కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల సాయిబాబా ఆలయం ఎదుట నాగుపాము, జెరిపోతు శనివారం ఉదయం సయ్యాటలాడాయి.
తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల సాయిబాబా ఆలయం ఎదుట నాగుపాము, జెరిపోతు శనివారం ఉదయం సయ్యాటలాడాయి. వాటిని చూడటానికి స్థానికులు ఆసక్తి చూపారు. పాముల సయ్యాటను చూస్తే మంచిది కాదని కొందరు.. వాటిని వెళ్లగొట్టొద్దని మరికొందరు దూరంగా వెళ్లిపోయారు. శుక్రవారం కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకోగా ఇరుగుపొరుగు వారు పాముల సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు.