తిమ్మాపూర్ (కరీంనగర్ జిల్లా) : ఒంటిపై కిరోసిన్ పోసుకుని దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన తిమ్మాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. తిమ్మాపూర్‌కు చెందిన బత్తిన రాజు, ఆయన భార్య కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో గాయాలయ్యాయి. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.