
భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అమెరికాలో వైభవంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో సిటీ హాల్‌లో జరిగిన వేడుకలకు ప్రవాసులు భారీగా తరలివచ్చారు. ముఖ్య అతిథిలుగా 'శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా' డాక్టర్ శ్రీకర్ రెడ్డి, 'చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ మరియం' హాజరై, ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని మాతృభూమిపై వారికున్న ప్రేమాభిమానాలను చాటిచెప్పారు.
వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ళ చరిత్రలో భారతదేశం సాధించిన పురోగతిని పలువురు కొనియాడారు. ఇక ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వహకులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment