ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) 2022లో ఎక్స్ (ట్విటర్) సంస్థను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కంపెనీని కొనుగోలు చేసే సమయంలో ఏవైనా ఫెడరల్ సెక్యూరిటీస్ చట్టాలను ఉల్లంఘించారా అనే దిశలో అమెరికాకు చెందిన SEC దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, ట్విటర్ సంస్థను కొనుగోలు చేసిన సమయంలో ఏవైనా చట్టాలను ఉల్లంగించారా అని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎస్ఈసీ స్టేట్‌మెంట్స్, డీల్స్ వంటి వాటికి సంబందించిన ఫైలింగ్ గురించి మస్క్‌ను ప్రశ్నించడానికి సన్నద్ధమైంది.
ఎలాన్ మస్క్ ఈ దర్యాప్తుకు హాజరు కావడానికి నిరాకరించినట్లు సమాచారం. కానీ దీనికి సాక్ష్యమివ్వడానికి ఎస్ఈసీ మస్క్‌ను బలవంతం చేస్తోంది, దీనికోసం ఫెడరల్ కోర్టులో దావా కూడా వేసింది. అయితే ఇప్పటికే యూఎస్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అనేక సార్లు మస్క్ వాంగ్మూలాన్ని తీసుకున్నట్లు, మళ్ళీ హాజరు కావాల్సిన అవసరం లేదని మస్క్ తరపు లాయర్ తెలిపాడు.
ఇదీ చదవండి: ఉద్యోగం పోయి చాలా రోజులైంది.. అప్పటి నుంచి.. మెటా మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్!
ఎలాన్ మస్క్ ట్విటర్‌లో ఎంత వాటా కలిగి ఉన్నారనే దాని గురించి నిజం చెప్పారా.. లేదా అని తెలుసుకోవడానికి ఎస్ఈసీ మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. 2023 మేలో శాన్‌ఫ్రాన్సిస్కోకి వచ్చి మాట్లాడాల్సిందిగా ఎస్ఈసీ కోరింది. దీనికి మస్క్ సెప్టెంబర్ 15న రావడానికి అంగీకరించారు. కానీ ఆ తరువాత మనసు మార్చుకుని రాలేకపోతున్నట్లు తెలిపాడు.
ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌పై పిటిషన్.. ఆ రైట్స్ కల్పించాలంటున్న మాజీ భార్య!
ఎస్ఈసీ చేపట్టిన దర్యాప్తు కేసులను కొట్టివేయడానికి మస్క్ చేసిన ప్రయత్నాలను US డిస్ట్రిక్ట్ జడ్జి ఆండ్రూ కార్టర్ తిరస్కరించారు. మిలియన్ల కొద్దీ స్టాక్‌లను కొనుగోలు చేయడానికి, ట్విటర్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ట్వీట్స్ చేయడానికి, ఎగ్జిక్యూటివ్‌లు, అంతర్గత వ్యక్తులతో సమావేశం కావడానికి సమయం ఉంటుంది, కానీ విచారణకు రావడానికి మాత్రం సమయం ఉండదా అంటూ అసహనం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment