వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి వెళ్లినప్పటి నుంచీ ట్విట్టర్‌ను వరుసబెట్టి కష్టాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న కార్యాలయానికి 1,36,250 డాలర్ల అద్దె చెల్లించడంలో విఫలమవడంతో పరిస్థితి విషయం కోర్టు కేసు దాకా వెళ్లింది! హార్ట్‌ఫోర్డ్ బిల్డింగ్‌లో 30వ అంతస్తులో ఉన్న కార్యాలయానికి బకాయి ఉన్న అద్దెను ఐదు రోజుల్లోగా చెల్లించాలంటూ గత డిసెంబర్ 16న యాజమాన్య సంస్థ కొలంబియా రీట్ తాఖీదులిచ్చింది.
గడువులోగా చెల్లించకపోవడంతో గురువారం ట్విట్టర్‌పై కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది! ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ కార్యాలయానికి ట్విట్టర్ కొద్ది కాలంగా అద్దె చెల్లించడం లేదంటూ న్యూయార్క్ టైమ్స్ డిసెంబర్ 13వ తేదీనే కథనం ప్రచురించింది. రెండు చార్టర్ విమానాల అద్దె చెల్లించేందుకు తిరస్కరించినందుకు డిసెంబర్లో కూడా ట్విట్టర్‌పై కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment