sivaprasad
-
ఎంపీ అభ్యర్థి శివప్రసాద్‌ను అడ్డుకున్న ఎన్ఆర్ కమ్మపల్లి గ్రామస్తులు
-
మరణంలోనూ నాన్నకు తోడుగా..
పిఠాపురం: నాన్నా.. నువ్వు లేకుండా నేనెలా బతకగలనంటూ తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు కూడా ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర సంఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగింది. పిఠాపురం వస్తాదు వీధికి చెందిన జాగు అశోక్‌బాబు (64)కు భార్య, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అశోక్‌బాబుకు నాలుగు రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు. ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆయన అంతిమ సంస్కారాల కోసం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసిన బంధువులు పాడెపై మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో రెండో కుమారుడు శివప్రసాద్(38) తండ్రి మృతదేహం వద్ద రోధిస్తూ పడిపోయాడు. బంధువులు అతడిని ఓదార్చారు. మిగిలిన ఇద్దరు కుమా రులు బంధువులతో కలిసి పాడె మోసుకుంటూ శ్మశానానికి వెళుతుండగా మార్గమధ్యంలో శివప్రసాద్ కుప్పకూలి పోయాడు. బంధువులు 108కు ఫోన్ చేసి సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రయ్యారు. మృతుడు శివప్రసాద్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. తండ్రీకుమారుల అంతిమ సంస్కారాలు ఒకేచోట నిర్వహించారు. మృతుడు శివప్రసాద్‌కు తండ్రి అంటే అత్యంత మమకారమని, ఆయన మృతిని తట్టుకోలేక గుండెఆగిపోయి మృతిచెందాడని బంధువులు చెప్పారు. -
‘బూతుపురాణం’పై విచారణకు ఆదేశం
అనంతపురం సెంట్రల్: కళ్యాణదుర్గంలో ట్రాఫిక్ క్లియర్ చేయలేదంటూ ఓ కానిస్టేబుల్‌ను సీఐ శివప్రసాద్ బూతులు తిట్టి మనస్తాపానికి గురి చేసినట్లు ‘కానిస్టేబుల్‌పై సీఐ బూతుపురాణం’ శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ స్పందించారు. అసలేం జరిగిందని ఆరా తీశారు. ఘటనపై విచారణ చేసి సమగ్ర నివేదిక అందజేయాలని కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణను ఆదేశించారు. -
వినూత్నమైన స్క్రిప్ట్
రామకృష్ణ, అంకిత జంటగా సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఉందా.. లేదా?’. శివప్రసాద్ దర్శకత్వంలో కమల్ ఆర్ట్స్ పతాకంపై అయితం ఎస్.కమల్ నిర్మించనున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ కొట్టారు. దర్శకుడు దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇప్పటి వరకు సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో చాలా సినిమాలొచ్చినా, ఇదొక కొత్త వెర్షన్లో రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే బేస్డ్ చిత్రమిది. మంచి ప్రేమకథ ఉంటుంది’’ అని దర్శకుడు శివ ప్రసాద్ పేర్కొన్నారు. ‘‘డిఫరెంట్ స్క్రిప్ట్ ఇది. కథ నచ్చడంతో నిర్మించేందుకు ముందుకొచ్చా. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది’’ అని నిర్మాత కమల్ తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: ప్రవీణ్ కె.బంగారి. -
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి:శివప్రసాద్
-
రుగ్మతలు తొలగించిన వ్యక్తి నాదమునిరెడ్డి
చంద్రగిరి: సమాజంలో రుగ్మతలను తొలగించిన వ్యక్తి రెడ్డివారి నాదమునిరెడ్డి అని చిత్తూరు ఎంపీ ఎన్. శివప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వర్గీయ రెడ్డివారి నాదమునిరెడ్డి శత జయంతి ఉత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథులుగా ఎంపీ శివప్రసాద్, వైఎస్ఆర్ సీపీ ప్రజాసేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, పుత్తూరు మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం రెడ్డివారి నాదమునిరెడ్డి అన్నారు. కులమత భేదాలు లేకుండా ఆయన తనను ఎంతగానో ప్రోత్సహించారన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి చంద్రగిరిని అభివృద్ధి చేస్తామన్నారు. ఎంపీ నిధులతో పాఠశాల, కళాశాలలో 8 వాటర్ ఫిల్టర్లను అందిస్తానన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డిభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా నుంచి రాష్ట్ర రాజకీయాలను శాసించిన వ్యక్తి రెడ్డివారి నాదమునిరెడ్డి అన్నారు. తిరుపతి, చంద్రగిరి, ప్రాంతాల్లోని ఎంతోమంది పేదలకు టీటీడీలో ఉద్యోగావకాశాలు కల్పిం చిన మహోన్నత వ్యక్తి అన్నారు. పాఠశాలకు ఆటస్థలం కావాలని విద్యార్థులు కోరడంతో పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. టవర్‌క్లాక్ వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. ఇక్కడ భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది పేదలకు ఉపాధి కల్పిం చిన వ్యక్తి నాదమునిరెడ్డి అన్నారు. చంద్రగిరి పాఠశాలకు ఎంతో చరిత్ర ఉందన్నారు. ఇక్కడ చదువుకున్న వారిలో వార్డుమెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఉన్నారన్నారు. ఎంపీపీ కె.కుసుమకుమారి, వైస్ ఎంపీపీ ఎ.వనజ, నరసింగాపురం సింగిల్ విండో చైర్మన్ ఎం.చంద్రమౌళిరెడ్డి, మాజీ ఎంపీపీ వేణుగోపాల్‌రెడ్డి, రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు ఆదికేశవులురెడ్డి, గుణశేఖర్ నాయుడు, ఎంపీటీసీలు బండారు జ్యోతి, ఒంటె భారతి, మల్లం దీపికారెడ్డి, నవనీతమ్మ, పసలనాగరాజు, మురగయ్య, రామిరెడ్డి, స్కూల్ కమిటీ చైర్మన్, కోఆప్షన్ షేక్‌మస్తాన్, మణి, బండారు హేమచంద్రారెడ్డి, స్కూల్ బిల్డింగ్ సెక్రటరీ పి.చంద్రశేఖర్‌రెడ్డి, సిద్ధముని, ప్రిన్సిపల్స్ నాగరాజునాయుడు, గిరిజ, ఓ.శివ పాల్గొన్నారు. -
పులుల సంరక్షణకు చర్యలు
కాగజ్‌నగర్ రూరల్(సిర్పూర్(టి)) : కాగజ్‌నగర్ అటవీ శాఖ డివిజన్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్‌వో శివప్రసాద్ తెలిపారు. సోమవారం కాగజ్‌నగర్‌లోని డీఎఫ్‌వో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగజ్‌నగర్ అటవీ శాఖ డివిజన్ పరిధిలో పులుల సంరక్షణకు 40 సీసీ కెమరా లు అమర్చడంతో పాటు 30 మంది బేస్‌క్యాంప్ వాచ ర్లు, పది మంది స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు అటవీ ప్రాంతంలో సంచరిస్తూ పులుల సంరక్షణకు కృషి చేస్తారని వివరించారు. ముఖ్యంగ పోడు వ్యవసాయం కారణంగా వణ్యప్రాణులు, మృగాలు అంతరించిపోతున్నాయని, పోడు వ్యవసాయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దినోత్సవం అలా మొదలైంది 2010లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో జులై 28వ తేదిని అంతర్జాతీయ పులుల దినోత్సవంగ పరిగణించాలని నిర్ణయించారని డీఎఫ్‌వో తెలిపారు. 1913లో ప్రపంచవ్యాప్తంగా లక్ష పులులు ఉన్నట్లు నిర్ధారించగా ఈ వందేళ్ల కాలంలో మూడు వేలకు తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు వేల పులులు ఉండ గా భారతదేశంలోనే 1700 పులులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని గ్రామాల్లో పులుల సంరక్షణపై గ్రామీణులకు అవగాహ కల్పిస్తామని చెప్పారు. -
వేషాలకు మోసపోతారా ?
మంత్రిగా, ఎంపీగా శివప్రసాద్ చేసిందేమిటో ! ఆయనది విభజనవాదమా ? సమైక్యవాదమా ? ఉద్యమం అంటే డ్రామా కాదంటున్న జనం కనీస వసతులు కల్పించలేదని ఆవేదన సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఆయన చెప్పేదొకటి, చేస్తున్నదొకటి... ఆయన పేరు ఎన్ శివప్రసాద్. ఐదేళ్లు చిత్తూరు ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం అదే పార్లమెంటు స్థానానికి టీడీపీ అభ్యర్థి. శివప్రసాద్ పదవీకాలంలో పార్లమెంటు పరిధిలోని శాసనసభ స్థానాల్లో ఆయన మార్క్ ఎక్కడా కనిపించలేదు. అక్కడక్కడా ఆయన వేసిన వేషాల గురించి మాత్రం జనం చర్చించుకుంటారు. ఓ కళాకారుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. అయితే ప్రజాప్రతినిధిగా మాత్రం ఫెయిల్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ హయాంలో సత్యవేడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శివప్రసాద్ సమాచార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఎమ్మెల్యేగా... మంత్రిగా జిల్లాకుగానీ, సత్యవేడు నియోజవకర్గానికిగానీ తాను చేసింది ఇదీ.. అని చెప్పుకునేందుకు ఏమీ లేదు. సత్యవేడు నియోజకవర్గానికి ఆయన హయాంలో రెసిడెన్సియల్ పాఠశాల ఒకటి మంజూరయింది. అది కూడా ఆయన గొప్పగా చెప్పేందుకు వీలు లేదు. ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్యను, పేదరికంలో ఉన్న వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం సాధారణంగా పాఠశాలలు మంజూరు చేస్తుంది. ఆ కోవలో ఆ పాఠశాల మంజూరయిందే తప్ప ఆయన ప్రత్యేకించి తీసుకొచ్చింది కాదని స్థానికులు చెబుతున్నారు. చిత్తూరు స్థానం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన ఐదేళ్ల పదవీకాలంలో చిత్తూరు నగర తాగునీటి సమస్యను కూడా పరిష్కరించలేదు. లక్షల రూపాయల ఎంపీ నిధులు వస్తారుు. ఈ నిధులు ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలకు ఉపయోగపడ్డాయి తప్ప నియోజవకర్గ అభివృద్ధికి కాదనే విమర్శ ఉంది. నియోజకవర్గంలో అనేక మంది విద్యా, ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రతి సంవత్సరం అత్యధిక మెజారిటీ ఇస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి అనేక మంది యువకులు వలసలు వెళ్లి కుటుంబాలను పోషిస్తున్నారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అయితే ఆయన కూడా పట్టించుకోలేదు. ఎవరైతే చిత్తూరు ఎంపీగా గెలిచేందుకు కారకులయ్యారో వారి గురించి కనీసపు ఆలోచన కూడా చేయలేదంటే జనం మనిషి ఎలా అవుతారనేది ప్రశ్న. విద్య, వైద్య ఆరోగ్యం, తాగునీరు వంటి అంశాలను కూడా పట్టించుకోలేదనేది ప్రజల ఆవేదన. తెలుగుదేశం పార్టీ ఆందోళనలకు పిలుపునిస్తే శివప్రసాద్ రాష్ట్రంలో ఏ వేషం వేస్తారా ? అంటూ జనమంతా చర్చించుకంటుంటారు. ఒక రోజు గాడిదమీద, మరో రోజు గుర్రంమీద, ఇంకో రోజు దున్నపోతు మీద ఊరేగుతూ దర్శనమిస్తారు. ఇది ఉద్యమం అవుతుందా ? అనేది పలువురి ప్రశ్న. రాష్ట్ర విభజన విషయంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు నాది రెండు కళ్లు సిద్ధాంతమని చెబుతుంటే ఢిల్లీలో శివప్రసాద్ సమైక్యంపేరుతో గుడ్డలు విప్పదీసి నిరసన తెలిపారు. తమ నాయకుని పంథా ఓ రకంగా ఉంటే ఈయన తన డ్రామాతో సమైక్యవాదినంటూ మోసంచేసే ప్రయత్నానికి ఒడిగట్టారు. ఈయనకు పార్లమెంటులో ప్రశ్నించే అధికారం ఉంది. భారతదేశ అత్యున్నత చట్టసభలో ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తోటి ఎంపీలు పలువురు చర్చలో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. చట్టసభను ఉపయోగించుకుని రాజ్యాంగం కల్పించిన అవకాశం మేరకు ప్రజలకు ఉపయోగపడే చర్చలో పార్లమెంటులో ఒక్కరోజు కూడా పాల్గొనలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. టీడీపీ పార్లమెంటు సభ్యులంతా రాష్ట్ర విభజనకు సంతకాలు చేసిన వారే. వారిలో శివప్రసాద్ కూడా ఒకరు. జనం సమైక్య రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ప్లేట్ మార్చి వేషాలు వేయడం ద్వారా నిరసన తెలిపారేగానీ నిజానికి ఈయన కూడ విభజనవాదే ! -
పగటి వేషాలతో ఆకట్టుకుంటున్న ఎంపీ