టోల్ గేట్ వద్ద వెలుగులోకి..
సంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన
మునిపల్లి (అందోల్): బైక్‌పై వెళుతు న్న ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు.. గాయపడి న వ్యక్తి కారు బంపర్ లో ఇరు క్కుపోయినా పట్టించుకోలేదు. నాలుగు కిలోమీటర్లు అలాగే ఈడ్చుకెళ్లడంతో ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ అమానవీయ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. బుదేరా ఎస్‌ఐ రాజేశ్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వన పర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్ల కానపురం తండాకు చెందిన మెగావత్ వెంకటేశం (22) హైదరాబాద్ మియాపూర్‌లో ఉంటూ ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడు. జహీరాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి బైక్‌పై మియాపూర్‌కు పయన య్యాడు.
హైదరాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్ కర్ణాటకలోని గానుగాపూర్ దైవదర్శ నానికి వెళ్లి కారులో తిరిగి వస్తూ.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పరిధిలో ముంబై జాతీయ రహదారిపై వెంకటేశాన్ని వేగంగా ఢీకొట్టాడు. దీంతో బైక్ పక్కకు పడిపోగా వెంకటేశం కారు బంపర్‌లో చిక్కుకున్నాడు. ఈ విషయం తెలిసినా కూడా రాజ్‌కుమార్.. కారుతో అలాగే నాలుగు కిలోమీటర్లు వెళ్లిపోయాడు.
ఈ క్ర మంలో లింగంపల్లి టోల్‌గేట్ వద్ద ఆగిన కారు.. మృతదేహం ఇరుక్కుపోవడం వల్ల ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో టోల్‌గేట్ సిబ్బంది వచ్చి చూడగా.. మృతదే హం ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశాన్ని సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు చెప్పారు.
ఛిద్రమైన శరీరం..
కారులో ఇరుక్కున్న వెంకటేశం మృతదేహం పూర్తిగా ఛిద్రమైంది. వీపుభాగం మొ త్తం కాలిపోయింది. కాళ్లు విరిగిపోయాయి. తలకు తీవ్ర గాయం కావడంతో రక్త స్రావమైంది. చేతులు నెంబర్ ప్లేట్‌లో, కొన్ని శరీర భాగాలు పొగగొట్టంలో ఇరు క్కుపోయాయి. రోడ్డు ప్రమాదం జరగడంతో భయపడి తాను కారు అపకుండా వచ్చానని రాజ్‌కుమార్ అంగీకరించినట్టు బుదేరా ఎస్‌ఐ రాజేశ్‌నాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment