student hostel
-
వార్డెన్ నిర్వాకం.. విద్యార్థి మృతితో విషాదంలో పేరెంట్స్
సాక్షి, కరీంనగర్: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ ఆదేశాల మేరకు హాస్టల్ ఆవరణలో ఉన్న బావిలోని చెత్తను తీస్తూ విద్యార్థి మృతిచెందాడు. దీంతో, విద్యార్థి పేరెంట్స్ కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ సెయింట్ ఆంటోని స్కూల్ 8వ తరగతి చదువుతున్న శ్రీకర్ బావిలో పడి మృతిచెందాడు. అయితే, ఆదివారం కావడంతో బావిలోని చెత్తను క్లీన్ చేయమని వార్డెన్ విద్యార్థులకు చెప్పాడు. దీంతో, బావిలోకి నలుగురు విద్యార్థులు దిగి క్లీన్ చేశారు. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థులకు ఈత రావడం, శ్రీకర్‌కు ఈత రాకపోవడంతో అతడు బావిలో పడి చనిపోయాడు. మిగతా ముగ్గురు విద్యార్థులు వెంటనే ఈ విషయం వార్డెన్‌కు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, రెస్క్యూ టీమ్ సాయంతో శ్రీకర్ మృతదేహాన్ని బయటకు తీశారు. విద్యార్థి మృతిచెందిన విషయం అతడి పేరెంట్స్‌కు తెలియడంతో హుటాహుటిన హాస్టల్‌కు చేరుకున్నారు. తమ కుమారుడికి మృతికి కారణమైన వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
హాస్టల్ విద్యార్థుల స్థితి మెరుగు పడాలంటే...
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురు కులాలు, కేజీబీవీలు, సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఆహారం విషతుల్యమైన ఘటనలు దిన దినం పెరిగిపోతున్నాయి. తాగే నీళ్ళు కూడా కలుషితమై పిల్లలకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. దీంతో విద్యా ర్థులూ, వారి తల్లిదండ్రులూ భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి నవంబర్ మొదటి వారం వరకు గడిచిన పది నెలల్లో ఇలాంటి ఘటనలు 34 జరుగగా, ఇందులో 2,147 మంది విద్యార్థులు అస్వస్థ తకు గురైనట్లు ‘హక్కు ఇనిషియేటివ్’ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడ యింది. ఇవి కూడా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా తమ సంస్థ వెళ్లి సేకరించిన వివరాలేననీ, బయటికి రాని ఫుడ్ పాయిజ నింగ్ ఘటనలు అనేకం ఉన్నాయనీ ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. రాష్ట్రంలోని గురుకులాలకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని సరైన ప్రదేశంలో నిల్వ చేయకపోవడం కారణంగా పురుగులు పడుతున్నాయి. ఆ బియ్యాన్ని సరిగా కడుగక పోవడం, పాడైపోయిన కూరగాయలు వండటం, వంటగది శుభ్రంగా ఉంచకపోవడంతో వండే భోజనంలో బొద్దింకలు, బల్లులు పడి ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా వసతి గృహాల్లోనే ఉండి పర్యవేక్షణ జరుపవలసిన వార్డెన్లు స్థానికంగా ఉండకపోవటం వలన... వంట మనుషులు నిర్లక్ష్యంగా వంటచేస్తున్నారు. దీంతో పిల్లలు తినే ఆహారం, నీరు విషతుల్యం అవుతున్నాయని అస్వస్థతకు గురైన విద్యార్థులు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లాలోని గిరిజన మహిళా కళాశాల ఘటన నుంచి నవంబరు నెలలో సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌లోని కేజీబీవీలో అటుకుల అల్పాహారంలో పురుగులు వచ్చిన ఘటన వరకూ... రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 34 ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగినట్లు హక్కు ఇనిషియేటివ్ సంస్థ తన నివేదికలోవెల్లడించింది. ఇందులో ఆదిలాబాద్, మెదక్, వరంగల్, మహబూబాబాద్, గద్వాల, నల్లగొండ, వికారాబాద్‌లో రెండు చొప్పున... సిద్ధిపేట, ఆసిఫాబాద్ , నిర్మల్, సంగారెడ్డిలో మూడు చొప్పున; మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, నారాయణపేట, ఖమ్మం, జనగామ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఘటనలు జరిగాయి. ఇందులో అత్యధికంగా జులై 15న బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఘటనలో 150 మంది వరకు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, సిద్ధిపేట మైనారిటీ గురుకులంలో 120 మందీ, ఖమ్మం జిల్లాలో తనికెళ్ళ గిరిజన మహిళా డిగ్రీ కాలేజీలో 100 మందీ, గట్టు మండలం బాలికల గురుకుల విద్యాలయంలో వంద మంది వరకూ అస్వస్థ తకు గురై ఆస్పత్రి పాలయ్యారు. రాష్ట్రంలో అన్ని సాంఘిక సంక్షేమ, గురుకుల, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల వార్డెన్లకు ‘ముఖ చిత్ర గుర్తింపు హాజరు యాప్ (ఫేస్ రికగ్నిషన్ ఎటెండెన్స్ యాప్) ప్రవేశ పెట్టాలి. వార్డెన్ వసతి గృహంలోనే ఉండి వంట గది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి, నాణ్యమైన నిత్యావసరాలు, కూరగాయలతో ఆహారం వండించాలి. మిషన్ భగీరథ తాగు నీళ్ళు తెప్పించాలి. విద్యార్థులతో కలిసి మూడు పూటలా భోజనం చేయాలి. అంతే గాకుండా అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. ఆ దిశగా ప్రభుత్వం అడు గులు వేస్తుందని ఆశిద్దాం. (క్లిక్ చేయండి: వారి పోరాటం ఫలించాలంటే...) - నల్లెల్ల రాజయ్య వరంగల్ పౌర స్పందన వేదిక ప్రధాన కార్యదర్శి -
‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య
భవానీపురం(విజయవాడ పశ్చిమ): విజయవాడ రూరల్ మండలం నల్లకుంటలోని నారాయణ జూనియర్ కాలేజ్ హాస్టల్లో మంగళవారం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గట్ల శివకోటిరెడ్డి కుమారుడు రామాంజనేయరెడ్డి (16) నల్లకుంట నారాయణ క్యాంపస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం రామాంజనేయరెడ్డి క్లాస్‌కు వెళ్లకపోవడంతో మధ్యాహ్నం 12.30 సమయంలో కాలేజీ సిబ్బంది హాస్టల్‌కు వెళ్లి చూడగా రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వారు వెంటనే అతన్ని కిందకి దింపి గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. విద్యార్థి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాలేజీ సిబ్బంది మృతుని తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. రామాంజనేయరెడ్డి మృతిపై అతని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆంజనేయరెడ్డి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. -
యూనివర్సిటీలో విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం
-
ఏలూరులో మెడికో సూసైడ్ కలకలం
-
ఉన్నది 200 మంది.. కానీ రెండే గదులు
సాక్షి, నర్సీపట్నం(విశాఖపట్నం) : కస్తూర్బా పాఠశాలను తొలుత మాకవరపాలెం ప్రాథమిక పాఠశాలలో అరకొర సౌకర్యాల మధ్య ప్రారంభించారు. దీంతో ఏళ్ల తరబడి విద్యార్థులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో 2015లో భీమబోయినపాలెం సమీపంలో కొండ ప్రాంతంలో కొత్త భవనం నిర్మించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషించారు. ఇక నుంచి తమకు వసతి సమస్య తప్పినట్టేనని వారు సంబరపడ్డారు. కానీ ఈ కొత్త భవనంలో విద్యార్థులకు సరిపడిన గదులు లేకపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నారు. ఈ భవనం ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా ఇప్పటికీ అదనపు గదులు నిర్మించక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నాలుగేళ్లయినా అలాగే.. ఈ పాఠశాలకు ప్రస్తుతం తొమ్మిది గదులు ఉన్నాయి. వీటిలో ఐదింటిలో తరగతులు, ఒక గదిలో ఆఫీస్, మరో గదిలో కంప్యూటర్, స్టాఫ్ రూమ్‌గా వినియోగిస్తున్నారు. ఇక మిగిలిన రెండు గదులు మాత్రమే 200 మంది విద్యార్థులు రాత్రి సమయంలో నిద్రించేందుకు ఉన్నాయి. ఇవి చాలక విద్యార్థులు ఉన్న వాటిలోనే తమ సామగ్రిని పెట్టుకుని ఇరుకుగా పడుకుంటున్నారు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకునేవారు లేకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం మరో రెండు గదులు డార్మెటరీకి, మూడు గదులు గ్రంథాలయం, ల్యాబ్‌కు అవసరం. మొత్తం ఐదు గదులు మంజూరు చేస్తే ఇక్కడి విద్యార్థులకు, సిబ్బందికి పూర్తిగా ఇబ్బందులు తొలగిపోతాయి. అయ్యన్న హామీ ఇచ్చినా.. ఈ పాఠశాలను ప్రారంభించిన అప్పటి మంత్రి అయ్యన్న కొండ ప్రాంతంలో నిర్మించడమేంటని అధికారులను ప్రశ్నించారు. అయితే భవనానికి రక్షణగా చుట్టూ ప్రహరీ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. దీంతోపాటు ప్రధాన రహదారి నుంచి పాఠశాల వరకు తారురోడ్డు నిర్మాణానికి కూడా ప్రతిపాదించాలన్నారు. గదుల కొరత కారణంగా మరో మూడు అదనపు గదులను నిర్మించేందుకు నిధులు మంజూరు చేయిస్తామని కస్తూర్బా పాఠశాలలో నిర్వహించిన సమావేశంలోనే అప్పటిలో ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల అనంతరం రోడ్డు పనులు చేపట్టారు. ఇక ప్రహరీ నిర్మాణం జరగలేదు. ఇక అదనపు గదుల హామీ ఇప్పటికీ అమలు చేయకపోవడంతో నిత్యం విద్యార్థులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
వసతి లేని గృహాలు !
ఖమ్మంమయూరిసెంటర్: రెండు రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచే ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలను సైతం ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. రెండు నెలలుగా విద్యార్థులు లేక మూసి ఉన్న హాస్టళ్లను శుభ్రం చేయడంతో పాటు వసతిగృహాల్లో నెలకొన్న ఇతర సమస్యలను పరిష్కరించాలి. అయితే జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. వాటి పరిష్కారానికి అధికారులు చేపడుతున్న చర్యలు శూన్యం. ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను గుర్తించి, మరమ్మతులకు అంచనాలు రూపొందించాలని ఆ శాఖ అధికారులు ఇంజనీరింగ్ శాఖకు లేఖలు రాసి, తమ పని అయిపోయిందన్నట్టుగా చేతులు దులుపుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్యా గుర్తించలేదు. బీసీ వసతిగృహాల్లోనూ సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. గతంలో ‘సాక్షి’ నిర్వహించిన హాస్టళ్ల సందర్శనలో బీసీ వసతి గృహాల్లో.. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలోని వసతిగృహాల్లోనే అత్యధిక సమస్యలు దర్శనమిచ్చాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రతిపాదనలు చేస్తున్నామని అధికారులు చెపుతున్నా.. ఇప్పటి వరకు ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు పనులు చేపట్టినప్పటికీ కొన్ని కూడా పూర్తి కాలేదు. హాస్టళ్ల కిటికీలకు తలుపులు కూడా లేవు. మరో రెండు రోజుల్లో విద్యార్థులు వసతిగృహాలకు వస్తున్నా.. పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో సమస్యలు పరిష్కారమవుతాయా అనే ప్రశ్న విద్యార్థి సంఘాల్లో తలెత్తుతోంది. ప్రారంభం కాని మరమ్మతులు.. విద్యా సంవత్సరం ప్రారంభానికి రెండు రోజులే సమయం ఉండడం, వేసవి సెలవులు ముగించుకొని నూతనోత్సాహంతో ఇంటి నుంచి వసతిగృహాలకు వచ్చే విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలుకనున్నాయి. ప్రతి ఏడాది వేసవిలోనే హాస్టళ్లలో సమస్యలను గుర్తించి, మరమ్మతుల కోసం ఆయా శాఖల అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపించి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఎస్సీ వసతిగృహాల్లో సమస్యలను గుర్తించాలని ఇంజనీరింగ్ అధికారులకు లేఖలు పెట్టినా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేకపోవడంతో వసతిగృహాల్లో సమస్యలు తప్పేలా లేవు. బీసీ హాస్టళ్లలో సమస్యలను గుర్తించినా.. ఇంతవరకు మరమ్మతు చర్యలేమీ చేపట్టలేదు. ఇక గిరిజన వసతిగృహాల్లో సైతం సమస్యలకు కొదవలేదు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించినప్పటికీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ మూడు శాఖల వసతిగృçహాలు, ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య ప్రధానంగా ఉంది. అద్దె భవనాల్లో ఉన్న వసతిగృహాల పరిస్థితి మరీ దారుణంగా ఉందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆయా శాఖల సంక్షేమాధికారులు శ్రద్ధ చూపించకపోవడంతో మరమ్మతుల ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయం పొడిగించినా ఫలితం లేదు.. 2019 – 20 విద్యా సంవత్సరం జూన్ 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రభుత్వం ఈనెల 12న పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో వసతిగృహాల్లో సమస్యల పరిష్కారానికి కొద్ది సమయం దొరికిందని అధికారులు భావించినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వసతిగృహాల్లో సమస్యలివే.. వసతిగృహాల ప్రారంభంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యల్లో మొదటిది మరుగుదొడ్ల శుభ్రత. వసతిగృహాలు ప్రతి రోజు నిర్వహించే సమయంలోనే వీటిని శుభ్రం చేసే వారు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు రెండు నెలలు మూసి ఉంచిన అనంతరం తెరుస్తుండడంతో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మరో ప్రధాన సమస్య తాగునీరు. గత్యంతరం లేని స్థితిలో విద్యార్థులు స్నానాలకు ఉపయోగించే నీటినే తాగిన విషయం గతంలో అనేక సార్లు బహిర్గతం అయింది. ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఈ సమస్య మళ్లీ ఉత్పన్నమయ్యేలా ఉంది. ఇక వాడుకునే నీరు సైతం అపరిశుభ్రంగానే ఉంది. జిల్లాలో వసతిగృహాల సంఖ్య ఇలా.. జిల్లాలో ఎస్సీ వసతిగృహాలు 50 ఉండగా వాటిలో కళాశాల స్థాయి 11 ఉన్నాయి. ఇందులో బాలురు 6, బాలికలకు 5 ఉన్నాయి. పాఠశాల స్థాయి వసతిగృహాలు 39 ఉండగా వీటిలో బాలురకు 25, బాలికలకు 14 కేటాయించారు. ఇందులో నేలకొండపల్లి బారుల వసతి గృహం ప్రైవేటు భవనంలో కొనసాగుతోంది. బీసీ వసతిగృహాలు 33 ఉండగా కళాశాల స్థాయి 10 ఉన్నాయి. ఇందులో బాలురవి 5, బాలికలవి 5. పాఠశాల స్థాయి వసతిగృహాలు 23 ఉండగా బాలురకు 18, బాలికలకు 5 కేటాయించారు. ఇందులో 10 హాస్టళ్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 19 వసతిగృహాలు ఉండగా కళాశాల స్థాయి 12 ఉన్నాయి. వీటిలో బాలురకు 6, బాలికలకు 6 కేటాయించారు. పాఠశాల స్థాయిలో 7 ఉండగా బాలురకు 5, బాలికలకు 2 ఉన్నాయి. ఇక ఆశ్రమ పాఠశాలలు 11 ఉండగా బాలురకు 4, బాలికలకు 7 కేటాయించారు. వీటిలో 4 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సమస్యలు గుర్తించడంలో నిర్లక్ష్యం.. వసతిగృహాల్లో సమస్యలను గుర్తించడంలో సంక్షేమశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యా సంవత్సరం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏ వసతిగృహంలో చూసినా ఏదో ఒక సమస్య విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. గత కొన్ని రోజులుగా అధికారులకు వినతిపత్రం అందించినా పట్టించుకోవడం లేదు. – ఎన్.ఆజాద్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సమస్యలు గుర్తించినా మరమ్మతులు లేవు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వసతిగృహాల సందర్శన నిర్వహించి సమస్యలను గుర్తించాం. వాటిని నివేదిక రూపంలో తయారు చేసి ఆయా శాఖల అధికారులకు అందించాం. సమస్యలను వారికి విన్నవించినా పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నారు. గుర్తించిన సమస్యలను మరమ్మతులు చేసి పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. – టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -
అగ్ని పరీక్ష
-
మోడల్ స్కూల్ ఎదుట ధర్నా
పర్వతగిరి: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గురువారం ఉరేసుకుని మోడల్ స్కూల్ వసతి గృహంలో మృతి చెందిన మడ్డి ప్రసన్న మృతిపై మోడల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రసన్న బంధువులు శుక్రవారం మోడల్ స్కూల్ ఎదుట ప్రసన్న మృతదేహంతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రసన్న మృతికి కారకులైన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, వారికి సహకరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన ధర్నా, రస్తారోకోలో రెండు వేల మంది పాల్గొని నినాదాలు చేశారు. మోడల్ స్కూల్ యాజమాన్యంపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయని నేటి వరకు యాజమాన్యంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. పాఠశాలలో తరగతి గదులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు నినాదాలు చేశారు. తమ విద్యార్థులకు రక్షణ కరువైందని ప్రభుత్వం మోడల్ స్కూల్ విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసన్నకు చదువు తప్ప మరో ద్యాస తెలియదని ప్రసన్న మృతికి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు మరో కారణం చూపించే ప్రయత్నం చేస్తున్నారని ప్రసన్న మృతిపై వాస్తవాలను తెలియజేయాలన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ప్రసన్న మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
తండ్రి తప్పుచేశాడని..కూతురిని గెంటేశారు.
సాక్షి, నాగిరెడ్డిపేట: మండలంలోని గోపాల్పేట మోడల్‌స్కూల్ హాస్టల్ నుంచి నందిని అనే పదో తరగతి విద్యార్థిని గెంటివేతపై మంగళవారం ఎంఈవో ఎ.వెంకటేశం పాఠశాలకు చేరుకొని విచారణ జరిపారు. విద్యార్థిని నందినితోపాటు ఆమె తండ్రి పీర్యాను పాఠశాలకు పిలిపించి మాట్లాడారు. కేర్‌టేకర్ తీరును నిరసిస్తూ తన కూతురిని పాఠశాలకు పంపబోనని, ఈ విషయమై తాను కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేస్తానని విద్యార్థిని తండ్రి పీర్యా ఎంఈవోతో పేర్కొన్నారు. దీంతో హాస్టల్ కేర్‌టేకర్ నిర్మలతో మాట్లాడారు. తండ్రి తప్పుచేయడంతోనే అతని కూతురిని హాస్టల్ నుంచి తీసివేసినట్లు ప్రిన్సిపాల్ శ్రీలత పేర్కొన్నారు. తండ్రి తప్పుచేస్తే కూతురికి శిక్ష వేయడం సరికాదని, నందినికి తిరిగి హాస్టల్లో సీటు కేటాయించాలని ఎంఈవో ఆదేశించారు. సిబ్బంది సంయమనం పాటించాలని సూచించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని పీర్యాకు నచ్చజెప్పి నందినిని హాస్టల్లో ఉంచేందుకు ఎంఈవో ఒప్పించారు. ఆయన వెంట సీఆర్పీ రాజయ్య ఉన్నారు. -
విద్యార్థుల హాస్టల్ గదిలో గంజాయి ప్యాకెట్లు
-
రూపాయి తీస్కో.. పండగ చేస్కో!
* జెండావందన వేడుకల నిర్వహణ అయోమయం * అరకొర నిధులతో ఉపాధ్యాయుల అవస్థలు * స్వీట్ కోసం ప్రతీ విద్యార్థికి ఒక్క రూపాయే.. * ఏళ్లనాటి పాత టారిఫ్‌లే అమలవుతున్న వైనం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఇంద రూపాయి తీసుకో.. నోరు తీపి చేసుకొని పండగ చేసుకో పో’.. అంటోంది ప్రభుత్వం. ‘ఏంటీ రూపాయికి ఏం వస్తుంది, పీచు మిఠాయి కూడా రాదు.. అనుకుంటున్నారా? అది నిజమే కానీ, ప్రభుత్వం ఇంతే ఇస్తుంది మరి. వివరాలలోకి వెళ్తే గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఆయా పాఠశాలల్లో, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులకు మిఠాయిలు పంచుతారు. హాస్టల్ విద్యార్థులకు ప్రతిరోజూ ఇచ్చే మెనూకు అదనంగా పండుగల రోజున మిఠాయి కూడా ఇస్తారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు అన్ని కలుపుకొని 168 వరకు ఉన్నాయి. వీటిలో 16 వేల మంది వరకు విద్యార్థులు అభ్యసిస్తున్నారు. హాస్టళ్లలో ఉన్న వారికి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఇచ్చేది మాత్రం కేవలం రూ.1 మాత్రమే. దాదాపు 35 ఏళ్ల కిందట, అంటే ఒక్క రూపాయికి పావుకిలో నెయ్యి, పావుకిలో చెక్కర, ఇతర పదార్ధాలు వచ్చే సమయంలో తీసుకున్న నిర్ణయం అన్న మాట. తరాలు మారినా ఈ టారిఫ్ మాత్రం మారలేదు. ఇప్పుడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోయింది. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటాయి. రూపాయి పెడితే బజార్లలో సైకిల్ మీద అమ్మే పీచు మిఠాయి కూడా రావడం లేదు. కనీసం 20 గ్రాముల స్వీటు, 5 గ్రాముల కార తీసుకోవాలన్నా కనీసం రూ.10 ఖర్చు అవుతున్నాయి. ఈ లెక్కన ప్రతీ హాస్టల్లో రూ.1,500 వరకు, పాఠశాలలో రూ.4 నుంచి 6.వేల వరకు ఖర్చు అవుతుంది. ఇక పాఠశాలల్లోనైతే మిఠాయిల కోసం ప్రత్యేకంగా ఆ.. ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. జిల్లాలో చిన్న, పెద్ద స్కూళ్లు కలుపుకుని దాదాపు 1,568 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3.23 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీళ్లకు కూడా జెండా వందనం రోజున స్వీట్ ఇస్తున్నారు, కానీ స్వీట్ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. దీంతో పాఠశాల గోడలకు సున్నం వేయడం కోసమో, రిపేర్ కోసమో ఇచ్చే స్కూల్ మెయింటనెన్స్ నుంచి గాని, స్టేషనరీ ఖర్చుల కోసం స్కూల్ గ్రాంటు నిధుల నుంచి గాని ఆయా పాఠశాలల హెచ్ఎంలు మిఠాయిల కోసం ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వమైనా బూజుపట్టిన పాత టారిఫ్‌ను తొలగించి.. కొత్త టారిఫ్‌ను అమల్లోకి తేవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
బాలికపై అకృత్యం
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : కంచే చేను మేసింది. ఏలూరు నడిబొడ్డున మరో మృగాడి అకృత్యం వెలుగుచూసింది. ముందూవెనుకా ఎవరూ లేకపోవడంతో హాస్టల్లో తలదాచుకుంటున్న ఓ అనాథ బాలికపై గేట్మెన్ అత్యాచారానికి ఒడిగట్టాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వ్యక్తి ఇలాంటి దురాగతానికి పాల్పడ్డాడని తెలిసి జనం నివ్వెరపోయూరు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థినులకూ భద్రత లేదనే విషయూన్ని ఈ వ్యవహారం మరోసారి బట్టబయలు చేసింది. వివరాల్లోకి వెళితే... ఏలూరు సత్రంపాడుకు చెందిన బాలిక తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే వుృతిచెందారు. అనాథగా మారిన ఆ బాలికను స్థానికులు చైల్డ్‌లైన్ సంస్థకు అప్పగించారు. అనంతరం ఆమె గుండుగొలనులోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో 8 నుంచి 10వ తరగతి వరకు చదివింది. చదువులో రాణిస్తుండడంతో సెరుుంట్ థెరిస్సా వుహిళా డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలోని ‘ఆశాకిరణం’లో బాలికను చేర్చుకున్నారు. అనంతరం ఏలూరు అమీనాపేటలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చేరిన ఆమె స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అక్టోబర్‌లో దసరా సెలవులు ఇవ్వటంతో విద్యార్థినులంతా ఇళ్లకు వెళ్లిపోయారు. అనాథ కావటంతో ఆ విద్యార్థిని వూత్రం హాస్టల్లోనే ఉండిపోయింది. ఇదిలావుండగా, గణపవరానికి చెందిన వుందలంక మోహనరావు ఏడాది క్రితం ఔట్‌సోర్సింగ్‌లో అదే హాస్టల్లో గేట్మెన్గా చేరాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాస్టల్లో ఒంటరిగా ఉంటున్న విద్యార్థినిపై కన్నేసిన మోహనరావు ఆమెపై అత్యాచారం జరిపాడు. ఈ విషయుం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. అప్పటినుంచి పలుమార్లు అత్యాచారం జరిపాడు. వారం రోజుల క్రితం ఆ విద్యార్థినికి ఒంట్లో బాగుండకపోవడంతో ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భం దాల్చినట్టు నిర్ధారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ వార్డెన్ జయంతితో కలిసి బాధితురాలు సోమవారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ కె.విజయుపాల్ కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న మోహనరావు అప్పటికే పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనధికారికంగా విధులు? మోహనరావు వివరాల కోసం ‘న్యూస్‌లైన్’ ప్రయత్నించగా... అతడిని రెండు నెలల కిందటే విధుల నుంచి తొలగించామని హాస్టల్ అధికారులు చెబుతున్నారు. అతడు మాత్రం అనధికారికంగా హాస్టల్లోనే పనిచేస్తున్నట్టు సహచర సిబ్బంది తెలిపారు. విధుల నుంచి తొలగించిన గేట్‌మెన్‌ను హాస్టల్లోకి మళ్లీ ఎలా రానిస్తున్నారే ప్రశ్నకు సమాధానం కరువైంది. గేట్మెన్ ఎవరి ప్రమేయంతో హాస్టల్ వద్ద ఉంటున్నాడో తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.