Nakabandi
-
విస్తృతంగా పోలీసుల తనిఖీలు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ 46 పోలీస్స్టేషన్ల పరిధిలోని 12 ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహిస్తున్నట్లు ఏసీపీ నారాయణగౌడ్ తెలిపారు. సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 వరకు వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. చైన్ స్నాచర్లు, తీవ్రవాదుల కదిలికల నేపథ్యంలో ఈ మేరకు నాకాబందీ చేపట్టినట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
తిమ్మాపూర్లో పోలీసుల నాకాబందీ
తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు గురువారం నాకాబందీ నిర్వహించారు. మూడు మండలాల పోలీసులతో ఎస్ఐ దామోదర్ రెడ్డి ఈ తనిఖీలు చేపట్టారు. పలు గుడంబా కేంద్రాలను గుర్తించి ధ్వంసం చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి నాకాబందీ కొనసాగుతోంది. పోలీసుల హడావుడితో ఉలిక్కిపడిన గ్రామస్థులు నాకాబందీ విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.