
సాక్షి, అసిఫాబాద్: కాగజ్ నగర్ మండలం ఈస్గాం మార్కెట్ లో భారీ చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి స్నేహ జ్యువెలరీ దుకాణంలో కొందరు దుండగులు షట్టర్ పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. కాగా దుకాణంలో సుమారు పది లక్షల విలువైన నగలు దోచుకెళ్లారిని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.
డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ బృందాలతో రంగంలోకి దిగిన అధికారలు దర్యాప్తు ముమ్మరం చేశారు. దోపిడీ జరిగిన ప్రాంతాన్ని ఎస్పీ సుదీంద్ర సందర్శించారు. ఈ సందర్బంగా దొంగలు దోపిడీ చేసిన తీరును స్థానిక పోలీసులను ఆయన అడిగి తెలుసుకున్నారు. పరిసరాల్లోని సీసీ కెమెరాల ద్వారా ఈ దొంగతనం రికార్డు కావడంతో ప్రస్తుతం అధికారులు ఆ వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు చోరిలో పాల్లొన్నట్టు కెమెరాలలో రికార్డైంది. సీసీ పుటేజీ ఆధారంగా దొంగలని పట్టుకోవడానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment