తిమ్మాపూర్ : కరువు ఛాయల నేపథ్యంలో సాగుభూములు బీళ్లు గా మారనున్నాయి. గతేడాది నీటితో నిండు కుండల్లా కనిపించిన ప్రాజెక్టులు ఈసారి వర్షాభావంతో వెలవెలబోతున్నాయి. జిల్లా వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈసారి కనీస వరద నీరు కూడా చేరలేదు. ఫలితంగా రెండు పంటలకు నీరందించాల్సిన ప్రాజెక్టు... ఒక్క పంటకు కూడా నీరందిం చలేని దుస్థితిలో ఉంది. ఖరీఫ్ సీజన్‌లో పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోవడం తో ఖరీఫ్ చివరిదశలో ఒక తడి నీరు అం దించారు. ఈ రబీ సీజన్‌కు సాగునీరిచ్చే అవకాశమే లేదని సీఈ శంకర్ ప్రకటించారు.
ఇప్పుడున్న నీరు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతుందని తెలి పారు. ఇప్పటికే బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో గోదావరి వరద నీరు వచ్చే అవకాశమే లేకుండా పో యింది. దీంతో రబీలో ఆయకట్టు మొత్తం బీడుగానే ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా బోర్లు, బావులు ఉన్నచోట లక్ష ఎకరాలు మాత్రమే సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రబీకి గండమే!
Published Mon, Nov 3 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM
Advertisement