rent dues
-
ఆఫీసు అద్దె కట్టని ట్విట్టర్
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి వెళ్లినప్పటి నుంచీ ట్విట్టర్‌ను వరుసబెట్టి కష్టాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న కార్యాలయానికి 1,36,250 డాలర్ల అద్దె చెల్లించడంలో విఫలమవడంతో పరిస్థితి విషయం కోర్టు కేసు దాకా వెళ్లింది! హార్ట్ఫోర్డ్ బిల్డింగ్‌లో 30వ అంతస్తులో ఉన్న కార్యాలయానికి బకాయి ఉన్న అద్దెను ఐదు రోజుల్లోగా చెల్లించాలంటూ గత డిసెంబర్ 16న యాజమాన్య సంస్థ కొలంబియా రీట్ తాఖీదులిచ్చింది. గడువులోగా చెల్లించకపోవడంతో గురువారం ట్విట్టర్‌పై కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది! ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ కార్యాలయానికి ట్విట్టర్ కొద్ది కాలంగా అద్దె చెల్లించడం లేదంటూ న్యూయార్క్ టైమ్స్ డిసెంబర్ 13వ తేదీనే కథనం ప్రచురించింది. రెండు చార్టర్ విమానాల అద్దె చెల్లించేందుకు తిరస్కరించినందుకు డిసెంబర్లో కూడా ట్విట్టర్‌పై కేసు నమోదైంది. -
అద్దెనా.. ఇద్దాములే..!
తమకు రావాల్సింది ఉంటే ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసే ప్రభుత్వ శాఖలు.. వాటి విషయా నికొస్తే మరోలా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అందుకు భువనగిరి మున్సిపాలిటీలో నిలిచిపో యిన అద్దెల బాగోతమే నిదర్శనం. మున్సిపల్ భవనంలో కొనసాగు తున్న పలు డిపార్ట్మెంట్లు నెలల తరబడి అద్దె చెల్లించకుండా మొండికే స్తున్నాయి. నోటీసులు జారీ చేసినా నో రెస్పాన్స్. ఒత్తిడి తెస్తే ఎంతోకొంత చేతిలో పెట్టి మకాం మారుస్తున్నాయి. భువనగిరి : మున్సిపాలిటీకి వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు 13 నెలలుగా అద్దె చెల్లించడం లేదు. దీంతో మున్సిపాలిటీకి వచ్చే కిరాయిలు ఏడాది కాలంగా నిలిచిపోయాయి. పాలనా సౌలభ్యం కోసం 2016, అక్టోబర్ 11వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడింది. నూతన జిల్లా కావడంతో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆర్డర్ టూ సర్వ్ ప్రతిపాదికన అధికారులను నియమించి జిల్లా కార్యాలయ నిర్వహణకు అందుబాటులో ఉన్న భవనాలను అద్దెకు తీసుకున్నారు. ఇందులో భాగంగా భువనగిరి మున్సిపాలిటీ ఆవరణలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్స్ ఫర్ స్మాల్, మీడియం టౌన్స్ పథకంలో భవనాన్ని నిర్మించారు. ఈ భవనం మున్సిపాలిటీకి పెద్దగా ఉపయోగం లేకపోవడంతో ప్రభుత్వ శాఖలకు చెందిన 11 కార్యాలయాలకు అద్దెకు ఇచ్చారు. ఏయే శాఖలంటే.. మున్సిపాలిటీ ఆవరణలో ఉన్న భవన సముదాయంలో 11 శాఖలకు అద్దెకు ఇచ్చారు. ఇందులో ఒక శాఖ ఆరు నెలల అద్దె చెల్లించి ఖాళీ చేసింది. మిగిలిన 10 శాఖల కార్యాలయాలు అక్కడే కొనసాగుతున్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ అభివృద్ధి కార్యాలయాలు, మైనార్టీ సంక్షేమ శాఖ, జిల్లా క్రీడలు యోజన, సర్వీసుల శాఖ, మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఆహార పరిరక్షణ, జిల్లా టౌన్ ప్లానింగ్, జిల్లా పంచాయతీ, జిల్లా ఆడిట్ అధికారి శాఖ, ఉపాధి కల్పన అధికారి శాఖలు ఉన్నాయి.వీటిలో గిరిజన శాఖ ఐదు నెలలు, ఐసీడీఎస్ మూడు నెలలు, ఆడిట్ కార్యాలయం ఐదు నెలలు, ఉపాధి కల్పన శాఖ ఆరు నెలల చొప్పున అద్దె చెల్లించాయి. మిగిలిన శాఖలు 13 నెలల కిరాయి బకాయి పడ్డాయి. ఆయా శాఖలు రూ.11.06 లక్షలు చెల్లించాలని తెలుస్తోంది. నోటీసులు జారీ.. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అద్దె చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతోనే తమకు నిధులు రావడం లేదని ఉపాధి కల్పన కార్యాలయం మరో చోటకు ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 10 శాఖలకు మున్సిపల్ అధికారులు అద్దె చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. -
అద్దె ఇవ్వరు.. ఖాళీ చెయ్యరు
కొందరి గుప్పిట్లో ఎస్సీ కార్పొరేషన్ దుకాణాలు ఖాళీ చేయమంటే అధికార పార్టీ నేతలతో ఒత్తిళ్లు తెప్పిస్తున్న వైనం రూ.లక్షల్లో పేరుకుపోయిన అద్దె బకాయిలు ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన షాపులను అద్దెకు తీసుకున్నవారిలో కొందరు కొన్ని సంవత్సరాలుగా అద్దె చెల్లించకుండా, ఖాళీ చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎస్సీల పేరు చెప్పి గతంలో ఉన్న అధికారులను పట్టుకుని షాపులను తీసుకున్న వీరు ఖాళీ చేయమంటే అధికార పార్టీ నాయకుల చేత అధికారులపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. నెల్లూరు(సెంట్రల్) : జిల్లాలో ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిచేందుకు సూళ్లూరుపేట, కావలి, గూడూరు, కోట, ఇందుకూరుపేట, నెల్లూరు, సీతారామపురం, అనంతసాగరం, ఏఎస్‌పేట, దుత్తలూరు, వెంకటగిరి, వాకాడు ప్రాంతాల్లో దుకాణ సముదాయాలను 1985 సంవత్సరంలో ఏర్పాటుచేశారు. వీటిలో 79 దుకాణాలు ఉండగా అందులో 44 దుకాణాలు వినియోగంలో ఉన్నాయి. సుమారు 35 దుకాణాలు వివిధ కారణాలతో ఖాళీగా ఉన్నాయి. అద్దెలు తక్కువగా ఉండటంతో కాలక్రమేణా ఎస్సీలు కానివారు దుకాణాలను బినామీ పేర్లతో తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఒక్కో షాపునకు అద్దె రూ.3 వేలుంటే ఎస్సీలకు కేటాయించిన షాపులకు మాత్రం కేవలం రూ.500 నుంచి రూ.700 మాత్రమే చెల్లిస్తున్నారు. పేరుకుపోయిన బకాయిలు.. 44 దుకాణాల నుంచి కొన్ని సంవత్సరాలుగా అద్దె వసూలు కావడంలేదు. దీంతో ఇప్పటివరకు ఎస్సీ కార్పోరేషన్ షాపులకు రావాల్సిన అద్దె రూ.21.85 లక్షలకు పైగా ఉంది. ప్రతి 11 నెలలకు ఒకసారి షాపు అగ్రిమెంట్‌ను రెన్యువల్ చేసి అద్దె పెంచాల్సి ఉంది. అయితే అలా జరిగిన దాఖలాలు లేవు. తనిఖీలు నామమాత్రం షాపులను ఎస్సీ కార్పోరేషన్ అధికారుల తనిఖీలు చేసి దుకాణాలు ఎవరు పేరు మీద ఉన్నాయి? వాటిని ఎవరు నిర్వహిస్తున్నారు? అనే విషయాలను పరిశీలించాల్సి ఉంది. అయితే తనిఖీలు నామమాత్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కొంతమంది అధికారులు తనిఖీలకు వెళ్లినా, అద్దె కట్టాలని నోటీసులు జారీ చేసినా అధికార పార్టీ నాయకుల ద్వారా వారిపై ఒత్తిళ్లు తెప్పిస్తున్నారు. విచారణ చేస్తున్నాం : రామచంద్రారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న దుకాణాలు ఎవరి పేరు మీద ఉన్నాయి? వాటిలో ప్రస్తుతం ఎవరున్నారు? ఎన్ని నెలల నుంచి అద్దె కట్టాలి అనే విషయాలను విచారిస్తున్నాం. నామమాత్రపు అద్దె కూడా కట్టకుండా ఉన్న వారిపై ఉన్నతాధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటాం. ఎస్సీలకే కేటాయించాలి : కనుపర్తి గంగాధర్, మాలమహానాడు నెల్లూరు నగర అధ్యక్షుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్న దుకాణాలు అర్హులైన ఎస్సీలకే ఇవ్వాలి. జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఎస్సీ యువత ఉపాధి లేకుండా ఉన్నారు. షాపులను గుర్తించి వారికి ఇవ్వాలి. వేలం పాట కూడా నిర్వహించి వారికే ఇవ్వాలి. లేకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.