సాక్షి, కరీంనగర్: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ ఆదేశాల మేరకు హాస్టల్ ఆవరణలో ఉన్న బావిలోని చెత్తను తీస్తూ విద్యార్థి మృతిచెందాడు. దీంతో, విద్యార్థి పేరెంట్స్ కన్నీటిపర్యంతమయ్యారు.
వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ సెయింట్ ఆంటోని స్కూల్ 8వ తరగతి చదువుతున్న శ్రీకర్ బావిలో పడి మృతిచెందాడు. అయితే, ఆదివారం కావడంతో బావిలోని చెత్తను క్లీన్ చేయమని వార్డెన్ విద్యార్థులకు చెప్పాడు. దీంతో, బావిలోకి నలుగురు విద్యార్థులు దిగి క్లీన్ చేశారు. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థులకు ఈత రావడం, శ్రీకర్‌కు ఈత రాకపోవడంతో అతడు బావిలో పడి చనిపోయాడు.
మిగతా ముగ్గురు విద్యార్థులు వెంటనే ఈ విషయం వార్డెన్‌కు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, రెస్క్యూ టీమ్ సాయంతో శ్రీకర్ మృతదేహాన్ని బయటకు తీశారు. విద్యార్థి మృతిచెందిన విషయం అతడి పేరెంట్స్‌కు తెలియడంతో హుటాహుటిన హాస్టల్‌కు చేరుకున్నారు. తమ కుమారుడికి మృతికి కారణమైన వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment