లంబోర్గిని కొత్త సూపర్‌ స్పోర్ట్స్‌ కారు | Lamborghini launches super sports car Aventador S | Sakshi
Sakshi News home page

లంబోర్గిని కొత్త సూపర్‌ స్పోర్ట్స్‌ కారు

Published Sat, Mar 4 2017 12:21 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

లంబోర్గిని కొత్త సూపర్‌ స్పోర్ట్స్‌ కారు - Sakshi

లంబోర్గిని కొత్త సూపర్‌ స్పోర్ట్స్‌ కారు

ధర రూ.5.01 కోట్లు 
గరిష్ట వేగం 350 కి.మీ.


ముంబై:  ఇటలీ లగ్జరీ కార్ల కంపెనీ లంబోర్గిని కొత్త ఎక్సట్రీమ్‌ ఎక్స్‌ట్రీమ్‌ సూపర్‌ స్పోర్ట్స్‌ కారును మార్కెట్లోకి తెచ్చింది. అవెంటడర్‌ ఎస్‌ ఎల్‌పీ 740–4 కూపే పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.5.01 కోట్లు (ఎక్స్‌ షోరూమ్, ముంబై) అని లంబోర్గిని ఇండియా తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదలైన  రెండు నెలలకే భారత్‌లో ఈ కారును ప్రవేశపెడుతున్నామని లంబోర్గిని ఇండియా హెడ్‌ శరద్‌ అగర్వాల్‌ చెప్పారు. 6.2 లీటర్‌ వీ 12 ఇంజిన్‌తో కూడిన ఈ రెండు డోర్ల, రెండు సీట్ల లగ్జరీ కారు 0–100 కి.మీ.వేగాన్ని 2.9 సెకన్లలోనే అందుకోగలదని, గరిష్ట వేగం గంటకు 350కి.మీ. అని వివరించారు.

ఈ కారులో ఫోర్‌వీల్‌ స్టీరింగ్‌ కార్‌ టెక్నాలజీ,  7 స్పీడ్‌ డ్యుయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్, మోనోకోక్‌ కార్బన్‌ఫైబర్‌ చాసిస్, టెలిమెట్రీ సిస్టమ్,  యాపిల్‌ కార్‌ప్లే తదితర ఫీచర్లున్నాయని తెలిపారు. ఆడి ఆర్‌8, ఫెరారి ఎఫ్‌ఎఫ్, మెర్సిడెస్‌  ఏఎంజీ జీఎల్‌ఎస్, బీఎమ్‌డబ్ల్యూ  ఐ8, బీఎండబ్ల్యూ ఎం6 సిరీస్‌ తదితర కార్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం 10%గా ఉన్న తమ మార్కెట్‌ వాటా త్వరలోనే 20–25%కి పెంచుకోగలమన్న ధీమాను అగర్వాల్‌ వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement