sanfransisco
-
శాన్ ఫ్రాన్సిస్కో సిటీ హాల్లో 75వ రిపబ్లిక్ డే వేడుకలు
భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అమెరికాలో వైభవంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో సిటీ హాల్లో జరిగిన వేడుకలకు ప్రవాసులు భారీగా తరలివచ్చారు. ముఖ్య అతిథిలుగా 'శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా' డాక్టర్ శ్రీకర్ రెడ్డి, 'చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ మరియం' హాజరై, ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని మాతృభూమిపై వారికున్న ప్రేమాభిమానాలను చాటిచెప్పారు. వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ళ చరిత్రలో భారతదేశం సాధించిన పురోగతిని పలువురు కొనియాడారు. ఇక ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వహకులు హర్షం వ్యక్తం చేశారు. -
మరీ ఇంత దారుణమా! అద్దె కూడా చెల్లించని ఎలాన్ మస్క్.. కోర్టులో దావా
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విటర్‌ను బిలియనీర్ ఎలాన్ మస్క్ టేకోవర్ చేసినప్పటి నుంచి క్రమంగా కొత్త రూపు సంతరించుకుంటోంది. అయినా ఆర్థిక కష్టాల్లో సతమతమవుతోంది. ఎంతలా అంటే చివరికి తమ కార్యాలయాలకు అద్దె కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంది. ట్విటర్ 1355 మార్కెట్ స్ట్రీట్‌లోని తన కార్యాలయాలకు డిసెంబర్ అద్దె 3.36 మిలియన్ డాలర్లు జనవరి అద్దెకు 3.42 మిలియన్ డాలర్లు చెల్లించడంలో విఫలమైంది. దీంతో భవన యజమాని శ్రీ నైన్ మార్కెట్ స్క్వేర్ ఎల్ఎల్సీ, కోర్టును ఆశ్రయించింది. కాలిఫోర్నియా స్టేట్ కోర్టులో దావా వేసింది. కార్యాలయాన్ని అద్దెకు ఇస్తున్న సమయంలో ట్విటర్ నుంచి శ్రీ నైన్ మార్కెట్ 3.6 మిలియన్ డాలర్ల ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ను పూచీకత్తుగా తీసుకుంది. ఇటీవల ట్విటర్ అద్దె చెల్లించకపోవడంతో లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా అద్దె బకాయిలో కొంత భాగాన్ని బ్యాంకు నుంచి తీసుకున్నట్లు తెలిపింది. మిగిలిన అద్దె చెల్లించేలా ట్విటర్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అలాగే లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను సైతం 10 మిలియన్ డాలర్లకు పెంచేలా ఆదేశించాలని కోరింది. ట్విటర్‌ను టేకోవర్ చేసినప్పటి నుంచి ఎలాన్ మస్క్ ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సంస్థలోని సగం మంది సిబ్బందిని తొలగించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ ఇతర కార్యాలయాల్లో అద్దెను నిలపడంతో పాటు జెట్, చార్టర్ వంటి కొన్ని బకాయి బిల్లులను చెల్లించేందుకు కూడా నిరాకరించాడు. మొత్తానికి గత బకాయిలను చెల్లించడానికీ అంగీకరించడం లేదు. చదవండి: ఫ్రీగా క్రెడిట్ కార్డు.. ఓటీటీ సబ్స్క్రిప్షన్, ఈఎంఐ ఆఫర్లంటూ బోలెడు బెనిఫిట్స్! -
ఆఫీసు అద్దె కట్టని ట్విట్టర్
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి వెళ్లినప్పటి నుంచీ ట్విట్టర్‌ను వరుసబెట్టి కష్టాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న కార్యాలయానికి 1,36,250 డాలర్ల అద్దె చెల్లించడంలో విఫలమవడంతో పరిస్థితి విషయం కోర్టు కేసు దాకా వెళ్లింది! హార్ట్ఫోర్డ్ బిల్డింగ్‌లో 30వ అంతస్తులో ఉన్న కార్యాలయానికి బకాయి ఉన్న అద్దెను ఐదు రోజుల్లోగా చెల్లించాలంటూ గత డిసెంబర్ 16న యాజమాన్య సంస్థ కొలంబియా రీట్ తాఖీదులిచ్చింది. గడువులోగా చెల్లించకపోవడంతో గురువారం ట్విట్టర్‌పై కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది! ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ కార్యాలయానికి ట్విట్టర్ కొద్ది కాలంగా అద్దె చెల్లించడం లేదంటూ న్యూయార్క్ టైమ్స్ డిసెంబర్ 13వ తేదీనే కథనం ప్రచురించింది. రెండు చార్టర్ విమానాల అద్దె చెల్లించేందుకు తిరస్కరించినందుకు డిసెంబర్లో కూడా ట్విట్టర్‌పై కేసు నమోదైంది. -
న్యాయవ్యవస్థ రాజ్యాంగానికే జవాబుదారీ
సాక్షి, న్యూఢిల్లీ/శాన్ఫ్రాన్సిస్కో: భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రభుత్వ ప్రతి చర్యకు న్యాయపరమైన ఆమోదం లభిస్తుందని భావిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా రాజకీయ అవసరాలను న్యాయవ్యవస్థ ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాయన్నారు. కానీ, భారత న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి.. కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్నా రాజ్యాంగ వ్యవస్థల బాధ్యతలను, వాటి పాత్రను ప్రజలు అర్థం చేసుకోలేకపోయారంటూ జస్టిస్ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంస్థల పనితీరుపై సరైన అవగాహన లేకుంటే ప్రజలు సరైన దిశగా ఆలోచించలేరని చెప్పారు. ప్రజల్లోని ఈ అజ్ఞానమే న్యాయవ్యవస్థ స్వతంత్రను నాశనం చేయడమే ఏకైక లక్ష్యంగా ఉన్న కొన్ని శక్తులకు సహాయకారిగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలోని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ శుక్రవారం రాత్రి శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. ‘దేశంలో ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునే విషయంలో తమ బాధ్యతను అద్భుతంగా నెరవేర్చారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు సైతం ఇందులో చురుగ్గా వ్యవహరించారు’అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారుతుంటాయని, కానీ పరిణతి గల ఏ ప్రభుత్వమూ తన సొంత దేశం పురోగతిని దెబ్బతీసేలా విధానాలను మార్చబోదని సీజేఐ తెలిపారు. దురదృష్టవశాత్తూ భారత్‌లో మాత్రం ప్రభుత్వాలు మారినప్పుడల్లా అలాంటి సున్నితత్వం, పరిపక్వత కనిపించట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రతీ ఒక్కరు రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలుపంచుకోవాలి. రాజ్యాంగాన్ని సరైన రీతిలో అమలు చేసేందుకు దేశంలో రాజ్యాంగ సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. -
ప్లీజ్.. నా కారుని ధ్వంసం చెయ్యొద్దు!
US woman left the trunk of her car: ప్రసుతం ప్రజలంతా ఒమిక్రాన్ వైరస్‌తో హడలెత్తిపోతుంటే ఒక పక్క ఈ దొంగల బెడద తప్పడం లేదు. ఈ వైరస్ మహమ్మారికి భయపడి చాలామటుకు ప్రజలంత తమ సోంత కార్లు లేదా(క్యాబ్ బుక్ చేసుకుని) ఎక్కడికైన వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అదునుగా చేసుకుని మార్గ మధ్యలో దోపిడి దారులు రెచ్చిపోయి కార్లను ఆపి లూటీ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు కార్లను ధ్వంసం కూడా చేస్తున్నారు. అచ్చం అదే తరహాతో యూఎస్‌లోని దొంగలు దోపిడి చేయబోతుంటే ఒక మహిళ మాత్రం తెలివిగా తన కారుని ధ్వంసం చేయనివ్వకుండా కాపాడుకుంది. (చదవండి: తగ్గేదేలే! నువ్వు ముందు విమానం నుంచి దిగిపో!) అసలు విషయంలోకెళ్లితే...కాలిఫోర్నియాలోని పారిసా హెమ్మత్, శాన్ఫ్రాన్సిస్కో బే ప్రాంతాల్లో దోపిడిదారులు చోరబడి విధ్వంసం సృష్టించారు. అక్కడ ఉన్న ప్రజల వద్ద నుంచి విలువైన వస్తువులు, డబ్బులు లాక్కోవడం వంటివి చేశారు. ఈ క్రమంలో వారు రహదారులపై ఉన్న కార్లులో వస్తున్న వాళ్లను సైతం ఆపి కారు పగలు గొట్టి భయబ్రాంతులకు గురి చేసి విలువైన వస్తువులను బలవంతంగా లాక్కుంటున్నారు. ఇదే తరహాతో ఒక మహిళ దగ్గరకు రాంగానే ఆమె తన కారుని కాపాడుకునే నిమిత్తం తానే ముందుగా కారు డిక్కి ఒపెన్ చేసి తన కారులో ఏమిలేవు కావలంటే చూడండి అంటూ చూపించింది. దీంతో సదరు దొంగలు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి ఆమెను ఏం చేయకుండా అక్కడ నుంచి దొంగలు నిష్క్రమించారు. అయితే ఒక్కోసారి మన దగ్గర అలాంటి దొంగలను ఎదిరించలేని పరిస్థితి ఏర్పడినప్పుడూ సదరు మహిళలా ముందుస్త చర్యగా కాస్త తెలివిగా వ్యవహరిస్తే చిన్న మొత్తంలోనే నష్టంతో సరిపెట్టుకోవచ్చు. ఈ మేరకు శాన్ ఫ్రాన్సిస్కో మేయర్ దోపిడి దారులను పట్టుకునేలా మరింత దూకుడుగా వ్యవహరించే కట్టుదిట్టమైన చట్టాల అమలు కోసం పిలుపునివ్వాలని గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు. (చదవండి: ఒమిక్రాన్ వైరస్ ఈ నగరాన్ని దెయ్యాల నగరంగా మారుస్తోంది!!) -
ఆమె కోపం.. రూ.8కోట్లు తెచ్చింది
డబ్బు లేకపోవడం మాత్రమే పేదరికం కాదు. పేదరికం అనేక రూపాల్లో, స్వరూపాల్లో ఉంటుంది. చదువు లేకపోవడం, ఆలోచన లేకపోవడం, ఒకరిపై ఆధారపడటం.. ఇవన్నీ పేదరికాలే. శారీరక వైకల్యం కూడా ఒక విధమైన పేదరికమే. దృష్టి, మాట, వినికిడి.. వంటివి లేకపోవడం భౌతిక పేదరికాలు. పేదరికంలో ఉన్నవాళ్లు పోరాటం చేయలేరు. చేసినా వారికి న్యాయం జరిగితే బాగుండన్న ఆశైతే ఉంటుంది తప్ప న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉండదు. ‘పేదవాడి కోపం పెదవికి చేటు’ అనే నానుడి ఇందుకే వచ్చి ఉండాలి. అయితే లీసా ఇర్వింగ్ అనే మహిళ ఈ నానుడిని తుడిచేశారు. ఆమెకు కోపం వచ్చింది కానీ ఆ కోపం ఆమెకు చేటు అవలేదు. తనను పద్నాలుగుసార్లు క్యాబ్ ఎక్కించుకోకుండా నిరాకరించిన ఉబర్ కంపెనీ మీద కోపంతో ఆమె వేసిన కేసులో ఇప్పుడు ఆమెకు రాబోతున్న నష్టపరిహారం 1.1 మిలియన్ డాలర్లు. అంటే 8 కోట్ల రూపాయలు! ఆమె పేదరికం.. కంటి చూపు లేకపోవడం. లీసా అంధురాలు. శాన్ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ఉంటారు. ఇంట్లో తనొక్కరే ఉంటారు లీసా. ఆ మాట పూర్తిగా నిజం కాదనాలి. ఆమెతో పాటు ఆమె పెంపుడు శునకం బెర్నీ కూడా ఆమెతో ఉంటుంది. లీసా ఓ ప్రేవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవారు. ఇప్పుడు చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే.. ఆమె అనేకసార్లు ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లారు. ఎందుకు అలస్యంగా వెళ్లారు అంటే క్యాబ్‌లు ఏవీ ఆమెను ఎక్కించుకోలేదు. ఉబర్ క్యాబ్లైతే ఆమెను పద్నాలుగుసార్లు క్యాబ్ ఎక్కించుకోడానికి నిరాకరించాయి. ఆమె అంధురాలు అవడం ఒక కారణం అయితే, ఆమె వెంట బెర్నీ ఉండటం ఇంకొక కారణం. ‘‘కుక్క ఉంటే ఎక్కించుకోం’’ అని క్యాబ్‌లు.. దగ్గరి వరకు వచ్చి కూడా లీసా పక్కన బెర్నీని చూసి వెళ్లిపోయిన సందర్భాలు ఆమె జీవితంలో చాలానే ఉన్నాయి. కానీ పక్కన బెర్నీ లేకుంటే ఆమెకు జీవితమే లేదు. ఇంట్లో లీసాకు సహాయం చేసేదీ, ఆఫీస్‌కు రోడ్డు దాటించేదీ, క్యాబ్‌లు ‘మాట్లాడిపెట్టి’ (అరుపులతో క్యాబ్‌లను ఆపి) ఇంటికి, ఆఫీస్‌కు ఆమె పక్కన ఉండి మరీ తీసుకెళ్లి తీసుకొచ్చేదీ బెర్నీనే! లీసాకు ఉద్యోగం కంటే కూడా బెర్నీ ముఖ్యం. అందుకే ఉద్యోగం పోతే ఆమెకు పెద్దగా మనసు కష్టం అనిపించలేదు కానీ.. బెర్నీని, తనను క్యాబ్‌లో ఎక్కించుకోడానికి క్యాబ్ డ్రైవర్లు అయిష్టం చూపడం ఆమెను బాధించింది. కొందరు ఎక్కించుకున్నా కూడా.. దారి పొడవునా.. బెర్నీని ఏదో ఒకటి అనడం కూడా ఆమె హృదయాన్ని మరింతగా గాయపరిచింది. తన నిస్సహాయతను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆమెకు ఆవేదనగా ఉండేది. కోపం ఆమెను ఊపేసేది. చివరికి లీసా ఉబర్‌పై కోర్టుకు వెళ్లారు. ఆమె కేసు వేసింది 2018లో. మొన్న గురువారం తీర్పు వెలువడింది. ఉబర్ ఆమెకు 8 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆర్డర్! ఉబర్ తన వాదనను వినిపించకుండా ఉంటుందా? తమ డ్రైవర్లు కాంట్రాక్ట్ మీద చేరినవారు కనుక వారు చూపిన నిర్లక్ష్యానికి కంపెనీ తరఫున తాము నష్టపరిహారాన్ని చెల్లించే అవసరం లేదని వాదించినా కోర్టు లీసా వైపే నిలబడింది. ‘‘మానవత్వం మరచి, అంధురాలిపై వివక్ష కనబరుస్తూ లీసాకు రైడ్ ఇవ్వడకుండా నిరాకరించినందుకు, ఇచ్చికూడా ఆమెను, ఆమె శునకాన్ని తృణీకారంగా మాట్లాడినందుకు నష్టపరిహారం చెల్లించవలసిందేనని అంతిమంగా తీర్పు చెప్పింది. లీసా ఇర్వింగ్ అప్పట్లో చేస్తూ ఉన్నది పెద్ద ఉద్యోగం కాదు. పెద్ద ఉద్యోగం కాదంటే.. పెద్ద జీతం వచ్చే ఉద్యోగం కాదు. కనుక ఆమె సొంతంగా క్యాబ్‌లో వెళ్లలేరు. రైడ్ షేరింగ్ క్యాబ్‌ను మాట్లాడుకోవలసిందే. యాప్‌తో రైడ్ షేరింగ్‌ని బుక్ చేయడం కూడా ఆమెకు కష్టమే. అలాంటప్పుడు క్యాబ్ డ్రైవర్లే ఆపి, ఆమెకు రైడ్ షేరింగ్ ఇవ్వడం వారి కనీస ధర్మం. పైగా అమెరికాలోని ‘డిజెబిలిటీస్ యాక్ట్’ ప్రకారం అంధులకు ‘గైడ్’ గా ఉన్న డాగ్‌కు ఛార్జి తీసుకోకూడదు. షేర్ రైడింగ్ కనుక డాగ్‌కి కూడా చోటు కల్పించడం కష్టం అనీ, డాగ్ ఉన్నప్పుడు మరొకరు షేరింగ్‌కు రారని క్యాబ్ డ్రైవర్లు అంధుల విషయంలో ఉదాసీనతను ప్రదర్శిస్తుంటారు. నిజానికి క్యాబ్ డ్రైవర్లు ఒకసారి క్యాబ్‌లో ఎక్కిన అంధుడు / అంధురాలి ఫోన్ నెంబర్ తీసుకుని వారు కనుక ప్రతిరోజూ నిర్ణీత వేళల్లో ప్రయాణించే ఉద్యోగులు అయితే మర్నాడు మళ్లీ అదే సమయానికి వారికి కాల్ చేసి అందుబాటులోకి క్యాబ్‌ని తెస్తారు. అయితే లీసాకు చేదు అనుభవాలే ఎక్కువగా ఉన్నాయి. ఆమె దాదాపుగా పీడకల వంటి ఒక పెద్ద మానసిక క్షోభనే అనుభవించారు. ఆ క్షోభకే ఇప్పుడు ఈ నగదు పరిహారం. ఉబర్ చెల్లిస్తుందా, పైకోర్టుకు వెళుతుందా చూడాలి. ఏమైనా లీసా చేసిన న్యాయపోరాటం వల్ల ‘పేదవారికి’ కూడా పోరాడగలం అనే ధైర్యం వచ్చింది. పోరాడాలి అన్న స్పహ కూడా. -
జో బైడెన్‌తో ధర్మపురి వాసి
ధర్మపురి : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు దిశలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జోబైడెన్‌తో ధర్మపురికి చెందిన అర్చకుడు కశోజ్జుల చంద్రశేఖర్‌శర్మ కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2003లో అమెరికాలోని వెల్మింగ్టన్ సిటీలోని మహాలక్ష్మీ అమ్మవారి ఆలయానికి జోబైడెన్ రాగా.. అక్కడే అర్చకుడిగా ఉన్న చంద్రశేఖర్‌శర్మ ప్రత్యేక పూజలు చేసి నుదుట తిలకం దిద్దారు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం చంద్రశేఖర్‌శర్మ శాన్ఫ్రాన్సిస్కోలో హన్మాన్ ఆలయం నిర్మించి అక్కడే ఉంటున్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ జో బైడెన్‌కు హిందూ దేవుళ్లపై విశ్వాసం ఎక్కువగా ఉందని, అమ్మవారి కృపతో అధ్యక్షుడిగా గెలుపొందుతారని జోస్యం చెప్పారు. -
ప్రతి ఉత్పత్తిలో పునరుత్పాదక ప్లాస్టిక్: గూగుల్
శాన్ఫ్రాన్సిస్కో : 2022 నాటికి తమ ప్రతి ఉత్పత్తిలో పునరుత్పాదక (రీసైకిల్డ్) ప్లాస్టిక్‌ను వినియోగించనున్నామని ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్ ప్రతిజ్ఞ చేసింది. వచ్చే ఏడాది నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రయత్నిస్తామని సోమవారం ప్రకటించింది. గూగుల్ కొత్తగా తీసుకొన్న ఈ నిర్ణయంతో పర్యావరణంలో కార్బన్ ఉద్గారాల విడుదలను తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామంటు ఇది వరకే ప్రతిజ్ఞ చేసిన టెక్ కంపెనీల జాబితాలో చేరింది. గూగుల్ నుంచి ఉత్పత్తి అయ్యే మొబైల్ ఫోన్లు, స్పీకర్లు, ల్యాప్‌టాప్‌లను తరలించడానికి విమానాలకు బదులు ఓడలపై ఎక్కువ ఆధారపడటంతో తమ కంపెనీ రవాణాకు సంబంధించిన కార్బన్ ఉద్గారాలు 2017తో పోలిస్తే గత ఏడాది 40 శాతం పడిపోయాయని గూగుల్ పరికరాలు, సేవల విభాగాధిపతి ‘అన్నా మీగన్’ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. గూగుల్ కంపెనీ హార్డ్‌వేర్ వ్యాపారంలో అడుగుపెట్టి కేవలం 3 సంవత్సరాలే అయినప్పటికి, తమ ప్రత్యర్థి ఆపిల్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోందని మీగన్ వెల్లడించారు. తమ సంస్థ ఆన్లైన్లో విక్రయించే గూగుల్ హోమ్ స్పీకర్లు, యూఎస్బీ, పెన్‌డ్రైవ్‌లు ప్రతి తొమ్మిది గూగుల్ ఉత్పత్తులలో మూడింటికి ప్లాస్టిక్‌ను 20 శాతం నుంచి 42శాతం వరకు తిరిగి వినియోగించవచ్చనే అంశాన్ని గూగుల్ వర్గాలు పరిశీలిస్తున్నాయి. అంతేకాక ఒక బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ 2022 నాటికి 100 శాతం రీసైకిల్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను మార్కెట్లో తీసుకురావడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. -
యాంటీ హెచ్1బీ పోస్టర్ల కలకలం
వాషింగ్టన్ : అమెరికా ప్రభుత్వం హెచ్1 బి వీసాలపై రూపొందిస్తున్న కఠిన నిబంధనలు ఒకవైపు భారతీయ ఐటీనిపుణుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుండగా.. తాజాగా హెచ్1బీ వీసాలకు వ్యతిరేకంగా అమెరికాలో వినూత్న నిరసన మొదలైంది. ఈ మేరకు శాన్ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలో హెచ్1 బీ వీసాల జారీకి వ్యతిరేకంగా రైల్వేస్టేషన్లలోనూ రైళ్లపై పోస్టర్స్‌ను అతికించారు. అయితే ఇది హెచ్1 బీ వీసాలకు వ్యతిరేకంగా కాదనీ, వీటిపై అవగాహన కల్పించేందుకే కల్పించేందుకే చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. మార్చి 15న మొదలైన ఈ ఉద్యమం ఏప్రిల్ 1 వరకు కొనసాగుతుందని చెప్పారు. హెచ్1 బీ వీసాల జారీలో భారతీయ ఐటీ నిపుణుల నియామకాలపై ప్రాధాన్యతకాకుండా కేవలం అమెరికా ఉద్యోగులకు బదులుగా మాత్రమే ఇక్కడి ఐటీ ఉద్యోగాలు కేటాయిస్తున్నారంటూ ఆందోళన కారుడు, వాషింగ్టన్ డీసీకిచెందిన ప్రొగ్రెసివ్ ఫర్ ఇన్ఫర్మేషన్ రిఫర్మ్ డైరెక్టర్ కెవిన్ లిన్ పేర్కొన్నారు. నిబంధనలను కఠినతరం చేసిన తరుణంలో దీనిపై వ్యతిరేకత రేగుతున్న నేపథ్యంలో వీటిపై అందరికీ అవగాహన కల్పించాలనీ ఈ విధంగా నిరసన చేపట్టామన్నారు. ఇక్కడి స్థానికులు అవకాశాలు కోల్పోతున్నారనీ, వలసవచ్చిన వారినే ఉద్యోగాల్లో నియమించుకుంటున్నారని వాదించారు. ఇక్కడి యువతకు ప్రతిభ ఉన్నా వేరే దేశం నుంచి వచ్చిన వారికే అవకాశం ఇస్తున్నారని ఆయన అన్నారు. మేం చేస్తున్న ఈ నిరసనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే తమ ఉద్యమానికి కొంతవ్యతిరేకత ఉన్నప్పటికీ భారీ మద్దతు లభిస్తోందన్నారు. ఈ నిరసన మిగతా రాష్ట్రాల్లో కూడా చేపట్టాలని నిర్ణయించామని వెల్లడించారు. కానీ ఈ పద్దతిలో కాదనీ, ఆయా రాష్ట్రాల పరిస్థితి అనుగుణంగా నిరసనలు చేపడతామని అన్నారు. హెచ్1 బీ వీసాదారులకు ఇక్కడి కంపెనీలు ఎటువంటి రక్షణ కల్పించడం లేదు. ఒకవేళ కంపెనీ వారిని తీసేయాలనుకుంటే కారణం లేకుండానే తీసివేయగలదు. అప్పుడు వారు తిరిగి వారి దేశానికి వెళ్లాల్సిందేనని లిన్ అన్నారు. అలాంటి సమయాంలో ఆ ఉద్యోగాల్లో ఇక్కడ ప్రతిభ ఉన్న యువతను నియమించుకోరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం కంపెనీలు మొదటగా ఇక్కడి స్థానికులకే ప్రాధాన్యతనివ్వాలి. సాధారణ కిందిస్థాయి ఉద్యోగాలకు కూడా హెచ్1 బీ వీసాదారులను నియమించుకోకూడదు. ఒకప్పుడు వీటిని జీనియస్ వీసాగా పిలిచేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. అమెరికాకు వస్తున్న మేధావి వర్గం గురించి మేం వ్యతిరేకంగా పోరాడటం లేదు. ఇక్కడి కార్మికుల పొట్ట కొట్టేవారిపైనే వ్యతిరేకంగా పోరాడుతున్నామని తెలిపారు. ఇక్కడికి వచ్చిన వలసదారులు అమెరికా అభివృద్ధికి ఎంతో దోహదం చేశారని, ఆర్థికాభివృద్ధికి ఎంతో సహకరించారని ఇప్పుడు ఇలాంటి నిరసనల వల్ల వలసదారులపై వ్యతిరేక భావాలకు ఆజ్యం పోసినట్లు ఉంటుందని హిందు అమెరికన్ ఫౌండర్ కల్రా పేర్కొన్నారు. మరోవైపు తాముఇలాంటి ప్రకటనలు ప్రోత్సహించడం లేదని బే ఏరియా ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ (బార్ట్ ) స్పష్టం చేసింది. -
చోరికి గురైన సింగర్ చిన్మయి కారు
శాన్ఫ్రాన్సిస్కో: మ్యూజిక్ టూర్‌కు వెళ్లిన సింగర్ చిన్మయి శ్రీ పాదకు చేదు అనుభవం ఎదురైంది. పార్క్ చేసిన ఉన్న ఆమె కారును పగులగొట్టిన దుండగులు కొన్ని వస్తువులను దొంగిలించారట. ఈ విషయాన్ని ఆమె ట్వీటర్ ద్వారా తెలిపారు. కారులోని వస్తువులను దొంగలించారని గుర్తించడానికి తనకు ఐదు నిమిషాలు పట్టిందన్నారు. కారు పార్కు చేసిన ప్రాంతంలో దొంగతనాలు సాధారణమేనని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు చెప్పనట్లు తెలిపారు. చోరీ జరుగుతుండగా చూసి కేకలు పెట్టిన వ్యక్తికి ధన్యవాదాలు చెప్పారు. భూమి మీద ఇంకా కొందరు మంచివాళ్లు ఉన్నారని అన్నారు. దొంగతనానికి గురైన వస్తువులన్నీ తిరిగి దొరుకుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. It took me 5 minutes to realize things were missing. The police here in SFO were really kind and told me break ins were common. — Chinmayi Sripaada (@Chinmayi) 9 May 2017 Thankfully a neighbor scared the thief from stealing more stuff and a red haired girl is caught on camera. Good people still walk the earth — Chinmayi Sripaada (@Chinmayi) 9 May 2017