‘కొండ’నాగులు | People Afraid Of Snakes And Catches It And Left In Forest | Sakshi
Sakshi News home page

‘కొండ’నాగులు

Published Mon, Apr 9 2018 7:02 AM | Last Updated on Mon, Oct 22 2018 2:22 PM

People Afraid Of Snakes And Catches It And Left In Forest - Sakshi

సాక్షి, తిరుమల : తిరుమల కొండపై ఆదివారం రెండు నాగుపాములు జనాన్ని హడలెత్తించా యి. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆకాశగంగ సమీపంలో ఓ టీ దుకాణంలోకి  నాగుపాము వెళ్లింది. ఈ సమాచారంతో స్థానికుడు మునస్వామి ఆ పామును పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఇక స్థానికులు నివాసం ఉండే తిరుమల బాలాజీనగర్‌ ఈస్ట్‌లో 1012 నంబరు ఇంటికి సమీపంలో మరో నాగుపాము వచ్చింది. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు దాన్ని చూసి పరుగులు తీశారు. ఈ సమాచారంతో మునస్వామి వెళ్లి ఆ పామును కూడా చాకచక్యంగా పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆయన పాము కాటుకు గురయ్యాడు. కుడిచేతికి కాటు పడడంతో రక్తం వచ్చింది. ఆ పామును అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. తర్వాత ఆస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement