మోడల్‌స్కూల్‌లో విచారణ జరుపుతున్న ఎంఈవో వెంకటేశం
సాక్షి, నాగిరెడ్డిపేట: మండలంలోని గోపాల్‌పేట మోడల్‌స్కూల్ హాస్టల్ నుంచి నందిని అనే పదో తరగతి విద్యార్థిని గెంటివేతపై మంగళవారం ఎంఈవో ఎ.వెంకటేశం పాఠశాలకు చేరుకొని విచారణ జరిపారు. విద్యార్థిని నందినితోపాటు ఆమె తండ్రి పీర్యాను పాఠశాలకు పిలిపించి మాట్లాడారు. కేర్‌టేకర్ తీరును నిరసిస్తూ తన కూతురిని పాఠశాలకు పంపబోనని, ఈ విషయమై తాను కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేస్తానని విద్యార్థిని తండ్రి పీర్యా ఎంఈవోతో పేర్కొన్నారు.
దీంతో హాస్టల్ కేర్‌టేకర్ నిర్మలతో మాట్లాడారు. తండ్రి తప్పుచేయడంతోనే అతని కూతురిని హాస్టల్ నుంచి తీసివేసినట్లు ప్రిన్సిపాల్ శ్రీలత పేర్కొన్నారు. తండ్రి తప్పుచేస్తే కూతురికి శిక్ష వేయడం సరికాదని, నందినికి తిరిగి హాస్టల్‌లో సీటు కేటాయించాలని ఎంఈవో ఆదేశించారు. సిబ్బంది సంయమనం పాటించాలని సూచించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని పీర్యాకు నచ్చజెప్పి నందినిని హాస్టల్‌లో ఉంచేందుకు ఎంఈవో ఒప్పించారు. ఆయన వెంట సీఆర్పీ రాజయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment