
పిఠాపురం: నాన్నా.. నువ్వు లేకుండా నేనెలా బతకగలనంటూ తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు కూడా ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర సంఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగింది. పిఠాపురం వస్తాదు వీధికి చెందిన జాగు అశోక్‌బాబు (64)కు భార్య, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అశోక్‌బాబుకు నాలుగు రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు. ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆయన అంతిమ సంస్కారాల కోసం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసిన బంధువులు పాడెపై మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో రెండో కుమారుడు శివప్రసాద్(38) తండ్రి మృతదేహం వద్ద రోధిస్తూ పడిపోయాడు. బంధువులు అతడిని ఓదార్చారు.
మిగిలిన ఇద్దరు కుమా రులు బంధువులతో కలిసి పాడె మోసుకుంటూ శ్మశానానికి వెళుతుండగా మార్గమధ్యంలో శివప్రసాద్ కుప్పకూలి పోయాడు. బంధువులు 108కు ఫోన్ చేసి సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రయ్యారు. మృతుడు శివప్రసాద్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. తండ్రీకుమారుల అంతిమ సంస్కారాలు ఒకేచోట నిర్వహించారు. మృతుడు శివప్రసాద్‌కు తండ్రి అంటే అత్యంత మమకారమని, ఆయన మృతిని తట్టుకోలేక గుండెఆగిపోయి మృతిచెందాడని బంధువులు చెప్పారు.