విలాసవంతమైన జీవితానికి, ఖరీదైన కార్లకు పెట్టింది పేరు రిలయన్స్ అధినేత బిలియనీర్ అంబానీ కుటుంబం. తాజాగా ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌పై పోలీసుల దాడి వార్తల్లో నిలిచింది. ఈ మాల్‌లో 41 ఖరీదైన కార్లతో పాటు ఫెరారీస్, లంబోర్గినీ లాంటి లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఏం జరిగిందంటే..?
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం అంబానీకి చెందిన మాల్ పార్కింగ్ స్థలంలో ముంబై పోలీసులు 41 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో ఫెరారీ, లంబోర్ఘిని, పోర్షెస్ తదితర అత్యాధునిక లగ్జరీ కార్లు ఉన్నాయి. భారతదేశంలోని అతిపెద్ద మాల్స్‌లో ఒకటి ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్ దేశంలోనే యాపిల్ స్టోర్ ఉన్న తొలి మాల్ కూడా ఇదే. తాజా వార్తలపై రిలయన్స్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా సంస్థ నిర్వహించిన ఈవెంట్, ర్యాలీకిగా ను ముంబై పోలీసుల ముందస్తు అనుమతి పొందలేని కారణంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారని సమాచారం. అయితే ఈ కారు అంబానీ కుటుంబంలోని ఏ ఒక్కరికీ చెందకపోవడం గమనార్హం.
ముంబైలో జనవరి 23 నుంచి ఫిబ్రవరి 6 వరకు నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ రిపబ్లిక్ డే రోజున నిర్వహించిన ర్యాలీలో ఫెరారీలు, లంబోర్గినిలు, పోర్షెస్, మెక్‌లారెన్స్, బిఎమ్‌డబ్ల్యూలు, జాగ్వార్‌లు, ఆడి, మెర్సిడెస్‌తో సహా 100కి పైగా కార్లు పాల్గొన్నాయని అంచనా. దీంతో పబ్లిక్ సర్వెంట్ అండ్ మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ 1951 ద్వారా సక్రమంగా ప్రకటించిన ఆర్డర్‌ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు కార్ల యజమానులపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment