శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: కోవూరులోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. నెల్లూరు థర్మల్ స్టేషన్ గేట్ సమీపంలోని చిట్టెమ్మ కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం కుటుంబసభ్యులంతా ఇంటికి తాళం వేసి జొన్నవాడ నవరాత్రి ఉత్సవాలకు వెళ్లారు. ఇదే అదనుగా తాళాలు పగులగొట్టిన దుండగులు బీరువాలో ఉన్న 20 సవర్ల బంగారు ఆభరణాలతోపాటు రూ.20 వేల డబ్బును ఎత్తుకుపోయారు.
శనివారం ఉదయం ఇంటికి చేరుకున్న చిట్టెమ్మ విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీంను రప్పించి దర్యాప్తు చేపట్టారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ
Published Sat, Oct 15 2016 1:59 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
Advertisement
Advertisement