Lamborghinis
-
జియో మాల్‌పై పోలీసుల దాడి: లగ్జరీ కార్లు సీజ్.. స్టోరీ ఏంటంటే?
విలాసవంతమైన జీవితానికి, ఖరీదైన కార్లకు పెట్టింది పేరు రిలయన్స్ అధినేత బిలియనీర్ అంబానీ కుటుంబం. తాజాగా ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌పై పోలీసుల దాడి వార్తల్లో నిలిచింది. ఈ మాల్లో 41 ఖరీదైన కార్లతో పాటు ఫెరారీస్, లంబోర్గినీ లాంటి లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఏం జరిగిందంటే..? టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం అంబానీకి చెందిన మాల్ పార్కింగ్ స్థలంలో ముంబై పోలీసులు 41 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో ఫెరారీ, లంబోర్ఘిని, పోర్షెస్ తదితర అత్యాధునిక లగ్జరీ కార్లు ఉన్నాయి. భారతదేశంలోని అతిపెద్ద మాల్స్‌లో ఒకటి ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్ దేశంలోనే యాపిల్ స్టోర్ ఉన్న తొలి మాల్ కూడా ఇదే. తాజా వార్తలపై రిలయన్స్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా సంస్థ నిర్వహించిన ఈవెంట్, ర్యాలీకిగా ను ముంబై పోలీసుల ముందస్తు అనుమతి పొందలేని కారణంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారని సమాచారం. అయితే ఈ కారు అంబానీ కుటుంబంలోని ఏ ఒక్కరికీ చెందకపోవడం గమనార్హం. ముంబైలో జనవరి 23 నుంచి ఫిబ్రవరి 6 వరకు నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ రిపబ్లిక్ డే రోజున నిర్వహించిన ర్యాలీలో ఫెరారీలు, లంబోర్గినిలు, పోర్షెస్, మెక్లారెన్స్, బిఎమ్‌డబ్ల్యూలు, జాగ్వార్లు, ఆడి, మెర్సిడెస్‌తో సహా 100కి పైగా కార్లు పాల్గొన్నాయని అంచనా. దీంతో పబ్లిక్ సర్వెంట్ అండ్ మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ 1951 ద్వారా సక్రమంగా ప్రకటించిన ఆర్డర్‌ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు కార్ల యజమానులపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
భారత్‌లోకి లంబోర్గిని ‘హురకన్ పెర్ఫార్మెంట్’
ప్రారంభ ధర రూ.3.97 కోట్లు న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన ప్రముఖ సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ ‘లంబోర్గిని’ తాజాగా కొత్త ‘హురకన్ పెర్ఫార్మెంట్’ కారును భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.3.97 కోట్లు. ఇందులో 5.2 లీటర్ వీ–10 పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.9 సెకన్ల వ్యవధిలో అందుకుంటుంది. ఇక దీని గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లు. తాము ఈ ఏడాదిలో భారత్‌లో ప్రవేశపెడుతున్న మూడవ కారు ఇదని లంబోర్గిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. హైబ్రిడ్ అల్యూమినియం, కార్బన్ ఫైబర్ ఫ్రేమ్ వల్ల తాజా మోడల్ ఇదివరకటి హురకన్ కార్ల కన్నా 40 కేజీల బరువు తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా లంబోర్గిని కంపెనీ భారత్‌లో హురకన్, అవెంటడర్ అనే మోడళ్ల స్పోర్ట్స్ కార్లను విక్రయిస్తోంది. వీటి ధర రూ.3.07–రూ.6.2 కోట్ల శ్రేణిలో ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. -
లంబోర్గిని కొత్త సూపర్ స్పోర్ట్స్ కారు
⇒ ధర రూ.5.01 కోట్లు ⇒ గరిష్ట వేగం 350 కి.మీ. ముంబై: ఇటలీ లగ్జరీ కార్ల కంపెనీ లంబోర్గిని కొత్త ఎక్సట్రీమ్ ఎక్స్ట్రీమ్ సూపర్ స్పోర్ట్స్ కారును మార్కెట్లోకి తెచ్చింది. అవెంటడర్ ఎస్ ఎల్పీ 740–4 కూపే పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.5.01 కోట్లు (ఎక్స్ షోరూమ్, ముంబై) అని లంబోర్గిని ఇండియా తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదలైన రెండు నెలలకే భారత్‌లో ఈ కారును ప్రవేశపెడుతున్నామని లంబోర్గిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ చెప్పారు. 6.2 లీటర్ వీ 12 ఇంజిన్‌తో కూడిన ఈ రెండు డోర్ల, రెండు సీట్ల లగ్జరీ కారు 0–100 కి.మీ.వేగాన్ని 2.9 సెకన్లలోనే అందుకోగలదని, గరిష్ట వేగం గంటకు 350కి.మీ. అని వివరించారు. ఈ కారులో ఫోర్‌వీల్ స్టీరింగ్ కార్ టెక్నాలజీ, 7 స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, మోనోకోక్ కార్బన్‌ఫైబర్ చాసిస్, టెలిమెట్రీ సిస్టమ్, యాపిల్ కార్ప్లే తదితర ఫీచర్లున్నాయని తెలిపారు. ఆడి ఆర్8, ఫెరారి ఎఫ్ఎఫ్, మెర్సిడెస్ ఏఎంజీ జీఎల్ఎస్, బీఎమ్‌డబ్ల్యూ ఐ8, బీఎండబ్ల్యూ ఎం6 సిరీస్ తదితర కార్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం 10%గా ఉన్న తమ మార్కెట్ వాటా త్వరలోనే 20–25%కి పెంచుకోగలమన్న ధీమాను అగర్వాల్ వ్యక్తం చేశారు.