అమ్మవారి తాళిబొట్టు చోరీ.. తప్పు తెలుసుకున్న దొంగలు! | Thieves Who Bring And Give Stolen Property | Sakshi
Sakshi News home page

అమ్మవారి తాళిబొట్టు చోరీ.. తప్పు తెలుసుకున్న దొంగలు!

Published Wed, May 4 2022 11:59 AM | Last Updated on Wed, May 4 2022 4:58 PM

Thieves Who Bring And Give Stolen Property - Sakshi

మైసూరు: అమ్మవారి తాళిబొట్టును చోరీ చేసుకుని వెళ్లిన దొంగలు తప్పు తెలుసుకుని తిరిగి ఆలయానికి వచ్చి కొంత నగదు, అమ్మవారి నగ అక్కడ పెట్టి వెళ్లిన వైనం మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని ఉప్పినహళ్ళి గ్రామంలో ఉన్న దుర్గాంబ అమ్మవారి దేవాలయంలొ చోటు చేసుకుంది. గతనెల 24న గ్రామంలోని దుర్గాంబ ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు అమ్మవారి తాళిబొట్టును ఎత్తుకెళ్లారు. అంతలోనే తప్పు తెలుసుకుని దొంగలు భక్తుల తరహాలో గుడికి వచ్చి దొంగిలించిన నగ, కొంత నగదు కానుకగా పెట్టి వెళ్లిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.   

(చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త అలా చేస్తున్నాడని వందన..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement