
కిలో వెండి ఆభరణాల చోరీ
పట్టణంలోని ఓ జువెల్లరీ షాపులో కిలో వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన గురువారం వెలుగుచూసింది.
కొండమల్లేపల్లి:
పట్టణంలోని ఓ జువెల్లరీ షాపులో కిలో వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన గురువారం వెలుగుచూసింది. దేవరకొండ ఎస్‌ఐ ఖలీల్‌ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల గణే ష్ జువెల్లరీ షాపు యజమాని సిరిగద్దె వెంకటాచారి బుధవారం రాత్రి షాపుకి తాళం వేసి ఇంటికెళ్లాడు. గురువారం ఉదయం వచ్చి చూసేసరికి షటర్ తీసి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు.సంఘటనస్థలానికి చేరుకున్న క్లూస్ టీం అధికారులు వివరాలు సేకరించారు.బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.