
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ అన్నారు. బుధవారం టీఎన్జీవో భవన్‌లో జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని, స్థానికత విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, స్థానికులకు మాత్రమే ఖాళీల్లో ఉద్యోగ అవకాశాలు దక్కేలా చూడాలని కోరారు.