theives
-
వీళ్ల తెలివి తగలెయ్య! కళాశాల టాయిలెట్లో సీసీ కెమెరా.. ఆ తర్వాత
ప్రపంచంలో రకరకాల దొంగలను మనం చూస్తూనే ఉంటాం. వీరిలో కొందరు విలువైన వస్తువులను దోచుకోగా, మరికొందరు తక్కువ విలువైన వస్తువులను దోచుకుంటుంటారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లోని ఓ దొంగ కళాశాలలోని కుళాయిలను తరచూ మాయం చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన కాలేజీ సెక్యూరిటీ టీమ్ దొంగలను పట్టుకునేందుకు తీసుకున్న చర్యల కారణంగా విద్యార్థులు నిరసనకు దిగారు. అసలు అక్కడ ఏం జరిగిందంటే.. సీసీకెమెరా.. పొరపాటు జరిగింది. అజంగఢ్‌లోని డీఏవీ పీజీ కళాశాల విద్యార్థులు 'తోటి చోర్' (నీటి కుళాయి దొంగ)ను పట్టుకునేందుకు ప్లాన్ చేశారు. అందుకోసం కళాశాలలోని పలు చోట్ల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో టాయిలెట్ల వెలుపల కూడా ఒక కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో మండిపడ్డ విద్యార్థులు కళాశాల యాజమాన్యం తీరుపై మండిపడుతూ నిరసనకు దిగారు. ఈ పరిణామాలపై యాజమాన్యం స్పందిస్తూ.. క్యాంపస్‌లో నిత్యం నీటి కుళాయిలు చోరీకి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నివారించేందుకు కుళాయిలపై నిఘా ఉంచాలనుకున్నాం. అందులో భాగంగానే సీసీటీవీ కెమరాలు ఏర్పాటు చేశాం. అయితే, పొరపాటున టాయిలెట్‌వైపు ఒక కెమెరా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాన్ని తీసివేసి మరో చోట మళ్లీ ఇన్స్టాల్ చేయమని ఆర్డర్ కూడా జారీ చేసినట్లు చెప్పింది. కళాశాల ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బాత్రూం దగ్గర సీసీటీవీ కెమెరా ఒకటి ఏర్పాటు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పారు. మరో వైపు కళాశాల అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులు వారి నిరసనను విరమించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
దొంగల దుశ్చర్య: కారును బైక్‌తో ఢీకొట్టి..వెంబడించి..
సాక్షి, బనశంకరి: బెంగళూరు నగరంలో అర్ధరాత్రి ఇద్దరు దొంగలు బైక్‌పై ఓ కారును ఢీకొట్టి వారిని ఐదు కిలోమీటర్లు వెంబడించారు. ఈ ఘటనతో కారులో ఉన్న దంపతులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వివరాలు... ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సర్జాపుర రోడ్డులో దంపతులు కారులో ఇంటికి వెళ్తున్నారు. ఎదురుగా బైక్‌లో వచ్చిన వ్యక్తులు అదే పనిగా కారును ఢీకొట్టాడు. డ్యాష్‌బోర్డులో ఉన్న కెమెరాలో ఈ దృశ్యం రికార్డయింది. అనంతరం బైక్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కారు వద్దకు వెళ్లి దంపతులను కిందకు దిగాలని అడిగాడు. వారు నిరాకరించడంతో కిటికీ అద్దాలపై కొట్టాడు. దీంతో వారు రివర్స్ తీసుకుని ముందుకు వెళ్లిపోతుండగా ఐదు కిలోమీటర్లు బైక్‌లో వీరి వాహనాన్ని వెంబడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నగర ప్రజలకు రక్షణ లేదనే విషయం అవగతమవుతోందని నెటిజన్లు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. సర్జాపుర రోడ్డు సోపాస్ మోర్ వద్ద ఈ ఘటన జరిగింది. రోడ్ల పక్కన విద్యుత్ దీపాలు అమర్చి గస్తీ పెంచాలని నెటిజన్లు నగర ట్రాఫిక్ పోలీసులు, బీబీఎంపీ కమిషనర్‌కు ట్యాగ్ చేశారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తూర్పువిభాగ ట్రాఫిక్ డీసీపీ కళాకృష్ణస్వామి తెలిపారు. Horrific incident reported on Sarjapur road near Sofas & More around 3 am today. Miscreant riders collided purposefully to a couple traveling in car. They chased the car for 5km till their society in Chikkanayakanahalli. Don't open your car in night. Use dash cam. @BlrCityPolice. pic.twitter.com/4QVYtBZ67B — Citizens Movement, East Bengaluru (@east_bengaluru) January 29, 2023 (చదవండి: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరార్..విచారణలో అతడు..) -
వైరల్ వీడియో: ఏకంగా కదులుతున్న ట్రైయిన్ నుంచి ఆయిల్ కొట్టేందుక యత్నం!
-
ఓర్నీ! ఏకంగా కదులుతున్న ట్రైయిన్ నుంచి ఆయిల్ చోరీనా!
ఇంతవరకు దొంగలు, రోడ్లు, బ్రిడ్జ్‌లు, టవర్లు ఎత్తుకుపోవడం చూశాం. ఇప్పుడూ ఏకంగా కదులుతున్న ట్రైయిన్ నుంచి ఆయిల్‌ని ఎత్తుకుపోతున్నారు. దొంగతనానికి హద్దే లేదంటే ఇదేనేమో. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...రోడ్లు, బ్రిడ్జ్‌లు ఎత్తుకుపోవడం అయిపోయాక దొంగలు ఇప్పుడూ ఆయిల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు కాబోలు. ఈ మేరకు గూడ్స్ రైలు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఆయిల్ డిపోకు వెళుతుండగా...అది గమ్యస్థానానికి చేరుకునేలోపు దొంగలు చమురును దొంగిలించడానికి దాని వెంటబడ్డారు. రైల్వేబ్రిడ్జి వద్ద బకెట్లతో నుంచుని ఆయిల్ దొంగలించేందకు యత్నించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. Bihar: Thieves steal oil from moving train in Bihta to close out 2022 on a high. pic.twitter.com/eKBPSp5HPR — KK (@krishnakakani08) December 4, 2022 (చదవండి: ఒక వ్యక్తినే పెళ్లాడిన ట్విన్ సిస్టర్స్: వీడియో వైరల్) -
పగలు భక్తి, రాత్రి లూటీ
యశవంతపుర: కలబురిగి నగరంలో దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో ఇద్దరు దొంగలకి గాయాలయ్యాయి. వివరాలు... మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లా తుళజాపూర్ తాలూకా ఝళకోళ గ్రామానికి చెందిన ముఠా దేవుని విగ్రహాల బండితో తిరుగుతూ డబ్బులు సేకరించేవారు. రాత్రి సమయంలో దోపిడీలు చేసేవారు. ఇటీవల కలబురిగి నగరంలో ఇళ్లు చోరీలు అధికంగా జరుగుతున్నాయి. ప్రజలు, పోలీసులకు తలనొప్పిగా మారింది. దుండగులు పగటిపూట దేవుని బండిని ఊరంతా తిప్పి తాళం వేసిన ఇళ్లు, ధనవంతుల నివాసాలను గుర్తుంచుకునేవారు. రాత్రి కాగానే లూటీ చేస్తుండేవారు. అర్ధరాత్రి దోపిడీకి యత్నం... మంగళవారం అర్ధరాత్రి బిద్దాపూర కాలనీలో దోపిడి చేయటానికీ చొరబడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటాడారు. దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో సీఐ పండిత్ సాగర్, పోలీసులు కాల్పులు జరిపారు. లవ, దేవిదాస్ అనే ఇద్దరు నిందితులకు తూటాలు తగిలి కిందపడిపోయారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఒక కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. (చదవండి: కి‘లేడీ’లు.. క్లోజ్‌గా మాట్లాడి హానీట్రాప్ చేసి ఆ తర్వాత..) -
ముగ్గురు దొంగల చిలిపి పని... భయపడి చస్తున్న నివాసితులు!
ఇటీవల కాలంలో దొంగతనానికి వచ్చిన దొంగలు కొన్ని చిలిపి చేష్టలు చేస్తున్న ఘటనలు చూశాం. వాళ్లు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్థంకాక బిత్తరపోతున్నారు జనాలు. మొన్నటికి మొన్న ఒక దొంగ ఐ లవ్ యూ అని ఒక లెటర్ రాసిపెట్టి వెళ్లిపోయాడు. మరొక దొంగ ఇంత కష్టపడి దొంగతనం చేయడానికి వస్తే ఏం పట్టికెళ్లకుండా వెనుదిరగడం చాలా కష్టంగా ఉంటుందంటూ తన ఆవేదన చెబుతూ ఒక లెటర్ రాసి మరీ వెళ్లాడు. ఇప్పుడు ఏకంగా ముగ్గురు దొంగలు సీసీటీవి వద్దకు డేర్‌గా వచ్చి ఏం చేశారో చూస్తే షాక్ అయిపోతారు. ఏం జరిగిందంటే....తమిళనాడులో రామ్‌నగర్‌లోని ఒక అపార్టమెంట్ వాసులు దొంగల బెడదతో సీసీటీవీని ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో దొంగలు తరుచుగా ఇళ్లపై దాడులు చేయడం జరిగింది. ఐతే ఒక రోజు ముగ్గురు దొంగలు ఆ అపార్టమెంట్ కాపౌండ్ వాల్ ఎక్కి నడుచుకుంటూ వచ్చారు. పైగా అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ వద్దకు డేర్‌గా వచ్చి ముద్దు పెట్టుకుని వెళ్లిపోయారు. మరుసటి రోజు అపార్ట్మెంట్ వాసులు సీసీపుటేజ్ చెక్ చేయగా ముగ్గురు దొంగలు చేసిన చిలిపి నిర్వాకం చూసి షాక్‌కి గురవుతారు. ఈ మేరకు భయంతో తులసీ రమేశ్ అనే వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్‌ని ట్విట్టర్లో షేర్ చేస్తూ సదరు దొంగలను గుర్తించి సాయం చేయడండి అంటూ పోలీసులు ప్రజలను కోరాడు. ఐతే చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. (చదవండి: హీరోయిన్ రేంజ్లో పరుగెత్తి... చివరికి నేలకి అతుక్కుపోయింది) -
రాజధానిలో మధ్యప్రదేశ్ పోలీసుల దాడి
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఓ భారీ చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న అక్కడి పోలీసులు నగరంలో దాడి చేశారు. ఆ నేరానికి బాధ్యులైన ఇద్దరు దొంగలను పట్టుకుని తీసుకెళ్లారు. పరారీలో ఉన్న మరో కీలక నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ చోరుల విషయం తెలుసుకున్న ఇక్కడి పోలీసులు స్థానికంగా ఏమైనా నేరాలు చేశారా? అనేది ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం... మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని కమలనగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షరీఫ్, మహ్మద్ నసీమ్ బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడే చిన్న చిన్న యంత్రాలు విక్రయించే వ్యాపారం చేశారు. కోవిడ్ నేపథ్యంలో అమలైన లాక్డౌన్ ఫలితంగా వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో మూసేసి తమ స్వస్థలానికి వచ్చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వీరికి హైదరాబాద్‌కు చెందిన వసీమ్‌తో ఇండోర్‌లో పరిచయం ఏర్పడింది. వీరి పరిస్థితిని గమనించిన వసీమ్ తాను చెప్పినట్లు చోరీలు చేస్తే తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని, అప్పులు తీర్చడమే కాకుండా జల్సాగా బతకవచ్చని చెప్పాడు. అందుకు వీరు అంగీకరించడంతో పోలీసులు సెల్‌ఫోన్ టవర్ లోకేషన్స్ ద్వారా పట్టుకుంటారనే విషయం వారికి చెప్పిన వసీమ్ టార్గెట్ చేసిన ప్రాంతానికి కనీసం పది కిలోమీటర్ల దూరంలోనే ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయాలని సలహా ఇచ్చాడు. ఆపై సంప్రదింపులు జరపడానికంటూ ఆన్లైన్లో చైనా నుంచి అత్యాధునిక వాకీటాకీలు ఖరీదు చేయించాడు. చోరీ చేయాల్సిన ప్రాంతానికి చేరుకోవడానికి ముందే ఈ గ్యాంగ్ కొన్ని కార్లను ఎంపిక చేసుకుని వాటి ఫొటోలు, వివరాలు తెలుసుకునేది. వీటి ఆధారంగా ఆ కార్లకు సంబంధించి ఫాస్ట్‌ట్యాగ్స్ సమీకరించుకునేది. ఆపై అదే మోడల్ కారును అద్దెకు తీసుకుని తాము టార్గెట్ చేసిన ప్రాంతానికి చేరుకుని చోరీ చేసేది. వసీమ్ మాత్రం నేరుగా నేరంలో పాల్గొనకుండా వీరికి సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన మొత్తాన్ని అంతా సమానంగా పంచుకునే వారు. ఈ పంథాలో మహ్మద్ షరీఫ్, మహ్మద్ నసీమ్‌లు భోపాల్‌లోని కమలనగర్, ఇండోర్‌లోని సాయి సంపద ఏరియాలతో కొన్ని నేరాలు చేశారు. గత నెల్లో ఇండోర్‌లోని ఎంఐజీ ప్రాంతంలో నివసించే వ్యాపారి స్వస్తిక్ అగర్వాల్ ఇంట్లో రూ.50 లక్షల సొత్తు తస్కరించారు. వసీమ్ సలహా మేరకు నగరానికి వచ్చేసిన మహ్మద్ షరీఫ్, మహ్మద్ నసీమ్ షేక్‌పేట్ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. వసీమ్ సూచనలతో ఇక్కడా కొన్ని నేరాలు చేసినట్లు తెలుస్తోంది. వీరి కోసం గాలింపు చేపట్టిన ఇండోర్‌లోని ఎంఐజీ పోలీసులు వారి భార్యల కదలికలపై నిఘా ఉంచారు. ఇటీవల వీరు తమ భార్యల్ని షేక్‌పేటకు పిలిపించుకున్నారు. అలా వీరి ఆచూకీ కనిపెట్టిన ఎంఐజీ పోలీసులు దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. పరారీలో ఉన్న వసీమ్ కోసం గాలిస్తున్నారు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న ఇక్కడి అధికారులు స్థానికంగా చేసిన నేరాలపై ఆరా తీస్తున్నారు. (చదవండి: ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టి ముగ్గురు మృతి.. ఆత్మహత్యలా? ప్రమాదమా?) -
పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు అందుకుంటున్న పిల్లి...ఎందుకో తెలుసా!
గౌరిబిదనూరు: పోలీసులను చూస్తే నేరగాళ్లకు హడల్. కానీ ఎలుకలకు కాదు. నగరంలోని రూరల్ పోలీసు స్టేషను మాదనహళ్ళి చెరువులో ఉంది. అది నిర్మానుష్య ప్రాంతం కాగా ఎలు కలు, పందికొక్కుల బెడద ఎక్కువగా వుంది. స్టేషనులో రికార్డులను అవి పాడు చేయడంతో విసుగు చెందిన పోలీసులు పిల్లిని తెచ్చి పెట్టారు. స్టేషనుకు పిల్లి వచ్చిన తరువాత ఎలుకల బాధ కొంతవరకు తక్కువగా ఉందని పోలీసులు చెప్పారు. ఏమైతేనేమి పిల్లికి స్టేషనులో రాచమర్యాదలు దక్కుతున్నాయి. ముగ్గురు దొంగల అరెస్టు మైసూరు: ముగ్గురు దోపిడీ దొంగలను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి మూడు బైకులతో పాటు రూ.15 లక్షల విలువ చేసే బంగారు నగలను సీజ్ చేశారు. నగర క్రైమ్, ట్రాఫిక్ డిసిపి గీతా ప్రసన్న ఆదేశాల మేరకు సీసీబీ పోలీసులు చైన్ స్నాచర్లు, ఇళ్లలో చోరీచేసేవారిపై నిఘా వేసి ముగ్గురిని అరెస్టు చేశారు. మైసూరులో ఇటీవలికాలంలో స్నాచింగ్‌లు, దొంగతనాలు పెరిగిపోవడం తెలిసిందే. (చదవండి: ఘనంగా పెంపుడు కుక్క బర్త్ డే వేడుక...ఏకంగా 4 వేలమందికి...) -
అమ్మవారి తాళిబొట్టు చోరీ.. తప్పు తెలుసుకున్న దొంగలు!
మైసూరు: అమ్మవారి తాళిబొట్టును చోరీ చేసుకుని వెళ్లిన దొంగలు తప్పు తెలుసుకుని తిరిగి ఆలయానికి వచ్చి కొంత నగదు, అమ్మవారి నగ అక్కడ పెట్టి వెళ్లిన వైనం మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని ఉప్పినహళ్ళి గ్రామంలో ఉన్న దుర్గాంబ అమ్మవారి దేవాలయంలొ చోటు చేసుకుంది. గతనెల 24న గ్రామంలోని దుర్గాంబ ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు అమ్మవారి తాళిబొట్టును ఎత్తుకెళ్లారు. అంతలోనే తప్పు తెలుసుకుని దొంగలు భక్తుల తరహాలో గుడికి వచ్చి దొంగిలించిన నగ, కొంత నగదు కానుకగా పెట్టి వెళ్లిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త అలా చేస్తున్నాడని వందన..) -
ఆ ఇంట్లో అందరూ దొంగలే
కర్ణాటక(యశవంతపుర): ఆ ఇంట్లో అందరూ దొంగలే. తల్లి, ఆమె తనయుడు, తనయ మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలబాట పట్టారు. ఎట్టకేలకు ముఠాకు చెందిన 8 మంది పోలీసులకు పట్టుబడ్డారు. ఉత్తర విభాగం డీసీపీ వినాయక పాటిల్ వివరాలు వెల్లడించారు. బెంగళూరులోని మాదనాయకనహళ్లి దొమ్మరహళ్లి నివాసి మంజునాథ్ అలియాస్ కోళిమంజ(31), అతని తల్లి ప్రేమ(50), అయన చెల్లెలు అన్నపూర్ణ అలియాస్ అను(28), లగ్గేరి నివాసి దీపక్ అలియాస్ దీపు(31), గంగానగరకు చెందిన మను అలియాస్ మహేంద్ర(21), దయానంద్ అలియాస్ దయా(25), మునిస్వామి అలియాస్ స్వామి(34), సతీశ్(24)లను ఉత్తర విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.45 లక్షల విలువైన 332 గ్రాములు బంగారం, రూ.59 వేల నగదు, 23 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఓ ఉపాధ్యాయురాలు జనవరి 10న బీఎంటీసీ బస్ దిగి కాలినడకన వెళ్తుండగా బైకుపై వచ్చిన దుండగులు ఆమె మెడలోని 50 గ్రాములు బంగారు మాంగల్య చైన్ లాక్కొని ఉడాయించారు. ఈ చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. నిందితులు అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రియురాలికి ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వాలని... చోరికి యత్నం!
న్యూఢిల్లీ: ఇటీవలకాలంలో దోపిడీలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎందుకు దొంగతనం చేశారని ప్రశ్నిస్తే వారు చెబుతున్న సమాధానాలను చూస్తే నిజంగా మతిపోతుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తాను ఎందుకు దొంగతనం చేశాడో తెలుసుకుంటే ఎవరైనా అవాక్క అవ్వక తప్పదు. (చదవండి: ప్లీజ్.. నా కారుని ధ్వంసం చేయోద్దు!) అసలు విషయంలోకెళ్లితే... ఢిల్లీలోని సరోజినీ నగర్ ప్రాంతంలో బహుళజాతి కంపెనీలో సీఈవోగా పనిచేస్తున్న ఆదిత్య కుమార్ అనే వ్యక్తి ఇంట్లో ముగ్గురు వ్యక్తులు చోరికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిత్య కుమార్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో డోర్ బెల్ మోగడంతో తలుపు తీశాడు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చోరబడి ఆదిత్యను తాళ్లతో కట్టేసి మొబైల, ల్యాప్‌టాప్, స్కూటర్, విలువైన వస్తువులను తీసుకుని ఉడాయించారు. అయితే ఆదిత్య కుమార్ కాసేపటికి ఏదోరకంగా కట్లు విడిపించుకుని మరోక విడి ల్యాప్‌టాప్ ద్వారా ఫేస్ బుక్ సాయంతో తన బంధువులకు, స్నేహితులకు సమాచారం అందిచాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారించడమే కాక నిందుతులు శుభం(20), ఆసిఫ్(19), మహ్మద్ షరీఫుల్ ముల్లా (41)గా గుర్తించారు. అయితే నిందుతుల్లో ఒకరు తన ప్రియురాలు అలిగి తనతో మాట్లాడకపోవడంతో మనస్తాపానికి గురయ్యానని, అందువల్ల ఆమెకు ఖరీదైన గిఫ్ట్‌లు కొని ఇచ్చి ప్రసన్నం చేసుకునే నిమిత్త దొంగతనం చేసినట్లు చెప్పాడని పోలీసులు మీడియాకి తెలిపారు. (చదవండి: ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పురస్కారం) -
ప్లీజ్.. నా కారుని ధ్వంసం చెయ్యొద్దు!
US woman left the trunk of her car: ప్రసుతం ప్రజలంతా ఒమిక్రాన్ వైరస్‌తో హడలెత్తిపోతుంటే ఒక పక్క ఈ దొంగల బెడద తప్పడం లేదు. ఈ వైరస్ మహమ్మారికి భయపడి చాలామటుకు ప్రజలంత తమ సోంత కార్లు లేదా(క్యాబ్ బుక్ చేసుకుని) ఎక్కడికైన వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అదునుగా చేసుకుని మార్గ మధ్యలో దోపిడి దారులు రెచ్చిపోయి కార్లను ఆపి లూటీ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు కార్లను ధ్వంసం కూడా చేస్తున్నారు. అచ్చం అదే తరహాతో యూఎస్‌లోని దొంగలు దోపిడి చేయబోతుంటే ఒక మహిళ మాత్రం తెలివిగా తన కారుని ధ్వంసం చేయనివ్వకుండా కాపాడుకుంది. (చదవండి: తగ్గేదేలే! నువ్వు ముందు విమానం నుంచి దిగిపో!) అసలు విషయంలోకెళ్లితే...కాలిఫోర్నియాలోని పారిసా హెమ్మత్, శాన్ఫ్రాన్సిస్కో బే ప్రాంతాల్లో దోపిడిదారులు చోరబడి విధ్వంసం సృష్టించారు. అక్కడ ఉన్న ప్రజల వద్ద నుంచి విలువైన వస్తువులు, డబ్బులు లాక్కోవడం వంటివి చేశారు. ఈ క్రమంలో వారు రహదారులపై ఉన్న కార్లులో వస్తున్న వాళ్లను సైతం ఆపి కారు పగలు గొట్టి భయబ్రాంతులకు గురి చేసి విలువైన వస్తువులను బలవంతంగా లాక్కుంటున్నారు. ఇదే తరహాతో ఒక మహిళ దగ్గరకు రాంగానే ఆమె తన కారుని కాపాడుకునే నిమిత్తం తానే ముందుగా కారు డిక్కి ఒపెన్ చేసి తన కారులో ఏమిలేవు కావలంటే చూడండి అంటూ చూపించింది. దీంతో సదరు దొంగలు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి ఆమెను ఏం చేయకుండా అక్కడ నుంచి దొంగలు నిష్క్రమించారు. అయితే ఒక్కోసారి మన దగ్గర అలాంటి దొంగలను ఎదిరించలేని పరిస్థితి ఏర్పడినప్పుడూ సదరు మహిళలా ముందుస్త చర్యగా కాస్త తెలివిగా వ్యవహరిస్తే చిన్న మొత్తంలోనే నష్టంతో సరిపెట్టుకోవచ్చు. ఈ మేరకు శాన్ ఫ్రాన్సిస్కో మేయర్ దోపిడి దారులను పట్టుకునేలా మరింత దూకుడుగా వ్యవహరించే కట్టుదిట్టమైన చట్టాల అమలు కోసం పిలుపునివ్వాలని గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు. (చదవండి: ఒమిక్రాన్ వైరస్ ఈ నగరాన్ని దెయ్యాల నగరంగా మారుస్తోంది!!) -
దొంగలొస్తున్నారు జాగ్రత్త..!
గోదావరిఖని: తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. మూడురోజుల్లో మూడిళ్లలో చొరబడ్డారు. మూడు రోజుల క్రితం స్థానిక శారదానగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన ఆర్టీసీ ఉద్యోగి నాగేందర్ ఇంటి తాళాలు పగులగొట్టారు. బంగారు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. మరో ఇంట్లో ఇలాగే చొరబడినా.. విలువైన వస్తువులేమీ ఎత్తుకెళ్లదు. వీటిపై ఫిర్యాదు రాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఎన్టీపీసీ జ్యోతినగర్ కృష్ణాకాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించి రూ.58వేల విలువైన బంగారం, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ సంఘటనపై ఎన్టీపీసీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది నెలల కిందట మార్కండేయకాలనీలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడి పెద్ద మొత్తంలో విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఇటీవల కాలంలో చోరీల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో మూడు చోరీలు జరగడంతో తాళాలు వేసి ఊరికి వెళ్లేవారు భయాందోళనకు గురవుతున్నారు. మూడు చోరీలు ఒకేలా జరగడంతో ఏదైనా ముఠా ఈ ప్రాంతంలో సంచరిస్తోందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో పోలీసులు దృష్టి సారించి చోరీలపై నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. నిఘా పెంచాం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రాత్రి పూట గస్తీ పెంచాం. నిత్యం తిరిగే పెట్రోలింగ్ కార్లతోపాటు బ్లూకోల్ట్స్ పెట్రోలింగ్, రెండు అదనపు పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. సీఐ, ఎస్సై క్రాస్ చెకింగ్ ఉంటోంది. ఎన్టీపీసీ క్రిష్ణానగర్, శారదానగర్ ఆర్టీసీ కాలనీల్లో జరిగిన దొంగతనాల తీరు వేర్వేరుగా ఉంది. అయినప్పటికీ సీసీ కెమెరాల పుటేజీ, నిందితులు వేలిముద్రలు సేకరించాం. దొంగలను త్వరలో పట్టుకుంటాం. – గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) -
మీ ఫోన్ పోయిందా..! వెంటనే ఇలా చేయండి..లేకపోతే..!
స్మార్ట్ ఫోన్ మన నిత్యజీవితంలో ఒక భాగమైపోయింది. పెరుగుతున్న సాంకేతికతో మన చేతుల్లోకి అన్ని రకాల సేవలను స్మార్ట్‌ఫోన్ అందిస్తోంది. రకరకాల యాప్‌లు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. స్మార్ట్ఫోన్లలోకి యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో భౌతికంగా నగదును క్యారీ చేయడం తక్కువైంది. కూరగాయల నుంచి సూది మందు వరకు ప్రతి చోట యూపీఐ సేవలను వాడుతున్నాం. మనలో చాలా మంది ప్రతి చోట నగదు లావాదేవీలను డిజిటల్ రూపంలోనే చేస్తున్నాం. ఇప్పుడు అంతా బాగానే ఉంది అనుకోండి ! ఒక వేళ మీ స్మార్ట్ ఫోన్ పోయినా, దొంగలు కొట్టేసినా అప్పుడు ఎలా...! సింపుల్‌గా మరో కొత్త ఫోన్ తీసుకుంటామని అనుకుంటున్నారా..! అయితే మీ బ్యాంకు ఖాతాలోని నగదును మర్చిపోవడం మంచింది. ఔను మీరు చూసింది నిజమే.. తాజాగా స్మార్ట్ఫోన్లను కొట్టేసిన దొంగలు సాంకేతికతో కొత్త పుంతలు తొక్కుతున్నారు. మీ ఫోన్‌ను బ్లాక్ మార్కెట్ విక్రయించడంతో పాటు, మీ ఫోన్లో ఉన్న డిజిటల్ పేమెంట్ యాప్‌లనుంచి నగదును కొట్టేస్తున్నారు. అంతేకాకుండా మీ విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. మీ ఫోన్ పోతే వెంటనే ఇలా చేయండి. మొబైల్ బ్యాంకింగ్ సేవలను పూర్తిగా బ్లాక్ చేయండి. మీ సిమ్ కార్డుతో రిజిస్టర్ ఐనా యూపీఐ సేవలను డియాక్టివేట్ చేయండి. మీ ఫోన్లో ఉన్న సిమ్ కార్డును వెంటనే బ్లాక్ చేయించండి. మీ నంబర్‌పై రిజిస్టర్ ఐనా అన్ని మొబైల్ వ్యాలెట్లను బ్లాక్ చేయండి. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. -
భారీ చోరి..పది లక్షల బంగారు నగలు మాయం
సాక్షి, అసిఫాబాద్: కాగజ్ నగర్ మండలం ఈస్గాం మార్కెట్ లో భారీ చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి స్నేహ జ్యువెలరీ దుకాణంలో కొందరు దుండగులు షట్టర్ పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. కాగా దుకాణంలో సుమారు పది లక్షల విలువైన నగలు దోచుకెళ్లారిని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ బృందాలతో రంగంలోకి దిగిన అధికారలు దర్యాప్తు ముమ్మరం చేశారు. దోపిడీ జరిగిన ప్రాంతాన్ని ఎస్పీ సుదీంద్ర సందర్శించారు. ఈ సందర్బంగా దొంగలు దోపిడీ చేసిన తీరును స్థానిక పోలీసులను ఆయన అడిగి తెలుసుకున్నారు. పరిసరాల్లోని సీసీ కెమెరాల ద్వారా ఈ దొంగతనం రికార్డు కావడంతో ప్రస్తుతం అధికారులు ఆ వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు చోరిలో పాల్లొన్నట్టు కెమెరాలలో రికార్డైంది. సీసీ పుటేజీ ఆధారంగా దొంగలని పట్టుకోవడానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
బస్టాండ్‌లో ప్రయాణికులే వీరి టార్గెట్
సాక్షి, రాజాం : బస్టాండ్లే వారికి ఆదాయ మార్గాలు. ఒంటరిగా బస్సు ఎక్కేవారే టార్గెట్. రద్దీగా ఉండే బస్సుల్లో ఎక్కేవారి చేతుల్లో ఉండే బ్యాగులు, నగదు కాజేయడంలో సిద్ధహస్తులు. ఇలా ఈ మధ్య కాలంలో రాజాం బస్టాండ్‌లో ఓ వ్యక్తి సంచిలో నుంచి దొంగిలించి పరారైన నిందితులను పోలీసులు చాకచక్యంగా బుధవారం పట్టుకున్నారు. రాజాం ఎస్ఐ కె.రాము నిందితులను విలేకరుల ముందు హాజరు పరిచి, వివరాలను వెల్లడించారు. ఈ నెల 10న విజయవాడకు చెందిన బట్టల వ్యాపారి పడాల నాగేశ్వరరావు రాజాంలో తన సొమ్ము కలెక్షన్ చేసుకుని, తిరుగు పయనమయ్యాడు. సాయంత్రం 6 గంటల సమయంలో విశాఖపట్నం బస్సు ఎక్కుతుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి వ్యాపారిని తత్తరపాటుకు గురిచేసి, చేతిలో ఉన్న బ్యాగును చాకచక్యంగా కాజేసి పరారయ్యారు. తేరుకున్ను నాగేశ్వరరావు.. తన బ్యాగులోని రూ.86,250లు అపరహరణకు గురయ్యాయని రాజాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, రంగంలోకి దిగిన పోలీసులు.. కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ పుటేజీలను పరిశీలించి, పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం బస్టాండ్‌లో అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ కె.రాము, క్రైం సిబ్బంది సీహెచ్ కృష్ణ, చౌదరి కృష్ణ, శంకరరావు బస్టాండ్‌కు చేరుకొని, చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు విశాఖపట్నంకు చెందిన బుర్లి సురేష్‌ప్రసాద్, గోపాలపట్నంకు చెందిన అరికట్ల తారకేశ్వరరావుగా గుర్తించి, మరిన్ని వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వీరి వద్ద నుంచి రూ.84,200లు స్వాధీనం చేసుకుని, రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించామని ఎస్ఐ వివరించారు. గతంలో విశాఖపట్నంలో కూడా వీరిపై పలు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. -
వ్యాపారుల్ని దొంగలన్నారు
న్యూఢిల్లీ: వ్యాపారులందరూ దొంగలేనని కాంగ్రెస్ పార్టీ అంటోందనీ, గత 70 ఏళ్ల ఆ పార్టీ పాలనలో వ్యాపారులకు అన్నీ అవమానాలే ఎదురయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ధరలు పెరగడానికి వర్తకులే కారణమని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆరోపించేవనీ, అయితే వాస్తవానికి ఆ పార్టీ మనుషులే వస్తువులను నల్లబజారుకు తరలించి ధరలు పెరిగేలా చేసేవారని మోదీ నిందించారు. ఢిల్లీలో పలువురు వ్యాపారులతో మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ‘వ్యాపారులను దొంగలు అంటూ కాంగ్రెస్ దుర్భాషలాడుతోంది. కానీ జాతిపిత మహాత్మా గాంధీ తాను వ్యాపారుల కులమైన బనియాకు చెందిన వాడినని గర్వంగా చెప్పేవారు. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యాపారులు వెన్నెముక. కానీ గతంలో వారికి లభించాల్సిన గౌరవం ఎన్నడూ దక్కలేదు. కష్టకాలంలో వ్యాపారులకు బాసటగా నిలిచింది బీజేపీ ప్రభుత్వమే’ అని అన్నారు. తనఖా లేకుండానే 50 లక్షల రుణం మళ్లీ ఎన్డీయే అధికారం చేపడితే వ్యాపారులకు ఎలాంటి తనఖా లేకుండానే రూ. 50 లక్షల వరకు రుణాలిస్తామనీ, జీఎస్టీ వ్యవస్థలో నమోదైన సంస్థలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని మోదీ తెలిపారు. వ్యాపారులకు క్రెడిట్ కార్డు సౌకర్యం కల్పించడం, చిన్న దుకాణాలు నడుపుకునే వ్యక్తులకు పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టడంతోపాటు కొత్త చిల్లర వర్తక విధానాన్ని తెస్తామని మోదీ ప్రకటించారు. అలాగే జాతీయ వ్యాపారుల సంక్షేమ మండలిని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. సులభతర వాణిజ్య ర్యాంకుల్లో భారత్ తమ ప్రభుత్వ కాలంలో 65 స్థానాలు మెరుగుపరుచుకుని 77వ ర్యాంకు పొందిన విషయాన్ని మోదీ గర్తుచేశారు. స్టార్టప్‌ల్లో 20 వేల కోట్లు పెడతాం.. తమ ఐదేళ్ల పదవీ కాలంలో పురాతన కాలం నాటి 1,500 చట్టాలను రద్దుచేసి వ్యాపారుల జీవితాలను, పనులను సరళతరం చేశామని మోదీ చెప్పారు. ‘వ్యాపారులు దోహదం చేయడం వల్లే ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చగలిగాం. వ్యాపారుల శ్రమ నన్ను ఆకట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ వికసించడానికి వారు సాయపడ్డారు’ అని మోదీ పేర్కొన్నారు. తమ పార్టీ గెలిస్తే యువతను వ్యాపారం వైపు ఆకర్షించేందుకు రూ. 20,000 కోట్లను స్టార్టప్ రంగంలో పెట్టుబడులుగా పెడతామని చెప్పారు. -
చోరీ ఫోన్లకు ‘రెక్కలు’
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు చోరీ చేసిన ఫోన్లను యధాతథంగా వినియోగించడం/విక్రయించడం జరిగేది.ఆ తర్వాత కొన్నాళ్లకు తస్కరించిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను ట్యాంపరింగ్/క్లోనింగ్ చేసి వాడటం మొదలెట్టారు.ఇప్పుడు చోరీ చేసిన వాటిలో అత్యంత ఖరీదైన సెల్ఫోన్లను గుట్టుగా విదేశాలకు తరలించేస్తున్నారు.నగరంలో అపహరణకు గురవుతున్న సెల్ఫోన్లలో ఖరీదైనవి అత్యధిక భాగం బ్యాంకాక్, చైనాలకు తరలిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశంలో ఉన్నవి సైతం ప్రధానంగా కర్ణాటకలోని గుల్బర్గా మార్కెట్‌కు వెళ్తున్నాయి. ఫలితంగా వీటిని రికవరీ చేయడం కష్టసాధ్యంగా మారుతోందని అధికారులు పేర్కొంటున్నారు. అనధికారిక సమాచారం ప్రకారం నగర వ్యాప్తంగా ఏటా దాదాపు లక్ష వరకు సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. రాజధానిలో అనేక ముఠాలు సెల్‌ఫోన్ పిక్‌పాకెటింగ్, స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయాణికులు, పాదచారులను లక్ష్యంగా చేసుకుని ఈ సెల్ఫోన్ల చోరీ చేస్తున్నారు. బాధితు ల్లో మధ్య తరగతి వారే ఎక్కువగా ఉంటున్నారు. పర్సుల నుంచి సెల్ఫోన్ల వరకు... నగరంలోని పిక్‌పాకెటింగ్ గ్యాంగ్‌లు ఒకప్పుడు కేవలం పర్సులను మాత్రమే టార్గెట్ చేసేవి. అయితే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరగడంతో వీరికి పర్సులతో ‘గిట్టుబాటు’ కావట్లేదు.ఈ నేపథ్యంలో ఇటీవల వీరు సెల్ఫోన్లపై దృష్టి సారించారు. పీడీ యాక్ట్ ప్రయోగం వరకు కరుడుగట్టిన రౌడీషీటర్లు ఫయాజ్, ఖైసర్, షేరూ, లతీఫ్ తదితరులు ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ మరికొన్ని చోటా మోటా ముఠాలు ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఐదుగురు సభ్యుల ముఠాను ముషీరాబాద్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఇలాంటి ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఒకరి ఏరియాల్లోకి మరొకరు ప్రవేశిస్తుండటంతో వీటి మధ్య అనేక సందర్భాల్లో గ్యాంగ్ వార్స్ జరిగి హత్యలకు దారి తీస్తున్నాయి. గతంలో ఐఎంఈఐ నంబర్ మార్చేసి... ప్రతి మొబైల్‌ఫోన్‌కు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫికేషన్‌గా పిలిచే ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది. మనిషి వేలిముద్రల తరహాలోనే ప్రపంచంలోని ఏ రెండు సెల్ఫోన్లకూ ఒకే నెంబర్ ఉండదు. సదరు సెల్‌ఫోన్‌ను ఏ వ్యక్తి వినియోగిస్తున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. జాతీయ భద్రత నేపథ్యంలో ఇది ఎంతో కీలకం. ఐఎంఈఐ నంబర్ ట్యాంపర్ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్ విపణిలో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లకు దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్‌ను వినియోగించి దానికి ఉన్న నెంబర్‌కు బదులు మరో ఐఎంఈఐ నెంబర్ కేటాయించేవారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి మదర్ బోర్డ్‌పై ఉన్న ఐఎంఈఐ నెంబర్ స్ట్రిప్‌ను ట్యాంపరింగ్ ద్వారా సేకరించి చోరీ వాటికి వేసే వారు. దీంతో సాంకేతికంగా చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు. సరిహద్దులు దాటిస్తూ... తాజాగా చోరీ సెల్ఫోన్లను కొనుగోలు చేస్తున్న, చోరీ చేస్తున్న వారి పంథా పూర్తిగా మారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురిలో ఒకడైన నజీరుద్దీన్ ఆరునెలల్లో దాదాపు నాలుగు సార్లు బ్యాంకాక్ వెళ్ళి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కోణంపై ఆరా తీయగా, తనతో పాటు మరికొందరు ‘ఐ–ఫోన్లను’ సరిహద్దులు దాటించేస్తున్నట్లు వెల్లడించాడు. ఒక్కో విడతలో నాలుగైదు ఫోన్ల చొప్పున బ్యాంకాక్ తీసుకువెళ్లి అక్కడ మార్కెట్లో అమ్మేసి వస్తున్నట్లు అంగీకరించాడు. నగరంలో జగదీష్ మార్కెట్ తరహాలోనే ఆ దేశంలోనూ ఓ భారీ సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్ ఉందని, అయితే అక్కడ ఐ–ఫోన్లకు మాత్రమే గిరాకీ ఉన్నట్లు వెల్లడించాడు. గుల్బర్గాలోని సెకండ్ హ్యాండ్ మార్కెట్ దేశంలో చోరీ మాల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా పోలీసులు గుర్తించారు. ఇలా తరలిపోతున్న వాటిని ట్రాక్ చేయడం సాధ్యం కావట్లేదని చెబుతున్నారు. రిటర్న్ రూపంలో చైనాకు... నగరంలోని అనేక ప్రాంతాలకు చెందిన చోరీ మాల్ వ్యాపారస్తులు సిండికేట్‌గా చైనా మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా చైనా నుంచి వివిధ రకాలైన వస్తువులను దిగుమతి చేసుకోవడం సాధారణమైంది. ఇలా వచ్చిన మాల్లో కొంత అనేక కారణాల నేపథ్యంలో రిటర్న్ చేస్తుంటారు. వీటితో కలిపి చోరీ సెల్ఫోన్లను చైనాకు పంపేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. పక్కా ప్రొఫెషనల్ చోరుల నుంచి ఖరీదు చేసిన ఖరీదైన హై–ఎండ్ ఫోన్లను మాత్రమే ఇలా పంపేస్తున్నట్లు భావిస్తున్నారు. రిటర్న్ మాల్లో గోప్యంగా దాచి పంపిస్తున్న నేపథ్యంలో కస్టమ్స్ అధికారులకూ చిక్కట్లేదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల చోరీకి గురైన హై–ఎండ్ సెల్ఫోన్లను రికవరీ చేయడం అసాధ్యంగా మారినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టిన పోలీసులు బాధ్యుల కోసం లోతుగా ఆరా తీస్తున్నారు. జాగ్రత్తలే మేలు... సెల్ఫోన్లను కోల్పోయిన సందర్భంలో బాధితులను ఎక్కువగా ఆందోళనకు గురిచేసేది దాని ఖరీదు కంటే అందులో ఉన్న డేటానే. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్నేహితులు, సన్నిహితులు, బంధువులు... చివరకు తల్లిదండ్రులు, భార్య ఫోన్ నెంబర్లు, అత్యంత కీలకమైన డేటాను సెల్లోనే ఫీడ్ చేసుకుంటున్నారు. ఫలితంగా ఒక్కసారి ఫోన్ పోగొట్టుకుంటే... దాదాపుగా అందరితోనూ సంబంధాలు తెగిపోతున్నాయి. విలువైన సమాచారం కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి సెల్‌ఫోన్‌కు 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్) ఉంటుంది. మెబైల్ ప్యాకింగ్ బాక్స్‌పైనా, అమ్మకం బిల్లుపైనా దీన్ని ముద్రిస్తారు. మీ సెల్ఫోన్లో (06) బటన్లు నొక్కితే ఈ నెంబరు డిస్ప్లే అవుతుంది. ఈ సంఖ్యను నోట్ చేసుకుని భద్రంగా ఉంచుకోవాలి. ఫోను పోయినప్పుడు దీన్నిబట్టి ఆచూకీ కనుక్కోవడానికి ప్రయత్నించవచ్చు. మీ సెల్‌ఫోన్‌ను సెక్యూరిటీ లాక్ పెట్టుకోవాలి. ప్రతి ఫోనులోనూ ఉన్న మెనూలో సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. దీనిని సెట్ చేసుకోవడం వల్ల మన ఫోను ఎవరికైనా దొరికినా, దొంగిలించినా... వినియోగించుకోవడం, అందులోని వ్యక్తిగత డేటాను చూడటం వారి వల్లకాదు. ప్రస్తుతం కొన్ని సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు, వెబ్‌సైట్స్ ఫోన్‌బుక్‌తో పాటు కొంత డేటా, ఫొటోలు బ్యాకప్/స్టోర్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటిని వినియోగిం చుకోవడం ద్వారా మీ ఫోన్లో సేవ్ చేసుకుంటున్న డేటా అంతా ఓచోట బ్యాకప్ అవుతుంది. దీని వల్ల ఫోన్ పోయినా... మీ డేటా సర్వర్‌లో సురక్షితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కేవలం సెల్లో ఫీడ్ చేసుకోవడంతో పాటు ఆ డేటా మొత్తం డేటా కార్డు సాయంతో కంప్యూటర్లో, సీడీల్లో భద్రపరుచు కోవడం లేదా కీలక నెంబర్లన్నీ రాసి పెట్టుకోవడం మంచిది. -
పరుగెత్తలేని పోలీసు.. పట్టేస్తుంది దొంగ ఫేసు!
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎడారి దేశం దుబాయికి ఎవరూ సాటిరారేమో. ఆకాశహర్మ్యాలలో అగ్నిప్రమాదాలను నివారించేందుకు ఇప్పటికే అక్కడ ఎగిరే జెట్‌ప్యాక్‌ల సేవలు వినియోగించుకుంటున్నారు. గత నెలలో ప్రపంచంలోనే తొలిసారి ఈ దేశంలో తొలి రోబో పోలీస్ విధులు నిర్వర్తించడం మొదలైంది. అయితే ఇదేమీ తుపాకీ చేతిలో పట్టుకుని తిరిగే రోబో పోలీస్ కాదులెండి. పర్యాటకులకు తగిన సలహా సూచనలిచ్చేందుకు, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూసేందుకు మాత్రమే ఉద్దేశించారు. తాజాగా దుబాయి పోలీస్ విభాగం రోబో కార్లను ప్రవేశపెట్టింది. ఫొటోలో కనిపిస్తున్నది అలాంటి రోబోనే. ఈ రోబో కారు చూసేందుకు చిన్నగా ఉంటుంది గానీ.. దీనిలో బోలెడన్ని టెక్నాలజీలు ఉన్నాయి. సింగపూర్ స్టార్టప్ కంపెనీ ఒట్సా డిజిటల్ అభివృద్ధి చేసిన ఈ రోబో పేరు ఓ–ఆర్3. పేరుకు కారే గానీ.. ఇది కనీసం పరుగు కూడా పెట్టలేదు. కాకపోతే.. తనకు కేటాయించిన బీట్‌లో పోలీసు రికార్డులకు ఎక్కిన నిందితులెవరైనా ఉంటే మాత్రం... ఇట్టే పసిగట్టేస్తుంది. ఇందుకు అనుగుణంగా దీంట్లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించారన్నమాట. ఓ లేజర్ స్కానర్, ఓ థర్మల్ కెమెరా, హెచ్డీ కెమెరాలతోపాటు లిడార్ వంటి స్పేస్ కెమెరాలూ ఇందులో ఉంటాయి. మరి ఇది చిన్నచిన్న గల్లీల్లోకి కూడా వెళ్లగలదా? ఊహూ. కానీ కారు పైకప్పుపై ఉండే డ్రోన్ కావాల్సిన చోటికెళ్లి అందరి మీద ఓ కన్నేసి రాగలదు. పగలు రాత్రి, ఎండా వాన లాంటి అవరోధాలు ఏమీ లేకుండా రోడ్లపై ఓ కన్నేసి ఉంచేందుకు, అనుమానితులను గుర్తించేందుకు ఓ–ఆర్3 మేలైన మార్గం అంటున్నారు దుబాయి పోలీస్ విభాగపు అధ్యక్షుడు అబ్దుల్లా ఖలీఫా అల్ మరీ. ఈ ఏడాది చివరికల్లా ఓ–ఆర్3 రోబోలను పెద్దసంఖ్యలో దుబాయి రోడ్లపై నియమిస్తామంటున్న ఖలీఫా.. భవిష్యత్తులో మరిన్ని కొత్త రోబోలు, టెక్నాలజీలను శాంతిభద్రతల పరిరక్షణకు వాడతామని చెబుతున్నారు. ఇంకొన్నేళ్లలో పది అడుగుల ఎత్తైన రోబో పోలీసులు దుబాయి వీధుల్లో పనిచేస్తూంటాయని, 2030 నాటికల్లా డిపార్ట్మెంట్లో 25 శాతం రోబోలే ఉంటాయనీ ఆయన అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
జల్సాల కోసం చోరీల బాట
మోటారు బైక్‌ల దొంగలు అరెస్టు రూ.3.60 లక్షల విలువైన బైక్‌లు స్వాధీనం కాకినాడ క్రైం : వారంతా యువకులు.. చదువు అబ్బకపోవడంతో బలాదూర్‌గా తిరుగుతూ, అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు చోరీల బాటపట్టారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. కాకినాడ సిటీ పరి«ధిలో ఇటీవల మోటారు బైక్‌ల వరుస మాయం సంఘటనలపై నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.3.60 లక్షల విలువైన 14 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం కాకినాడ త్రీటౌన్ క్రైం పోలీస్ స్టేçషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాకినాడ క్రైం డీఎస్పీ ఎ.పల్లపురాజు నిందితుల వివరాలను వెల్లడించారు. సామర్లకోట మండలం మాధవపట్నం అంబేడ్కర్ కాలనీకి చెందిన 19 ఏళ్ల బొలిపే రాజబాబు (రాజు), ఇదే కాలనీకి చెందిన బారిక వెంకటరమణలు పాత నేరస్తులు. వీరు గతంలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడ్డారు. పెదపూడి మండలం కరకుదురు గ్రామానికి చెందిన బొంతు సూరిబాబు (సురేష్), ఒక మైనర్ బాలుడు కలసి మూడు నెలలుగా కాకినాడ వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ క్రైం పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 మోటార్ బైక్‌లను అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మోటార్ బైక్‌ల దొంగతనాలపై ఏఎస్పీ ఏఆర్ దామోదర్ పర్యవేక్షణలో తన ఆధ్వర్యంలో త్రీటౌన్ క్రైం ఎస్సై ఎస్ఎం.పాషా, క్రైం పార్టీ ఆధ్వర్యంలో మూడు నెలలుగా దర్యాప్తు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. నలుగురు నిందితుల్లో ఇద్దరు పాత వారే.. కాకినాడ సాంబమూర్తినగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చోరీల పర్వం వెలుగుచూసింది. వీరి వద్ద నుంచి రూ.2.10 లక్షల విలువ చేసే 4 బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదే విధంగా కాకినాడ టూటౌన్ క్రైం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు మోటారు బైక్‌లు చోరీకి గురయ్యాయి. వీటిని కాకినాడ రాజీవ్ గృహకల్ప వద్ద, డైరీఫారం సెంటర్లో చవ్వాకుల దుర్గాప్రసాద్ వద్ద నుంచి క్రైం ఎస్సై రామారావు అరెస్టు చేసి, రూ.1.50 లక్షల విలువ చేసే 5 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులను శనివారం అరెస్ట్ చేసి కోర్టుకు పంపినట్టు తెలిపారు. బాలుడిని జువైనల్ యాక్టు ప్రకారం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. సమావేశంలో క్రైం ఎస్సైలు ఎస్ఎం పాషా, హరీష్‌కుమార్, రామారావు, క్రైం పార్టీ పోలీసులు పాల్గొన్నారు. -
బీహారీ దొంగల అరెస్టు..రూ.7.65లక్షలు స్వాధీనం
వరంగల్: అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి పోలీసులు పెద్ద ఎత్తున నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఆర్ఎన్టీ రోడ్డులోని బంగారు దుకాణాల వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా రూ.7.65 లక్షల నగదు, 255 గ్రాముల బంగారం లభించింది. ఇద్దరూ బీహార్‌లోని భగల్పూర్ నారాయణపూర్‌కు చెందిన ఇర్షాద్ అలీ, నజాం అలీలుగా తేలింది. కూలి పనుల కోసం వరంగల్‌కు వచ్చారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో బంగారం మెరుగుపెడతామని గ్రామాల్లో తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను దోచుకునే వారు. గత ఏడాది దొంగతనాలకు పాల్పడి దోచుకున్న సొత్తును అమ్ముకునేందుకు బులియన్ మార్కెట్‌కు వస్తున్నట్లు అందిన సమాచారం మేరకు వలపన్ని దొంగలు పట్టుకున్నట్లు ఇన్స్పెక్టర్ డేవిడ్ రాజు తెలిపారు. దొంగలను పట్టుకుని సొత్తును రికవరీ చేసిన సీసీఎస్ సిబ్బందిని సీపీ సుధీర్‌బాబు అభినందించారు. -
ఇద్దరు అంతర్జిల్లా నేరస్తుల అరెస్ట్
కొవ్వూరు : ఇద్దరు అంతర్జిల్లా నేరస్తులను కొవ్వూరు రూరల్ పోలీసులు మంగళ వారం అరెస్ట్ చేశారు. రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కొవ్వూరు మండలంలోని సీతంపేటలో నవంబర్ 26న రోడ్డు పక్కన పార్క్ చేసిన లారీ అపహరణకు గురైంది. దీంతో లారీ యాజమాని మచ్చా సూర్యనారాయణ అప్పట్లో రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విజయవాడ పోరంకికి చెందిన కడియాల శ్రీనివాసుతో పాటు అతని సోదరుడు కడియాల ఓకార్ ఈ చోరీకి పాల్పడ్డారని గుర్తించి వారిని మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి లారీతోపాటు చోరీ సమయంలో వినియోగించిన అంబాసిడర్ కారును స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలతో గుట్టురట్టు ఈ కేసును సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఛేదించారు. లారీ చోరీకి గురైన రోజు కొవ్వూరు పట్టణంలోని టోల్‌గేట్‌తోపాటు పలుప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల్లో లారీ వెనుక అంబాసిడర్ కారు యర్నగూడెం వరకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఆ కారు నంబర్ సీసీ కెమెరాల్లో పూర్తిస్థాయిలో కనిపించకపోవడంతో విజయవాడకు చెందిన నిపుణుల సాయంతో కారు నంబర్‌ను గుర్తించారు. కారు ఖమ్మం జిల్లా కొత్తగూడేనికి చెందినదిగా కనుగొన్నారు. దానిని జంగారెడ్డిగూడెంకు చెందిన నిందితుడు శ్రీనివాస్‌కు అమ్మినట్టు తెలుసుకున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ విజయవాడలో ఉంటున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అతని గురించి ఆరా తీశారు. శ్రీనివాస్‌తో, అతని తమ్ముడు ఓంకార్ పాతనేరస్తులని గుర్తించారు. గతంలో లారీల రికార్డులు మార్పు చేసి లోడ్లు అమ్ముకుని వీరిద్దరూ పట్టుబడినట్టు తెలుసుకున్నారు. జంగారెడ్డిగూడెం, చాగల్లు, పెనమలూరు, కాకినాడల్లో వీరిపై కేసులు నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిందితులపై నిఘా ఉంచిన పోలీసులు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు యర్నగూడెం సమీపంలో పోలేరమ్మ ఆలయం వద్ద లారీతో ఉండగా వారిద్దరినీ పట్టుకున్నారు. లారీకి రంగు మార్చివేసి కర్నాటక రిజిస్ట్రేషన్‌తో దొంగనంబర్ వేసినట్టు పోలీసులు గుర్తించారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై ఎం.శ్యాం సుందరరావు, హెచ్‌సీ ఏకే సత్యనారాయణ, కానిస్టేబుల్ ఎల్.చిరంజీవిని అభినందించారు. వీరికి రివార్డుల నిమిత్తం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: కోవూరులోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. నెల్లూరు థర్మల్ స్టేషన్ గేట్ సమీపంలోని చిట్టెమ్మ కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం కుటుంబసభ్యులంతా ఇంటికి తాళం వేసి జొన్నవాడ నవరాత్రి ఉత్సవాలకు వెళ్లారు. ఇదే అదనుగా తాళాలు పగులగొట్టిన దుండగులు బీరువాలో ఉన్న 20 సవర్ల బంగారు ఆభరణాలతోపాటు రూ.20 వేల డబ్బును ఎత్తుకుపోయారు. శనివారం ఉదయం ఇంటికి చేరుకున్న చిట్టెమ్మ విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీంను రప్పించి దర్యాప్తు చేపట్టారు. -
పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు
– మహిళపై దాడి – ఒంటిపైనున్న నగల దోపిడీ తిరుపతి క్రైం: నగరంలోని మధురానగర్‌లో శుక్రవారం దొంగలు పట్టపగలే ఓ మహిళపై దాడికి పాల్పడి బంగారు దోచుకున్నారు. బాధితురాలు సురేఖ అలియాస్ జ్యోతి కథనం మేరకు... మధురానగర్‌కు చెందిన సురేఖ (48) తన ఇద్దరు కూతుళ్లు, తల్లితో పాటు ఉంటుంటున్నారు. శుక్రవారం చిన్నకూతురు సొంతపని నిమిత్తం బయటికి వెళ్లింది. పెద్ద కూతురు, తల్లి మిద్దెమీద ఉన్న గదిని శుభ్రం చేసేందుకు వెళ్లారు. సురేఖ దేవుడి పటాలను శుభ్రం చేయాలని బయటికి వెళ్లింది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ముసుగు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు సురేఖ మొఖంపై కారం చల్లారు. నోటికి, మెడకు టేప్ చుట్టేశారు. అంతేగాక తలపై, మొఖంపై బలంగా కొట్టారు. ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఆమె మెడలో ఉన్న చైన్, చేతికున్న బంగారు గాజులు, కమ్మలు లాక్కున్నారు. అనంతరం ఆమెను ఇంట్లోకి నెట్టి పక్కనే ఉన్న కాంపౌండ్ వాల్ దూకి పరారయ్యారు. ఆమె కూడా వారి వెనుకనే పరిగెత్తేందుకు ప్రయత్నించింది. కేకలు వేయడంతో పక్కింటి వారు కూతురు, తల్లి కిందకు వచ్చారు. బాధితురాలని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 4.30 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలిపిరి సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మల్లికార్జున, క్రైం సీఐ భాస్కర్, ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. ఈ దోపిడీలో 8 సవర్ల గాజులు, 3 సవర్ల చైన్, 6 గ్రాముల కమ్మలు పోయినట్లు బాధితురాలు తెలిపింది. -
నల్లగొండలో దొంగ హల్చల్..!
– రెండు ఇళ్లలో చోరీ.. – బంగారం ఎలక్ట్రానిక్ సామగ్రి అపహరణ నల్లగొండ క్రైం జిల్లా కేంద్రంలో ఓ దుండగుడు హల్చల్ చేశాడు. రెండు ఇళ్లల్లో చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను అపహరించుకుపోయాడు. టూటౌన్ ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకార.. పాత వీటీ కాలనీకి చెందిన ఊట్కూరి భూపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు శనివారం రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఓ దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు. బీరువాలో ఉన్న ఎనిమిది గ్రాముల బంగారం, సెలఫోన్, చార్జర్ అపహరించాడు. అదే విధంగా ఎన్జీ కాలనీలోని ఆకవరం సతీష్‌కుమార్ ఇంట్లోకి కూడా ప్రవేశించి హెచ్‌పీ కంప్యూటర్ మానిటర్, ఓ ఫోను ఎత్తుకెళ్లాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. సీసీ కెమెరాలో దుండగుడి కదలికలు పాత వీటీ కాలనీలో చోరీకి పాల్పడిన వ్యక్తి కదలికలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అయితే బాధితుల ఇళ్లలో సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఎస్ఐ తెలిపారు.