
US woman left the trunk of her car: ప్రసుతం ప్రజలంతా ఒమిక్రాన్ వైరస్‌తో హడలెత్తిపోతుంటే ఒక పక్క ఈ దొంగల బెడద తప్పడం లేదు. ఈ వైరస్ మహమ్మారికి భయపడి చాలామటుకు ప్రజలంత తమ సోంత కార్లు లేదా(క్యాబ్ బుక్ చేసుకుని) ఎక్కడికైన వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అదునుగా చేసుకుని మార్గ మధ్యలో దోపిడి దారులు రెచ్చిపోయి కార్లను ఆపి లూటీ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు కార్లను ధ్వంసం కూడా చేస్తున్నారు. అచ్చం అదే తరహాతో యూఎస్‌లోని దొంగలు దోపిడి చేయబోతుంటే ఒక మహిళ మాత్రం తెలివిగా తన కారుని ధ్వంసం చేయనివ్వకుండా కాపాడుకుంది.
(చదవండి: తగ్గేదేలే! నువ్వు ముందు విమానం నుంచి దిగిపో!)
అసలు విషయంలోకెళ్లితే...కాలిఫోర్నియాలోని పారిసా హెమ్మత్, శాన్‌ఫ్రాన్సిస్కో బే ప్రాంతాల్లో దోపిడిదారులు చోరబడి విధ్వంసం సృష్టించారు. అక్కడ ఉన్న ప్రజల వద్ద నుంచి విలువైన వస్తువులు, డబ్బులు లాక్కోవడం వంటివి చేశారు. ఈ క్రమంలో వారు రహదారులపై ఉన్న కార్లులో వస్తున్న వాళ్లను సైతం ఆపి కారు పగలు గొట్టి భయబ్రాంతులకు గురి చేసి విలువైన వస్తువులను బలవంతంగా లాక్కుంటున్నారు. ఇదే తరహాతో ఒక మహిళ దగ్గరకు రాంగానే ఆమె తన కారుని కాపాడుకునే నిమిత్తం తానే ముందుగా కారు డిక్కి ఒపెన్ చేసి తన కారులో ఏమిలేవు కావలంటే చూడండి అంటూ చూపించింది.
దీంతో సదరు దొంగలు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి ఆమెను ఏం చేయకుండా అక్కడ నుంచి దొంగలు నిష్క్రమించారు. అయితే ఒక్కోసారి మన దగ్గర అలాంటి దొంగలను ఎదిరించలేని పరిస్థితి ఏర్పడినప్పుడూ సదరు మహిళలా ముందుస్త చర్యగా కాస్త తెలివిగా వ్యవహరిస్తే చిన్న మొత్తంలోనే నష్టంతో సరిపెట్టుకోవచ్చు. ఈ మేరకు శాన్ ఫ్రాన్సిస్కో మేయర్ దోపిడి దారులను పట్టుకునేలా మరింత దూకుడుగా వ్యవహరించే కట్టుదిట్టమైన చట్టాల అమలు కోసం పిలుపునివ్వాలని గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు.
(చదవండి: ఒమిక్రాన్ వైరస్ ఈ నగరాన్ని దెయ్యాల నగరంగా మారుస్తోంది!!)