rayadurgam police
-
Sai Dharam Tej Accident: సాయి తేజ్‌పై కేసు నమోదు
మెగా హీరో సాయి తేజ్ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటి ఐకియా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఆయనను 108 సాయంతో సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికత్స పూర్తయ్యాక మెరుగైన చికిత్స కోసం అపోలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతంసాయి తేజ్ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. బైక్ రాష్ డ్రైవింగ్ చేసినందున సాయి తేజ్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద ఐపీసీ సెక్షన్ 336, 184 సెక్షన్ల పై కేసు నమోదు చేసి అతని బైక్ ని కస్టడీ లోకి తీసుకున్నారు. -
కోయిలమ్మ నటుడు అమర్ అరెస్ట్
కోయిలమ్మ సీరియల్ హీరో అమర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బోటిక్ నిర్వహణ విషయంలో స్నేహితురాళ్ల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో జరిగిన గొడవలో అమర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషనులో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు అమర్‌ను బుధవారం అరెస్టు చేశారు. కూకట్పల్లి కోర్టు అతనికి రిమాండ్ విధించడంతో అమర్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. కాగా శ్రీ విద్య, స్వాతి, లక్ష్మి ఈ ముగ్గురూ కలిసి మణికొండలో బౌటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల స్వాతి బౌటిక్ వ్యాపారం నుంచి తప్పుకుంది. అయితే తనకు రావాల్సిన కుట్టు మెషిన్, డబ్బుల విషయంలో పార్టనర్స్ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్వాతికి రావాల్సిన బకాయిలు శ్రీవిద్య ఇవ్వకపోవడంతోఇటీవల స్వాతి తన భాయ్‌ఫ్రెండ్ కోయిలమ్మ సీరియల్ నటుడు అమర్‌తో కలిసి శ్రీ విద్య ఇంటికి వెళ్లి నిలదీశారు. మాటా మాటా పెరిగి గొడవకు దారి తీయడంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దాంతో సమీర్ తాగిన మత్తులో అసభ్య పదజాలంతో తనను దూషించాడని శ్రీవిద్య రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే అమర్, స్వాతిలు కూడా కౌంటర్ కేసు పెట్టారు. ఇరువురి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చదవండి: ఆ రోజు నేను తాగి వెళ్లలేదు: అమర్ -
రాయదుర్గంలో పోలీసుల నిర్వాకం
-
బోనాలకు వెళ్లొచ్చేసరికి ఇల్లు సర్దేశారు..
మణికొండ (రంగారెడ్డి): బోనాల పండగ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడి అంతా సర్దుకుపోయారు. మణికొండ పంచాయతీ పరిధిలోని నేతాజీనగర్కాలనీ ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివసించే సత్యనారాయణ ఆదివారం బోనాలు ఉండడంతో కుటుంబ సభ్యులతో కలసి స్వగ్రామానికి వెళ్లారు. రాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 4తులాల బంగారం, 70 తులాల వెండి, రూ.75వేల నగదును దోచుకెళ్లిపోయారు. సోమవారం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.