
సత్యసాయి జిల్లా: కదిరిలో నాగుపాముతో ఆటలాడి.. కాటుకు గురైన యువకుడు నాగరాజు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అతను బతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని గురువారం ఉదయం బులిటెన్ ద్వారా ప్రకటించారు.
పూటుగా మద్యం సేవించిన నాగరాజు.. రోడ్డు మీద ఓ నాగుపాముతో ఆటలాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మద్యం మత్తులో ఉన్న నాగరాజు ఆ యువకుడు అక్కడున్న వారు వద్దని చెప్పినా వినిపించుకోలేదు. నాగుపాము తల వద్ద చేయి పెట్టి ఆడుతుండగా అది కాటేసింది. పాము కాటేసినా నాగరాజు దాన్ని వదలలేదు. దాన్ని కాలుతో తొక్కాడు. చివరకు అది పొదల్లోకి పారిపోయింది. ఆ తర్వాత నాగరాజును బలవంతంగానే స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024
Comments
Please login to add a commentAdd a comment