నితీష్ ఫేసు.. లాలూ బేసు | Nitish's face, Lalu's base helped us, says JD-U leader | Sakshi
Sakshi News home page

నితీష్ ఫేసు.. లాలూ బేసు

Published Sun, Nov 8 2015 11:42 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

నితీష్ ఫేసు.. లాలూ బేసు - Sakshi

నితీష్ ఫేసు.. లాలూ బేసు

పట్నా: బిహార్  అసెంబ్లీ ఎన్నికల్లో  ఆ ఇద్దరు అధినేతల ఫేసు, బేసు మహాకూటమికి మహావిజయాన్ని అందించాయని జేడీయూ నేత   నావల్  శర్మ వ్యాఖ్యానించారు. ఆ ఇద్దరు మరెవ్వరో కాదు. ఒకరు జేడీయూ అధినేత నితీష్ కుమార్, రెండోవారు ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్. ఇది ప్రజల విజయమని వ్యాఖ్యానించిన ఆయన.. నితీష్  మెరిసిపోయే ముఖం, రాష్ట్రంలో లాలుకున్న పటిష్టమైన పునాదే తమకు ఇన్ని స్థానాలను సాధించి పెట్టాయన్నారు. రాష్ట్రప్రజలకు తాము చేసిన సేవలే తమకు ఇంతటి అపూర్వమైన విజయాన్ని అందించాయన్నారు.

 

బీజీపీ కుట్రపూరిత ఎత్తుగడలే వారిని  ఓడించాయన్నారు.  దాద్రి, పాకిస్తాన్, ఆవు, బీఫ్ లాంటి అంశాలేవీ బీజేపీ కాపాడలేకపోయాయన్నారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన  బిహార్ అసెంబ్లీ ఎన్నికల  ఓట్ల లెక్కింపులో మహాకూటమి ఇప్పటికే 161 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  ఆధిక్యంలో కొనసాగుతూ ప్రభుత్వ స్థాపన దిశగా  అడుగులు వేస్తోంది.  అటు బీజేపీ  కూటమికి ఓటమిని  అంగీకరించినట్టే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement