venkatesham
-
కారుతో ఢీకొట్టి.. 4 కి.మీ.ఈడ్చుకెళ్లి..
మునిపల్లి (అందోల్): బైక్‌పై వెళుతు న్న ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు.. గాయపడి న వ్యక్తి కారు బంపర్ లో ఇరు క్కుపోయినా పట్టించుకోలేదు. నాలుగు కిలోమీటర్లు అలాగే ఈడ్చుకెళ్లడంతో ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ అమానవీయ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. బుదేరా ఎస్ఐ రాజేశ్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వన పర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్ల కానపురం తండాకు చెందిన మెగావత్ వెంకటేశం (22) హైదరాబాద్ మియాపూర్‌లో ఉంటూ ఎల్ఎల్బీ చదువుతున్నాడు. జహీరాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి బైక్‌పై మియాపూర్‌కు పయన య్యాడు. హైదరాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్ కర్ణాటకలోని గానుగాపూర్ దైవదర్శ నానికి వెళ్లి కారులో తిరిగి వస్తూ.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పరిధిలో ముంబై జాతీయ రహదారిపై వెంకటేశాన్ని వేగంగా ఢీకొట్టాడు. దీంతో బైక్ పక్కకు పడిపోగా వెంకటేశం కారు బంపర్‌లో చిక్కుకున్నాడు. ఈ విషయం తెలిసినా కూడా రాజ్‌కుమార్.. కారుతో అలాగే నాలుగు కిలోమీటర్లు వెళ్లిపోయాడు. ఈ క్ర మంలో లింగంపల్లి టోల్గేట్ వద్ద ఆగిన కారు.. మృతదేహం ఇరుక్కుపోవడం వల్ల ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో టోల్గేట్ సిబ్బంది వచ్చి చూడగా.. మృతదే హం ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశాన్ని సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు చెప్పారు.ఛిద్రమైన శరీరం..కారులో ఇరుక్కున్న వెంకటేశం మృతదేహం పూర్తిగా ఛిద్రమైంది. వీపుభాగం మొ త్తం కాలిపోయింది. కాళ్లు విరిగిపోయాయి. తలకు తీవ్ర గాయం కావడంతో రక్త స్రావమైంది. చేతులు నెంబర్ ప్లేట్లో, కొన్ని శరీర భాగాలు పొగగొట్టంలో ఇరు క్కుపోయాయి. రోడ్డు ప్రమాదం జరగడంతో భయపడి తాను కారు అపకుండా వచ్చానని రాజ్‌కుమార్ అంగీకరించినట్టు బుదేరా ఎస్ఐ రాజేశ్‌నాయక్ తెలిపారు. -
మనస్తాపం చెందిన ఓ వ్యక్తి.. ఒక్కసారిగా!
సాక్షి, మెదక్: కుటుంబ కలహాలు, అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపం చెందిన ఒక వ్యక్తి చెరువులోదూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని సర్ధన గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కట్ట వెంకటేశం(35) తన భార్య లక్ష్మి మృతి చెందగా మరో మహిళతో వివాహం చేయగా ఆమె ఇటీవల వెంకటేశంతో గొడవపడి వెళ్లిపోయిందని వెంకటేశం తల్లి నర్సమ్మ తెలిపింది. దానికి తోడు ఆయనకు ఫిట్స్ వ్యాధి ఉండడంతో జీవితంపై విరక్తి చెంది ఈ నెల 14న ఇంట్లో నుంచి వెళ్లి పోయాడని, సోమవారం ఐలేరు చెరువులోపడి మృతి చెందినట్లు చెప్పింది. నర్సమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆనంద్‌గౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అన్నలకే ‘పెద్దన్న’.. నిజాం వెంకటేశం..!
సిరిసిల్ల: మావోయిస్టు అగ్రనేతలకు ఆత్మీయుడు నిజాం వెంకటేశం. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని మావో యిస్టు అగ్రనేతలు ఆయన మరణించే దాకా బయటపెట్టలేదు. సిరిసిల్ల పట్టణానికి చెందిన నిజాం వెంకటేశం(74) గతేడాది సెప్టెంబరు 18న హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణించిన విషయం తెలిసి..సరిగ్గా పది రోజులకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ ఓ వ్యాసం రాశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల రాసిన వ్యాసం ఏడాది కిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎవరీ నిజాం వెంకటేశం.. ఏమిటీ ఆయన చరిత్ర అని ఆరా తీశారు. ఆయన మరణించిన ఏడాది పూర్తి అయిన సందర్భంగా ‘అన్నలకే పెద్ద న్న’ అయిన నిజాం వెంకటేశం అడుగుజాడలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఎవరీ నిజాం వెంకటేశం.. కల్లోల సిరిసిల్లలో 1948 నవంబరు 14న వైశ్య కుటుంబంలో పుట్టి పెరిగిన నిజాం వెంకటేశం ట్రాన్స్‌కో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆయన మూలాలు పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఉన్నాయని తెలుసుకున్న పలువురు సాహితీవేత్తలు ఉద్వేగానికి గురయ్యారు. సమసమాజ స్థాపనకు జరుగుతున్న ప్రజా యుద్ధంలో తన వంతు శక్తికి మించి సాయాన్ని అందించారని నిజాం వెంకటేశం నిజాల గురించి మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రాసిన వ్యాసంతో వెల్లడైంది. పెద్దపల్లిలోని తన చిన్ననాటి మిత్రులు ఒకసారి పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ‘అవును వెంకటేశం సార్ ఇక్కడే ఉండేవారు. ఇక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత తిరిగి పెద్దపెల్లికి రాలేదు’ అంటూ 42 ఏళ్ల క్రితం తనతో ఉన్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఐదారేళ్లు పెద్దపల్లిలోనే ఉద్యోగం చేశారు. కరెంటు పవర్ హౌస్ (రాఘవపూర్ సబ్ స్టేషన్) లో ఉద్యోగం చేస్తూ ఓ సాహితీవేత్తగా విప్లవానికి అందించాల్సిన సేవలు అందించారు. ఆయన విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూనే.. గుట్టలు సమీపంలో ఉండడంతో పెద్దపల్లిలో ఐటీఐ చదివే వారు, విప్లవకారులు ఆయన ఇంటిని షెల్టర్‌గా చేసుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా వారికి భోజనం పెట్టి ఆత్మీయంగా ఉండేవారని మల్లోజుల తన వ్యాసంలో వెల్లడించారు. తన కంటే ముందు తన సోదరుడు మల్లోజుల కోటేశ్వర్రావుకు వెంకటేశం అత్యంత సన్నిహితుడని వివరించారు. తనను సైకిల్‌పై కూర్చోబెట్టుకుని డబుల్ సవారీ చేస్తూ తనకు ప్రపంచాన్ని పరిచయం చేశాడని వేణుగోపాల్ చెప్పడం విశేషం. అగ్రనేతలకు ఆత్మీయుడు.. పశ్చిమబెంగాల్లో అమరుడైన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ మొదలుకొని ఇప్పటికీ సజీవంగా కేంద్ర కమిటీలో ఉన్న గణపతి అలియాస్ ముప్పళ్ల లక్ష్మణ్‌రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి (కోసా), మంథనికి చెందిన మల్లా రాజిరెడ్డి, ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రతినిధి గణేష్ ఇలా.. ఓ పదిపదిహేను మంది మావోయిస్ట్ అగ్రనేతలకు నిజాం వెంకటేశం సార్ ఇల్లు ప్రధాన షెల్టర్ అని రాఘవపూర్ గ్రామస్తులు తెలిపారు. వామ్మో సార్ ఇంటికి అప్పట్లో పెద్ద పెద్దోళ్లు (పెద్దన్నలు) వచ్చేవారని అంటున్నారు. ఇక ఉత్తర తెలంగాణ కార్యదర్శి సాగర్ అలియాస్ దుగ్గు రాజ లింగం ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు. రాజలింగంకు నిజాం వెంకటేశం అత్యంత సన్నిహితుడిగా మల్లోజుల వేణుగోపాల్ పేర్కొన్నారు. నిజాం వెంకటేశం విప్లవ కార్యాచరణకు అందించిన సహకారాన్ని వివరిస్తూ రాసిన లేఖ పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల్లో ఒక సంచలనం రేపింది. విప్లవ ఉద్యమానికి ఆయన నిర్వర్తించిన పాత్ర అనిర్వచనమని మల్లోజుల పేర్కొన్నారు. ఆశ్రయం కల్పించడం, సాహిత్యాన్ని అందించడం, వచ్చినవారిని కడుపులో దాచుకోవడం, ఉద్యమంలో పాల్గొన్నవారిని, వారి ఆర్థిక అవసరాలను తీర్చి, ప్రోత్సహించేవారిని నాటి వెంకటేశం మిత్రులు పేర్కొంటున్నారు. ఇలా ఉద్యమానికి అక్షరమై, ఆయుధాన్ని అందించిన వెంకటేశం సిరిసిల్ల ప్రాంత వాసి కావడం విశేషం. నిజానికి నిజాం వెంకటేశం గురించి సిరిసిల్ల ప్రాంత వాసులకు చాలా తక్కువే తెలుసు కానీ, ఆయనతో సన్నిహితంగా ఉండేవారికి అపర మేధావి, ధైర్యవంతుడు, పెద్ద యుద్ధానికి అగ్రనేతలను సంసిద్ధులను చేసిన పెద్దన్నగా పేరు సంపాదించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో స్థిరపడి.. సిరిసిల్లకు చెందిన నిజాం విశ్వనాథం, సత్తమ్మ దంపతుల కొడుకు వెంకటేశం. భార్య పేరు మాధవి. ఒక్క కొడుకు, ఇద్దరు కూతుర్లు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 1966లో పాలిటెక్నిక్ చేసిన వెంకటేశం, చదువు పూర్తికాగానే 1968లో తొలిసారి ట్రాన్స్‌కోలో ఉద్యోగిగా జగిత్యాలలో విధుల్లో చేరారు. 1972 నుంచి 1978 వరకు పెద్దపల్లిలో పని చేశారు. అనంతరం 1978 నుంచి 1990 వరకు జగిత్యాల ప్రాంతంలో పని చేశారు. 1997లో ఉద్యోగ విరమణ చేశారు. ఇంగ్లిష్‌పై పట్టున్న ఆయన అనేక పుస్తకాలను తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. సిరిసిల్ల శివారులోని రంగినేని ట్రస్ట్‌లో జరిగే సాహిత్య వేడుకలకు ఆయన తరచూ వచ్చేవారు. సిరిసిల్లలో అనేక మంది కవులు, సాహిత్యకారులు నిజాం వెంకటేశం సన్నిహితులుగా ఉన్నారు. కవిగా, విమర్శకులుగా పలు సాహిత్యకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘అజాత శత్రువు’గా పుస్తకం వెంకటేశం సాహిత్యం.. వ్యక్తిత్వాన్ని ‘అజాత శత్రువు నిజాం వెంకటేశం’ పేరుతో పుస్తకాన్ని వెలువరించారు. తెలంగాణ జిల్లాలోని ప్రముఖ రచయితలు, కవులు, సాహిత్యకారులు ఈ పుస్తకంలో ఆయనతో ఉన్న అనుబంధాలను రాశారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఆయన ఎదుటివారికి సాయం చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేవారు కాదు. తన సంపాదనలో ఎక్కువగా పుస్తకాల కొనుగోలుకు వెచ్చించినట్లు పలువురు తమ వ్యాసాల్లో వెల్లడించడం విశేషం. తను మరణించిన ఏడాది పూర్తి అయిన సందర్భంగా సిరిసిల్ల ప్రాంతంలోని సాహిత్యకారులు ఆయన సేవలను యాది చేసుకున్నారు. -
వారికి రిజర్వేషన్లు సహేతుకం కాదు!
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్)కు పదిశాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ 2019 జనవరి 8న పార్లమెంట్ చేసిన 103వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ సుప్రీం కోర్ట్ 2022 నవంబర్ 7న తీర్పు ఇచ్చింది. దీంతో రిజర్వేషన్ అంశం దేశ వ్యాప్తంగా మరోసారి చర్చకు వచ్చింది. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ రవీంద్రభట్‌లు ఈడబ్ల్యూఎస్ కోటాను విభేదించగా... జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది సమర్థించారు. మొత్తం మీద 3:2 మెజారిటీతో 103వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ ఎస్సీ, ఎస్టీ బీసీలు కాని వారిలో పేదలు... అనగా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్పునివ్వడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశంలో తరతరాలుగా సామాజికంగా, విద్యాపరంగా; అంటరానితనం, వివక్షతలను అనుభవిస్తున్న కులాలకు కల్పించవలసిన రిజర్వేషన్లు... ఆర్థికపరంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం కల్పించడం రాజ్యాంగ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమనీ, ఆ సవరణను రద్దు చేయాలనీ సుమారు 40 మంది సుప్రీం కోర్టులో కేసులు వేశారు. జస్టిస్ యు.యు. లలిత్ కుమార్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ విచారణ సమయంలో దీన్ని ప్రభుత్వం సమర్ధించుకుంటూ... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంతకు ముందే రిజర్వేషన్లు కల్పిస్తున్నందున వారికి కేటాయించిన 50 శాతం కోటాకు ఈ 10 శాతం అదనంగా ఉంటుందనీ, వీటితో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధం లేదనీ, ఇది రాజ్యాంగబద్ధమే అనీ చెప్పింది. ఈ కోర్టు తీర్పు రాగానే అధికార, ప్రతిపక్ష, వివిధ రాజకీయ పార్టీలు క్రెడిట్ మాదంటే మాది అని ప్రకటించుకోవడం సిగ్గుచేటు. 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆర్టికల్ 15 (6), 16 (6) క్లాజు లను చేర్చడం ద్వారా దేశ జనాభాలో 8 నుంచి 10 శాతం ఉన్న అగ్ర వర్ణాలకు అందులో కేవలం మూడు శాతం ఉన్న పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఏ విధంగా సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ, ఎసీ,్ట బీసీలలో ఉన్న నిరుపేదలు పేదలు కాదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలలో ఎలాంటి స్థిరాస్తులు కలిగి లేకుండా ఏడాదికి రూ. 2.5 లక్షల ఆదాయం ఉన్న వారిని పేదలుగా గుర్తించినప్పుడు... అగ్రవర్ణాలకు మాత్రం 5 ఎకరాల లోపు భూమీ, సంవత్సరాదాయం రూ. 8 లక్షల లోపు ఆదాయం... అంటే నెలకు 60 వేల ఆదాయం ఉండా లని నిర్ణయించడం వివక్ష కాదా? నెలకు 60 వేల ఆదాయం సంపాదించే వారు ఎలా పేదలవుతారో తెలపాలి. పేదలు ఎవరైనా పేదలే అన్న ప్పుడు ఈ వివక్ష ఎందుకో సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎస్సీలలో 38 శాతం, ఎస్టీలలో 48.4 శాతం, బీసీలలో 13.8 శాతం, ఓసీలలో 3 శాతం పేదలు ఉన్నారు. పేదరికం, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా ఓసీలలో ఉన్న మూడు శాతం పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్న పేదలకు ఎందుకు ఇందులో అవకాశం ఇవ్వరు? వీరు పేదలు కాదా? కేవలం అగ్రవర్ణాల్లోనే పేదలుంటారని ఈడబ్ల్యూఎస్ కోటా నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీలను తప్పించడం రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వపు హక్కును కాలరాయడమే. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వే షన్లను కొందరికే ఎలా వర్తింపచేస్తారని రాజ్యాంగ నిపుణులు అంటు న్నారు. ఉదాహరణకు దివ్యాంగులకు ఏ కులం వారికైనా రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు. నిరుపేదలు ఏ కులంలో ఉన్నా ఈడబ్ల్యూఎస్ రిజ ర్వేషన్లు వర్తింపజేయాలి కదా! ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 52 శాతం ఉన్న బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వలేదు. పైపెచ్చు 1992లో ఇందిరా సహాని కేసులో తొమ్మిది మంది సభ్యులు గల సుప్రీంకోర్టు బెంచ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం ఇస్తున్న రిజర్వేషన్లు 50 శాతానికి దాటడానికి వీలులేదని తీర్పునిచ్చింది. ఇదే సందర్భంలో ప్రమోషన్లలో రిజర్వేషన్లను కూడా తొలగించి, బీసీలకు క్రిమిలేయర్ ని వర్తింపజేసింది. దేశంలో 49.5 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా ప్రస్తుత ఈడబ్ల్యూఎస్‌లకు ఇస్తున్న 10 శాతం కలిపితే 59.5 శాతం అవుతున్నది. అయితే ఓ న్యాయమూర్తి 50 శాతం అనేది లక్ష్మణరేఖ కాదని పేర్కొనడం విశేషం. ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలోనూ అనేక అన్యాయాలు జరగుతు న్నాయి. 2018లో హైకోర్టు జీవో నంబర్ 26ను సమర్థిస్తూ ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు కల్పించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 26ను తొలగిస్తూ జీవో నంబర్ 247ను తీసుకు రావడం జరిగింది. దీనివల్ల దళిత, గిరిజన ఉద్యోగుల ప్రమోషన్లకు అడ్డుకట్ట వేయడం జరిగింది. ఇదిలా ఉండగా మరో అన్యాయాన్ని గమనిస్తే (ఈడబ్ల్యూఎస్) అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కేటాయించడం వల్ల ఓపెన్ కేటగిరిలో వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీలు పది శాతం రిజర్వేషన్లు కోల్పోవడం జరుగుతుంది. ఇటీవలే జరిగిన కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియలో ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ పాటించక పోవడం వల్ల అన్యాయానికి గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తీవ్ర ఆందోళన చేయడం... ఈ అంశం అసెంబ్లీలో చర్చకు రావడం వల్ల తిరిగి వాటిని సరిచేయడం జరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగ నియమకాల ఫలితాలలో ఎస్సీలకు –82.50, ఎస్టీలకు –76.50, బీసీ లకు 110.50, ఈడబ్ల్యూఎస్ (ఓసీ)లకు – 51.25 మార్కులు కటాఫ్ మార్కులుగా కేటాయించారు. ఇలా నిరుపేదలు, వికలాంగుల కంటే కూడా ఈడబ్ల్యూఎస్ (ఓసీ)లకు తక్కువ కటాఫ్ మార్కులు కేటాయిం చడం అన్యాయం. ఈ విధంగా కూడా దళిత గిరిజనులకు, బహుజను లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇలా ఒక్కొక్కటిగా రాజ్యాంగ రక్షణలు అన్నిటిని కూడా పెకిలించివేస్తున్న చర్యలను వివిధ సామాజిక వర్గాల మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సామాజిక వెనుకబాటే ఆర్థిక వెనుకబాటుకు కారణం కాబట్టి ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ సాధన కోసం సామాజికంగా, విద్యా పరంగా... వివక్ష, అంటరానితనం అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. రిజర్వేషన్లు ఆర్థిక ఉద్దీపన కోసం కాదన్న విషయం గమనించాలి. కాబట్టి ఆర్థిక వెనుకబాటు కారణంగా రిజర్వేషన్లు కల్పించలేమన్న విషయాన్ని గుర్తించాలి. అగ్రవర్ణ పేదలపై ఎవరికీ వ్యతిరేకత లేదనేది గమనించాలి. వారి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటే కాదనేది ఎవరు? ఆ దిశలో కృషి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. (క్లిక్ చేయండి: రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?) - బైరి వెంకటేశం రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి, తెలంగాణ -
Nizam Venkatesham: అరుదైన వ్యక్తి నిజాం వెంకటేశం
సాహితీవేత్త, పుస్తక ప్రేమికుడు నిజాం వెంకటేశం మృతి తెలుగు సాహితీలోకాన్ని కలచివేసింది. అప్పటివరకూ ఆరోగ్యంగా ఉన్న ఆయన హఠాత్తుగా సెప్టెంబర్ 18 సాయంత్రం గుండెపోటుతో అసువులు బాశారు. ఆగస్టు 31న తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న వెంకటేశంను పలకరించి ఓదార్చిన సాహితీ మిత్ర బృందానికి ఆయన అర్ధంతర నిష్క్రమణ దిగ్భ్రాంతిని కలిగించింది. నచ్చిన పుస్తకాన్ని పదుల సంఖ్యలో కొని, పంచి, మురిసిపోయిన అరుదైన వ్యక్తి వెంకటేశం. ఆయన 1948లో సిరిసిల్లాలో జన్మించారు. విద్యుత్ శాఖలో ఇంజినీర్‌గా విధులు నిర్వ హించి 1997లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు ఎన్నో సాహితీ కార్యక్రమాల నిర్వహణకు, పుస్త కాల ప్రచురణకు సహకరించారు. కవిత్వం పట్ల ప్రేమతో 1980 దశకంలో ‘దిక్సూచి’ కవితా సంచి కలు వెలువరించి యువ కవులకూ ప్రోత్సాహాన్ని చ్చారు. అలిశెట్టి ప్రభాకర్ దీర్ఘకవిత ‘నిజరూపం’ అందులోనే వచ్చింది. కరీంనగర్ బుక్ ట్రస్ట్ ఆరంభించి అల్లం రాజయ్య ‘భూమి’ కథలు, బీఎస్ రాములు ‘బతుకు పోరు’ నవలను ప్రచురించారు. 1950 దశకంలో తెలంగాణ మాండలీకంలో వచ్చిన గూడూరి సీతారాం కథలు కొత్త తరానికి పరిచయమయ్యేలా 2010లో పుస్తకరూపంలో రావడానికి తోడ్పడ్డారు. 2013లో అలిశెట్టి సమగ్ర కవితా సంపుటి రాకలో ప్రధానపాత్ర పోషించారు. న్యాయవాది విద్యాసాగర్ రెడ్డి దేశంలో ఆర్థికరంగ మార్పులను సూచిస్తూ రాసిన మూడు ఇంగ్లిష్ పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. సేంద్రియ వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ పుస్తకాన్ని కూడా తెనిగించారు. పుస్తకాన్నీ, రచయితనీ, మంచితనాన్నీ ఏకకాలంలో సమానంగా ప్రేమించిన అరుదైన వ్యక్తి వెంకటేశం. ఆయనకు నివాళి. – బి. నర్సన్ -
తండ్రి తప్పుచేశాడని..కూతురిని గెంటేశారు.
సాక్షి, నాగిరెడ్డిపేట: మండలంలోని గోపాల్పేట మోడల్‌స్కూల్ హాస్టల్ నుంచి నందిని అనే పదో తరగతి విద్యార్థిని గెంటివేతపై మంగళవారం ఎంఈవో ఎ.వెంకటేశం పాఠశాలకు చేరుకొని విచారణ జరిపారు. విద్యార్థిని నందినితోపాటు ఆమె తండ్రి పీర్యాను పాఠశాలకు పిలిపించి మాట్లాడారు. కేర్‌టేకర్ తీరును నిరసిస్తూ తన కూతురిని పాఠశాలకు పంపబోనని, ఈ విషయమై తాను కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేస్తానని విద్యార్థిని తండ్రి పీర్యా ఎంఈవోతో పేర్కొన్నారు. దీంతో హాస్టల్ కేర్‌టేకర్ నిర్మలతో మాట్లాడారు. తండ్రి తప్పుచేయడంతోనే అతని కూతురిని హాస్టల్ నుంచి తీసివేసినట్లు ప్రిన్సిపాల్ శ్రీలత పేర్కొన్నారు. తండ్రి తప్పుచేస్తే కూతురికి శిక్ష వేయడం సరికాదని, నందినికి తిరిగి హాస్టల్లో సీటు కేటాయించాలని ఎంఈవో ఆదేశించారు. సిబ్బంది సంయమనం పాటించాలని సూచించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని పీర్యాకు నచ్చజెప్పి నందినిని హాస్టల్లో ఉంచేందుకు ఎంఈవో ఒప్పించారు. ఆయన వెంట సీఆర్పీ రాజయ్య ఉన్నారు. -
లైంగిక వేధింపులు: బుక్కైన స్త్రీ సంక్షేమ శాఖ అధికారి
-
నా కోరిక తీర్చు.. లేకపోతే అంతే
సాక్షి, అనంతపురం : అది స్త్రీ సంక్షేమ శాఖ. అంటే మహిళలు, యువతుల సంక్షేమం కోసం పనిచేసే సంస్థ. కానీ అందులో పనిచేసే ఉద్యోగునులకే భద్రత లేకుండా పోయింది. తమ లైంగిక వాంఛ తీర్చాలంటూ ప్రతిరోజు వేధింపులే. పైఅధికారుల తీరుతో విరక్తి చెందిన ఓ మహిళా ఉద్యోగి, తన ఉన్నతాధికారికి తగిన రీతిలో బుద్ది చెప్పింది. అధికారి భాగోతాన్ని బట్టబయలు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం ఐసీడీఎస్ పీడీ వెంకటేశం ఓ మహిళా ఉద్యోగిపట్ల గత కొద్ది కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. తన కోరిక తీర్చాలని లేకపోతే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రతిరోజు వెంకటేశం ఫోన్లో సదరు మహిళా ఉద్యోగిని వేధిస్తున్నాడు. అయితే అధికారి ఫోన్‌కాల్స్ అన్నింటిని మహిళా ఉద్యోగి రికార్డు చేసి తండ్రికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఉద్యోగి తండ్రి వెంకటేశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులు ఆపకపోతే ఆడియో టేపులను బయటపెడతామని హెచ్చరించారు. దీంతో దారికి వచ్చిన వెంకటేశం తన బాగాతాన్ని బయటపెట్టొద్దని, తన ఉద్యోగం పోతుందంటూ ఫోన్లోనే క్షమాపణ కోరాడు. దీంతో విషయం కొద్ది మేర సద్దుమణిగింది. గతంలోనే వెంకటేశంపై పలు ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నవెంకటేశంను సస్పెండ్ చేయాలంటూ జిల్లా ఐద్వా అధ్యక్షురాలు సావిత్రి డిమాండ్ చేశారు. -
అందరికీ పింఛన్
పింఛన్..పింఛన్.. రెండు నెలలుగా ఎక్కడ చూసినా ఇదే చర్చ. పింఛన్ల పంపిణీలో కొత్త నిబంధనల కారణంగా లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేలి ముద్రలు పడక చాలా చోట్ల వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పడుతున్న ఇబ్బందులను సాక్షి వీఐపీ రిపోర్టర్ హోదాలో డీఆర్డీఏ పీడీ వెంకటేశం తెలుసుకున్నారు. అర్హులందరికీ పింఛన్లు అందుతున్నాయా? పంపిణీ ప్రక్రియలో ఎక్కడ లోపం ఉందో తెలుసుకున్నారు. శనివారం అనంతపురం కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్ జనశక్తినగర్‌కు వెళ్లి లబ్ధిదారుల సమస్యలను సావదానంగా విన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, అర్హులందరికీ పింఛన్ ఇప్పించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. వెంకటేశం : ఏం పెద్దాయన. పింఛన్ సక్రమంగా అందుతోందా? ఫకృద్దీన్ : మూన్నెళ్లనుంచి అందలేదయ్యా! వెంకటేశం : ఏం ఆందోళన పడొద్దు. మాన్నెళ్లది ఒకే సారి వస్తుంది. వెంకటేశం : ఏమ్మా..నువ్వు పింఛన్ తీసుకున్నావా? పెద్దక్క : నాకు ముప్పై ఏళ్ల నుంచి పింఛన్ వస్తోంది సారూ. చంద్రబాబు వెయ్యి రూపాయలు చేసినప్పటి నుంచి రాలేదు. మూన్నెళ్లు అయితాంది. కంప్యూటర్లో వేలిముద్రలు పడలేదని సెపుతున్నారు. వెంకటేశం : వేలిముద్రలు పడకపోయినా మీకు పింఛన్ జాబితా పంపించాం. దాంట్లో నీ పేరుంటే చాలు. అధికారులు నిర్ధారించి పింఛన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటారు. వెంకటేశం : ఏమ్మా నీ పేరేమి.? నీ సమస్య ఏంటి? దస్తగిరమ్మ: మాయన పోయి ఐదేళ్లు అవుతాంది. అప్పట్నుంచి పింఛన్‌పైనే ఆదారపడుతున్నా. ఇప్పుడు ఎప్పుడిత్తారో.. ఎక్కడిత్తారో సెప్పే నాథుడు లేరు. కుటుంబం గడిచేది కష్టంగా ఉంది. మా సమస్య ఎవరితో సెప్పుకోవాలి. వెంకటేశం : ఆధార్ నంబర్ ఇచ్చావా? దస్తగిరమ్మ: మూడు సార్లు ఇచ్చినాం సామీ! వెంకటేశం : ఆధార్ నంబర్ ఇచ్చింటే తప్పకుండా వస్తుంది. ఏం బెంగ పెట్టుకోవద్దు. వెంకటేశం : ఏంటమ్మా అలా ఉన్నావు.? పింఛన్ అందలేదా? ముంతాజ్ : పింఛన్ కోసం కళ్లు కాచేలా చూస్తున్నాం సారూ. రోజుకు 5 నుంచి 10 మందికి ఇస్తున్నారు. దీంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. రెండు రోజులు ఇచ్చారు. మళ్లీ ఇటు వైపు రాలేదు. ఇట్లైతే ఇంకెప్పుడిత్తారో? వెంకటేశం : కొత్తగా మిషన్లు వచ్చాయ్. రోజూ 100 మందికి ఇచ్చేందుకు వెసులుబాటు ఉంటుంది. మీరు సహకరిస్తే ఇంకా ఎక్కువ మందికి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. వెంకటేశం : ఏం పెద్దాయమ్మ. దిగాలుగా ఉన్నావే.? రాములమ్మ : ఏం సెప్పేది సారూ. పింఛన్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసినట్లుంది. రోజూ కాలనీలో విచారించుకునేందుకు సరిపోతాంది. మాకంతకూ పింఛన్ ఇస్తారా? ఎప్పుడిస్తారో చెప్పండి సారు. వెంకటేశం : రెండు రోజుల్లో మీ కాలనీలో అందరికీ పింఛన్లు అందించే ఏర్పాటు చేస్తా (తపాల ఎస్పీతో మాట్లాడిన తరువాత). వెంకటేశం : ఏం బాబు (వికలాంగున్ని చూస్తూ) నువ్వ కూడా తీసుకోలేదా.? మహబూబ్‌బాషా: సార్, చాలా ఇబ్బంది అవుతోంది. రెండు నెలలుగా తీసుకోలేదు. టౌన్లో అంతా పంచుతున్నారు. మా కాలనీకి మాత్రం రాలేదు. పింఛన్ వస్తుందో రాదోనని దిగులు పట్టుకుంది. వెంకటేశం : తప్పకుండా వస్తుంది. మీలాంటి వాళ్లు అనవసరంగా తిరిగి ఇబ్బందులు పడొద్దు. వెంకటేశం : ఏమ్మా పింఛన్ వచ్చిందా? లిస్టులో చూసుకున్నావా? గంగమ్మ : లిస్టులో పేరు ఉందా లేదా అని సెప్పెవాళ్లు ఎవరూ లేరు. ఇంత వరకూ లిస్టే రాలేదంటున్నారు. మా పేరు ఎవరు సెప్తారో తెలియడం లేదు. ఒకప్పుడు బాగుండే. ఇళ్ల వద్దకు వచ్చి ఇచ్చే వాళ్లు. ఇప్పుడు ఎవరూ రావడం లేదు. వెంకటేశం : ఇప్పటికే పింఛన్ జాబితాను పంపించాం. కార్పొరేషన్ ఆఫీసుకు వెళ్లి జాబితా తెచ్చుకుని లిస్ట్‌లో పేర్లున్నాయో లేదో చూసుకోండి. వెంకటేశం : ఏమ్మా నువ్వ పింఛన్ ఎంత తీసుకుంటున్నావు? సుబ్బమ్మ : సార్.. మూడు నెలల నుంచి పింఛన్ తీసుకోలేదు. రేపుమాపు అంటున్నారు. అప్పట్లో రూ. 200 ఉండేది. ఇప్పుడు వెయ్యి రూపాయాలు అంటున్నారు. కానీ మా కాలనీలో ఎప్పుడిస్తారో తెలియడం లేదు. వెంకటేశం : పోస్టల్ వాళ్లతో మాట్లాడి మీ కాలనీకి త్వరగా ఇప్పించేలా చూస్తా. వెంకటేశం : అన్నా నీ సమస్య చెప్పు. పింఛన్ అందలేదా? హనుమన్న : సారూ.. వికలాంగ పింఛన్ కింద రూ.1500 వస్తుందని అంటున్నారు. కానీ ఇచ్చింది లేదు. చాలా ఇబ్బంది అవుతాంది. దీనిపై ఆధారపడేటోళ్లం. మాపై కరుణ చూపండి. వెంటనే మాకు పింఛన్ ఇప్పించండి. సమస్యలపై పోస్టల్ అధికారులతో మాట్లాడిన పీడీ ప్రతి నెలా పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగుల సమస్యలను విన్న పీడీ వెంకటేశం చలించారు. అక్కడ నుంచే ఫోన్లో తపాలశాఖ సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. ‘జనశక్తినగర్ పెద్ద కాలనీ. కాలనీలో పింఛన్లు పంచేందుకు అధికారులు ఒక రోజు మాత్రమే వచ్చారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికి 5 మందికి మాత్రమే పింఛన్ ఇచ్చారంట. అదనపు సిబ్బందిని కేటాయించైనా కాలనీలో త్వరగా పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోండి. రేపటి నుంచే కౌంటర్ ఏర్పాటు చేయండి’ అని కోరారు. అనంతరం ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ.. ‘పింఛన్ పంపిణీపై కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఏడు మున్సిపాల్టీల పరిధిలో 61 వేల మంది లబ్ధిదారులకు ఈ నెల పింఛన్ మంజూరైంది. 54 స్పాట్ మిషన్ల ద్వారా పంపిణీ చేపడుతున్నాం. అందువల్ల పింఛన్‌దారులకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అందరికీ పెన్షన్ తప్పక అందుతుంది. వేలిముద్రలు సరిపోకపోయినా జాబితాలో పేరుంటే చాలు బిల్ కలెక్టర్ పేరు మీద పెన్షన్ మంజూరు చేయమని ఆదేశాలు జారీ చేశాం’’ అని చెప్పారు. -
ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయి
మార్గదర్శకాల కమిటీ చైర్మన్ కమలనాథన్ ఉద్ఘాటన రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనపై కేంద్ర హోంశాఖ సమీక్ష హాజరైన కమల్‌నాథన్, సీఎస్ మహంతి, రమేశ్, వెంకటేశం ‘స్థానికత’ ఏ ప్రాతిపదికపై తీసుకోవాలనే దానిపై మీమాంస మార్గదర్శకాల ఖరారుకు రెండు మూడు వారాల సమయం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీలో ఉద్యోగులకు ఆప్షన్లు తప్పనిసరిగా ఉంటాయని రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించేందుకు ఏర్పా టైన కమిటీ చైర్మన్ కమలనాథన్ స్పష్టంచేశారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శక సూత్రాల రూపకల్పనపై కేంద్ర హోంశాఖ గురువారం ఢిల్లీలో సమీక్షించింది. ఈ సమీక్షకు కమలనాథన్తోపాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేశ్, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం సభ్యుడు పి.వెంకటేశం హాజరయ్యారు. భేటీ అనంతరం కమలనాథన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఉద్యోగుల పంపిణీ ఏ ప్రాతిపదికన ఉండాలి అనే మార్గదర్శక సూత్రాలు ఖరారు చేసేందుకు సమావేశమయ్యాం. ఇంకా ఖరారు కాలేదు. మరో రెండు మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. దాదాపు 52 వేల మంది ఉద్యోగులను పంపిణీ చేయాల్సి ఉంది. జూన్ 2కల్లా ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది...’’ అని చెప్పారు. ‘ఉద్యోగుల పంపిణీలో ఆప్షన్లు ఉంటాయా?’ అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘తప్పనిసరిగా ఉంటాయి’ అని తెలి పారు. ‘ఈ విధివిధానాల ఖరారులో ఉద్యోగులతో చర్చలు జరుపుతారా?’ అని అడగ్గా.. ‘అధికారుల సంఘాలతో చర్చిస్తాం’ అని బదులిచ్చారు. ‘స్థానికత’ ప్రాతిపదికపై మల్లగుల్లాలు... ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రస్థాయి ఉద్యోగాలు 72 వేలు ఉండగా.. ఇందులో ఖాళీలు పోను ప్రస్తు తం 54 వేల మంది ఉద్యోగులున్నారు. వీరిని.. రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకుగల ప్రాతిపదికను, మార్గదర్శక సూత్రాలను ఖరారు చేయటంపై సమావేశంలో చర్చిం చారు. ఉద్యోగుల స్థానికత ఆధారంగా చేయాలా? ఉద్యోగ నియామకం సమయంలో ఉన్న అభ్యర్థి ప్రాంతాన్ని బట్టి విభజించాలా? స్థానికతకు ఏ ప్రాతిపదిక తీసుకోవాలి? ఏ ప్రాతిపదిక తీసుకుం టే ఉద్యోగుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? తదితర అంశాలపై చర్చించారు. అయితే.. ఉద్యోగ నియామకం సమయంలో ‘స్థానికత’కు ఉన్న నిర్వచనమే ఈ మార్గదర్శక సూత్రాల్లోనూ వర్తిస్తుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇదిలావుంటే.. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సోమవారం (17వ తేదీ) హైదరాబాద్ వెళ్లనున్నారు. విభజన పనులకు సంబంధించి సమీక్ష జరుపనున్నారు. -
అమ్మా..నాన్న మీరు రారని..
మల్లారెడ్డిపేట(గంభీరావుపేట), న్యూస్‌లైన్: నాన్న.. దేశం కాని దేశంలో ఉన్నాడు. అమ్మ.. కనిపించకుండా ఎటో వెళ్లిపోయింది. ఆమె ఎక్కడుందో.. తిరిగి వస్తుందో రాదో..! నాన్న ఎప్పుడొస్తాడో తెలియదు. తల్లిదండ్రుల కోసం ఎదురుచూడలేక.. ఒంటరి జీవితాన్ని భరించలేక.. ఆ పసివాడు నిండు ప్రాణం తీసుకున్నాడు. ఈ హృదయ విదారక సంఘటన గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి గ్రామానికి చెందిన చంద్రం, శ్యామల దంపతులకు రమ్య(13), వెంకటేశం(17) పిల్లలు. జీవనోపాధికోసం చంద్రం రెండేళ్ల క్రితం దుబాయి వెళ్లాడు. ఆయన వెళ్లిన కొద్ది రోజులకే శ్యామల ఇద్దరు పిల్లలను వదిలేసి కనిపించకుండా ఎటో వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఆనాటి నుంచి పిల్లలు ఒంటరిగా మిగిలారు. మల్లారెడ్డిపేటలోని తాత దగ్గర కొన్ని రోజులు, రామక్కపేటలోని బంధువుల ఇంటి దగ్గర కొన్ని రోజులు ఉంటున్నారు. వెంకటేశం తొమ్మిదోతరగతి మధ్యలో చదువు ఆపేశాడు. నాలుగైదు రోజులక్రితం మల్లారెడ్డిపేటలోని తాత ఎల్లయ్య ద గ్గరికి వెంకటేశం వచ్చి ఉంటున్నాడు. మానసిక వేదనకు గురై జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. సంఘటన సమాచారాన్ని గ్రామస్తులు దుబాయిలోని తండ్రి చంద్రంకు తెలిపారు. ఆయన దుబాయి నుంచి మల్లారెడ్డిపేటకు బయలుదేరాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై జాఫర్ షరీఫ్ తెలిపారు. -
ఇండెంట్ పెడితే కాదంటారా?
అనంతపురం వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాల లేమిపై అడిషనల్ డీఎంఈ డాక్టర్ వెంకటేశం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్న చిన్న సదుపాయాలు కూడా లేకపోతే ఎలాగంటూ ప్రిన్సిపాల్‌పై అసహనం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం అనంతపురం వైద్య కళాశాల, సర్వజనాస్పత్రిని అడిషనల్ డీఎంఈ తనిఖీ చేశారు. ముందుగా వైద్య కళాశాల వద్ద ఆయనకు ప్రిన్సిపాల్ నీరజ, ఆస్పత్రి సూపరింటెండెంట్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. అనంతరం కామన్ గదులపై ఏడీఎంఈ ఆరా తీయగా మొదటి నుంచి ఆ వసతులు లేవని ప్రిన్సిపాల్ చెప్పడంతో ‘ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కనీసం టాయ్‌లెట్స్ కూడా లేకుంటే ఎలాగని మండిపడ్డారు. అనాటమీ, ఫోరెన్సిక్, ఎగ్జామ్ వాల్యుయేషన్ రూంలు, జిమ్, లైబ్రరీ, సెంట్రల్ హాల్‌ను తనిఖీ చేశారు. లైబ్రరీలో కూడా టాయ్‌లెట్స్ లేవని తెలియడంతో ‘ఏందండీ ప్రతి చిన్న విషయానికి కారణాలు చెబుతున్నారు..డీఎంఈకి ఇండెంట్ పెడితే కాదంటారా?’ అని ప్రశ్నించారు. అనంతరం వైద్య కళాశాల పైభాగానికి వెళ్లి ఖాళీ స్థలాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీనియర్ రెసిడెంట్ హాస్టల్‌ను చూసి ఎందుకు నిరుపయోగంగా ఉందని ఏపీఎంఎస్ఐడీసీ డీఈ ప్రభాకర్ చౌదరిని ప్రశ్నించగా.. చిన్న చిన్న రిపేరీలు ఉన్నాయన్నారు. దీంతో మార్చిలోపు హాస్టల్‌ను పునరుద్ధరించాలని, అందుకు రూ.20 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. - న్యూస్‌లైన్, అనంతపురం అర్బన్ ‘అనంత’పై ప్రత్యేక శ్రద్ధ చూపండి ఏడీఎంఈని కోరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి కరువు కాటకాలతో విలవిల్లాడుతున్న ‘అనంత’పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైఎస్ఆర్సీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఏడీఎంఈ డాక్టర్ వెంకటేశంను కోరారు. ఆస్పత్రి, వైద్య కళాశాల తనిఖీకి వచ్చిన ఆయన్ను ఎమ్మెల్యే కలిసి వినతిపత్రం అందజేశారు. ఆస్పత్రిలోని సమస్యలను వివరించారు. ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీతో పాటు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. వెయ్యి పడకల ఆస్పత్రిగా చేసి అందుకు అనుగుణంగా ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు, అటెండర్లకు విశ్రాంతి గదులు నిర్మించాలన్నారు. నిమ్స్ తరహాలో అన్ని రకాల జబ్బులకు సంబంధించి వైద్యులను నియమించాలన్నారు. 24 గంటలూ పని చేసేలా రెండు అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలన్నారు. మౌలిక సదుపాయాల కోసం అధిక నిధులు కేటాయించాలన్నారు. అత్యవసర చికిత్సలను కర్నూలు, బెంగళూరుకు రెఫర్ చేస్తూ ఇక్కడి వైద్యులు చేతులు దులుపుకుంటున్నారని, ఫలితంగా మార్గంమధ్యలోనే వారు మృత్యువాత పడుతున్నారని చెప్పగా.. డీఎంఈ దృష్టికి తీసుకెళ్తానని వెంకటేశం హామీ ఇచ్చారు. వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ సమస్యలను ప్రభుత్వ సర్వజనాస్పత్రి, వైద్య కళాశాల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు గంగిరెడ్డి, స్వప్ప తదితరులు ఏడీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు. వీరికి వైఎస్ఆర్సీపీ అనుబంధ ఏపీ హెల్త్ మెడికల్, ఫ్యామిటీ వెల్ఫేర్ ఈయూ అధ్యక్ష కార్యదర్శులు షఫీ, శ్రీధర్ బాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్ పీరా మద్దతు తెలిపారు. కాంట్రాక్ట్ వ్యవస్థకు స్వస్తి పలకాలని కోరారు. ఆస్పత్రి సమస్యలను సీపీఐ నగర కార్యదర్శి నారాయణస్వామి ఏడీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు. 150 సీట్ల పెంపు లేనట్లే మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేరన్న కారణంతో వైద్య కళాశాలలో 150 సీట్ల పెంపును మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తిరస్కరించినట్లు ఏడీఎంఈ తెలిపారు. గత ఏడాది ఎంసీఐ తనిఖీ చేసినప్పుడు సదుపాయాల లేమి, సిబ్బంది కొరత వల్ల సీట్ల పెంపునకు వర్తించదని తేల్చి చెప్పినట్లు తెలిపారు. దాని పునరుద్ధరణ కోసమే వచ్చామన్నారు. పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతానికి నాలుగు డిపార్ట్మెంట్లు చేసుకుంటే సరిపోతుందని, మిగతా వాటి గురించి భవిష్యత్‌లో ఆలోచిద్దామన్నారు. ప్రమోషన్లు కావాలంటే పరిశోధనలు చేయాల్సిందే ఏళ్ల తరబడి పని చేస్తున్నా ప్రమోషన్లలో జాప్యం జరుగుతోందని, తమకు ప్రమోషన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు కన్నేగంటి భాస్కర్, నాయకులు నవీన్, వీరభద్రయ్య, సుబ్రమణ్యం తదితరులు ఏడీఎంఈని కోరారు. ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. దీంతో స్పందించిన ఏడీఎంఈ ‘మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న కళాశాలలో కూడా పరిశోధనలు చేస్తున్నారు. మీరు మాత్రం ఆ అవకాశం లేదని చెబుతున్నారు. పరిశోధనలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం ద్వారా వచ్చేలా చూస్తాం. ప్రమోషన్లు కావాలంటే పరిశోధనలు చేయాల్సిందే’ అని చెప్పారు. మీరెందుకలా చేయడం లేదు సర్వజనాస్పత్రిలోని ఐసీసీయూ, ఎఫ్ఎం, ఎంఎం వార్డులను ఏడీఎంఈ పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లి సమస్యలపై ఆరా తీశారు. శస్త్ర చికిత్స రికార్డులను పరిశీలించి ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘‘ ఆరోగ్య శ్రీ కేసులు నెలకు కేవలం 30 మాత్రమే చేస్తున్నారు.. రెవెన్యూ ఏ విధంగా వస్తుందో చెప్పండి. గాంధీ ఆస్పత్రికి రూ.16 కోట్లు, కాకినాడ ఆస్పత్రి రూ.14 కోట్లు, పక్కనే ఉన్న కర్నూలుకు ఏడాదికి రూ.కోటి ఆరోగ్య శ్రీ నిధులు వచ్చాయి. మీకెందుకు రావడం లేదో అర్థం కావడం లేదు’’ అని అన్నారు. అందుకు సూపరింటెండెంట్, పలు విభాగాధిపతులు డాక్టర్ రామస్వామినాయక్, డాక్టర్ నవీన్, డాక్టర్ మురళీకృష్ణ స్పందిస్తూ డేటా ఎంట్రీ ఆపరేటర్ లేరని, అప్రూవల్ వచ్చేందుకు ఆలస్యమవుతోందని సమాధానమిచ్చారు. దీంతో హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు ఏడీఎంఈ ఫోన్ చేసి ‘మీ పరిధిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఎంత మంది ఉన్నారు’ అని అడిగారు. దీంతో వారు ప్రైవేట్ కాంట్రాక్ట్ సిబ్బంది ద్వారా కేసుల జాబితా, అప్రూవల్ చేయిస్తున్నామని చెప్పడంతో ‘మీరెందుకలా చేయడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆగిన ఆటో
సాక్షి,సిటీబ్యూరో: ఏయ్ బాబు ఇటు రా...అని పిలిచే ఆటో శనివారం నుంచి నిలిచిపోయింది. సందుల్లో, గొందుల్లో రయ్యున దూసుకెళ్లే ఈ త్రిచక్రం బంద్ పాటించడంతో నగరంలో లక్షలాది ఆటోలు రోడ్డెక్కలేదు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆటోసంఘాల జేఏసీ చేపట్టిన నిరవధిక సమ్మెతో సింహభాగం ఆటోలు బయటకు రాలేదు. దీంతో నిత్యం కిటకిటలాడే రోడ్లు.. చాలావరకు బోసిపోయాయి. రైల్వేస్టేషన్లు, బస్టేషన్ల వద్ద ఆటోలు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్రఇబ్బందులకు గురయ్యారు. ఆటోచార్జీలను పెంచాలని, ట్రాఫిక్ చలానా పెంపు జీవోను వెంటనే రద్దు చేయాలని ఆటోసంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం అర్ధరాత్రి మొదలైన బంద్ ప్రభావం శనివారం స్పష్టంగా కనిపించింది. సుమారు లక్షా 20 వేల ఆటోల్లో 65శాతం ఆటోలు నిలిచి పోయాయి. వీటిలో 25వేల వరకు స్కూల్ ఆటోలే ఉన్నాయి. అయితే చాలా స్కూళ్లకు సంక్రాంతి సెలవులు కావడంతో పిల్లలకు పెద్దగా ఇబ్బందులు కలుగలేదు. పాతబస్తీ,నగర శివారు ప్రాంతాలు, జనసమ్మర్ధం అధికంగా ఉండే కోఠి,అబిడ్స్,అమీర్‌పేట, పంజగుట్ట వంటి ప్రాంతాల్లో మాత్రం ఆటోలు పలుచగా తిరిగాయి. సికింద్రాబాద్,నాంపల్లి రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జూబ్లీ బస్స్టేషన్లు తదితర ప్రాంతాల్లో మాత్రం ఆటోల జాడ కనిపించలేదు. 16 కార్మిక సంఘాలతో కూడిన జేఏసీ బంద్‌కు మద్దతివ్వగా, బీఎంఎస్‌తోపాటు మరికొన్ని సంఘాలు బంద్‌కు దూరంగా ఉన్నాయి. నిలువుదోపిడీ: బంద్‌ను అదునుగా తీసుకున్న కొందరు ఆటోడ్రైవర్లు,సెవెన్ సీటర్ ఆటోవాలాలు, షేరింగ్ ఆటోల డ్రైవర్లు ప్రయాణికులను నిలువునా దోచుకున్నారు. మీటర్‌రీడింగ్‌తో నిమిత్తం లేకుండా ఇష్టానుసారం వసూలు చేశారు. నేడు కార్మిక సంఘాల రాస్తారోకో: ఆటోకార్మికుల నిరవధిక సమ్మెకు మద్దతుగా ప్రధానకార్మిక సంఘాలు ఆదివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో రాస్తారోకో చేపట్టనున్నాయి. ఆటోబంద్ మరింత ఉధృతం కాకముందే ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జేఏసీ ప్రతినిధులు వెంకటేశం, సత్తిరెడ్డి, తదితరులు విజ్ఞప్తి చేశారు. -
ఆగిన ఆటో
-
ఆగిన ఆటో
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఆటో రిక్షాకు బ్రేకులు పడ్డాయి. ఆటోసంఘాల జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి సుమారు లక్షా 20 వేల ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరవధిక సమ్మె కొనసాగించనున్నట్లు జేఏసీ ప్రతినిధులు వెంకటేశం, నరేందర్, సత్తిరెడ్డి, కిరణ్ స్పష్టం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనందున తమ ఆందోళనను ఉధృతం చేయనున్నట్లు వారు తెలిపారు. సమ్మెకు దూరం బీఎంఎస్, ఆటోసంఘాల నాన్ పొలిటికల్ జేఏసీ తదితర సంఘాలు సమ్మెకు దూరంగా ఉన్నట్లు ప్రకటించాయి. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో సమ్మె అర్థరహితమని ఆ సంఘాలు పేర్కొన్నాయి.