భారత్‌లోకి లంబోర్గిని ‘హురకన్‌ పెర్ఫార్మెంట్‌’ | New Lamborghini Huracán Performante revealed | Sakshi
Sakshi News home page

భారత్‌లోకి లంబోర్గిని ‘హురకన్‌ పెర్ఫార్మెంట్‌’

Published Sat, Apr 8 2017 12:39 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

భారత్‌లోకి లంబోర్గిని ‘హురకన్‌ పెర్ఫార్మెంట్‌’

భారత్‌లోకి లంబోర్గిని ‘హురకన్‌ పెర్ఫార్మెంట్‌’

ప్రారంభ ధర రూ.3.97 కోట్లు
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన ప్రముఖ సూపర్‌ స్పోర్ట్స్‌ కార్ల తయారీ కంపెనీ ‘లంబోర్గిని’ తాజాగా కొత్త ‘హురకన్‌ పెర్ఫార్మెంట్‌’ కారును భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.3.97 కోట్లు. ఇందులో 5.2 లీటర్‌ వీ–10 పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.9 సెకన్ల వ్యవధిలో అందుకుంటుంది. ఇక దీని గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లు.

తాము ఈ ఏడాదిలో భారత్‌లో ప్రవేశపెడుతున్న మూడవ కారు ఇదని లంబోర్గిని ఇండియా హెడ్‌ శరద్‌ అగర్వాల్‌ తెలిపారు. హైబ్రిడ్‌ అల్యూమినియం, కార్బన్‌ ఫైబర్‌ ఫ్రేమ్‌ వల్ల తాజా మోడల్‌ ఇదివరకటి హురకన్‌ కార్ల కన్నా 40 కేజీల బరువు తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా లంబోర్గిని కంపెనీ భారత్‌లో హురకన్, అవెంటడర్‌ అనే మోడళ్ల స్పోర్ట్స్‌ కార్లను విక్రయిస్తోంది. వీటి ధర రూ.3.07–రూ.6.2 కోట్ల శ్రేణిలో ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement