
హొయలొలికే అందాలతో పెంచికలపేట మండలం పాలరాపు గుట్టవద్ద పెద్దవాగు
చింతలమానెపల్లి(సిర్పూర్): జిల్లాలో అలరించే ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి. కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలోని కాగజ్‌నగర్, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్, దహెగాం మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతం ఎన్నో రకాల వన్యప్రాణులకు నెలవు. డివిజన్‌లోని అడవులలో ప్రవహించే ప్రాణహిత నది, పెద్ద వాగు (బీబ్రానది) అందాలు పర్యాటకంగా ప్రకృతి ప్రేమికుల మనసును దోస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో వన్యప్రాణులు సందడి చేస్తూ అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిక్కాయి. మరికొన్ని చిత్రాలను అధికారులు ప్రత్యేక కెమెరాలతో చిత్రీకరించారు. ఈ చిత్రాలను కాగజ్‌నగర్ అటవీ అధికారుల వద్ద నుంచి ‘సాక్షి’ సేకరించింది.

మాలిని అడవిలో నెమలి నృత్యం

సిర్పూర్ రేంజ్‌లో తలపడుతున్న చుక్కల జింకలు

కాగజ్‌నగర్ డివిజన్‌లో నీలుగాయి

మాలిని బీట్‌లో నీటి మడుగువద్ద జింకల గుంపు

పాలరాపు గుట్ట వద్ద రాత్రివేళలో మంచె (బేస్‌క్యాంప్)