
పార్వతీపురం మన్యం: మండలంలోని బూర్లిపేటలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థిని పాముకాటుతో బుధవారం మృతిచెందింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. బూర్లిపేటకు చెందిన ద్వారపూడి మౌనిక (16) మంగళవారం సాయంత్రం ఇంటి ఆరు బయట ఉన్న వరండాలో కుర్చీలో కుర్చుని సెల్‌ఫోన్ చూసుకుంటూ కుర్చీ కింద ఉన్న నాగుపామును గమనించలేదు.
ఇంతలో మౌనిక కాలిపై పాము కాటువేసింది. పాము కాటువేసిన సంగతి కుటుంబసభ్యులకు తెలియజేయడంతో ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మా ర్గమధ్యంలో మృతిచెందింది. మౌనిక నెల్లిమర్ల సీకేఎంజీజే కాలేజీలో ఇంటరీ్మడియట్ మొదటి ఏడాది చదువుతోంది. కూతురు ఆకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరయ్యారు. ఫిర్యాదు మేరకు గుర్ల ఎస్సై నారాయణ రావు బుధవారం కేసు నమోదు చేశారు.
నీలగిరి తోటలు దగ్ధం
వేపాడ: మండలంలోని వీలుపర్తి పంచాయతీ శివారు కొత్తూరు గ్రామం సమీపంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నీలగిరి, టేకు తోటలు దగ్ధమయ్యాయి. ఎస్.కోట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో ఫైర్‌స్టేషన్ అధికారి ఎస్.కె మదీనా నేతృత్వంలో సిబ్బంది శ్రీనివాసరావు, లక్ష్మణరావు, వెంకటరావులు సంఘటానా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కొత్తూరు గ్రామానికి చెందిన బోజంకి ఎరుకునాయుడు, బోజంకి ఈశ్వర్రావు, జూరెడ్డి దేముడు తదితర 15 మందికి సంబంధించిన నీలగిరి, టేకు చెట్లు సుమారు పది ఎకరాల్లో కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. సుమారు రూ.నాలుగు లక్షల ఆస్తి నష్టం ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment