బిహార్ ఫలితాలు అసహనంపై సహనంసాధించిన విజయానికి తార్కాణమని వ్యాఖ్యానించారు.
కోల్ కతా: బిహార్ ఎన్నికల ఫలితాలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఫలితాలు అసహనంపై సహనంసాధించిన విజయానికి తార్కాణమని వ్యాఖ్యానించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి గెలుపు దాదాపు ఖాయమైన నేపథ్యంలో దీదీ సోషల్ మీడియాలో స్పందించారు. నితిష్, లాలుతో కూడిన మహాకూటమికి దీదీ అభినందనలు తెలిపారు. సహనానికి గెలుపు, అసహనానికి ఓటమి అంటూ ట్వీట్ చేశారు. బిహార్ లోని నా సోదర సోదరమణులకు అభినందనలంటూ ట్వీట్ చేశారు.