
రుగ్మతలు తొలగించిన వ్యక్తి నాదమునిరెడ్డి
చంద్రగిరి: సమాజంలో రుగ్మతలను తొలగించిన వ్యక్తి రెడ్డివారి నాదమునిరెడ్డి అని చిత్తూరు ఎంపీ ఎన్. శివప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వర్గీయ రెడ్డివారి నాదమునిరెడ్డి శత జయంతి ఉత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథులుగా ఎంపీ శివప్రసాద్, వైఎస్‌ఆర్ సీపీ ప్రజాసేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, పుత్తూరు మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం రెడ్డివారి నాదమునిరెడ్డి అన్నారు.
కులమత భేదాలు లేకుండా ఆయన తనను ఎంతగానో ప్రోత్సహించారన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి చంద్రగిరిని అభివృద్ధి చేస్తామన్నారు. ఎంపీ నిధులతో పాఠశాల, కళాశాలలో 8 వాటర్ ఫిల్టర్లను అందిస్తానన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డిభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా నుంచి రాష్ట్ర రాజకీయాలను శాసించిన వ్యక్తి రెడ్డివారి నాదమునిరెడ్డి అన్నారు. తిరుపతి, చంద్రగిరి, ప్రాంతాల్లోని ఎంతోమంది పేదలకు టీటీడీలో ఉద్యోగావకాశాలు కల్పిం చిన మహోన్నత వ్యక్తి అన్నారు. పాఠశాలకు ఆటస్థలం కావాలని విద్యార్థులు కోరడంతో పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
టవర్‌క్లాక్ వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. ఇక్కడ భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది పేదలకు ఉపాధి కల్పిం చిన వ్యక్తి నాదమునిరెడ్డి అన్నారు. చంద్రగిరి పాఠశాలకు ఎంతో చరిత్ర ఉందన్నారు. ఇక్కడ చదువుకున్న వారిలో వార్డుమెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఉన్నారన్నారు. ఎంపీపీ కె.కుసుమకుమారి, వైస్ ఎంపీపీ ఎ.వనజ, నరసింగాపురం సింగిల్ విండో చైర్మన్ ఎం.చంద్రమౌళిరెడ్డి, మాజీ ఎంపీపీ వేణుగోపాల్‌రెడ్డి, రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు ఆదికేశవులురెడ్డి, గుణశేఖర్ నాయుడు, ఎంపీటీసీలు బండారు జ్యోతి, ఒంటె భారతి, మల్లం దీపికారెడ్డి, నవనీతమ్మ, పసలనాగరాజు, మురగయ్య, రామిరెడ్డి, స్కూల్ కమిటీ చైర్మన్, కోఆప్షన్ షేక్‌మస్తాన్, మణి, బండారు హేమచంద్రారెడ్డి, స్కూల్ బిల్డింగ్ సెక్రటరీ పి.చంద్రశేఖర్‌రెడ్డి, సిద్ధముని, ప్రిన్సిపల్స్ నాగరాజునాయుడు, గిరిజ, ఓ.శివ పాల్గొన్నారు.