Shocking Video: Biker Collides Purposely With Car, Chased And Threatens Couple Inside - Sakshi
Sakshi News home page

Viral Video: దొంగల దుశ్చర్య: కారును బైక్‌తో ఢీకొట్టి..వెంబడించి..

Published Mon, Jan 30 2023 10:42 AM | Last Updated on Mon, Jan 30 2023 1:09 PM

Shociking Video: Biker Collides Purposely With Car And Bikers Chasing  - Sakshi

సాక్షి, బనశంకరి: బెంగళూరు నగరంలో అర్ధరాత్రి ఇద్దరు దొంగలు బైక్‌పై ఓ కారును ఢీకొట్టి వారిని ఐదు కిలోమీటర్లు వెంబడించారు. ఈ ఘటనతో కారులో ఉన్న దంపతులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వివరాలు... ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సర్జాపుర రోడ్డులో దంపతులు కారులో ఇంటికి వెళ్తున్నారు. ఎదురుగా బైక్‌లో వచ్చిన వ్యక్తులు అదే పనిగా కారును ఢీకొట్టాడు. డ్యాష్‌బోర్డులో ఉన్న కెమెరాలో ఈ దృశ్యం రికార్డయింది.

అనంతరం బైక్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కారు వద్దకు వెళ్లి దంపతులను కిందకు దిగాలని అడిగాడు. వారు నిరాకరించడంతో కిటికీ అద్దాలపై కొట్టాడు. దీంతో వారు రివర్స్‌ తీసుకుని ముందుకు వెళ్లిపోతుండగా ఐదు కిలోమీటర్లు బైక్‌లో వీరి వాహనాన్ని వెంబడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నగర ప్రజలకు రక్షణ లేదనే విషయం అవగతమవుతోందని నెటిజన్లు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

సర్జాపుర రోడ్డు సోపాస్‌ మోర్‌ వద్ద ఈ ఘటన జరిగింది. రోడ్ల పక్కన విద్యుత్‌ దీపాలు అమర్చి గస్తీ పెంచాలని నెటిజన్లు నగర ట్రాఫిక్‌ పోలీసులు, బీబీఎంపీ కమిషనర్‌కు ట్యాగ్‌ చేశారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తూర్పువిభాగ ట్రాఫిక్‌ డీసీపీ కళాకృష్ణస్వామి తెలిపారు.   

(చదవండి: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరార్‌..విచారణలో అతడు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement