ఇటీవల మన్యం జిల్లా పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం
ఐపీఎస్ యూనిఫామ్‌లో నకిలీ పోలీస్ అధికారి హడావుడి
సాలూరు: పవన్‌కళ్యాణ్ ఈ నెల 20న పార్వతీపురం మన్యం జిల్లా గిరి శిఖర గ్రామమైన సిరివర రహదారి శంకుస్థాపనలో పాల్గొన్నారు. పర్యటనలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి పాల్గొన్నారు. అయితే ఆయన పర్యటనలో భద్రతా లోపం ఆలస్యంగా వెలుగు చూసింది. ఏకంగా భద్రతా దళాల కళ్లుగప్పి.. ఐపీఎస్ అధికారినంటూ ఓ డూప్లికేట్ పోలీస్ హల్‌చల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
నకిలీ ఐపీఎస్ అరెస్ట్
స్వప్రయోజనాల కోసం ఐపీఎస్ అవతారమెత్తిన నకిలీ ఐపీఎస్ బి.సూర్యప్రకాశ్‌ను పోలీసులు శని వారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను అడిషనల్ ఎస్పీ దిలీప్‌కిరణ్ వివరించారు. విజయనగరం జిల్లా అంబటివలస గ్రామానికి చెందిన బి.సూర్యప్రకాశ్ 2003 నుంచి 2005 వరకు పంజాబ్ రెజిమెంట్‌లో సిపాయిగా పనిచేసి మానే శాడు. తరువాత బీటెక్, ఎంబీఏ పూర్తిచేసి పలు వ్యాపారాలు సాగించాడు. తన తండ్రి తవిటి బాబు కరోనాతో 2020లో మృతి చెందారు.
ఆ సమయంలో తన తండ్రి ఎకరాకు రూ.30 వేల చొప్పున చెల్లించి దత్తిరాజేరు మండలం గడసాం రెవెన్యూ పరిధిలో సుమారు 9.79 ఎకరాలను అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఇంట్లో లభ్యమైన ప త్రాల ద్వారా సూర్యప్రకాశ్ తెలుసుకున్నాడు. తండ్రి మరణంతో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు రావాలని సదరు రైతులను సూర్యప్రకాశ్ కోరగా నిరాకరించారు. తను ఐపీఎస్‌కు సెలెక్ట్ అయ్యా నని డిసెంబర్ 2023లో కుటుంబీకులు, బంధు వులను నమ్మించాడు. ట్రైనింగ్ కోసమంటూ 2024 జనవరిలో హైదరాబాద్ కు వెళ్లాడు. అక్కడ హాస్టల్‌లో ఉండి పోలీస్ యూనిఫాం, నకిలీ ఐడీ కార్డులు తయారు చేయించాడు. తను ట్రైనింగ్‌లో ఉన్నట్టు ఫొటోలు తీయించుకుని బంధువులకు పంపించాడు. ఆ ఫొటోలు, ఐడీ కార్డులను చూపించి ఆ భూములను రిజి స్ట్రేషన్ చేయాలంటూ రైతులపై ఒత్తిడి తెచ్చినా ముందుకు రాలేదు.
పోలీస్‌నని నమ్మించేందుకే..
రైతులందరినీ తాను పోలీస్ అయినట్టు నమ్మించాలని ప్లాన్‌చేసి.. ఈ నెల 20న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మక్కువ పర్యటనకు వచ్చిన నేప థ్యంలో ఉదయం 9.30 గంటలకు ముడిదాం నుంచి డ్రైవర్‌తో కలిసి సూర్యప్రకాశ్ కారులో మక్కువ కు చేరుకున్నాడు. దుగ్గేరు వద్ద పోలీసులు మంత్రి కాన్వాయ్ వెహికల్స్ తప్ప మిగిలిన వాహనాలను నిలిపివేశారు. సూర్యప్రకాశ్ కారును కూడా అక్కడే ఆపేశారు. దీంతో అతడు కారు దిగి కొంతదూరం కాలినడకన వెళ్లి, అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ అడిగి బాగుజోలకు చేరుకున్నాడు. అప్ప టికే శంకుస్థాపన కార్యక్రమం పూర్తికావడం, అక్క డ ఎవరూ లేకపోవడం చూసి శిలాఫలకం దగ్గర ఫొటో తీసుకున్నాడు. అక్కడ బందోబస్తులో ఉన్న పలువురు పోలీసులతో ఫొటోలు దిగి ఇంటికి వెళ్లిపోయాడు. వాటిని వాట్సాప్ స్టేటస్‌లో పెటు కున్నాడు. విషయం తెలుసుకున్న మక్కువ పోలీ సులు సూర్యప్రకాశ్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment