కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు గురువారం నాకాబందీ నిర్వహించారు.
తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు గురువారం నాకాబందీ నిర్వహించారు. మూడు మండలాల పోలీసులతో ఎస్‌ఐ దామోదర్ రెడ్డి ఈ తనిఖీలు చేపట్టారు. పలు గుడంబా కేంద్రాలను గుర్తించి ధ్వంసం చేశారు.
తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి నాకాబందీ కొనసాగుతోంది. పోలీసుల హడావుడితో ఉలిక్కిపడిన గ్రామస్థులు నాకాబందీ విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.