గౌరిబిదనూరు: పోలీసులను చూస్తే నేరగాళ్లకు హడల్. కానీ ఎలుకలకు కాదు. నగరంలోని రూరల్ పోలీసు స్టేషను మాదనహళ్ళి చెరువులో ఉంది. అది నిర్మానుష్య ప్రాంతం కాగా ఎలు కలు, పందికొక్కుల బెడద ఎక్కువగా వుంది. స్టేషనులో రికార్డులను అవి పాడు చేయడంతో విసుగు చెందిన పోలీసులు పిల్లిని తెచ్చి పెట్టారు. స్టేషనుకు పిల్లి వచ్చిన తరువాత ఎలుకల బాధ కొంతవరకు తక్కువగా ఉందని పోలీసులు చెప్పారు. ఏమైతేనేమి పిల్లికి స్టేషనులో రాచమర్యాదలు దక్కుతున్నాయి.
ముగ్గురు దొంగల అరెస్టు
మైసూరు: ముగ్గురు దోపిడీ దొంగలను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి మూడు బైకులతో పాటు రూ.15 లక్షల విలువ చేసే బంగారు నగలను సీజ్ చేశారు. నగర క్రైమ్, ట్రాఫిక్ డిసిపి గీతా ప్రసన్న ఆదేశాల మేరకు సీసీబీ పోలీసులు చైన్ స్నాచర్లు, ఇళ్లలో చోరీచేసేవారిపై నిఘా వేసి ముగ్గురిని అరెస్టు చేశారు. మైసూరులో ఇటీవలికాలంలో స్నాచింగ్‌లు, దొంగతనాలు పెరిగిపోవడం తెలిసిందే.
(చదవండి: ఘనంగా పెంపుడు కుక్క బర్త్ డే వేడుక...ఏకంగా 4 వేలమందికి...)
Comments
Please login to add a commentAdd a comment