పట్నా: తాను ప్రారంభించబోయే రాజకీయ పార్టీ ప్రాథమిక ఎజెండాను రాజకీయ వ్యూవహకర్త ప్రశాంత్‌కిశోర్ ఆదివారం(ఆగస్టు4) ప్రకటించారు. బిహార్ నుంచి యువత వలసలు ఆపడానికి, బిహార్‌ను నితీశ్, లాలూల నుంచి విముక్తి చేయడమే తన పార్టీ ప్రధాన ఎజెండా అని చెప్పారు. అక్టోబర్ 2న కోటి మంది బిహారీలు సమావేశమై తమ పిల్లల భవిష్యత్తును నిర్ణయించుకుంటారన్నారు.
‘అక్టోబర్ 2న ప్రశాంత్‌కిశోర్ పార్టీ ప్రారంభించడం లేదు. బిహార్ ప్రజలు కొత్త పార్టీ ప్రారంభించుకుంటున్నారు. నితీశ్‌కుమార్, లాలూ ప్రసాద్‌లను వదిలించుకుని తమ పిల్లల భవిష్యత్తును నిర్ణయించుకోబోతున్నారు. గతంలో నేను రాజకీయ పార్టీల గెలుపు కోసం పనిచేశాను. ఇప్పుడు మాత్రం బిహార్ ప్రజలకు వ్యూహకర్తగా పనిచేయబోతున్నాను’అని చెప్పారు.
కాగా,ప్రశాంత్‌కిశోర్ జన్‌సురాజ్ పేరుతో బిహార్‌లో పాదయాత్ర చేశారు. జనసురాజ్‌ను అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రాజకీయ పార్టీగా ప్రకటించనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జన్‌సురాజ్ పోటీ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment