mamatha
-
తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను వేధించింది.. మమత కీలక వ్యాఖ్యలు
సాక్షి, పహాడీషరీఫ్: మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి చెరువులో పడేసిన ఘటనలో స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో మృతుడు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమైన పూరన్ సింగ్‌గా గుర్తించారు. కాగా, పూరన్ సింగ్‌పై మృతిలో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. పూరన్ సింగ్ భార్య సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మృతికి జయదేవీ అనే మహిళే కారణమని చెప్పుకొచ్చారు. వివరాల ప్రకారం, పూరన్ సింగ్ మృతిపై తాజగా ఆయన భార్య మమతా సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. జయదేవీ తనను పెళ్లి చేసుకోవాలని నా భర్త వెంట పడుతోంది. ఆయన్ను వేధింపులకు గురిచేసింది. నన్ను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను గత కొద్దిరోజులుగా బెదిరిస్తోంది. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. నా భర్తను జయదేవీనే కిరాతకంగా చంపేసింది. పూరన్ సింగ్‌ను ట్రాప్ చేసి ప్లాన్ ప్రకారమే హత్య చేసింది అని కామెంట్స్ చేశారు. అంతకు ముందు, ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 25న సాయంత్రం చెరువులో మృతదేహం లభ్యం కావడంతో పరిసర పోలీస్స్టేషన్లలో అదృశ్యమైన కేసులను పరిశీలించారు. చాంద్రాయణగుట్ట పరిధిలోని కేసుగా పోలీసులు నిర్ధారించారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దీన్ దయాళ్ కుమారుడు పూరన్‌సింగ్ (30) హైదరాబాద్‌కు వలస వచ్చి చాంద్రాయణగుట్టలోని బండ్లగూడ పటేల్‌నగర్‌లో పానీపూరి బండి నడుపుకొంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 22న రాత్రి 10 గంటలకు బార్కాస్‌లోని వివాహానికి హాజరవుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడం.. స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో అతని భార్య మమతా సింగ్ 23న రాత్రి 7 గంటలకు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మృతుడి వివరాలు తెలియరావడంతో పూరన్‌సింగ్‌కు ఉన్న విబేధాల విషయమై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇది కూడా చదవండి: మాజీ మంత్రి నవ కిషోర్ దాస్ హత్యలో కీలక పరిణామం -
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో మమతా అనే బాలింత మృతి
-
సాధికారతే సౌందర్యం
మహిళలు... మౌనం వీడాలి... గొంతు విప్పాలి. చెప్పాలనుకున్నది... చెప్పగలగాలి. వాళ్లకు... ఓ ఆలంబన కావాలి. వినడానికి ఒకరున్నారనే భరోసానివ్వాలి. సాధికార సాధనలో ఒకరిది తొలి అడుగైతే మరొకరిది వందో అడుగు... అంతే. గమ్యం వేల అడుగుల దూరాన ఉంది. ఆ లక్ష్యాన్ని దగ్గర చేస్తోంది మమత‘సేవ’ ‘సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలి. తనకు గౌరవప్రదమైన స్థానాన్నిచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వాలి’... ఇదీ ఆమె ఫిలాసఫీ. మరి ఆ తిరిగి ఇవ్వడంలో ‘మీ ప్రాధాన్యం మహిళలకే... ఎందుకలా?’ అని అడిగిన వాళ్లకు ఆమె చెప్పే సమాధానం ఒక్కటే. ‘‘తరతరాల వివక్షకు తలొగ్గి మగ్గిపోయింది మహిళ. సమానత్వ పోరాటంలో అనుక్షణం అలసి పోతోంది. ఇంటి నాలుగ్గోడలు ఆమెను అర్థం చేసుకుంటాయి. కానీ ఆమె మనసులో ఆవేదనను బయటకు తెలియనివ్వకుండా అడ్డుకుంటాయి కూడా. మహిళ గొంతు విప్పడానికి సాహసం చేయలేని నిస్సహాయ స్థితిలోనే ఉంది నేటికీ. ఆమె ఎదగడానికి నిచ్చెన వేసే వాళ్లు ఉండరు. సాధికారత సాధనలో భాగంగా చెమటోడ్చి ఒక్కో సోపానాన్ని తనకు తానే నిర్మించుకుంటోంది. నా మాటలను నమ్మలేకపోతే నేను దత్తత తీసుకున్న ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చూడండి. ఆడపిల్ల పరిస్థితి అర్థమవుతుంది. ఒక్క పూట అయినా అన్నం దొరుకుతుందని బడికి వచ్చే అభాగ్యులు కనిపిస్తారు. చేనేత కుటుంబాల్లో ఆడవాళ్లను చూడండి, రంగులద్ది అద్ది అరచేతులు రంగుమారిపోయి ఉంటాయి. ఇక వేలాది రూపాయలు పెట్టి ఆ చీరలను ధరించగలిగిన సంపన్న వర్గాల మహిళలను కదిలించి చూడండి, జానెడు పొట్ట ఆకలి తీర్చడానికి పట్టెడన్నం ఎప్పుడు తినాలో తెలియని ఎదురు చూపులే ఉంటాయి. ఇంట్లో మగవాళ్లందరూ భోజనం చేసిన తర్వాత మాత్రమే ఆడవాళ్లు భోజనం చేయాలనే నియమాన్ని పాటిస్తున్న కుటుంబాలు మన దేశంలో ఇప్పటికీ ఉన్నాయంటే నమ్ముతారా?’’ అన్నారామె ఆవేదనగా. మహిళలంతా విజేతలే మమతా త్రివేది పూర్వీకులు వారణాసి నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఎం.ఎ సైకాలజీ చేసిన మమత... తన మామగారు ఆర్.పి. త్రివేది స్థాపించిన పబ్లికేషన్ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. భర్త, కొడుకు చార్టెడ్ అకౌంటెంట్లు. కూతురు యూఎస్‌లో స్థిరపడింది. ఎంప్టీనెస్ అనేటంతటి పెద్ద పదం కాదు కానీ, కుటుంబ బాధ్యతలన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఏర్పడే ఒకలాంటి శూన్యత చాలామందికి ఎదురవుతుంది. కొద్ది సంవత్సరాలుగా ఒకే మూసలో సాగుతున్న డైలీ రొటీన్ కొంతమందిలో బోర్‌కు దారి తీస్తుంది.ఆ స్థితిలోనే జీవితానికి కొత్త అర్థాన్ని చెప్పుకోగలగాలి. అదే చేశారు మమత. ‘‘మా అమ్మాయి ప్రోత్సాహంతో నలభై ఏడేళ్ల వయసులో మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాను. మేకప్, హై హీల్స్ ధరించడం కొత్తగా అనిపించింది. ‘బ్యూటీ’ అనే పదానికి అసలైన అర్థం అప్పుడే తెలిసింది. మేని ఛాయ, ఎత్తు, లావు... ఇవేవీ కాదు. పరిస్థితికి తగినట్లు తనను తాను మార్చుకోగలిగిన నేర్పు, మార్పును స్వీకరించగలిగిన వైనం వంటి అనేక అంశాల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. సాధికారతను మించిన సౌందర్యం మరొకటి ఉండదు. స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయి పోటీల్లో నాకు ‘మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ వరల్డ్ (2017)’ కిరీటం దక్కింది. కానీ ఆ పోటీలకు ముప్పైకిపైగా దేశాల నుంచి వచ్చిన మహిళల్లో ప్రతి ఒక్కరూ విజేతలే అని చెప్పాలి. ప్రతి ఒక్కరిలో ఒక గొప్పతనం ఉంది. నిజానికి నేను అసలైన ప్రపంచాన్ని చూసింది అప్పటి నుంచే. ప్రతి మహిళకూ జీవితంలో పోరాటం ఉంటుంది. జీవితంతో పోరాడి నిలబడడమే గొప్ప విజయం. అప్పటి వరకు ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదు. ఇల్లు, పబ్లికేషన్ వ్యాపారం, పిల్లలు... ఇదే లోకంగా జీవించాను. ఈ పోటీల్లో టాస్కుల్లో భాగంగా నా గురించి రాసి ఎఫ్బీలో పోస్ట్ చేయాల్సి వచ్చింది. నా సోషల్ మీడియా జర్నీ అలా మొదలైంది. మిసెస్ ఏసియా ఇంటర్నేషనల్ వరల్డ్ విజేత మమతా త్రివేది అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ! బ్యూటీ విత్ హార్ట్... కాన్సెప్ట్‌తో హైదరాబాద్‌లోని రోష్నీ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆత్మహత్యల నివారణ కోసం పని చేస్తున్నాను. ‘సేవ (ఎస్ఈడబ్లు్యఏ, సొసైటీ ఫర్ ఎంపవరింగ్ ఉమెన్)’ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి మహిళల సాధికారత కోసం పని చేస్తున్నాను. హైదరాబాద్ సమీపంలోని షాద్‌నగర్ దగ్గర బాలానగర్ ప్రభుత్వ పాఠశాల, హైదరాబాద్, బర్కత్‌పురాలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత చేసుకున్నాను. ప్రభుత్వ స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్‌ను ఒకసారి పరిశీలించండి. అమ్మాయిలే ఎక్కువగా ఉంటారు. ఆడపిల్లలను చదివిస్తున్నారని సంబర పడితే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు. మగపిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తూ ఆడపిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తున్నారు. పైగా వాళ్లను టెన్త్ తర్వాత చదివించరు. ఎనిమిదో తరగతి నుంచే డ్రాపవుట్లు మొదలవుతుంటాయి. పెళ్లి చేసేయడం అన్నింటికీ పరిష్కారం అన్నట్లు ఉంటాయి పేరెంట్స్ ఆలోచనలు. ఆ ఆడపిల్లలు ఎంత చురుగ్గా ఉంటారంటే... క్షణాల్లో చక్కగా బొమ్మలు వేసే వాళ్లున్నారు. వాళ్లకు చాక్లెట్ తయారీ, పెయింటింగ్, ప్రింటింగ్ వంటి మాకు తెలిసిన స్కిల్స్ నేర్పిస్తున్నాం. ఎనభై శాతం మార్కులతో పాసైన అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ల కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషనల్ అడాప్షన్ చేస్తున్నాం. వీవర్స్ కుటుంబం నుంచి కూడా విద్యాదత్తత చేసుకున్నాం. తొలి అడ్డంకి గడప లోపలే ఎవరైనా ఏదో ఒక ప్రత్యేకత సాధించాలంటే కుటుంబం ప్రోత్సాహం తప్పనిసరి. చాలామంది ఆడవాళ్లకు ఇంట్లో సాటి ఆడవాళ్ల నుంచే మద్దతు కరవవుతోంది. తొలి అడ్డంకి ఇంట్లోనే ఎదురవుతోంది. ఈ విషయంలో మహిళలు ఇంట్లో వాళ్లతో పోరాడడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఇంట్లో వాళ్లను కన్విన్స్ చేసుకోవడమే కరెక్ట్. ఆ తొలి మెట్టులో విజయం సాధించగలిగితే ఇక ఆమె ప్రస్థానంలో ఎదురీతలు పెద్దగా ఉండవు. అందుకు నేనే ఉదాహరణ’’ అన్నారు మమతా త్రివేది. ఆమె చేస్తున్న సేవలో తొలి ప్రయోజకులుగా మహిళలు కనిపిస్తున్నప్పటికీ ఆ ఫలితం కుటుంబానికి ఉపయోగపడుతుందంటారామె. అందుకే సమాజానికి తాను తిరిగి ఇస్తున్న ప్రయోజనాలకు వారధులుగా మహిళలనే ఎంచుకున్నానన్నారు. తరాల కలనేత పోచంపల్లికి వెళ్లి చేనేతకారుల కుటుంబాలను చూస్తే కన్నీరు వస్తుంది. భార్యాభర్త నెలంతా కష్టపడితే వాళ్లకు వచ్చేది పదిహేను వేల రూపాయలే. వాళ్ల చేతుల్లో రూపుదిద్దుకున్న చీరలు మార్కెట్లో ఏ ధరకు అమ్ముడవుతాయో కూడా వాళ్లకు సరైన అంచనా లేదు. వాళ్లకు తగినంత పని కల్పించడానికి, మంచి రాబడినివ్వడానికి గాను... నేను నిర్వహిస్తున్న బ్యూటీ కాంటెస్ట్‌లలో తప్పనిసరిగా ట్రెడిషనల్ వేర్ ఉండేటట్లు చూస్తున్నాను. ఇటీవల ర్యాంప్ వాక్ కూడా అక్కడే ఏర్పాటు చేశాను. ఆగస్టు ఏడవ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా మరో కార్యక్రమం నిర్వహించే ప్రయత్నంలో ఉన్నాను. నాకు స్వతహాగా కూడా చేనేత చీరలంటే చాలా ఇష్టం. నేను కట్టుకున్న ఈ చీరను చూడండి. అరవై ఏళ్ల నాటిది. మా అత్తగారి చీర. ఇప్పటికీ అదే మెరుపు. అందుకే ఈ కళను బతికించుకోవాలి. – మమతా త్రివేది, ఫౌండర్, సొసైటీ ఫర్ ఎంపవరింగ్ ఉమెన్ రీజనల్ డైరెక్టర్, మిసెస్ ఇండియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
ఈ రోజే బతుకుతాను.. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు
భవిష్యత్తు గురించి ఆలోచించనివారుండరు. రాబోయే రోజులు, వచ్చే ఏడాది, ఇంకో పదేళ్లపాటు.. రేపటి ఆనందకర జీవనం కోసం ఆశపడుతూనే ఉంటారు. కానీ, హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఉంటున్న ఐలా మమతను కలిస్తే ఈ రోజుకున్న విలువ ఏంటో తెలుస్తుంది. రెండు కిడ్నీలు చెడిపోయి, 22 ఏళ్లుగా డయాలసిస్ మీద ఆధారపడి జీవిస్తున్నారు మమత. కష్టాలను అధిగమిస్తూ సొంతంగా మ్యాగజీన్ నడుపుతూ, కిడ్నీ రోగులకు మానసిక స్థైర్యం ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘మీ నవ్వు చాలా బాగుందండి’ అని పలకరిస్తే.. రేపటి నవ్వు కూడా ఈ రోజే నవ్వేస్తాను. ఈ రోజును ఆనందంగా బతకడానికి ప్రయత్నిస్తాను’ అన్నారు. ‘ఇన్నేళ్లు కష్టాలన్నీ ఒక్కోటి అధిగమిస్తూ వచ్చాను. కానీ, ఇప్పుడు డయాలసిస్ చేయించుకోవడానికి కూడా ఆర్థికంగా లేక.. ఈ రోజు బతికితే చాలు అనుకుంటున్నాను’ అంటూ నవ్వు వెనకాల దాచుకున్న ఒక్కో వాస్తవాన్ని ఇలా కళ్లకు కట్టారు మమత. ‘‘నన్ను చూసి ఎవరు పలకరించినా ముందు నవ్వేస్తాను. ‘ఇంతబాధలోనూ నవ్వుతూ ఉంటావు’ అంటారు. కష్టం మరింత పరీక్ష పెట్టడానికే వస్తుందేమో అనిపిస్తుంటుంది. 22 ఏళ్ల క్రితం బాబు పుట్టినప్పుడు డెలివరీ తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ పాకి, రెండు కిడ్నీలూ చెడిపోయాయి. దీంతో రెండు కిడ్నీలను తొలగించారు. అప్పటినుంచి డయాలసిస్ తప్పనిసరైంది. మా వారికి ఉద్యోగం లేదు. ఊళ్లో ఉన్న తన తల్లిదండ్రులని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇటు నా ఆరోగ్యపరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. అమ్మ వెన్నుదన్నుగా ఉండటంతో బిడ్డ పెంపకం భారంగా అనిపించలేదు. రాత మార్చుకున్నాను.. ఆర్థికంగా ఏమీ లేదు. ఆరోగ్యమూ లేదు. నా స్థితిని అప్పటి కలెక్టర్‌కు చెప్పాను. నా మాటతీరు చూసి, పుస్తకాలు రాయమన్నాడు. అలా ‘భారతీయ సంస్కృతి’ పేరుతో మ్యాగజీన్ పెట్టుకొని, ప్రకటనలు తెచ్చుకొని నాకంటూ ఓ చిన్న లోకాన్ని ఏర్పరుచుకున్నాను. పత్రిక ద్వారా నలుగురికి సాయం చేయగలిగాను. వారంలో మూడు రోజులు డయాలసిస్. నెలకు సరిపడా చేతినిండా పని. ఈ సమయంలోనే నాలాంటి డయాలసిస్ పేషెంట్ల కోసం ఓ ఎన్జీవోను ఏర్పాటు చేశాను. కిడ్నీ రోగులకు అవగాహన కార్యక్రమాల ఏర్పాటుతో పాటు, కౌన్సిలింగ్ ఇచ్చాను. ప్రభుత్వంతో పోరాడి, వేలాది మందికి ఉచిత డయాలసిస్ అవకాశం వచ్చేలా చేశాను. మారిన రాత.. కరోనా టైమ్‌లో శారీరకంగా చాలా దెబ్బతిన్నాను. అసలే డయాలసిస్ పేషెంట్‌ను. దీనికితోడు కరోనా సోకింది. మ్యాగజీన్ ఆగిపోయింది. ఎన్జీవోలోని సభ్యులు కరోనా బారినపడి చాలామంది చనిపోయారు. సపోర్ట్‌గా ఉందనుకున్న అమ్మ మరణం... మానసికంగా బాగా కుంగిపోయాను. దీంతో చాలా ఒంటరిగా అనిపించింది. దాని నుంచి కోలుకుంటానన్న నమ్మకం కూడా కొన్నిరోజులపాటు లేదు. మా అబ్బాయి ‘ఎంతోమందికి కౌన్సెలింగ్ ఇచ్చావు. నువ్వు ఇలా ఉంటే ఎలా..’ అని ధైర్యం ఇచ్చాడు. మా అబ్బాయి ఫిల్మ్‌మేకింగ్ లో కోర్సు చేస్తున్నాడు. ఇంకా వాడి జీవితం సెట్ అవ్వాల్సి ఉంది. ప్రాణం నిలబడాలంటే.. మ్యాగజీన్ నడిపించాలన్నా, చేపట్టిన ఆర్గనైజేషన్‌ను ముందుకుతీసుకువెళ్లాలన్నా మళ్లీ సున్నా నుంచి జీవితం మొదలుపెట్టాను. ఈ ఉగాదికి మ్యాగజీన్‌ను మళ్లీ ప్రారంభించాను. కానీ, ఆర్థిక లేమి కారణంగా నడపలేకపోతున్నాను. అంతకుముందున్న శక్తి ఇప్పుడు ఉండటం లేదు. హిమోగ్లోబిన్ సడెన్‌గా పడిపోతోంది. ఇన్నేళ్లుగా డయాలసిస్ వల్ల శరీరంలో అకస్మాత్తు గా మార్పులు వస్తుంటాయి. డయాలసిస్‌కు డబ్బుల్లేక ఎప్పుడు మానేస్తానో, ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో.. తెలియదు. నా కొడుకు జీవితం ఏం అవుతుందో అని మనసులో ఆందోళనగా ఉంటుంది. ఎవరైనా సాయం అందిస్తే, ఇంకొంతమందికి నా పని ద్వారా సాయం అందించగలను’’ అని వివరించారు మమత. నిన్నటి వరకు రేపటి గురించిన ఆలోచన లేకున్నా గుండెధైర్యంతో నిలదొక్కుకున్న మమత నేటి జీవనం కోసం చిరునవ్వు వెనుక దాగున్న విషాదాన్ని పరిచయం చేశారు. సాయమందించే మనసులు ఆమె చిరునవ్వును కాపాడతాయని ఆశిద్దాం. – నిర్మలారెడ్డి -
Hyderabad: నగరంలో 8 మంది అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: వేర్వేరు ప్రాంతాల్లో ఒకే రోజు ఎనిమిది మంది అదృశ్యమైన సంఘటన బోయిన్పల్లి, లాలాగూడ, సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసు స్టేషన్ల పరిధిలో చోటు చేసుకుంది. వీరిలో ఇద్దరు మతిస్థిమితం లేని యువకులు కాగా, మరో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మతిస్థిమితం లేని యువకుడు.. కొడంగల్, రావులపల్లికి చెందిన బీమయ్య చిన్నతోకట్టాలో నివాసముంటున్నాడు. వీరి ఇంట్లోనే ఉంటున్న అతడి మేనల్లుడు రవి కుమార్ (19)కు మతిస్థిమితం లేదు. ఈ నెల 1న ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన రవికుమార్ తిరిగి రాకపోవడంతో భీమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీ తెచ్చేందుకు వెళ్లిన బాలుడు.. బోరబండలో ఉంటున్న దర్లావత్ గుత్యా కుమారుడు రమేశ్ (13)తో కలిసి గత నెల 26న బోయిన్పల్లి పెన్షన్‌లైన్‌లో ఉంటున్న తమ బంధువు ఇంటికి వచ్చాడు. మతిస్థిమితం సరిగా లేని రమేశ్‌ను టీ తెమ్మని బయటికి పంపగా, అతను తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బర్త్‌డే పార్టీకి వెళ్లిన కుటుంబం అదృశ్యం బోయిన్పల్లి బాపూజీనగర్‌కు చెందిన సురేశ్ కుమార్, భార్య సంతోషి, కుమారుడు లిఖిత్తో కలిసి గత నెల 30న బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఈ నెల 1న సురేశ్ బంధువు వెంకటేశ్, అతని డ్రైవర్ దుర్గా ప్రసాద్ బాపూజీనగర్‌లోని సురేశ్ ఇంటికి వచ్చారు. ఇళ్లు తాళం వేసి ఉండటంతో ఇంటి ఓనర్‌ను వాకబు చేయగా, రెండు రోజుల క్రితం బర్త్ డే పార్టీకని బయటికి వెళ్లినట్లు తెలిపారు. సురేశ్ తండ్రి ధర్మపాల్‌కు సమాచారం ఇవ్వగా వారి కోసం గాలించినా ఆచూకీ తెలియరాలేదు. ఒకే రోజు పోలీసు స్టేషన్లో మూడు కేసులు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చదవండి: (Hyderabad: అసెంబ్లీ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం) యువతి అదృశ్యం అడ్డగుట్ట: ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాఘవేంద్ర స్వామి కథనం ప్రకారం. లాలాపేట, సత్యనగర్ ప్రాంతానికి చెందిన గండు నర్సింగ్‌రావు కుమార్తె గండు దీపిక(19) నాచారంలోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా ట్రెయినింగ్ తీసుకుంటోంది. ఈ నెల 3న ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన దీపిక ఇంటికి తిరిగిరాలేదు. ఆమె కుటుంబసభ్యులు గాలింపు చేపట్టినా ఫలితం లేకపోవడంతో అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (సామాజిక మాధ్యమాల్లో భార్య నగ్న దృశ్యాలు.. విటులకు ఆహ్వానం..) భర్త ఊరెళ్లొచ్చేసరికి భార్య.. భర్త ఊరెళ్లొచ్చేసరికి భార్య అదృశ్యమైన ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందిరానగర్ బి కాలనీలో నాగేంద్ర, మమత దంపతులు నివాసం ఉంటున్నారు. నాగేంద్ర ఇటీవల అనంతపురం వెళ్లాడు. గత నెల 30న ఊరి నుంచి తిరిగి వచ్చే సరికి ఇంటికి తాళం వేసి ఉంది. మమత కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం లాలాగూడ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థి.. సికింద్రాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థి అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం. సంగారెడ్డికి చెందిన మహేష్కర్ గిరిధర్ రోజు రైలులో కాలేజీకి రాకపోకలు సాగించేవాడు. ఈనెల 3న కాలేజీకి వెళ్లిన మహేష్కర్ గిరిధర్ ఇంటికి తిరిగి రాలేదు. ఆయన ఆచూకీ కోసం వాకాబు చేసిన ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేపోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లయిన ఐదు రోజులకే నవవధువు..!
కరీంనగర్, రామగుండం: పెళ్లయిన ఐదురోజులకే నవ వధువు అత్తారింట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం అంతర్గాం మండల పరిధిలోని పొట్యాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు..మండలంలోని ముర్మూర్ గ్రామానికి చెందిన పెసరు రాజమల్లు–మల్లమ్మ దంపతులకు నలుగురు కూతుర్లు కాగా మమత చిన్నకూతురు. పొట్యాల గ్రామానికి చెందిన మస్కం రాయమల్లు అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఏకైక కుమారుడు మస్కం స్వామి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇచ్చి ఈ నెల 11వ తేదీన కట్నకానుకలతో వివాహం జరిపించారు. (నా చావుకు ఎవరూ బాధ్యులు కారు) ఈ నేపథ్యంలో పెళ్లయిన ఐదురోజుల్లోనే పొట్యాలలోని అత్తారింట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మృతురాలు చివరగా తన సెల్‌ఫోన్ వాట్సప్‌లో చాటింగ్ చేసిన మెసేజ్, ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు విచారిస్తున్నారు. కాగా యువతికి, యువకుడికి గతంలో వివాహం అయి విడాకులు అయినట్లు తెలిసింది. గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, రామగుండం సీఐ తాండ్ర కరుణాకర్‌రావు, అంతర్గాం ఏఎస్సై పురుషోత్తంరెడ్డి తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించి యువతి మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. (అప్పుడే పెళ్లి: వాంతి వస్తోందని చెప్పి వధువు..) -
తాగిన మైకంలో...
విజయ్, మమత, రిషీ, బేబీ సుహాన, సతీష్, లడ్డు, తేజశ్విని ముఖ్య పాత్రల్లో రాజా విక్రమ నరేంద్ర తెరకెక్కించిన చిత్రం ‘అమృత నిలయం’. ఆర్.పి. సమర్పణలో రామమోహన్ నాగుల, ప్రవీణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా పాటలను విడుదల చేశారు. రాజా విక్రమ నరేంద్ర మాట్లాడుతూ– ‘‘తాగిన మైకంలో యువత చేసే పొరపాట్ల వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి కుటుంబాల్లోని ఓ అంధుడి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించాం. మా సినిమా ద్వారా మంచి సందేశం ఇస్తున్నాం. ‘అపరాజిత సేవా సమితి’లోని అనాథ బాలికల చేత ఫస్ట్ లుక్, ఆడియో విడుదల చేయించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రధాన కథ అనాథగా మారిన అంధుడి జీవితం చుట్టూ తిరుగుతుంది. ‘అపరాజిత సేవా సమితి’లోని అనాథ పిల్లలకు కావాల్సిన సదుపాయాలు కల్పించాం. మా బ్యానర్ నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇకపైనా చేస్తాం’’ అన్నారు రామమోహన్ నాగుల, ప్రవీణ్ కుమార్. -
టీజీవో అధ్యక్ష, కార్యదర్శులుగా మమత, సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (టీజీవో) నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వి.మమత, ఎ.సత్యనారాయణ మరోసారి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని సంఘం కార్యాలయంలో మంగళవారం జరిగిన టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారిని మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో వారు 2022 వరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతారు. సంఘం అధ్యక్షురాలు మమత అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యలు, ఇతర అంశాలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. సంఘం చైర్మన్, వ్యవస్థాపక అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్‌కు తెలంగాణ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సంఘం ధన్యవాదాలు తెలిపింది. రాష్ట్రంలోని 31 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సచివాలయం, హైదరాబాద్ సిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సంఘం అనుబంధ శాఖల (54) ఫోరమ్‌ల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలను సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యతను కేంద్ర సంఘానికి అప్పగిస్తూ తీర్మానించారు. అలాగే కేంద్ర సంఘం మిగతా కార్యవర్గాన్ని నియమించే అధికారం, అనుబంధ సంఘాలకు నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించే అధికారాన్ని కేంద్ర సంఘానికి అప్పగించారు. ఉద్యోగాలను పణంగా పెట్టారు టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం చైర్మన్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులు తమ ఉద్యోగాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని గుర్తు చేశారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా ఏర్పడిన టీజీవో ముందుడి పోరాటం చేసిందన్నారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేయడంలో, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి మేలు చేకూర్చడంలో సంఘం ముందుందని తెలిపారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రథ«మ ప్రాధాన్యం ఇస్తోందని, ఉద్యోగుల అవసరాలు, సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన కేసీఆర్ సరైన సమయంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారన్నారు. -
తాగిన మైకంలో...
విజయ్, మమత, రిషివర్మ, సుహాసన ముఖ్య తారలుగా రాజా విక్రమ నరేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమృత నిలయం’. ఆర్.పి సమర్పణలో అను ఫిల్మ్ బ్యానర్‌పై రామమోహన్ నాగుల, ఎం.ప్రవీణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రాజా విక్రమ నరేంద్ర మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం సమాజంలో యువత తాగిన మైకంలో పొరపాట్లు చేస్తున్నారు. వాటివల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి కుటుంబాల్లోని ఓ అంధుడి జీవిత కథ ఆధారంగా మా ‘అమృత నిలయం’ తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘వైజాగ్‌లో ఎక్కువ శాతం మా సినిమా చిత్రీకరణ జరిపాం. సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశలో ఉన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్. -
ఉద్యోగ వేటలో ఓడిన మమత
సాక్షి, కరీంనగర్‌క్రైం/రామగుడు(చొప్పదండి): తనది పేద కుటుంబం. తల్లిదండ్రులకు ముగ్గురు అక్కచెల్లెల్లు. నాన్న ఆటో నడిపి ముగ్గురిని చదివించాడు. పెద్ద కూతురు మమత(20) డిగ్రీ చేసింది. ఇక కుటుంబానికి బాసటగా ఉండాలని నిర్ణయించుకుంది. పోలీసు కొలువుకు దరఖాస్తు చేసుకుంది. ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించింది. ఈవెంట్స్‌కోసం సిద్ధమైంది. కొలువు కొట్టాని కోటి ఆశలతో మైదానంలోకి అడుగుపెట్టింది. పరుగుపందెంలో అర్హత సాధించింది. ఇక పోలీస్ అయినట్లే అని సంతోషంతో మైదానం వీడుతున్న సమయంలో ఒక్కసారి కుప్పకూలింది. అక్కడే ఉన్న సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయింది. రోదిస్తున్న మమత కుటుంబసభ్యులు పోలీసుల వివరాల ప్రకారం.. రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన వడ్లకొండ సంపత్– సరోచన దంపతులది నిరుపేద కుటుంబం. సంపత్ ఆటో నడుపుంటాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు మమత, మానస, అర్చన. పెద్దకూతురు మమత(20) డిగ్రీపూర్తి చేసింది. ఇటీవల పోలీస్‌శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించింది.మూడు నెలలుగా కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు సంస్థ ఆధ్వర్యంలో గ్రౌండ్‌కోచింగ్ తీసుకుంటోంది. పోలీసుశాఖ నిర్వహిస్తున్న దేహదారుఢ్య,శారీరక పరీక్షలకు సోమవారం హాజరైంది. ఉదయం 7గంటలకు 100మీటర్ల పరుగుపందెంను 16.95 సెకన్లలో పూర్తిచేసి అర్హత సాధించింది. ట్రాక్ నుంచి బయటకు వస్తూనే కుప్పకూలింది. అక్కడే ఉన్న పోలీసులు, వైద్యసిబ్బంది గమనించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయింది. అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందిందని వైద్యులు తెలిపారు. సీపీ కమలాసన్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం అనంతరం స్వగ్రామానికి తరలించారు. ఆస్పత్రి ఆవరణలో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీటీసీ వీర్ల కవిత, ఎంపీటీసీ బండపెల్లి యాదగిరి, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్రావు మృతదేహనికి నివాళి అర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం పరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని రవిశంకర్ తెలిపారు. అయితే తరువాత జరిగిన ఈవెంట్స్‌లో జగిత్యాలకు చెందిన రశ్మిత, చిగురుమామిడికి చెంది మనీషలు కూడా స్వల్ప ఆస్వస్థతకు గురయ్యారు. మమత కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జాగ్రత్తలు తీసుకోవాలి – సీపీ కమలాసన్‌రెడ్డి మమత మృతిచెందడం బాధాకరమని సీపీ తెలిపారు. 25రోజుల పాటు జరగనున్న దేహదారుఢ్య,శారీరక పరీక్షల్లో సుమారు 25వేల మందికి పైగా అభ్యర్థులు పాల్గొంటున్నారని, 4వేల మంది మహిళలు ఉన్నారని తెలిపారు. మూడు రోజులుగా మహిళ కోసం ప్రత్యేకంగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నమని పేర్కొన్నారు. ఈ సమయంలో పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో ఉంటారని, 108, పోలీస్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్, వైద్య నిపుణులు ఉంటున్నారని వివరించారు. అభ్యర్థులు ఈవెంట్స్‌కు వచ్చేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
పోలీస్ ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో అపశ్రుతి
-
కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో అపశ్రుతి
సాక్షి, కరీంనగర్ : పోలీస్ ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో భాగంగా రన్నింగ్ రేసులో పాల్గొన్న మమత అనే యువతి హార్ట్ బీట్ ఎక్కువై కిందపడిపోయి, మృతిచెందింది. మమత స్వస్థలం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల. తండ్రి సంపత్ ఆటో డ్రైవర్ కాగా, ముగ్గురు కూతుళ్లలో మమత పెద్దమ్మాయి. మమత మృతితో వెలిచాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. సీపీ కమలాసన్‌రెడ్డి మమత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ పరంగా మమత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. -
చనిపోతున్నానని దిబాకర్ ఫోన్‌కు మమత మెసేజ్..
గుంటూరు, పేరేచర్ల(తాడికొండ): అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన 22 రోజుల తరువాత ఆలస్యంగా వెలుగు చూసింది. మండల కేంద్రమైన మేడికొండూరులో ఈ ఉదంతం జరిగింది. యువతి సోదరి, తండ్రి ఒడిశా నుంచి వచ్చి తమ కుమార్తె చనిపోయిందంటున్నారని, దర్యాప్తు చేసి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లా అచోం గ్రామానికి చెందిన మమతాసేత్ ఆమె సోదరి నమితాసేత్, తండ్రి బసంత్‌కుమార్‌ను మేడికొండూరు మండల పరిథిలోని భీమనేనివారిపాలెం సమీపంలోని ఒక స్పిన్నింగ్ మిల్లులో అదే రాష్ట్రానికి చెందిన గుత్తేదారు దిబాకర్ పనికి కుదిర్చాడు. మూడు సంవత్సరాల క్రితం నమితాకు వివాహం నిశ్చయమవటంతో వారు ముగ్గురూ ఒడిశాకు వెళ్లి పోయారు. అనంతరం మమతాసేత్ మాత్రం మళ్లీ మిల్లులో పనికి తిరిగి వచ్చింది. మొదటి నుంచి ఆమెతో చనువుగా ఉంటున్న దిబాకర్ మమతను తాను సొంతంగా పెట్టిన కిరాణా దుకాణంలో ఉంచి, ఇద్దరూ కలసి ఒకే గదిలో ఉండేవారు. దిబాకర్‌కు సామర్లకోటలో కూడా లేబర్ కాంట్రాక్టు ఉండటంతో అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వస్తుండేవాడు. పోలీసుల విచారణలో వెలుగు చూసిన నిజాలు మమతాసేత్ జనవరి 15న అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. మమత అక్క, తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మేడికొండూరు ఎస్ఐ సీహెచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది మిల్లు దగ్గరకి వెళ్లి సహచర కూలీలు, మమత ఉండే గది పక్కన ఉన్న గుత్తేదారు దిబాకర్ తమ్ముడిని విచారించారు. విచారణలో దిబాకర్ తమ్ముడు మాట్లాడుతూ జనవరి 15 రాత్రి మమత ఎంత సేపటికి గదిలో నుంచి బయటికి రాక పోయేసరికి తాళాలు పగలకొట్టి చూశానని మమత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొందని తెలిపాడు. ఏంచేయాలో తెలియక తాను సామర్లకోటలో ఉన్న తన అన్న దిబాకర్‌కు ఫోన్లో సమాచారం అందించగా, మరో ఇద్దరితో కలసి దగ్గరలో ఉన్న శ్మశానవాటికలో ఖననం చేయమని చెప్పడంతో అలాగే చేశామని పోలీసులకు వివరించాడు. తాను చనిపోతున్నానని మమత దిబాకర్ ఫోన్‌కు మెసేజ్ కూడా పంపించిందని తెలపటంతో పోలీసులు దిబాకర్ కోసం వెతుకుతున్నారు. మమతా సేత్‌ను ఖననం చేసిన ప్రదేశాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. -
నా భర్తను చంపిన వారిని కఠినంగా శిక్షించాలి
కడప రూరల్: తన భర్త రాజేష్‌కుమార్ మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కడప నగరం, చిన్నచౌక్కు చెందిన మమత కోరారు. గురువారం స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన భర్త స్ధానిక ఎర్రముక్కపల్లెలోని ఒక షాపులో రాడ్ వెండర్‌గా పనిచేసేవాడని తెలిపారు. గతనెల ఆ షాపు యజమాని ప్రసాద్‌రెడ్డి తన భర్తను విందు పేరుతో కడప నగర సమీపంలోని వాటర్ గండి వద్దకు తీసుకెళ్లాడని తెలిపారు. తరువాత తన భర్త తిరిగి ఇంటికి రాలేదన్నారు. ఈ విషయమై స్ధానిక చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. తరువాత అదే నెల 26వ తేదీన ఆ ప్రాంతంలోనే తన భర్త మృతదేహం లభించిందన్నారు. తన భర్త మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తనకు ఒకటిన్నర ఏడాది పాప ఉందని, తాను తన తండ్రి వద్ద ఉంటున్నట్లు తెలిపారు. నిరుపేదనైన తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్కే నజీర్‌బాషా మాట్లాడుతూ మమతకు న్యాయం జరగకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మమత తండ్రి చిన్న కొండయ్య, బీఎస్పీ నాయకులు రవికుమార్, కానుగ దానం తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో కొనసాగుతా
తిరుపతి మంగళం: తాను వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని ముత్యాలరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బోయనపాటి మమత స్పష్టం చేశారు. మంగళవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. క్రమశిక్షణ.. విశిష్ట వ్యక్తిత్వం..ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తపించే ఉద్యమ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి సారథ్యంలో పనిచేస్తానని చెప్పారు. చిన్నతనం నుంచే పోరాట పటిమతో నాయకత్వ లక్షణాలను అలవరుచుకుని నాటి కాంగ్రెస్ నుంచి నేటి వైఎస్సార్ సీపీ వరకూ వెన్నెముకలా ఉంటూ నడిపిస్తున్న నాయకుడు భూమన తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. కులమతాలకతీతంగా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగే ఆయన నేతృత్వంలో పనిచేయడం సంతోషకరమన్నారు. మహిళలకు పార్టీలో ప్రత్యేక గౌరవాన్ని కల్పిస్తారని, అందుకు తనకు రాష్ట్ర పదవిని ఇవ్వడమే నిదర్శనమని అన్నారు. అనునిత్యం ప్రజల మధ్య ఉండాలనే కాంక్షతో గడప గడపకూ వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ శ్రమిస్తున్న కరుణాకరరెడ్డి సారథ్యాన్ని తాను కోరుకుంటానని తెలిపారు. నాలుగు నెలలుగా వ్యక్తిగత కారణాలతో పార్టీకి దూరంగా ఉన్నానన్నారు. అంతేతప్ప పార్టీని వీడిపోలేదని స్పష్టం చేశారు. పదవికి రాజీనామా చేశానే తప్ప పార్టీకి కాదన్నారు. కొందరు తాను టీడీపీలోకి వెళుతున్నానని చేస్తున్న ప్రచారం సరికాదని తోసిపుచ్చారు. ప్రాణమున్నంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. -
‘మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్’కు సత్కారం
హైదరాబాద్: ‘క్లాసిక్ మిసెస్ ఇంటర్నేషనల్ వరల్డ్–2017’ పోటీల్లో విజేతగా నిలిచిన మమతా త్రివేదిని హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. లాలా దవాసాజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మిసెస్ ఇండియా పేజెంట్స్, ప్రొడక్షన్స్ జాతీయ డైరెక్టర్ దీపాలీ ఫడ్నిస్ హాజరయ్యారు. మోడల్స్ కాకుండా రోల్‌మోడల్స్ అన్వేషణే మిసెస్ ఇండియా లక్ష్యమని ఆమె వ్యాఖ్యానించారు. లాలా దవాసాజ్ సంస్థ ఉత్పత్తులకు మమతా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల చైనాలోని డాంగ్యాంగ్ సిటీలో మిసెస్ ఇంటర్నేషనల్ వరల్డ్ ఫైనల్స్ నిర్వహించారు. గత జూలైలో క్లాసిక్ మిసెస్ ఇండియాగా గెలిచిన మమతా హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. -
‘ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి’
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ అన్నారు. బుధవారం టీఎన్జీవో భవన్లో జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని, స్థానికత విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, స్థానికులకు మాత్రమే ఖాళీల్లో ఉద్యోగ అవకాశాలు దక్కేలా చూడాలని కోరారు. -
ఫేస్‌బుక్కా? ఫేక్‌బుక్కా?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నెలకొన్న మత ఉద్రిక్తతలకు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఫేస్బుక్లో ప్రచారమవుతున్న తప్పుడు వార్తలు ఆజ్యం పోస్తున్నాయి. ఓ భోజ్‌పురి సినిమాలో ఓ యువతి పైట లాగుతున్న దృశ్యాన్ని పోస్ట్ చేసి మత ఘర్షణలు చెలరేగిన 24 పరిగణాల జిల్లాలో ఓ హిందూ యువతి పైటలాగుతున్న ముష్కరలు అంటూ కామెంట్ పెట్టారు. ఆ దృశ్యంలో యువతి మేకప్ వేసుకొని ఉండడం, పిల్లలు, పెద్దలంతా కలసి ఆ దృశ్యాన్ని చూస్తుంటే అది సినిమా షూటింగ్ లేదా సినిమాలో స్టిల్ అని కచ్చితంగా అర్థమవుతుంది. ఎవరో ఆకతాయి చేసిన ఈ పోస్ట్‌ను సాక్షాత్తు బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద చిత్రాన్ని వేసి ప్రస్తుత బెంగాల్ మత ఉద్రిక్తతలకు కారణమైన యువకుడి తల్లిదండ్రులను 24 పరిగణాల జిల్లాలోని బడూరియాలో ఎలా హింసించారో చూడండి అంటూ ఫేస్బుక్లో మరో చిత్రాన్ని పోస్ట్‌చేసి కామెంట్ రాశారు. అసలు ఆ యువకుడికి తల్లే లేదని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. పైగా ఆ చిత్రం బంగ్లాదేశ్‌లో 2014లో జరిగిన ఓ గొడవకు సంబంధించినదని ఆన్లైన్లో తప్పుడు వార్తలను వెతికిపట్టుకొనే సైట్ ‘ఆల్ట్‌న్యూస్ డాట్ ఇన్’ వెల్లడించింది. ఒకప్పుడు శాంతి, సౌభ్రాతత్వాలు విరాజిల్లిన బెంగాల్ నేడు అన్ని రంగాల్లో విఫలమైందన్న వ్యాఖ్యలతో ఆటోట్రాలీ తగులబడుతున్న దశ్యాన్ని పోస్ట్ చేశారు. ఈ తగులబడుతున్న దశ్యం ఈనాటిది కాదు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో 2002లో జరిగిన అల్లర్లకు సంబంధించినది. దీన్ని బీజీపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఫేస్బుక్ ఫేక్బుక్గా మారుతోందని, తాను ఫేస్‌బుక్‌ను ఎంతైనా ప్రేమిస్తానని, ఫేక్బుక్ను ద్వేషిస్తానని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేకపోలేదు. -
'నా భర్తను కళ్ల ముందే కాల్చేశారు'
జైపూర్: కళ్ల ముందే తన భర్తను కాల్చి చంపారని రాజస్ధాన్‌లోని జైపూర్‌కు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ హత్య వెనుక తన తల్లిదండ్రుల హస్తం ఉందని ఆమె ఆరోపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మమత చౌదరి(30), అమిత్ నయ్యర్(28)లు ఏడాదిన్నర క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. సివిల్ ఇంజనీర్ అయిన అమిత్.. జైపూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ మమత ఇంటి పక్కనే నివసించేవాడు. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో మమత తన ఇంట్లో ప్రేమ విషయం చెప్పి పెద్దలను పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే, అమిత్‌ది వేరే కులం కావడంతో మమత తల్లిదండ్రులు వారి వివాహానికి అడ్డుచెప్పారు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మమత, అమిత్‌ను వివాహం చేసుకుని జైపూర్‌లోనే కాపురం పెట్టారు. మమత గర్భవతి అని తెలిసిన ఆమె తల్లిదండ్రులు కొద్ది రోజుల క్రితం ఫోన్ చేసి పలకరించారు. బుధవారం మమతను కలిసేందుకు ఇంటికి వచ్చారు. అమిత్ గురించి వాకబు చేశారు. అమిత్‌ను వదిలేసి తమతో వచ్చేయాలంటూ బలవంతపెట్టారు. మమత ప్రతిఘటించడంతో ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి అమిత్‌పై కాల్పులు జరిపారు. కాల్పుల్లో అమిత్ మెడ, ఛాతీ భాగాల్లో బుల్లెట్ గాయాలు అయ్యాయి. రక్తం ఎక్కువగా పోవడంతో అమిత్ చనిపోయినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. అమిత్‌పై కాల్పుల తర్వాత ఆచూకీ లేకుండా పోయిన మమత తల్లిదండ్రుల కోసం వెతుకులాట కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ప్రాణం తీసిన 'ఫేస్బుక్' ఫొటో..
-
ప్రాణం తీసిన 'ఫేస్బుక్' ఫొటో..
హైదరాబాద్ (మీర్పేట్): ప్రేమ వేధింపులతో వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మీర్పేట్ ఠాణా పరిధిలోని ఓం సాయినగర్‌లో ఈ ఘటన జరిగింది. సీఐ రంగస్వామి కథనం ప్రకారం.. జిల్లెలగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఓం సాయినగర్‌లో గల విజయహోమ్స్‌లో నివాసం ఉండే విష్ణుమూర్తి కూతురు మమత(19) ఇంటర్ వరకు చదివి ఇంట్లో ఉంటోంది. ఈమెకు గాయత్రీనగర్‌లోని నివాసం ఉండే మహేశ్వరం నాగరాజు(26)తో పరిచయం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యంతో మమతను పెళ్లి చేసుకుంటానని ఆమెతో పాటుగా వారి కుటుంబసభ్యులకు సైతం తెలిపాడు. అయితే మమత ఇంట్లో వీరి వివాహానికి అభ్యంతరం తెలిపారు. దీంతో మమత కూడా నాగరాజును వివాహం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో గతనెల 30న మమత పుట్టినరోజును పురస్కరించుకుని మమతతో కలిసి ఉన్న ఫొటోను నాగరాజు తన ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. ఇది గమనించిన మమత మనస్తాపానికి గురై శుక్రవారం సాయంత్రం వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. 90 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతు శనివారం మృతి చెందింది. మృతురాలి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని నాగరాజును అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. ఇష్టంలేని పెళ్లికి బలవంతపెట్టడాన్ని తాళలేక తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
‘ఆక్రోశ్ దిన్’కు జేడీయూ దూరం
-
‘ఆక్రోశ్ దిన్’కు జేడీయూ దూరం
- బంద్‌లో పాల్గొనబోము: మమతా బెనర్జీ న్యూఢిల్లీ: నోట్ల రద్దు అంశంపై కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తలపడుతోన్న విపక్షపార్టీల కూటమికి మరో ఝలక్. నోట్ల రద్దు నిర్ణయాన్ని, అమలు తీరును వ్యతిరేకిస్తోన్న విపక్ష పార్టీలు కలిసి ఈ నెల 28న(సోమవారం) దేశవ్యాప్త బంద్‘ఆక్రోశ్ దిన్’ను తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బంద్‌లో పాల్గొనబోమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా, తాజాగా నితీశ్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్న జనతాదళ్ యునైటెడ్- జేడీయూ కూడా ‘ఆక్రోశ్’కు దూరంగా ఉంటామని ప్రకటించింది. ఈ మేరకు జేడీయూ కీలక నేతలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన కార్యాలయం వెల్లడించింది. నోట్ల రద్దు వ్యతిరేక ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామన్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. భారత్ బంద్ వల్ల పేదలు మరింత ఇబ్బందులు పడతారని, అందుకే ‘ఆక్రోశ్ దిన్’లో భాగస్వాములు కాబోమని తెలిపారు. బంద్ బదులు సోమవారం(28న) కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఆమె చెప్పారు. జేడీయూది కూడా దాదాపు ఇదే వాదన. జేడీయూ చీఫ్ నితీశ కుమార్ మొదటి నుంచి ప్రధాని మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నప్పటికీ పార్టీ పరంగా పార్లమెంట్లో నోట్ల రద్దు వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నారు. తాజా ప్రకటనతో నితీశ్ అభిప్రాయమే పార్టీ అభిప్రాయమని తేటతెల్లమైంది. అయితే జేడీయూ మిత్రపక్షం ఆర్జేడీ మాత్రం ‘ఆక్రోశ్’లో పాల్గొంటున్నది. కాంగ్రెస్ పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, శరద్ పవార్ ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన తదితర పార్టీలు బంద్‌లో యధావిధిగా పాల్గొంటున్నాయి. -
ఏది ప్రేమ?
కవిత ఒక ఆశాకం పిగిలిపోయాక ఒక అడవీ కుంగిపోయాక కళ్లల్లోంచి రాలిన నల్లని పదాలు ఖాళీ చేతుల్లోకి ఇంకిపోతున్నప్పుడు విచ్చుకోవాలో, ముడుచుకోవాలో తేల్చుకోలేక మనసు విరుచుకు పడిపోతున్నప్పుడు, సరిగ్గా అప్పుడే మారుమూల ద్వీపంలో అవ్వాతాతల సమాధుల సాక్షిగా పేర్చుకున్న తన కలలన్నీ ఇంకా మన ఇళ్లకు రాని ప్రళయానికి ఇచ్చి కొన్ని గ్నాపకాలను మూటగట్టుకుంటూ ఒక అమ్మాయి మనల్ని చూసి పకాలున నవ్వుతుంది అంతలోనే, ఉప్పగా ఏడుస్తూ నిలదీస్తుంది ‘దేనికోసం మీ పలవరింత? ఏది విరహం? ఏది ప్రేమ?’ –మమత -
ఇద్దరు వివాహితలు లేచిపోయి..
జైపూర్: వాళ్లిద్దరూ మహిళలే అయినప్పటికీ, ఒకరినొకరు ఇష్టపడ్డారు. తాము కలసి ఉండేందుకు భర్తలతో పాటు కన్న బిడ్డలను కాదనుకున్నారు. ఎన్నో మలుపులు, ట్విస్ట్‌లతో ఉన్న ఈ కథతో ఓ సూపర్ హిట్ సినిమా తీయడానికి కావల్సిన అన్ని ఎలిమెంట్లు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. సోనియా(27), మమత(26)లు ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్లలో నివాసముండేవారు. వీరిద్దరికి ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. అంతేకాకుండా ఆ వివాహితలకు చెరో సంతానం కూడా ఉంది. వారి భర్తలు రోజువారి పనిలో భాగంగా విధులకు వెళ్లేవారు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న వీరిద్దరూ ఒకేచోట చేరి ఎక్కువ సమయాన్ని గడిపేవారు. ఒకరిని ఒకరూ బాగా అర్థం చేసుకున్నారో లేక అభిప్రాయాలే నచ్చాయో తెలియదు కానీ వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అంతే ఇద్దరూ కలిసి వివాహం చేసుకొని దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆ ఇద్దరు వివాహితలు తమ తమ కుటుంబాలను వదిలిపెట్టి పెళ్లి చేసుకోవాలని భావించారు. మన్సరోవర్ గ్రామంలోని ఓ ఆలయంలో ఈ మహిళలు ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వాళ్లు పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లు ప్రకారం...సోనియా భర్తగా, మమతా భార్యగా వ్యవహరించారు. వారిరువురి కుటుంబాలకు దూరంగా వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. అయితే ఆరు నెలల తర్వాత మమత సోదరుడు వీరిద్దరు కలిసి నివాసం ఉంటున్న చోటును కనుగొన్నాడు. వారి దగ్గరికి వెళ్లి మీ వివాహనికి ఇరు కుటుంబాలు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాయని నమ్మించి, ఇంటికి రావాల్సిందిగా కోరాడు. వారు స్వగ్రామానికి తిరిగి రాగానే మొదటి వివాహానికి సంబంధించి ఇరువురి అత్తలు సోనియా(భర్తగా చెప్పుకునే మహిళ)ను చితకబాది, ఊరి నుంచి తరిమికొట్టారు. సోనియా వెళ్లిన తర్వాత మమతా కనిపించకుండా పోయింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని టోన్క్ జిల్లాలోని అమ్లీ గ్రామంలో చోటు చేసుకుంది. తన భాగస్వామి మమత జాడ కోసం సానియా అన్ని ప్రాంతాల్లో వెతుకుతూనే ఉంది. తామున్న చోటు ఎవరికీ తెలియకుండా ఉండటానికి మమత కుటుంబ సభ్యులు ఇంటిని కూడా వదిలి పోవడంతో.. తన తోడు కోసం వెతికి వెతికి నీరసించి చివరకు డిగ్గి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. స్వలింగ వివాహాలు చెల్లుతాయని, వారి విషయంలో ఎవరి అనుమతి అవసరం లేదని నిరూపించడానికి న్యాయ సహాయం కోసం కోర్టు మెట్లు కూడా సానియా ఎక్కింది. కోర్టు మమత కుటుంబ సభ్యులకు లీగల్ నోటీసులు పంపింది. మమత కోరికలు నెరవేర్చడానికి తన ఇంటిని కూడా అమ్మేసినట్టు సోనియా చెబుతోంది. మమతా ఆచూకీ గనుక దొరక్కపోతే ఆత్మహత్య చేసుకుంటానని సోనియా కన్నీటి పర్యంతమవుతోంది. -
జైలు.. అమ్మ.. చిన్నారి
జగిత్యాల : మాతృమూర్తి చేసిన నేరం ఆ చిన్నారిని జైలులో ఉండేలా చేసింది. 14 రోజులుగా జైలు గోడలమధ్య అమ్మతో కాలం వెళ్లదీస్తోంది. తల్లిలేక ఉండలేని ఆ బిడ్డకు జైలు సిబ్బంది ఆడిస్తూ లాలిస్తూ సంబరపడుతున్నారు. జిల్లాలోని పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన నాగసముద్రపు రాజశేఖర్(30) వండంగ్రి. ఈయనకు నాలుగేళ్ల క్రితం కరీంనగర్‌కు చెందిన మమతతో వివాహమైంది. వీరికి 20 నెలల కూతురు శ్రీనిధి ఉంది. భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలూ జరిగాయి. అయినా పరిస్థితిలో మార్పురాలేదు. 2015 డిసెంబర్ 10న రాజశేఖర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘తన చావుకు భార్య సహా అత్తింటివారే కారణం’ అని సూసైడ్ నోట్ రాశాడు. అప్పుడు రాజశేఖర్ కుటుంబ సభ్యులు భార్య మమతతో పాటు అత్తింటివారిపై పెగడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం గత నెల 30న మమతను అరెస్టు చేసి జగిత్యాల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో మమత జగిత్యాల స్పెషల్ జైలులో గడుపుతోంది. తల్లితో కూతురు.. జైలులో ఉంటున్న మమత వెంట కూతురు శ్రీనిధి (20 నెలలు) ఉంటోంది. పాలుతాగే వయస్సు కావడంతో తల్లితోపాటు కూతురును జైలులో ఉండేందుకు కోర్టు అనుమతిచ్చింది. దీంతో 14 రోజులుగా చిన్నారి శ్రీనిధి జైలులో గడుపుతోంది. మహిళా ఖైదీలు అమ్మమ్మలు, నానమ్మలుగా మారి చిన్నారికి స్నానం చేయించడం.. అన్నం తినిపించడం, ఆటలాడించడం చేస్తూ అమ్మకు ఆసరా, చిన్నారికి భరోసా ఇస్తున్నారు. జైలు సిబ్బంది మానతా దృక్పథం.. జైలు సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నారు. ఆమెను ఆడిస్తున్నారు. నవిస్తూ ముచ్చటపడుతున్నారు. చాకెట్లు, బిస్కెట్లు ఇస్తూ ప్రేమను పంచుతున్నారు. దీంతో శ్రీనిధి అమ్మకంటే జైలు సిబ్బంది వద్దే ఎక్కువ సమయం గడుపుతోంది. చిన్నారికి ఎలాంటి అనారోగ్యం లేకున్నప్పటికీ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వారం రోజులకోసారి ఆసుపత్రికి తరలించి సిబ్బంది చికిత్సలు చేయిస్తున్నారు. బిడ్డను చూసినప్పుడల్లా తల్లి మమత కళ్లలో కన్నీళ్లు గిర్రున తిరుగుతున్నాయి. ‘నేను నేరం చేశానో, చేయలేదో దేవుడికి తెలుసు, కానీ.. ఏ నేరం చేయని బిడ్డ నాతో జైలు జీవితం అనుభవించడమే నాకు పెద్ద శిక్ష’ అంటూ కన్నీళ్ల పర్యంతమవుతోంది. -
మమత ప్రమాణ స్వీకారోత్సవానికి భూటాన్ రాజు
కోల్ కతా: పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారోత్సవానికి భూటాన్ రాజు శెరింగ్ తొబ్గే హాజరు కానున్నారు. మమత ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యక్షంగా హాజరై ఆమెకు శుభాకాంక్షలు చెప్పడానికి ఎదురు చూస్తున్నానని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. తొబ్గే ట్వీట్ పై స్పందించిన మమత ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. గతేడాది మమత భూటాన్ వెళ్లిన సందర్భంలో ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. భూటాన్ కోల్ కతాతో 180 కి.మీ సరిహద్దును పంచుకుంటుంది. నరేంద్రమోదీ, సోనియా గాంధీ, అరుణ్ జైట్లీ, లాలూ ప్రసాద్ యాదవ్, నితిష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ లను కూడా మమత తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించింది. మమత రెండోసారి సీఎంగా ఈనెల 27 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
ప్రసూతి ఆస్పత్రిలో గర్భిణి మృతి
- కుటుంబసభ్యుల ఆందోళన హైదరాబాద్ : నగరంలోని కోఠి ప్రసూతి వైద్యశాలలో గర్భిణి మృతి చెందడంతో మృతురాలి కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. రంగారెడ్డి జిల్లా మాధపురం గ్రామానికి చెందిన మమత(25) పురిటినొప్పులతో సోమవారం సాయంత్రం కోఠిలోని ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. ఆమె మంగళవారం ఉదయం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మమత చనిపోయిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. -
ప్రియుడు బెదిరింపులు... లెక్చరర్ ఆత్మహత్య
వరంగల్ : వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పీజీ లెక్చరర్‌గా పని చేస్తున్న మమతా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. నాలుగేళ్లుగా మమతతో ప్రేమాయణం సాగించిన డాక్టర్ వెంకటరమణ... నిశ్చితార్థం జరిగాక కట్నం కోసం వేధించాడంటూ బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలో తాను మరో పెళ్లి చేసుకుంటానని మమతను వెంకటరమణ బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన మమత ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్
నోబెల్ బహుమతి గ్రహీత మదర్ థెరిసాకు పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ను ప్రకటించనున్నారు. 2016 సంవత్సరంలో ఆమెను సెయింట్‌గా ప్రకటించేందుకు పోప్ ఫ్రాన్సిస్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అనాథలకు, వృద్ధులకు అందించిన అపురూపమైన సేవలతో ప్రపంచ శాంతిదూతగా పేరొందిన థెరిస్సా ఇక దైవదూతగా అవతరించనున్నారు. మదర్ థెరిస్సా శక్తులు అద్భుతమని ఫ్రాన్సిస్ కొనియాడినట్లు ఇటలీకి చెందిన క్యాథలిక్ పత్రిక అవినైర్ ప్రచురించింది. ప్రాణాంతక మెదడు వ్యాధితో బాధపడుతున్న ఓ బ్రెజిల్ వ్యక్తిని మదర్ థెరిస్సా తన అద్భుత దివ్యశక్తితో దీవించినట్లు పోప్ పేర్కొన్నారు. తద్వారా ఆమెకు అద్భుతమైన దైవశక్తి ఉన్నట్టుగా అంగీకరించినట్టు తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరిగే కార్యక్రమంలో మదర్ థెరిస్సాకు సెయింట్ వుడ్ హోదా అధికారికంగా ప్రకటిస్తారు. వాటికన్ సిటీ నిర్ణయంపై వివిధ క్రిష్టియన్ మత సంస్థలు, మత పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేశారు. క్రైస్తవ మిషనరీస్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మదర్ థెరిసా రోమన్ క్యాథలిక్ కేంద్రమైన వాటికన్ నుంచి ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ' స్థాపనకు అనుమతి పొందారు. రోమన్ క్యాథలిక్ వ్యవస్థకు అనుబంధంగా ఉంటూ, స్వతంత్ర ప్రతిపత్తి గల ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ' ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తన సేవలందించారు. -
'దీదీ.. చిదంబరాన్ని చూసి నేర్చుకో'
ఢిల్లీ: సల్మాన్ రష్దీ పుస్తకాన్ని నిషేధించడం తప్పేనంటూ చిదంబరం ప్రకటించిన నేపథ్యంలో బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రిన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చురకలంటించారు. చిదంబరాన్ని చూసైనా నేర్చుకోవాలని దీదీకి హితవు పలికారు. తస్లిమా రచించిన ఓ టీవీ సీరియల్ తమ మనోభావాలకు విరుద్ధంగా ఉందంటూ ముస్లిం సంస్థలు అభ్యంతరం తెలపడంతో ఆ సీరియల్ ప్రసారంపై మమత ప్రభుత్వం నిషేధం విధించింది. చిదంబరాన్ని చూసైనా సీరియల్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని తస్లిమా కోరారు. తస్లిమా రచించిన 'ద్విఖండితో' పుస్తకాన్ని బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం నిషేధించింది. చిదంబరం మాదిరిగా బుద్ధదేవ్ భట్టాచార్య కూడా తన తప్పును ఎప్పుడు అంగీకరిస్తారని ఆమె ప్రశ్నించారు. -
సహనమే గెలిచింది...
కోల్ కతా: బిహార్ ఎన్నికల ఫలితాలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఫలితాలు అసహనంపై సహనంసాధించిన విజయానికి తార్కాణమని వ్యాఖ్యానించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి గెలుపు దాదాపు ఖాయమైన నేపథ్యంలో దీదీ సోషల్ మీడియాలో స్పందించారు. నితిష్, లాలుతో కూడిన మహాకూటమికి దీదీ అభినందనలు తెలిపారు. సహనానికి గెలుపు, అసహనానికి ఓటమి అంటూ ట్వీట్ చేశారు. బిహార్ లోని నా సోదర సోదరమణులకు అభినందనలంటూ ట్వీట్ చేశారు. -
వర్షాలతో అధికారులకు ప్రత్యేక బాధ్యతలు
కుత్బుల్లాపూర్ (హైదరాబాద్): రుతు పవనాల రాకతో వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు ‘మాన్సూన్’ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. వర్షపు నీరు నిండి కాలువలు పొంగి పొర్లినా.. ఇళ్లల్లోకి నీళ్లు చేరినా.. అత్యవసర పరిస్థితుల్లో స్పందించి రక్షణ చర్యలు చేపట్టేందుకు అధికారులను నియమించారు. ఆయా ప్రాంతాల వారీగా ఒక్కో అధికారిని ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచి నవంబరు 2వ తేదీ వరకు ఆయా ప్రాంతాల వారీగా అధికారుల వివరాలను శనివారం ఉపకమిషనర్ మమత వెల్లడించారు. రెండు షిప్ట్‌ల వారీగా వీరు పనిచేస్తారని తెలిపారు. అత్యవసర కంట్రోల్ రూంను సైతం 24/7 పని చేసే విధంగా 040-23085845 ను కేటాయించారు. ఇక్కడ ఓ సిబ్బందిని నియమించి ఫోన్‌కు వచ్చే కాల్స్ ఆధారంగా అధికారులు అప్రమత్తమై సహాయక చర్యల్లో పాల్గొంటారని మమత తెలిపారు. -
భూకంప బాధితులను పరామర్శించిన మమత బెనర్జి
-
ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండండి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భయోత్పాతం సృష్టించిన భూకంపం పై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర హోం మంత్రి ట్వీట్స్ చేశారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ విపత్తు నివారణ సంస్థలను అప్రమత్తం చేసినట్టు తెలిపారు. నష్ఠం జరిగినట్టుగా ఇంతవరకు ఎలాంటి ప్రాథమిక రిపోర్టు అందలేదని ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఢిల్లీలో అలజడి రేపిన భూకంపంపై ప్రశాంతంగా ఉండాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారులు రంగంలోకి దిగారు. పరిస్థితిని అంచనా వేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాష్ట్రంలో నెలకొన్న భూకంపం పరిస్థితిపై స్పందించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ఆమె తెలిపారు. ముఖ్యంగా డార్జిలింగ్, సిలిగురి తదితర ఏరియాల్లోని సీనియర్ అధికారులతో చర్చించినట్లు ఆమె తెలిపారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి వద్దంటున్నాడు..
న్యాయం చేయాలంటూ ఆందోళన కమ్మర్పల్లి : ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి తనను కాదంటున్నాడని మమత అనే యువతి ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది. వివరాలిలా ఉన్నాయి. కోనాసముందర్‌కు చెందిన మమత అదే గ్రామానికి చెందిన పరమేశ్వర్ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 18వ తేదీన హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పరమేశ్వర్ మేనమామ వీరిని 22న కమ్మర్పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. తర్వాత అడవి మామిడిపల్లికి తీసుకెళ్లి, మరుసటి ఉదయం మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి పరమేశ్వర్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తానంటే ఇష్టం లేదని పేర్కొంటున్నాడని మమత ఆరోపించింది. ఈ విషయమై పోలీసులు తమకు కౌన్సెలింగ్ నిర్వహించారని, అయినప్పటికీ పరమేశ్వర్ తనతో కలిసి ఉండడానికి అంగీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త బంధువైన ఓ కానిస్టేబుల్.. ఆయన మనసు మార్చి తనకు దూరం చేశారని ఆరోపించింది. ఆయనకు వేరొకరితో వివాహం జరిపించడానికి యత్నిస్తున్నారని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. అయితే మమత తన భర్తపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఎస్సై ప్రభాకర్ తెలిపారు. -
అందరికోసం పనిచేస్తే కేంద్రానికి మద్దతు
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు పట్ల పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్వరం మారింది. శారదా స్కాంలో తృణమూల్ నేతలనూ సీబీఐ అరెస్టు చేయడంతో పార్టీ ఇరుకున పడిన నేపథ్యంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాల కోసం నిర్మాణాత్మకంగా కృషి చేస్తే మోదీ సర్కారుకు పూర్తి మద్దతునిచ్చేందుకు తృణమూల్ సిద్ధంగా ఉండేదని మమత అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత దినం సందర్భంగా శనివారమిక్కడ వివిధ మతాల నేతల ఆధ్వర్యంలో జరిగిన మత సామరస్య ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ మేరకు మాట్లాడారు. ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తూ రాజకీయాలు చేయడాన్ని తాము అంగీకరించబోమని, పాలనను, రాజకీయాలను మిళితం చేయరాదన్నారు. ఇప్పటికైనా అన్ని వర్గాల సంక్షేమం కోసం నిర్మాణాత్మకంగా, వాస్తవికంగా పాలన సాగిస్తే కేంద్రానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని మమత వ్యాఖ్యానించారు. సమాఖ్య వ్యవస్థను గౌరవించండి: బీజేపీ మోదీ ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశానికి సమాఖ్య వ్యవస్థను గౌరవించి హాజరు కావాలని మమతకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. బెంగాల్ అభివృద్ధిపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్న ఆరోపణలను సమావేశంలో ప్రస్తావించవచ్చని కూడా సూచించినా, సమావేశానికి రాకూడదని ఆమె నిర్ణయించడాన్ని తప్పుబట్టింది. పార్టీ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ.. రాజకీయ విభేదాలను మమత మరిచిపోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధితో దేశం మొత్తాన్నీ ప్రగతిపథంలోకి తీసుకెళ్లాలన్నదే మోదీ ప్రాధాన్యమన్నారు. -
మమత బెనర్జీకి హ్యాండిచ్చిన అన్నా హజారే
-
కలల బండి ఆగేనా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మొన్న మమత... నిన్న త్రివేది... ఇపుడు మల్లికార్జున ఖర్గే... కేంద్ర రైల్వే మంత్రులు ఎవరైనా...వారి బడ్జెట్లో జిల్లాకు ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంటోంది. 2013-14 సంవత్సరం లో కొంత మోదం.. మరికొంత ఖేదం మిగిల్చిన రైల్వే బడ్జెట్ ఈ సా రైనా ఆశాజనకంగా ఉంటుందా? అన్న సంశయాలు వ్యక్తమవుతున్నాయి. గత బడ్జెట్లో సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీ దుగా బాసర, ముథ్కేడ్, ఆదిలాబాద్ వరకు డబుల్ లైన్ మంజూరు చేసినా అరకొర నిధులే కేటాయించారు. నిజామాబాద్- ముంబయి వరకు వేసిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆశాజనకంగా లేవు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైను 2014 మార్చి వరకు పూర్తి చేస్తామని ప్రకటించినా... పెండింగ్‌లోనే ఉంది. ఆర్మూర్-ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ ప్రతిపాదనకు మోక్షం కలగలేదు. ఈసారైనా మేలు జరిగేనా రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో జిల్లాకు ప్రయోజనం దక్కుతుందా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవు తున్నాయి. గత బడ్జెట్లో జిల్లాకు కొత్త రైళ్లు, నిధులు కేటాయింపులపై రాజకీయ పక్షాలు, ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభించగా, ఆ బడ్జెట్లో పేర్కొన్న పలు అంశాలు అమలుకు నోచుకోలేదు. జిల్లాలోని రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, ఫై ్లఓవర్, పుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, రైల్వే అభివృద్ధిపై బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించ లేదు. రెండు దశాబ్దాలుగా నత్తనడక నడుస్తున్న పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ మోర్తాడ్ వరకు వచ్చి ఆగిపోయింది. ఈ లైను పనులు పూర్తి చేస్తామన్నా,అమలుకు నోచుకోలేదు. ఆర్మూర్-ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ పనులు చేపట్టలేదు. జిల్లా వ్యవసాయిక, పారిశ్రామిక, వ్యాపార అభివృద్ధికి ప్రధానంగా ఉపయోగపడే ఈ రెండు కొత్త రైల్వేలైన్ల పనులకు ఈసారైనా తుదిరూపు వస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే. ఎంపీల ప్రతిపాదనలు ఫలించేనా రైల్వే బడ్జెట్ సందర్భంగా జిల్లా పరిధిలోని ఇద్దరు ఎంపీలు మధు యాష్కీ, సురేశ్ షెట్కార్ల ప్రతిపాదనలకు ఈసారైనా పూర్తిస్థాయిలో ఊరట లభిస్తుందా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత బడ్జెట్లో ఆర్మూర్ ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ వేయటానికి గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికి తగినన్ని నిధులు కేటాయించలేదు. ఫలితంగా ప్రతిపాదనలకే పరిమితమైంది. బోధన్-బీదర్ లైన్, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్లైన్లను మరచి పూర్తిగా నిరాశకు గురి చేశారు. సరుకు రవాణా భారం తగ్గించకపోగా మరింత పెం చి, ఆదర్శ స్టేషన్ల అభివృద్ధికి పైసా కూడ విదిల్చలేదు. కొత్త ప్యాసింజర్ రైళ్ల ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. ఈ నేపథ్యంలో పాత, కొత్త సమస్యలు, ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఇద్దరు ఎంపీలు ప్రకటించినా.. ఈ సారి బడ్జెట్లోనైనా ఫలితం ఉం టుందా అన్న చర్చ జరుగుతోంది. కాగా నిజామాబా ద్, కామారెడ్డి రైల్వేస్టేషన్లను ఆదర్శ రైల్వే స్టేషన్లుగా ప్రకటించి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆధునికీకరించిన దాఖలాలు లేవు. ఆదర్శంగా తీర్చిదిద్దటానికి తీసుకున్న చర్యలు కూడా లేవు. -
ప్రియుడితో పెళ్లి కాదేమోనని ఆత్మహత్య
తిమ్మాపూర్ (చందుర్తి), న్యూస్‌లైన్ : ప్రియుడితో పెళ్లి కాదేమోనని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం మండలంలోని తిమ్మాపూర్‌కు చెందిన పోతుగంటి మమత(20) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియుడితో పెళ్లికి ఆటంకం కలుగుతుందేమోనని భావించి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. మమత తల్లిదండ్రులు అంజవ్వ, సత్తయ్య తమ స్వగ్రామం రామన్నపేట నుంచి వలస వచ్చి తిమ్మాపూర్‌లో నివాసముంటున్నారు. వీరు రెండేళ్ల క్రితం బెజ్జంకి మండలం గుండ్లపల్లిలో హోటల్ నిర్వహించారు. ఆ సమయంలో మమతకు తిమ్మాపూర్ మండలం వచ్చునూర్కు చెందిన శ్రీనివాస్‌తో పరిచ యం ఏర్పడి, ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటామని నిర్ణయించుకున్నారు. శనివారం రాత్రి శ్రీకాంత్ మమత ఇంటికి వెళ్లగా ఆమె మరో సోదరి కవిత ఉంది. ఆమెకు పెళ్లి విషయం చెప్పగా, సర్పంచ్ తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలంది. దీంతో ఆయన వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం మమత తన ప్రియుడు శ్రీకాంత్‌కు ఫోన్ చేసి మాట్లాడింది. అంతలోనే బహిర్భూమికని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఎంతకూ రాకపోవడంతో అనుమానం వచ్చిన కవిత గ్రామ శివారులోని బావిలో చూడగా శవమై కనిపించింది. కాగా తమ కూతురు మృతిపై అనుమానాలున్నాయని ఆమె తల్లి అంజవ్వ ఫిర్యాదు చేసింది.