
స్మార్ట్ ఫోన్ మన నిత్యజీవితంలో ఒక భాగమైపోయింది. పెరుగుతున్న సాంకేతికతో మన చేతుల్లోకి అన్ని రకాల సేవలను స్మార్ట్‌ఫోన్ అందిస్తోంది. రకరకాల యాప్‌లు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లలోకి యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో భౌతికంగా నగదును క్యారీ చేయడం తక్కువైంది. కూరగాయల నుంచి సూది మందు వరకు ప్రతి చోట యూపీఐ సేవలను వాడుతున్నాం. మనలో చాలా మంది ప్రతి చోట నగదు లావాదేవీలను డిజిటల్ రూపంలోనే చేస్తున్నాం. ఇప్పుడు అంతా బాగానే ఉంది అనుకోండి !
ఒక వేళ మీ స్మార్ట్ ఫోన్ పోయినా, దొంగలు కొట్టేసినా అప్పుడు ఎలా...! సింపుల్‌గా మరో కొత్త ఫోన్ తీసుకుంటామని అనుకుంటున్నారా..! అయితే మీ బ్యాంకు ఖాతాలోని నగదును మర్చిపోవడం మంచింది. ఔను మీరు చూసింది నిజమే.. తాజాగా స్మార్ట్‌ఫోన్‌లను కొట్టేసిన దొంగలు సాంకేతికతో కొత్త పుంతలు తొక్కుతున్నారు. మీ ఫోన్‌ను బ్లాక్ మార్కెట్ విక్రయించడంతో పాటు, మీ ఫోన్లో ఉన్న డిజిటల్ పేమెంట్ యాప్‌లనుంచి నగదును కొట్టేస్తున్నారు. అంతేకాకుండా మీ విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నారు.
మీ ఫోన్ పోతే వెంటనే ఇలా చేయండి.
- మొబైల్ బ్యాంకింగ్ సేవలను పూర్తిగా బ్లాక్ చేయండి.
- మీ సిమ్ కార్డుతో రిజిస్టర్ ఐనా యూపీఐ సేవలను డియాక్టివేట్ చేయండి.
- మీ ఫోన్లో ఉన్న సిమ్ కార్డును వెంటనే బ్లాక్ చేయించండి.
- మీ నంబర్‌పై రిజిస్టర్ ఐనా అన్ని మొబైల్ వ్యాలెట్లను బ్లాక్ చేయండి.
- దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment