Snake bite: ఇంటి పామే కాటు వేసింది! | Woman dies of snakebite in Khanapur | Sakshi

నిత్యం పూజలందుకున్న పామే కాటు వేసింది!

Jul 31 2024 8:39 AM | Updated on Jul 31 2024 1:21 PM

Woman dies of snakebite in Khanapur

ఖానాపూర్‌: మండలంలోని గోసంపల్లెకు చెందిన అరుగుల గంగమ్మ (65)మంగళవారం పాముకాటుతో మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వృద్ధురాలు నివాసం ఉంటున్న ఇంట్లోనే పాముల పుట్ట ఉంది. పలుమార్లు పుట్టలోంచి బయటకు వచ్చిన పాము పరిసరాల్లో సంచరిస్తూ ఉండేది. 

సోమవారం ఇంటిని శుభ్రం చేసే క్రమంలో పుట్టవద్ద శుభ్రం చేస్తుండగా నాగుపాము బయటకు వచ్చి వృద్ధురాలిని కాటువేసింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి కుమార్తె రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement