తిమ్మాపూర్ (చందుర్తి), న్యూస్‌లైన్ : ప్రియుడితో పెళ్లి కాదేమోనని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం మండలంలోని తిమ్మాపూర్‌కు చెందిన పోతుగంటి మమత(20) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియుడితో పెళ్లికి ఆటంకం కలుగుతుందేమోనని భావించి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. మమత తల్లిదండ్రులు అంజవ్వ, సత్తయ్య తమ స్వగ్రామం రామన్నపేట నుంచి వలస వచ్చి తిమ్మాపూర్‌లో నివాసముంటున్నారు. వీరు రెండేళ్ల క్రితం బెజ్జంకి మండలం గుండ్లపల్లిలో హోటల్ నిర్వహించారు.
ఆ సమయంలో మమతకు తిమ్మాపూర్ మండలం వచ్చునూర్‌కు చెందిన శ్రీనివాస్‌తో పరిచ యం ఏర్పడి, ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటామని నిర్ణయించుకున్నారు. శనివారం రాత్రి శ్రీకాంత్ మమత ఇంటికి వెళ్లగా ఆమె మరో సోదరి కవిత ఉంది. ఆమెకు పెళ్లి విషయం చెప్పగా, సర్పంచ్ తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలంది. దీంతో ఆయన వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం మమత తన ప్రియుడు శ్రీకాంత్‌కు ఫోన్ చేసి మాట్లాడింది. అంతలోనే బహిర్భూమికని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఎంతకూ రాకపోవడంతో అనుమానం వచ్చిన కవిత గ్రామ శివారులోని బావిలో చూడగా శవమై కనిపించింది. కాగా తమ కూతురు మృతిపై అనుమానాలున్నాయని ఆమె తల్లి అంజవ్వ ఫిర్యాదు చేసింది.
ప్రియుడితో పెళ్లి కాదేమోనని ఆత్మహత్య
Published Mon, Sep 23 2013 4:01 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement