బోనాల పండగ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడి అంతా సర్దుకుపోయారు.
మణికొండ (రంగారెడ్డి): బోనాల పండగ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడి అంతా సర్దుకుపోయారు. మణికొండ పంచాయతీ పరిధిలోని నేతాజీనగర్‌కాలనీ ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివసించే సత్యనారాయణ ఆదివారం బోనాలు ఉండడంతో కుటుంబ సభ్యులతో కలసి స్వగ్రామానికి వెళ్లారు.
రాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 4తులాల బంగారం, 70 తులాల వెండి, రూ.75వేల నగదును దోచుకెళ్లిపోయారు. సోమవారం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.