పులుల కదలికలపై నిఘా
శ్రీశైలం బయోల్యాబ్‌లో విశ్లేషణ ప్రక్రియ
డేటాలోని చిత్రాలు పరిశీలన
45రోజుల పాటుఅడవిలో లెక్కింపు
రాజంపేట: నాగార్జునసాగర్–శ్రీశైలం అభయారణ్యంలో పులుల కారిడార్ విస్తరిస్తోంది. నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు పులుల సంచారం ఉన్నట్లు అటవీశాఖ గుర్తించిన సంగతి విధితమే. గతంలో పులులు తిరిగే ప్రాంతం గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల పరిధిలో మాత్రమే ఉండేది. ఆ మూడు జిల్లాలోని నల్లమల్ల అడవుల్లో పులులు సంచరించేవి. కొన్నేళ్లుగా ఇవి తిరిగే కారిడార్ నల్లమల్ల నుంచి వైఎస్సార్, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో శేషాచలం అడవుల వరకు విస్తరించి ఉంది.
తరుచూ నిర్వహిస్తున్న పులుల గణనలో ఈ విషయం స్పష్టమైంది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వు (ఎన్‌ఎస్‌టీఆర్)వారి ఆధ్వర్యంలో పులులు గణన చేపడుతున్నారు. పులులు గణన రెండు బ్లాకులో జరుగుతోంది. నాలుగేళ్లకొకసారి చేసే గణన బ్లాక్–3లోకి వస్తుండగా , ప్రతి ఏడాది జరిపే గణన బ్లాక్–4 కిందికి వస్తుంది. ఇటీవల బ్లాక్–4లోని వార్షిక గణనలో టైగర్ కారిడార్ ప్రాంతంలో గత యేడాదిలో ఫిబ్రవరి 20 నుంచి అటవీశాఖాధికారులు గణన ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.
ఎక్కడెక్కడా..
టైగర్ కారిడార్ నంద్యాల, గిద్దలూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి డివిజన్లలో నిర్వహించారు. నంద్యాల డివిజన్‌లోని చలమరుద్రవరం (రేంజ్), గిద్దలూరులో గుండ్లకమ్మ, వైఎస్సార్ జిల్లాలో ప్రొద్దుటూరు, వనిపెంట, పోరుమామిళ్ల, బద్వేలు, సిద్దవటం, ఒంటిమిట్ట, ముద్దనూరు, అన్నమయ్య జిల్లాలో చిట్వేలు, రాయచోటి , బాలపల్లె తిరుపతి జిల్లాలో భాకరాపేట, తిరుపతి రేంజిలోని అటవీ ప్రాంతాల్లోని సాంకేతిక డిజిటల్ కెమెరాలు అమర్చిసర్వే చేశారు.
ప్రతి రెండు చదరుపు అడుగులకు రెండు కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా రేంజిలలో గత యేడాది 188 లోకేషన్లకు మొత్తం 376 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 127 కెమెరాలు అమర్చారు. 40రోజుల పాటు జరిగిన గణనలో 20 రోజులకొక సారి కెమెరాలు తీసి వాటిలోని చిత్రాలను సేకరించారు. అదే ప్రదేశాలలో మళ్లీ కెమెరాలు ఏర్పాటుచేయనున్నట్లు అటవీవర్గాల సమాచారం.
కెమెరాల్లోని డేటాను ఆయా అటవీశాఖాధికారులు శ్రీశ్రైలంలోని టైగర్ బయోల్యాబ్‌కు పంపనున్నారు. వాటిలోని చిత్రాలను బయోల్యాబ్ ప్రతినిధులు క్షుణ్ణంగా విశ్లేషించనున్నారు. గత ఏడాది పోరుమామిళ్ల, వనిపెంట అడవుల్లో ఆరు పలులు కెమెరాలకు చిక్కినట్లుగా అటవీ అధికారుల నుంచి అందని ప్రాథమిక సమాచారం.
పెరుగుతున్న పులులు సంఖ్య
2021లో ఆరుపులులు ఉండగా, 2022లో వాటి సంఖ్య తొమ్మిదికి చేరినట్లు అటవీ వర్గాల సమాచారం. 2019లో బద్వేలు, సిద్ధవటం అటవీ ప్రాంతాల్లో కూడా పులులు ఉండేవని అప్పటి సమాచారం. ఈ సారి గణనలో అవి కెమెరాలకు చిక్కలేదు. అయితే పెనుశిల అభయారణ్యం, శేషాచలం అటవీ ప్రాంతాల వైపు వెళ్లినట్లు అటవీవర్గాలు భావిస్తున్నాయి. చిరుతలు మాత్రం కెమెరాకు చిక్కుతున్నాయి. పెనుశిల అభయారణ్యానికి సోమశిల వెనుకజలాలు అడ్డుగా ఉండటం వల్ల రాలేకున్నాయి.
అభయారణ్యాలు
శేషాచలం (బయోస్పియర్)
లంకామల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యం
పెనుశిల లక్ష్మీనరసింహా అభయారణ్యం
8ప్రాథమికంగా 8 నుంచి 10 పులులు సంచారం
ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని టైగర్ కారిడార్ చేపట్టిన పులుల గణనలో ప్రాథమికంగా 8 నుంచి 10 లోపు పులులను అధికారులు గతంలో గుర్తించారు. వాటి సంఖ్య ఈ ఏడాది పెరిగి ఉంటుందని అటవీశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అడవుల్లో అమర్చిన విదేశీ సాంకేతిక డిజిటల్ కెమెరాల ద్వారా వాటి సంఖ్యను కొనుగొన్నారు.
శ్రీశైలంలోని టైగర్ బయోట్యాబ్‌లో శాస్త్రవేత్తలు కెమెరాల్లో లభ్యమైన చిత్రాలపై విశ్లేషణ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
అడవిలో చెట్లకు కెమెరాలు అమర్చాం
శేషాచలం అటవీ ప్రాంతంలో చెట్ల కెమెరాలు అమర్చాము. పులి, చిరుత కెమెరాలో పడితే వివరాలు వెల్లడిస్తాము. సర్వే జ రుగుతోంది. టైగర్ కారిడార్ పరిధిలో పులల గణన జరుగుతుంది. –జగన్నాథ్‌సింగ్, జిల్లా అటవీశాఖాధికారి, రాజంపేట
Comments
Please login to add a commentAdd a comment