
మెగా హీరో సాయి తేజ్ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటి ఐకియా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఆయనను 108 సాయంతో సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికత్స పూర్తయ్యాక మెరుగైన చికిత్స కోసం అపోలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతంసాయి తేజ్ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. బైక్ రాష్ డ్రైవింగ్ చేసినందున సాయి తేజ్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద ఐపీసీ సెక్షన్ 336, 184 సెక్షన్ల పై కేసు నమోదు చేసి అతని బైక్ ని కస్టడీ లోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment