ఆ అయిదు కీలక అంశాలు | Bihar results decoded: What went wrong for BJP, what helped GA | Sakshi
Sakshi News home page

ఆ అయిదు కీలక అంశాలు

Published Sun, Nov 8 2015 2:22 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

Bihar results decoded: What went wrong for BJP, what helped GA

పట్న:  బిహార్  అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కూటమికి  బిహార్ రాష్ట్ర ప్రజల అనూహ్య మెజారిటీ కట్టబెట్టారు.  ప్రధానంగా యాదవులు, ముస్లింల ఓట్లే మహాకూటమి గెలుసును నిర్దేశించాయని  విశ్లేషకులు భావిస్తున్నారు.  వీటితో పాటు అయిదు  ప్రధాన  అంశాలను అటు మహాకూటమి  విజయానికి, ఇటు  ఎన్డీయే కూటమి  ఘోర పరాజయానికి  కీలకమైనవి భావిస్తున్నారు.
 ముందుగా మహాకూటమి   అద్భుత విజయానికి గల కారణాలను పరిశీలిస్తే..
1.  రాష్ట్రంలో అత్యధికంగా వెనుకబడిన తరగతుల కు చెందిన కలాల ఓటర్లను మహాకూటమి ప్రభావితం చేయగలిగింది. ప్రధానంగా  యాదవులు, ముస్లిం, కుర్మి తదిరత సామాజిక వర్గాలను తన వైపు  తిప్పు కోవడంలో కూటమి నాయకత్వం విజయం సాధించింది.
2.  ఆర్ ఎస్ ఎస్  అధినేత మోహన్ భగవత్  వ్యాఖ్యల్ని ఎండగట్టడంలో మహాకూటమి  సక్సెస్ అయింది.  రిజర్వేషన్ల విషయంలో ఆయా వర్గాల ప్రజలకు  లాలూ ప్రసాద్ లాంటి అగ్రనేతలు మద్దతుగా నిలిచారు.
3.  తమ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ముందుగానే ప్రకటించి తమ కూటమి విశ్వసనీయతను పెంచారు.
4.   మత విద్వేషాలను, మత రాజకీయాలను ఎండగట్టడంలో మహాకూటమి చాలా ధృఢంగా వ్యవహరించింది. ఆ మేరకు ప్రజల్లో ప్రజాస్వామ్య భావాలను  పాదుకొల్పగలిగింది.
5. ఈ  బిగ్  ఫైట్ లో కీలక మైన అంశాలను గెలుపు  గుర్రాలను ఎంపిక. ఈ విషయంలోపార్టీల నేతల చేసిన కసరత్తు   మంచి ఫలితాలనిచ్చింది.

ఎన్డీయే కూటమికి ఎలా ప్రతికూలంగా అంశాలను పరిశీలిస్తే..
1.  బిహార్  రాజకీయ దిగ్గజాలు లాలూ, నితీష్ ల కరిష్మాను, వారి స్థాయిని అంచనా వేయడంలో  ఎన్డీయే కూటమి విఫలమైంది. వారి శక్తి సామర్ధ్యాలను, రాష్ట్ర  ప్రజల్లో వారికున్నపునాదిని  లైట్ తీసుకోవడం కొంపముంచింది.
2.     ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బీజేపీ నేతల  వైఖరి, వ్యాఖ్యనాలు ప్రధానంగా బీజేపి ఇమేజ్ ను దెబ్బతీశాయి. వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యనాలు పార్టీ విజయాన్ని సుదూరం నెట్టివేశాయని అంచనా.
3. బీజేపీ  కూటిమికి ముసలం తెచ్చిపెట్టిన మరో కీలక అంశం  ఆర్ ఎస్ ఎ స్  అధినేత మోహన భగవత్  వివాదాస్పద వ్యాఖ్యలు
వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు అవసరం లేదన్న భగవత్ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.  ఇవి ఆయా వర్గాల ప్రజల్లోతీవ్ర   అసంతృప్తిని రాజేశాయని  పరిశీలకుల భావన.
4.  ఇక మరో ప్రధాన అంశంగా చెప్పుకోవాల్సింది.  పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు. టిక్కెట్ల కేటాయింపులో రగిలిన అసంతృప్తులు మహాకూటమి విజయాన్ని సానుకూలం చేశాయి.
5.  చివరిది అతి కీలకమైన అంశం ముఖ్యమంత్రి  అభ్యర్థిని ప్రకటించడంలో పూర్తిగా వైఫ్యలం చెందడం ఎన్డీయేకి  ప్రతికూలంగా మారిపోయింది.  ఈ విషయంలో సాధించని ఏకాభిప్రాయం   కూటమిలోని విభేదాలు చెప్పకనే  చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement