timmapur
-
వార్డెన్ నిర్వాకం.. విద్యార్థి మృతితో విషాదంలో పేరెంట్స్
సాక్షి, కరీంనగర్: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ ఆదేశాల మేరకు హాస్టల్ ఆవరణలో ఉన్న బావిలోని చెత్తను తీస్తూ విద్యార్థి మృతిచెందాడు. దీంతో, విద్యార్థి పేరెంట్స్ కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ సెయింట్ ఆంటోని స్కూల్ 8వ తరగతి చదువుతున్న శ్రీకర్ బావిలో పడి మృతిచెందాడు. అయితే, ఆదివారం కావడంతో బావిలోని చెత్తను క్లీన్ చేయమని వార్డెన్ విద్యార్థులకు చెప్పాడు. దీంతో, బావిలోకి నలుగురు విద్యార్థులు దిగి క్లీన్ చేశారు. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థులకు ఈత రావడం, శ్రీకర్‌కు ఈత రాకపోవడంతో అతడు బావిలో పడి చనిపోయాడు. మిగతా ముగ్గురు విద్యార్థులు వెంటనే ఈ విషయం వార్డెన్‌కు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, రెస్క్యూ టీమ్ సాయంతో శ్రీకర్ మృతదేహాన్ని బయటకు తీశారు. విద్యార్థి మృతిచెందిన విషయం అతడి పేరెంట్స్‌కు తెలియడంతో హుటాహుటిన హాస్టల్‌కు చేరుకున్నారు. తమ కుమారుడికి మృతికి కారణమైన వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
బురఖా ధరించి కోర్టుకు వచ్చిన వ్యక్తి.. ఎందుకంటే..?
సాక్షి, కరీంనగర్: భార్య తనపై పెట్టిన కట్నం వేధింపుల కేసులో కోర్టు వాయిదాలకు నిందితుడు బుధవారం బురఖా వేసుకొని జిల్లా కోర్టు ఆవరణలోని పీసీఆర్ కోర్టుకు హాజరయ్యేందుకు రావటం సంచలనం రేపింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన పల్లె శ్రీనివాసరెడ్డిపై అతడిభార్య కట్నం వేధింపుల కేసు పెట్టింది. వాయిదాలకు కోర్టుకు హాజరవుతున్నాడు. మధ్యలో ఓ వాయిదాకు హాజరు కాకపోవడంతో కోర్టు అతడిపై వారెంట్ జారీ చేసింది. భార్య తరఫువారితో ప్రాణభయం ఉండటం, వారెంట్‌పై పోలీసులు పట్టుకోకుండా ఉండేందుకు బురఖా ధరించి కోర్టుకు వచ్చాడు. కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. టూటౌన్ పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనివెంట తండ్రి, తల్లి, చెల్లి రాగా.. పోలీసులు అరెస్టు చేయడంతో తండ్రి మల్లారెడ్డి వెంటతెచ్చుకున్న పురుగుల మందు తాగి కిందపడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. తరువాత తనపై ఉన్న వారెంటును తొలగించుకునేందుకు శ్రీనివాసరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోగా కోర్టు అనుమతి ఇచ్చింది. తన భార్య తప్పుడు కేసు పెట్టి ఇబ్బందికి గురి చేస్తోందని, ప్రాణ భయం ఉండడంతో ఇలా బురఖా ధరించి వచ్చానని శ్రీనివాస్‌రెడ్డి ఏడ్వడం కలవరపరిచింది. (క్లిక్: ‘ఊపిరి’ పోసిన ఎస్ఐ) -
కరీంనగర్ జిల్లాలో మరో ఆరు కొత్త మండలాలు!?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో మరో ఆరు కొత్త మండలాలు రాబోతున్నాయి. ఒకప్పుడు 57 మండలాల సువిశాల జిల్లాగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ తరువాత నాలుగు కొత్త జిల్లాలుగా ఆవిర్భవించింది. మరో మూడుజిల్లాల్లోనూ పాత మండలాలు కలిశాయి. మొత్తానికి జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016లో కేవలం 16 మండలాలతో చిన్న జిల్లాగా కరీంనగర్ ఆవిర్భవించింది. చాలాకాలంగా కొన్ని గ్రామాలను మండలాలుగా చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఇటీవల సర్వే కూడా ప్రారంభించింది. చల్లూరు (వీణవంక), వావిలాల (జమ్మికుంట), గర్షకుర్తి (గంగాధర), గోపాలరావుపేట (రామడుగు), రేణికుంట (తిమ్మాపూర్) (పర్లపల్లి లేదా నుస్తులాపూర్ను సైతం పరిశీలిస్తున్నారని సమాచారం) గ్రామాలను కొత్త మండలాల కోసం గురువారం సర్వే నిర్వహించారు. గ్రామాల మ్యాప్‌లతో కొత్త మండలాల ప్రతిపాదనలను జిల్లా అధికారులకు అందజేసినట్లు తెలిసింది. వీటిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జగిత్యాలలో రాజారాంపల్లి జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలం రాజారాంపల్లి– ఎండపెల్లి గ్రామాలను కలిపి మండలకేంద్రంగా చేయాలని ప్రతిపాదనలను తాజాగా రెవెన్యూ అధికారులు పంపారు. ఇందుకోసం ధర్మారం మండలంలోని మూడు గ్రామాలను విలీనం చేసేందుకు గతంలోనే గ్రామపంచాయతీలు తీర్మానం కూడా చేశాయి. వీటిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉందని, ఆగస్టు 15 నాటికి ప్రతిపాదనలకు సంబంధించిన మండలాలపై అధికారిక ప్రకటన ఉండే అవకాశముందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజనలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న వేళ కొత్త మండలాల ప్రస్తావన ఆసక్తికరంగా మారింది. (క్లిక్: కాకతీయ ఉత్సవాలు అద్భుతం!) -
తిమ్మాపూర్ రైల్వే స్టేషన్: సీన్ ఉంటే.. సినిమా హిట్టే
సాక్షి, రంగారెడ్డి: తిమ్మాపూర్‌లో ఎనభై ఏళ్ల క్రితం ప్రారంభమైన రైల్వేస్టేషన్ సినిమా షూటింగ్‌లకు ప్రఖ్యాతి గాంచింది. అగ్ర హీరోలు మొదలుకుని జూనియర్ల వరకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో సినిమా షూటింగ్‌లు చిత్రీకరించడానికి చాలా ఆసక్తి కనబర్చుతారు. వీరి సెంటిమెంటే ఇందుకు కారణం. పెద్ద హీరోలు నటించే సినిమాల్లో రైల్వే స్టేషన్ సీన్ ఉందంటే ముందుగా తిమ్మాపూర్నే ఎంచుకుంటారు. ఇక్కడ ఒక చిన్న సీన్ చిత్రీకరించినా సినిమా హిట్ అవుతుందని హీరోలతో పాటు డైరక్టర్లలో గట్టి నమ్మకం ఉంది. చిరంజీవి నటించిన అల్లుడా మజాకా, వెంకటేశ్ నటించిన సూర్యవంశం, పవన్ కల్యాణ్ సినిమా జానీ, బాలకృష్ణ మూవీ సమరసింహారెడ్డితో పాటు పలు చిత్రాల్లోని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. ఆదర్శంగా.. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ మిగితా స్టేషన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. పరిశుభ్రత, మొక్కల పెంపకం, ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీలు, తాగునీరు, టాయిలెట్లు ఇలా ప్రయాణికులకు అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయి. స్టేషన్ మీదుగా నిత్యం 20 రైళ్లు రాకపోకలు కొనసాగిస్తుండగా 4 రైళ్లు ఇక్కడ ఆగుతాయి. పండగలు ఇతర రద్దీ దినాల్లో ఈ స్టేషన్ నుంచి నిత్యం వంద మందికిపైగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. రెండుసార్లు ఉత్తమ అవార్డులు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో పనిచేసే స్టేషన్ మాస్టర్లు, మేనేజర్‌తో పాటు ఇతర సిబ్బంది కృషి ఫలితంగా హైదరాబాద్ డివిజన్ పరిధిలో రెండుసార్లు ఉత్తమ స్టేషన్‌గా అవార్డులు వరించాయి. ప్రస్తుతం పాత భవనాలు, ఫ్లాట్‌ఫాంలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. -
మహిళపై యాసిడ్ దాడి.. కవిత దిగ్భ్రాంతి
మెట్పల్లి(కోరుట్ల) : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాలో బుధవారం రాత్రి భూక్య స్వాతి(25)పై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్‌తో దాడి చేశాడు. స్వాతి భర్త కొంత కాలం కింద మృతి చెందడంతో ఇద్దరు పిల్లలతో కలసి తిమ్మాపూర్ తండాలోని తల్లి గారింట్లో ఉంటోంది. ఇంట్లో జరిగే శుభకార్యానికి అవసరమైన వస్తువులు కొనేందుకు కుటుంబసభ్యులతో కలసి మెట్‌పల్లికి వెళ్లింది. తిరిగి రాత్రి బస్సులో తండాలోని బస్‌స్టాప్ వద్ద దిగారు. అదే సమయంలో అక్కడికి బైక్‌పై హెల్మెట్ ధరించి ఉన్న ఓ వ్యక్తి వచ్చి స్వాతి ముఖంపై యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ సంఘటనలో ఆమె కుడి వైపు చెంప, మెడ, భుజం వద్ద గాయాలయ్యాయి. వెంటనే ఆమెను వాహనంలో మెట్‌పల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్పీ సింధు శర్మకు ఫోన్ చేసి ఘాతుకానికి పాల్పడ్డ నిందితున్ని పట్టుకొని కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, తిమ్మాపూర్(మానకొండూర్): మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామానికి చెందిన జడ అనూష(21) మండల కేంద్రంలోని గర్ట్స్ హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతోంది. ఏడాది క్రితం తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన ఆది మల్లేష్‌తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా హాస్టల్లో ఉంటూనే చదువు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం అనారోగ్యంగా ఉందని కాలేజీకి వెళ్లకుండా గదిలోనే ఉంది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు అనూష రాకపోవడంతో పక్కగదిలో ఉంటున్న మరో విద్యార్థిని వెళ్లి చూడగా కనిపించలేదు. వెంటనే హాస్టల్ యజమానికి చెప్పడంతో కిటికీ పగలగొట్టి చూడగా బాత్రూంలో కాళ్లు కనిపించాయి. జారిపడి ఉంటుందని భావించారు. బాత్రూంకు గడియ పెట్టడంతో వెంటిలేటర్ నుంచి చూడగా ఉరేసుకుని ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, రూరల్ ఏసీపీ విజయసారధి, సీఐ మహేశ్‌గౌడ్, ఎల్ఎండీ ఎస్‌హెచ్‌వో నీతికపంత్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హైదరాబాద్‌లో ఉన్న అనూష భర్తను కూడా రప్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అత్తింటి వేధింపులే కారణం! అనూష మృతికి అత్తింటి వేధింపులే కారణమంటూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. ఏడాది క్రితం తమ కుమార్తెకు రూ.21 లక్షల కట్నం, బంగారం ఇచ్చి సాగనంపామని, సంవత్సరం గడవకముందే ఆడపడచు, అత్త వేధింపులు మొదలయ్యాయని, మరో రూ.పది లక్షలు అదనంగా వరకట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. అనూష మరిదికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. అతడికి రూ.25 నుంచి రూ.30 లక్షలు ఇస్తున్నారని, నీవు కూడా అంత కట్నం తీసుకురావాలని అనూషను ఒత్తిడి చేసినట్లు తల్లిదండ్రులు, బంధువులు వాపోతున్నారు. ఏసీపీ, సిఐ, తహసీల్దార్ మృతురాలి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తండ్రి జడ మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేష్‌గౌడ్ తెలిపారు. మర్తనపేటలో విషాదం కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామానికి చెందిన జడ అనూష ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. భర్త హైదరాబాద్‌లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. శుక్రవారం అనూష ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కరీంనగర్‌కు తరలివెళ్లారు. -
ప్లాస్టిక్ వాడబోమని ఒట్టేశారు..
సాక్షి, మోర్తాడ్ (నిజామాబాద్): పర్యావరణ పరిరక్షణ కు తిమ్మాపూర్ గ్రామస్తులు నడుం బిగించారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తిమ్మాపూర్‌ను ప్రకటించిన గ్రామస్తులు స్వాతంత్ర దినోత్సవం నుంచి తమ గ్రామంలో కఠిన నియమ నిబంధనలను అమలు చేస్తున్నారు. గతంలో ఏకగ్రీవ ఎన్నికలతో పొరుగు గ్రామాలకు ఆదర్శంగా నిలచిన తిమ్మాపూర్ ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, గ్లాసులను నిషేధించి అన్ని గ్రామాలకు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. తిమ్మాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ, సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు ఆస్మా నాయకత్వంలో గ్రామస్థులు తీసుకున్న నిర్ణయానికి వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తాము కూడా ప్లాస్టిక్ రహిత గ్రామంగా తిమ్మాపూర్‌కు గుర్తింపు తీసుకరావడానికి సహకరిస్తామని వ్యాపారులు హామీ ఇచ్చారు. కిరాణ దుకాణాలు, మాంసం విక్రయదారులు, హోటల్ యజమానులు, కూరగాయల వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లను వినియోగించబోమని స్పష్టం చేశారు. ప్లాస్టిక్‌కు బదులు బట్టతో తయారు చేసిన సంచులను వినియోగించడానికి అందరు సమ్మతం తెలిపారు. కాగా బట్ట సంచులను కొనుగోలు చేసి గ్రామస్తులకు ఉచితంగా పంపిణీ చేయడానికి గ్రామ పంచాయతీలో పాలకవర్గం తీర్మానం చేసింది. విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ను వినియోగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని పర్యావరణ ప్రేమికులు ఎంతో మొత్తుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ కవర్లను నిషేధించడం ఒక్కటే మార్గం అని గుర్తించి ఈ దశగా తిమ్మాపూర్ నిర్ణయం తీసుకుంది. తిమ్మాపూర్ గ్రామస్థులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇతర గ్రామాలను కూడా ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చి దిద్దాలని పలువురు సూచిస్తున్నారు. అందరి సమ్మతంతోనే.. తిమ్మాపూర్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి అందరు సమ్మతించారు. అందువల్లనే ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నాం. పర్యావరణ పరిరక్షణ కోసం అందరు ముందుకు రావాల్సి ఉంది. తిమ్మాపూర్‌ను జిల్లాలో ఆదర్శ గ్రామంగా ఉంచడానికి కృషి చేస్తు న్నాం. – గడ్డం చిన్నారెడ్డి, సర్పంచ్ గ్రామస్తుల సహకారం మరువలేనిది తిమ్మాపూర్‌ను ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి గ్రామస్థుల సహకారం మరువలేనిది. మేము తీసుకున్న నిర్ణయానికి అందరు సమ్మతించా రు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తాం. ప్రజలు ఇదే సహకారాన్ని కొనసాగించాలి. - ఆస్మా, ఎంపీటీసీ -
కరీంనగర్లో 'అతడు' సీన్ రిపీట్
సాక్షి, హైదరాబాద్ : మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో 2005లో వచ్చిన అతడు చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటీకీ చూసినప్పుడల్లా తెగ నవ్వులు తెప్పిస్తుంటాయి. అయితే అచ్చు అతడు చిత్రంలో సన్నివేశం తరహాలోనే ఓ సంఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. అతడు చిత్రంలో విలన్ తనికెళ్ల భరణి, కొడుకు బ్రహ్మజీతో .. మర్డర్ చేయాలంటే కత్తులుండాలి కానీ, క్వాలీసులు, సుమోలు ఎందుకురా భుజ్జీ.. అన్ని బండ్లు వద్దురా పెట్రోల్ రేట్లు పెరిగాయి కదా.. అందరూ కలిసి ఒకే బండిలో వెళ్లండిరా.. మీరెంత సైలెంట్‌గా ఉంటే మర్డర్ అంత వైలెంట్‌గా ఉంటది.. అంటూ చెబుతాడు ... తర్వాత సీన్లో అందరు రౌడీలు కలిసి ఇరుక్కుని మరీ ఒకే సుమోలో కూర్చోని వస్తారు.. సీరియస్ సిచ్చువేషన్‌లోనూ కామెడీ పూయించే ఆ సన్నివేశం అందరికీ గుర్తుండిపోతుంది. తెగ నవ్వు తెప్పించే అలాంటి సన్నివేశమే కరీంగర్‌లోని తిమ్మాపూర్‌లో చోటుచేసుకుంది. అబ్దుల్ అనే ఓ ఆటో డ్రైవర్ తన వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని తిమ్మాపూర్ వెళ్తూ పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత పోలీసులు ఆటోలో ఉన్న ప్రయాణికులను కిందకు దింపి లెక్కించారు. మహిళలు, పిల్లలు కలిపి మొత్తం 24 మంది ఒకే ఆటో నుంచి దిగడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రతపై బాధ్యత వహించాలని దీనికి సంబంధించి వీడియోను కరీంనగర్ సీపీ కమాలాసన్ రెడ్డి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
పెళ్లింట ఊహించని విషాదం
సాక్షి, తిమ్మాపూర్: కుమారుడి పెళ్లి శుభలేఖలు పంచిపెట్టి తిరిగివస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ముగ్గురు అక్కడికక్కడే కారులో ఇరుక్కుపోయి మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు వదిలారు. ప్రమాదంలో మృతి చెందిన రవీందర్ రావు, సరితాబాయి దంపతులు రామగుండం మండలం కుందనపల్లి సమీపంలోని స్వగృహ కాలనీ వాసులు. వీరి కుమారుడి వివాహం ఈ నెల 29న హైదరాబాద్‌లో జరగాల్సి వుంది. వీరు తమ అక్కా, బావతో కలిసి పెళ్లి కార్డులు పంపిణీ చేసి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భగీరథ పనులు పరిశీలించిన మంత్రి ఈటల
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం ఉదయం పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు ఉన్నారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
తిమ్మాపూర్ (కరీంనగర్ జిల్లా) : ఒంటిపై కిరోసిన్ పోసుకుని దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన తిమ్మాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. తిమ్మాపూర్‌కు చెందిన బత్తిన రాజు, ఆయన భార్య కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో గాయాలయ్యాయి. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
బాలిక కళ్లలోంచి కట్టెపుల్లలు!
-
బాలిక కళ్లలోంచి కట్టెపుల్లలు!
తిమ్మాపూర్: పదమూడేళ్ల బాలిక కళ్లల్లో నుంచి చిన్న, చిన్న కట్టెపుల్లలు రోజంతా వస్తూనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మం డలం రామకృష్ణకాలనీకి చెందిన దుర్శేటి రవి-లత కూతురు శివాని స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. గత మంగళవారం రాత్రి శివాని ఒక్కసారిగా తనకు కళ్లు నొప్పి పెడుతున్నాయని ఏడ్చింది. కంట్లో నుంచి చిన్నచిన్న కట్టెపుల్లలు బయటకు వచ్చాయి. కాసేపటికి ఆగి పోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి ఆదివారం రాత్రి 10 గంటలకు రెండు కళ్లు మళ్లీ నొప్పి పెడుతున్నాయని శివాని విలపించింది. కాసేపటికే రెండు కళ్ల నుంచి కట్టెపుల్లలు బయటకు వచ్చాయి. ఇలా రాత్రి నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు 32 పుల్లలు బయటకు వచ్చాయి. ఎడమ కన్ను నుంచి ఎక్కువగా వచ్చాయి. గ్రామస్తులు, మీడియా ప్రతినిధు ల సమక్షంలో సైతం బాలిక కళ్లలోంచి పుల్లలు బయటకు వచ్చాయి. కుటుంబసభ్యులు ఆం దోళనతో శివానిని సోమవారం సాయంత్రం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కంటి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుడు శ్రీధర్ పరీక్షించారు. కళ్ల నుం చి రాళ్లు రావడం సహజమేనని, కానీ, పుల్లలు రావడం అరుదైన సంఘటన అని చెప్పారు. -
‘తోటపల్లి’ని రద్దు చేయాలని రాస్తారోకో
తిమ్మాపూర్ : తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేయాలని కోరుతూ నిర్వాసిత గ్రామస్తులు మండలంలోని కొత్తపల్లిలో గురువారం రాస్తారోకో చేశారు. ఒగులాపూర్, ఇందుర్తి, వరుకోలు, ఎర్రగుంటపల్లె, రాంచంద్రాపూర్, గొట్లమిట్లకు చెందిన నిర్వాసితులు అరగంటపాటు ఆందోళన నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, టీపీసీసీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేసి సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సేకరించిన భూములను పరిశ్రమలకు ఇస్తే ఒప్పుకునేది లేదన్నారు. కాలువల ద్వారా నీరు ఇవ్వడం హర్షనీయమన్నారు. రిజర్వాయర్ నిర్మించాలని పట్టుబడుతున్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, బీజేపీల వైఖరి అనాలోచితమని ఆరోపించారు. ఎల్ఎండీ ఎస్సై సతీష్‌కుమార్ సిబ్బందితో వచ్చి రాస్తారోకోను విరమింపజేశారు. ఇందులో హుస్నాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బద్దం నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు ఆకుల మొగిలి, అందె సుజాత, టీఆర్ఎస్ నాయకులు, నిర్వాసితులు పాల్గొన్నారు. -
సర్పాల సయ్యాట చూడతరమా!
తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల సాయిబాబా ఆలయం ఎదుట నాగుపాము, జెరిపోతు శనివారం ఉదయం సయ్యాటలాడాయి. వాటిని చూడటానికి స్థానికులు ఆసక్తి చూపారు. పాముల సయ్యాటను చూస్తే మంచిది కాదని కొందరు.. వాటిని వెళ్లగొట్టొద్దని మరికొందరు దూరంగా వెళ్లిపోయారు. శుక్రవారం కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకోగా ఇరుగుపొరుగు వారు పాముల సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు. -
భార్యను చంపి, ఉరి వేశాడు..
మోర్తాడ్(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌లో ఓ వ్యక్తి భార్యను కొట్టి చంపి, ఆపై ఉరి వేశాడు. గ్రామానికి చెందిన బాజెత్తుల రాములుకు లక్ష్మి(27)తో వివాహమై ఆరేళ్లయింది. వీరికి సంతానం లేదు. గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసైన రాములు, భార్యను రోజూ వేధిస్తున్నాడు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో భార్యతో గొడవపడి, విచక్షణారహితంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక ఆమె చనిపోగా మృతదేహానికి ఉరివేశాడు. శనివారం ఉరిని తొలగించి, మంచంపై పడుకోబెట్టాడు. ఏమీ తెలియనట్లు తిరుగుతుండగా అతని తీరుపై చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. వారు వచ్చి చూడగా ఘోరం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
తిమ్మాపూర్: పెద్దపల్లి నియోజకవర్గంలోని డీ83, డీ86 కాలువలకు నీళ్లు వదిలి చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, టీడీపీ నాయకులతో కలిసి ఎల్ఎండీలోని సీఈ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.విజయరమణారావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండదని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కారు ఇప్పుడు రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. ఎస్సారెస్పీలో 21 టీఎంసీల నీరుంటే ఆయకట్టుకు నాలుగు తడుల నీరు ఇచ్చామని, ఇప్పుడు 16 టీఎంసీలుంటే తాగునీరు ఇవ్వ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు బాబ్లీని టీడీపీ అడ్డుకుంటే కేసీఆర్ విమర్శించి, తెలంగాణ వస్తే సస్యశ్యామలం చేస్తానని చెప్పాడని, మంత్రి హరీష్‌రావు సిద్దిపేటకు నీరు తీసుకెళ్తూ జిల్లా ప్రజలకు నీరివ్వడం లేదని విమర్శించారు. కేసీఆర్, హరీష్‌రావు, ఈటెల రైతులకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దద్దమ్మలని అన్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లికి నీరిచ్చినపుడు పెద్దపల్లికి ఎందుకివ్వరని ప్రశ్నించారు. చెరువుల్లో నీరు నింపితే భూగర్భజలాలు పెరిగి తాగునీటికి ఇబ్బంది ఉండదన్నారు. నీరు విడుదల చేస్తామని స్పష్టమైన హామీచ్చే వరకు లేచేది లేదని ఆఫీసు ఎదుట భైఠాయించారు. పోలీసులు చెప్పడంతో జీవీసీ 4 ఎస్ఈ అనిల్‌కుమార్ అక్కడకు చేరుకోగా ఆయనతో విజ యరమణారావు మాట్లాడారు. సీఈతో మాట్లాడిన ఎస్ఈ రెండు రోజుల తర్వాత నీటిని విడుదల చేస్తామని హామీవ్వడంతో శాంతించారు. నాలుగు రోజుల్లో నీరు ఇవ్వకుంటే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని, మెడలు వంచి తీసుకెళ్తామని ఆయన అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో మాట్లాడి గైక్వాడ్ నుంచి నీటిని తీసుకురవాలని కేసీఆర్‌కు ఆయ న సూచించారు. ధర్నాలో టీడీపీ నాయకులు గంట రాములు, పాల రామారావు, కొట్యాల శంకర్, వంగల తిరుపతిరెడ్డి, అక్కపాక తిరుపతి, రావుల రమేష్, రామంచ గోపాల్‌రెడ్డి, కంది అశోక్‌రెడ్డి, గోపు మల్లారెడ్డి, ఎల్లయ్య, రాములు, సురేందర్‌రెడ్డి, రాజిరెడ్డి, రైతులు, మహిళలు పాల్గొన్నారు. -
తిమ్మాపూర్‌లో పోలీసుల నాకాబందీ
తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు గురువారం నాకాబందీ నిర్వహించారు. మూడు మండలాల పోలీసులతో ఎస్ఐ దామోదర్ రెడ్డి ఈ తనిఖీలు చేపట్టారు. పలు గుడంబా కేంద్రాలను గుర్తించి ధ్వంసం చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి నాకాబందీ కొనసాగుతోంది. పోలీసుల హడావుడితో ఉలిక్కిపడిన గ్రామస్థులు నాకాబందీ విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. -
రబీకి గండమే!
తిమ్మాపూర్ : కరువు ఛాయల నేపథ్యంలో సాగుభూములు బీళ్లు గా మారనున్నాయి. గతేడాది నీటితో నిండు కుండల్లా కనిపించిన ప్రాజెక్టులు ఈసారి వర్షాభావంతో వెలవెలబోతున్నాయి. జిల్లా వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈసారి కనీస వరద నీరు కూడా చేరలేదు. ఫలితంగా రెండు పంటలకు నీరందించాల్సిన ప్రాజెక్టు... ఒక్క పంటకు కూడా నీరందిం చలేని దుస్థితిలో ఉంది. ఖరీఫ్ సీజన్లో పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోవడం తో ఖరీఫ్ చివరిదశలో ఒక తడి నీరు అం దించారు. ఈ రబీ సీజన్‌కు సాగునీరిచ్చే అవకాశమే లేదని సీఈ శంకర్ ప్రకటించారు. ఇప్పుడున్న నీరు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతుందని తెలి పారు. ఇప్పటికే బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో గోదావరి వరద నీరు వచ్చే అవకాశమే లేకుండా పో యింది. దీంతో రబీలో ఆయకట్టు మొత్తం బీడుగానే ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా బోర్లు, బావులు ఉన్నచోట లక్ష ఎకరాలు మాత్రమే సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
ఈ కారుకు పవనమే ఇంధనం
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఫైనలియర్ విద్యార్థులు పవనశక్తి(గాలి)తో నడిచే కారును తయారు చేశారు. కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులు సాయికిరణ్, అనిల్‌రెడ్డి, ప్రశాంత్, నరేశ్ బుధవారం కళాశాలలో ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా రూ.60 వేల ఖర్చుతో 45 రోజులపాటు శ్రమించి ఇంధనంతో పనిలేని, కాలుష్యం వెదజల్లని కారును వీరు రూపొందించారు. తాము తయారు చేసిన కారుకు ఉన్న ఫ్యాన్ తిరిగినప్పుడు.. ఆ గాలి యాంత్రికశక్తిగా మారి..విండ్ టర్బైన్ జనరేటర్ సిస్టం ద్వారా విద్యుచ్ఛక్తి తయారై ఎలక్ట్రిక్ (బ్యాటరీలు) మోటార్ల ద్వారా కారు నడుస్తుందని విద్యార్థులు వివరించారు. అయితే కారు ముందుగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో నడిస్తేనే ఫ్యాన్ తిరిగి విద్యుచ్చక్తి తయారవుతుందన్నారు. వాహనం ఎంత స్పీడ్‌గా వెళ్తే అంతగా బ్యాటరీ చార్జి అవుతుందని..ఎలాంటి కాలుష్యం వెదజల్లదని విద్యార్థులు తెలిపారు. -
21మంది జ్యోతిష్మతీ విద్యార్థులకు ఉద్యోగాలు
తిమ్మాపూర్, న్యూస్‌లైన్: మండలంలోని జ్యోతిష్మతీ ఇంజినీరింగ్ విద్యాసంస్థలో హైదరాబాద్‌కు చెందిన ఏజిల్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ కంపెనీ వారు శుక్రవారం నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో 20 మంది ఎంపికైనట్లు చైర్మన్ జె.సాగర్‌రావు తెలిపారు. కళాశాలలోని అన్ని గ్రూప్‌లకు చెందిన 140 మంది హాజరు కాగా రెండు రౌండ్లలో 20 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారన్నారు. వీరికి కంపెనీ ప్రతినిధి సృజన నియామక పత్రాలు అందించారు. విద్యార్థులు ఐటీ రిక్రూటర్స్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తారని ప్రతినిధి తెలిపారు. కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఇది 16వ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని, వీటిని విద్యార్థులు వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ వి.పూర్ణచంద్రరావు, డెరైక్టర్ వెంకట్రావు కోరారు. నేడు మరో రిక్రూట్మెంట్ డ్రైవ్ జ్యోతిష్మతీ విద్యాసంస్థల్లో శనివారం రైజ్ కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు కళాశాల ప్లేస్మెంట్ కో ఆర్డినేటర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. ఇందులో సీఎస్ఈ, ఐటీ ఇంజినీరింగ్ విద్యార్థులు, ఎంటెక్ కంప్యూటర్స్ విద్యార్థులు అర్హులని చెప్పారు. -
కేసీఆర్.. ఖబడ్దార్!
తిమ్మాపూర్, న్యూస్‌లైన్ : కేసీఆర్.. నువ్వు కాంగ్రెస్ గురించి ఒక్కటి కాదు, రెండు కాదు.. వంద తప్పుడు కూతలు కూశా వ్.. అయినా మిన్నకున్నాం.. కానీ దళితులను ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు.. ఖబడ్దార్ అంటూ మానకొండూర్ ఎ మ్మెల్యే ఆరెపల్లి మోహన్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. దొరతనాన్ని ఫాంహౌజ్‌లో, గడీల్లో చూపించుకోగానీ దళితులపై ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిం చారు. సోమవారం ఆయన మండలంలోని రామకృష్ణకాలనీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళితులెవరూ అడగకముందే తెలంగాణ రాష్ట్రానికి దళితుడినే సీఎం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు మాటమార్చడమెందుకని ప్రశ్నించారు. ఇది దళితులను అవమానపరచడమే అన్నారు. తెలంగాణ వస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో వి లీనం చేస్తానన్న ఆయన మాటకు కట్టుబడి ఉండకపోవడం ఆయన నైజమేమిటో తెలిసిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీ ఇంటికి వెళ్లి కృతజ్ఞత తెలిపి న ఆయన కాంగ్రెస్‌పై లేనిపోని మాటలు మాట్లాడడం తగదన్నారు. స్వాతంత్య్రం కోసం జైలుకెళ్లిన గాంధీ కుటుంబ సభ్యులు ఎవరూ పాలించడం లేదని, ఒక్క కేసీఆర్ కుటుం బంలో తప్ప ఉద్యమాలు నడిపించిన వారిలో కుటుంబ పాలన లేదన్నారు. దళితులపై దొరతనం చలాయిస్తే ఎదురుదాడికి దిగక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ కేసీఆర్ జాగీ ర్ అన్నట్లుగా మాట్లాడుతున్నారని, అమరుల త్యాగాలు, విద్యార్థులు, జేఏసీ నాయకులు, కుల సంఘాల ఆందోళనతో రాష్ట్రం వచ్చిందన్నారు. కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఉండి కరీంనగర్ జిల్లాకు, తెలంగాాణకు దమ్మిడిపైసా ఖర్చు చేయలేదని విమర్శించారు. మానకొండూర్ నియోజకవర్గంపై ఇతరుల పెత్తనం చూపేందుకు అభ్యర్థిని ఎందుకు పంపారని, ఇక్కడ దళితులు లేరా..అని ప్రశ్నించారు. ఇకనైనా కిలాడీ చంద్రశేఖర్‌రావు నాలుక దగ్గరపెట్టుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఆయన వెంట కేడీసీసీబీ డెరైక్టర్ దేవేందర్‌రెడ్డి, తదితర నాయకులున్నారు. -
ఆర్టీఏలో నిబంధనలు హుష్‌కాకి!
యూనిట్ కేంద్రాల్లో తిష్టవేసిన ఉద్యోగులు బదిలీ వద్దంటూ పైరవీలు అసంతృప్తిలో డీటీసీ ఆఫీసు సిబ్బంది తిమ్మాపూర్, ప్రాంతీయ రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో నిబంధనలు అమలు కావడం లేదు. ఉద్యోగుల బదిలీల విషయంలో అధికారులు సైతం వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యూనిట్ కేంద్రాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయకపోవడమే దీనికి నిదర్శనంగా చూపుతున్నారు. డీటీసీ కార్యాలయంలో సాధారణంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయితే ఇక్కడ పనిచేస్తున్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు యూనిట్ కేంద్రాలకు బదిలీ కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాతుకుపోతున్న ఉద్యోగులు స్థానిక ఆర్టీఏ కార్యాలయం యూనిట్ కేంద్రాల్లో ఉద్యోగులు ఏళ్ల తరబడి పాతుకుపోతున్నారు. నిబంధనల మేరకు బదిలీలు జరగడం లేదు. యూనిట్ కేంద్రాల్లో పనిచేసే సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను ఏడాదికోసారి బదిలీ చేయాలనేది నిబంధన. అది ఇక్కడ తుంగలో తొక్కుతున్నారు. జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లిలో పనిచేస్తున్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు మూడేళ్లకుపైగా ఒకే చోట పాతుకుపోయినట్లు సమాచారం. వీరిలో సంఘ నాయకులు ఉండడంతోనే ఇలా జరుగుతున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండాలని కోరుకునే సంఘం నాయకులు దూరంగా ఉండే యూనిట్ కేంద్రాల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాసుల వర్షం కురిపిస్తూ పెద్ద ఎత్తున పైరవీలు చేసుకుంటూ జిల్లా కేంద్రంలోని డీటీసీ ఆఫీసుకు రాకుండా బదిలీలను ఆపుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. జిల్లా కేంద్రానికి సంబంధించిన డీటీసీ కార్యాలయంలో అధికారుల ఒత్తిడి, దరఖాస్తుదారుల తాకిడి తట్టుకోలేక యూనిట్ కేంద్రాలకే పరిమితమవుతున్నారని తెలుస్తోంది. బదిలీపై ఉన్నతాధికారులను అడగలేక పనిఒత్తిడిని తట్టుకోలేక తిమ్మాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో ఉద్యోగులు సతమతమవుతున్నారు. కార్యాలయంలో అటెండర్లు సైతం ఇదే గోడును వెళ్లబోసుకుంటున్నారు. -
లే అవుట్లకు తూట్లు
తిమ్మాపూర్, న్యూస్‌లైన్ : తిమ్మాపూర్ మండలంలో అక్రమ లే అవుట్ల దందా జోరుగా సాగుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సామాన్యులు భూమిని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. నగర శివారు ప్రాంతాల్లో గుంట భూమికి రూ.20 లక్షలకు పైగా ధర పలుకుతోంది. ప్రధాన సెంటర్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యులకు అందుబాటులో లేనివిధంగా భూముల ధరలు ఉండడంతో తిమ్మాపూర్ మండలంలో రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాలపై దృష్టి పెట్టారు. ఇక్కడ నగర వాసులతోపాటు దూరప్రాంతాల వారుసైతం ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న అల్గునూర్, తిమ్మాపూర్, రామకృష్ణకాలనీ, ఇందిరానగర్, నుస్తులాపూర్, కొత్తపల్లి, రేణికుంటతోపాటు లోపలికి ఉన్న మన్నెంపల్లి, నల్లగొండ గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఐదారేళ్ల క్రితం ఎకరానికి రూ.20 లక్షలు పలికిన ధరలు ఇప్పుడు రూ.కోటికి పైగా పెరిగిపోయాయి. అల్గునూర్, తిమ్మాపూర్, రామకృష్ణకాలనీ గ్రామాల్లో ఎకరానికి రూ.2కోట్ల వరకు ధర పలుకుతోంది. మొదట గుంటకు రూ.2లక్షలు పలికిన ధర ఇప్పుడు రూ.6లక్షల వరకు పెరిగిపోయింది. రామకృష్ణకాలనీలోని ఇంజినీరింగ్ కళాశాల ఎదుట రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న స్థలం గుంటకు రూ.13లక్షల వరకు ఉందంటే ఇక్కడ భూముల ధరలు ఎంత ఖరీదో ఊహించవచ్చు. నిబంధనలకు తూట్లు... వ్యవసాయ భూములను ప్లాట్లు చేసేందుకు ప్రభుత్వపరంగా నిబంధనలున్నాయి. వ్యవసా య భూమిని కమర్షియల్‌కు వాడుకోవడానికి రెవెన్యూ శాఖకు నాలాపన్ను చెల్లించాలి. ఎకరం భూమిలో ప్లాట్లు చేస్తే అందులో నాలుగు గుం టలు స్థానిక గ్రామపంచాయతీ పేర రిజిస్ట్రేషన్ చేయాలి. అందులో 33ఫీట్ల రోడ్లతో అన్ని మౌలి క వసతులు కల్పించాలి. ఎకరానికి రూ.12వేల వరకు లే అవుట్ ఫీజు, సెక్యురిటీ డిపాజిట్ చే యాలి. లే అవుట్ భూమి వరకు 33 ఫీట్ల అ ప్రోచ్ రోడ్లు ఉండాలి. వీటన్నింటికి రియల్టర్లు తూట్లు పొడుస్తున్నారు. రామకృష్ణకాలనీలో అక్కడక్కడ 33 ఫీట్ల అప్రోచ్ రోడ్ మినహా ఎక్కడా ప్రభుత్వ నిబంధనలు పాటించిన దాఖ లాలు కానరావు. తిమ్మాపూర్‌లోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో అక్రమ లే అవుట్ ప్లాట్లలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇవి గ్రామపంచాయతీ అనుమతి లేకుండా నిర్మిస్తున్నా రా... అనుమతి ఉంటే ఎలా ఇచ్చారనేది ప్రశ్న. అల్గునూర్‌లో అక్రమ లే అవుట్ల స్థలాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది హెచ్చరిక బోర్డులు పాత గా వాటిని రియల్టర్లు వెంటనే తొలగించేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి... అక్రమ లే అవుట్ల దందాతో తమ జేబులు నిం పుకుంటున్న రియల్టర్లు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. మండలంలో మొత్తం 257.09 ఎకరాల్లో అక్రమ లే అవుట్ల దందా కొనసాగుతోంది. అత్యధికంగా రామకృష్ణకాలనీలో 93.07 ఎకరాల్లో ప్లాట్ల క్రయ విక్రయాలు సాగుతున్నాయి. ఇందిరానగర్‌లో 64 ఎకరాల్లో, తిమ్మాపూర్‌లో 44.15 ఎకరాల్లో, కొత్తపల్లిలో 3 ఎకరాల్లో, మన్నెంపల్లిలో 17.11 ఎకరాల్లో, నుస్తులాపూర్‌లో 4.07 ఎకరాల్లో, నల్లగొండలో 1.24 ఎకరాల్లో, రేణికుంటలో 28.25 ఎకరాల్లో, అల్గునూర్‌లో 18 ఎకరాల్లో అక్రమంగా లే అవుట్లు చేశారు. ఇక్కడ ప్రైవేటు గా గుంటకు పలుకుతున్న ధరను ఎకరానికి చూపిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రియల్టర్లు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఆ ధరలనే చూపిస్తూ నాలాపన్ను చెల్లించి వ్యవసాయ భూములను కమర్షియల్‌గా అమ్మేసుకుంటున్నారు. గ్రామపంచాయతీకి ఎకరానికి నాలుగు గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉన్నా ఏ ఒక్కరూ ఒక్క గుంటను సైతం చేయలేదని రికార్డులు చెబుతున్నాయి. మండలంలో మొత్తం 257 ఎకరాల్లో 25 ఎకరాలు ఆయా గ్రామ పంచాయతీల పేర రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. దీంతో గుంటకు సరాసరిగా రూ.4లక్షలు ధర ఉన్నా ప్రభుత్వానికి రూ.40 కోట్లు నష్టం స్పష్టంగా కనిపిస్తోంది. లే అవుట్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ 257 ఎకరాలకు రూ.30.84 లక్షలు ప్రభుత్వానికి జమ కాలేదు. మిగతా మౌలిక వసతులు కల్పన అసలు కానరావడం లేదు. అటు రిజిస్ట్రేషన్లలో, ఇటు నాలాపన్నులో, 10 శాతం భూమి, ఫీజు, డిపాజిట్‌తో కలిపి మొత్తంగా రూ.50 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. సర్కారుకు ఇంత నష్టం జరుగుతున్నా పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావితీస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ లే అవుట్లపై కొరడా ఝులిపించాల్సిన అవసరముంది. -
కాంట కొడుతాన్రు
తిమ్మాపూర్ మండలం పోరండ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. కష్టపడి పండించి తెచ్చిన ధాన్యాన్ని ఇక్కడ తూకం వేస్తున్న తీరు చూస్తే అన్నదాతల గుండె తరుక్కుపోతోంది. పొలంలో ఒక్క గింజ కూడా పోకుండా తెచ్చుకుని ఇక్కడికి వస్తున్న రైతులను రాళ్ల బాట్లు, ముల్లు తరాజుతో నిండా ముంచుతున్నారు. కొనుగోళ్లను పర్యవేక్షించే అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రధాన మార్కెట్లలో ఎలక్ట్రానిక్ కాంటాలను ఏర్పాటు చేయగా, మిగిలిన అన్ని చోట్ల ముళ్ల కాంటాలతోనే తూకం వేస్తున్నారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ప్రకృతి విపత్తులకు, పెట్టుబడి కష్టాలకు ఎదురీది పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలకు అడుగడుగునా మోసాలే ఎదురవుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తూ వ్యాపారులు రైతులను దోచుకునేవిధంగా సర్కారే సహకరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో వ్యాపారుల కంటే దారుణంగా తూకాల్లో మోసాలు జరిగేందుకు తావిస్తోంది. రైతుల నుంచి ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం తరపున... ఇందిరా క్రాంతిపథం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, గిరిజన సహకార సంఘాలు ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో తూకం మోసాలకు యథేచ్చగా సాగుతున్నాయి. ముళ్ల కాంటాళ్లు, రాళ్లనే బాట్లుగా పెట్టి అన్నదాతల శ్రమఫలాన్ని తూకం వేస్తున్నారు. పెద్ద మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో మినహా అన్ని చోట్ల ముల్లు తరాజులతోనే తూకాలు వేస్తున్నారు. రాళ్లబాట్లు, ముల్లు తరాజులతో కొనుగోలు కేంద్రాల్లో జరిగే మోసాలపై ప్రశ్నించిన రైతులను... కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ధాన్యం తేమగా ఉందని చెప్పి ఎక్కువ రోజులు రైతులు అక్కడే ఉండేలా చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు ఎక్కువగా జరిపే సంఘాలకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ఆర్భాటంగా చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు... ఎలక్ట్రానిక్ కాంటాలు సమకూర్చే విషయాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ‘దండి’గా దోపిడీ.. తూకాల్లో మోసాల కారణంగా జిల్లాలోని అన్నదాతలు భారీగా నష్టపోతున్నారు. రాళ్ల బాట్లతో క్వింటాల్‌కు సగటున కిలో చొప్పున తూకంలో రైతులు నష్టపోయినా... మొత్తంగా చూస్తే ఇది భారీగా ఉంటోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో మొత్తం 12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనాలు చెబుతున్నాయి. ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీలు కలిపి 6లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయిం చింది. ఈ లెక్కన ఆరు లక్షల టన్నుల్లో క్వింటాల్‌కు కిలో చొప్పున తూకంలో రైతులకు నష్టం జరిగినా... ఖరీఫ్ మొత్తంలో ఇది 60 వేల క్విం టాళ్లు ఉంటోంది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.1345 ప్రకారం లెక్క వేసినా తూకాల్లో రైతులు నష్టపోయే మొత్తం రూ.8.07 కోట్లుగా ఉంటోంది. ప్రస్తుత సీజన్లో జిల్లాలో 4.70 లక్షల ఎకరాల్లో వరిపంట సాగయ్యింది. రికార్డు స్థాయిలో 12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి. భారీగా వస్తున్న ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వ పరంగా ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 594 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శనివారం వరకు 99 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. గత నెలలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించిన కేంద్రంలో మాత్రమే ఎలక్ట్రానిక్ తూకం యంత్రం ఉంది. మిగిలిన కేంద్రాల్లో రెండుమూడు చోట్ల తప్ప అన్ని ముల్లు కాంటాలే ఉన్నాయి. ఎక్కువ చోట్ల రాళ్లనే బాట్లుగా పెడుతున్నారు. పాసంగం తక్కువగా ఉందని చిన్న రాళ్లను, ఖాళీ బస్తాలను వేసి తూకాలు వేస్తున్నారు. ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా... ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్న రెవెన్యూ యంత్రాంగం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఉన్నతాధికారులు దీన్ని పట్టించుకోవడంలేదు. పర్యవేక్షణ లోపం, తూకాల్లో మోసాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. -
ప్రియుడితో పెళ్లి కాదేమోనని ఆత్మహత్య
తిమ్మాపూర్ (చందుర్తి), న్యూస్‌లైన్ : ప్రియుడితో పెళ్లి కాదేమోనని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం మండలంలోని తిమ్మాపూర్‌కు చెందిన పోతుగంటి మమత(20) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియుడితో పెళ్లికి ఆటంకం కలుగుతుందేమోనని భావించి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. మమత తల్లిదండ్రులు అంజవ్వ, సత్తయ్య తమ స్వగ్రామం రామన్నపేట నుంచి వలస వచ్చి తిమ్మాపూర్‌లో నివాసముంటున్నారు. వీరు రెండేళ్ల క్రితం బెజ్జంకి మండలం గుండ్లపల్లిలో హోటల్ నిర్వహించారు. ఆ సమయంలో మమతకు తిమ్మాపూర్ మండలం వచ్చునూర్కు చెందిన శ్రీనివాస్‌తో పరిచ యం ఏర్పడి, ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటామని నిర్ణయించుకున్నారు. శనివారం రాత్రి శ్రీకాంత్ మమత ఇంటికి వెళ్లగా ఆమె మరో సోదరి కవిత ఉంది. ఆమెకు పెళ్లి విషయం చెప్పగా, సర్పంచ్ తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలంది. దీంతో ఆయన వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం మమత తన ప్రియుడు శ్రీకాంత్‌కు ఫోన్ చేసి మాట్లాడింది. అంతలోనే బహిర్భూమికని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఎంతకూ రాకపోవడంతో అనుమానం వచ్చిన కవిత గ్రామ శివారులోని బావిలో చూడగా శవమై కనిపించింది. కాగా తమ కూతురు మృతిపై అనుమానాలున్నాయని ఆమె తల్లి అంజవ్వ ఫిర్యాదు చేసింది.