Prashant Kishore
-
నితీశ్, లాలూ పీడ వదిలించడమే ఎజెండా: ప్రశాంత్‌కిశోర్
పట్నా: తాను ప్రారంభించబోయే రాజకీయ పార్టీ ప్రాథమిక ఎజెండాను రాజకీయ వ్యూవహకర్త ప్రశాంత్‌కిశోర్ ఆదివారం(ఆగస్టు4) ప్రకటించారు. బిహార్ నుంచి యువత వలసలు ఆపడానికి, బిహార్‌ను నితీశ్, లాలూల నుంచి విముక్తి చేయడమే తన పార్టీ ప్రధాన ఎజెండా అని చెప్పారు. అక్టోబర్ 2న కోటి మంది బిహారీలు సమావేశమై తమ పిల్లల భవిష్యత్తును నిర్ణయించుకుంటారన్నారు.‘అక్టోబర్ 2న ప్రశాంత్‌కిశోర్ పార్టీ ప్రారంభించడం లేదు. బిహార్ ప్రజలు కొత్త పార్టీ ప్రారంభించుకుంటున్నారు. నితీశ్‌కుమార్, లాలూ ప్రసాద్‌లను వదిలించుకుని తమ పిల్లల భవిష్యత్తును నిర్ణయించుకోబోతున్నారు. గతంలో నేను రాజకీయ పార్టీల గెలుపు కోసం పనిచేశాను. ఇప్పుడు మాత్రం బిహార్ ప్రజలకు వ్యూహకర్తగా పనిచేయబోతున్నాను’అని చెప్పారు. కాగా,ప్రశాంత్‌కిశోర్ జన్‌సురాజ్ పేరుతో బిహార్‌లో పాదయాత్ర చేశారు. జనసురాజ్‌ను అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రాజకీయ పార్టీగా ప్రకటించనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జన్‌సురాజ్ పోటీ చేయనుంది. -
అక్టోబర్ 2న ప్రశాంత్‌కిశోర్ కొత్త పార్టీ
పట్నా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడి అవతారమెత్తనున్నారు. బిహార్‌లో ఆయన ప్రారంభించిన జన్‌సురాజ్ అభియాన్ సంస్థ గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ 2న రాజకీయ పార్టీగా మారనుంది. రాజకీయ పార్టీగా మారేముందు ప్రశాంత్‌కిశోర్ పెద్దఎత్తున కసరత్తు చేయనున్నారు.అక్టోబర్ 2కు ముందు జన్‌సురాజ్ తమ నేతలతో ఎనిమిది రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహించనుంది. ప్రశాంత్‌కిశోర్ పాదయాత్ర కోసం పనిచేసిన లక్షన్నర మంది కార్యకర్తలతో రాష్ట్రవ్యాప్త సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలన్నింటిలో పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉండాలి.. విధి విధానాలు ఏంటి..పార్టీ ప్రాధాన్యాలేంటన్న విషయాలపై చర్చించి ఫైనల్ చేయనున్నారు.జన్‌సురాజ్ పేరు మీద బిహార్‌లో ప్రశాంత్‌కిశోర్ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సభల్లో విద్య, వైద్యం, యువతకు ఉద్యోగ అవకాశాలపైనే ఎక్కువ ఫోకస్ చేసి ప్రసంగించారు. కాగా, ఇటీవల తమ కార్యకర్తలెవరూ జన్‌సురాజ్‌తో సంబంధాలు నెరపొద్దని బిహార్ ప్రతిపక్షపార్టీ ఆర్జేడీ ఒక అంతర్గత సర్కులర్ జారీ చేసింది. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బిహార్‌లో అత్యంత బలమైన పార్టీ అని చెప్పుకునే ఆర్జేడీ తమను చూసి భయపడుతోందని జన్సురాజ్ఎద్దేవా చేసింది. -
పీకేవన్నీ తప్పుడు అంచనాలే
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్(పీకే) అంచనా తప్పుతోంది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ‘ది వైర్’ వెబ్సైట్, చానల్ కోసం ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్‌థాపర్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి 2022 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని అప్పట్లో పీకే జోస్యం చెప్పారు. అయితే హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇదే అంశాన్ని కరణ్‌థాపర్ ఎత్తిచూపుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో 300కు పైగా లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని నిలదీశారు. దీనిపై పీకే స్పందిస్తూ తాను హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పలేదని బుకాయించారు. కానీ అప్పట్లో పీకే చెప్పిన జోస్యంపై జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తల క్లిప్పింగ్‌లను కరణ్‌థాపర్ చూపడంతో ఆయన తెల్లబోయారు. పత్రికల్లో వచ్చే వార్తలకు విశ్వసనీయత ఉండదంటూ తప్పించుకునేందుకు యత్నించగా... ఇదే అంశంపై అప్పట్లో పీకే స్వయంగా చేసిన ట్వీట్లను ఎత్తిచూపారు. దీంతో అడ్డంగా దొరికిపోయిన పీకే ఉక్రోషంతో ఊగిపోయారు. మీరు జర్నలిస్టే కాదంటూ కరణ్‌థాపర్‌పై విరుచుకుపడ్డారు. బిహార్‌లో రాజకీయాలు కలసి రాకే... పశ్చిమ బంగా ఎన్నికల తర్వాత ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనంటూ ప్రతిజ్ఞ చేసిన పీకే ఐప్యాక్ నుంచి తప్పుకున్నారు. బిహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బిహార్ సీఎం నితీష్‌కుమార్ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. కొన్నాళ్లకు ఆయనతో విభేదించి సొంత పార్టీ స్థాపించి బిహార్‌లో పాదయాత్ర చేశారు. దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో రాజకీయంగా ఇక మనుగడ సాగించలేమని తెలిసి డబ్బుల కోసం ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పంచన చేరి ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు. ఏపీలోనూ ఆయన అంచనాలు తారుమారే గతేడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన చెబితే కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికార పీఠం అధిష్టించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్ కిశోర్ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాబు పలుకులే చెబుతూ..ప్రశాంత్‌కిశోర్ ప్రస్తుతం ఏ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదన్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ ఏప్రిల్ 12న ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారనీ, అందుకే ఏపీలో చంద్రబాబుకు, పశ్చిమ బంగాలో బీజేపీకి అనుకూలంగా జోస్యం చెబుతున్నారని ఆమె స్పష్టం చేశారు. దీనిని బట్టి చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఆయన బాబే గెలుస్తారంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతున్నట్టు తేటతెల్లమైంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టుతో భయపడిన నారా లోకేశ్ ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో పీకేను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని వేడుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి విజయవాడకు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్‌లో తీసుకొచ్చారు. ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనూ తాను ఏ పార్టీకీ వ్యూహకర్తగా పని చేయడం లేదని పీకే చెప్పిన విషయం అబద్ధమని తరువాత అందరికీ తెలిసిందే. -
రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భవితవ్యంపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకవేళ పరాజయం పాలైతే రాహుల్‌గాంధీ రాజకీయాల నుంచి కొంత కాలం విరామం తీసుకోవాలని సూచించారు. ‘మీ సొంత వ్యూహాల మీద మీరు ఎన్నికలకు వెళ్లారు. ఇలాంటప్పుడు మీ పార్టీ ఓడిపోతే మీరు విరామం తీసుకోవడం వ్యూహాత్మకంగా, నైతికంగా సరైనది’అని రాహుల్‌ను ఉద్దేశించి పీకే అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 300 సీట్ల దాకా గెలుచుకునే అవకాశాలున్నాయని పీకే చెప్పుకొచ్చారు. -
కాపీ కొట్టిన మేనిఫెస్టోనే అంతా చెబుతోంది!
తెలుగు దేశం పార్టీ కోసం పనిచేస్తున్న ‘కన్సల్టెన్సీ’ హెడ్ రాబిన్ శర్మ ‘‘ఎన్నికల్లో టీడీపీ గెలుపు దుర్లభమనీ, తాము చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదనీ, చంద్రబాబుకు ఏమాత్రం విశ్వసనీయత లేక పోవడమే అసలు సమస్య’’ అనడం రేపు ‘పోలింగ్ బూత్’లో తటస్థ ఓటరుపై గట్టి ప్రభావం చూపి స్తుంది. ఎందుకంటే, ఇది మరొక ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటున్న మాట కాదు. మన కోసం మనం ‘ఫీజు’ కట్టి పెట్టుకున్న ‘సర్వీస్ ప్రొవైడర్’ వ్యక్తం చేసిన నిస్సహాయత. ఇది ఎటువంటిది అంటే, మన ‘ఫ్యామిలీ డాక్టర్’– ‘‘మీ జబ్బును నేను తగ్గించ లేకపోతున్నాను’’ అని పెదవి విరవడం వంటిది. వాళ్ళు అటువంటి ముగింపుకు రావడానికి కారణం, ఆరు నెలల క్రితం ‘మేనిఫెస్టో’లో నుంచి ‘బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ’ పేరుతో ‘సూపర్ సిక్స్’ పథకాలు ‘ట్రయిల్’ కోసం విడుదల చేశారు. ఆ తర్వాత దానికి విస్తృతంగా ప్రచారం చేసినా ప్రజల నుండి స్పందన లేదు. ఈ ‘టీం’ ఇటువంటి అభిప్రాయానికి రావడానికి ఇదే ప్రధాన కారణం అయింది. ఈ దశలో ‘రిస్క్ మేనేజ్మెంట్’ కోసం ప్రశాంత్ కిషోర్ తెరపైకి వచ్చి, తన ప్రకటనకు ముందూ వెనుకా ఎటువంటి వివరణ లేకుండా, ‘ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవదు’ అని ఏకవాక్య ప్రకటన చేసి మళ్ళీ ఎక్కడా కనిపించకుండా నిష్క్రమించారు. ఈ ప్రకటన మనం నమ్మడం కోసం ముందుగా – ‘ఈ ఎన్నికల్లో నేను టీడీపీ కోసం పనిచేయడం లేదు’ అని ప్రకటించాక, ‘వైఎస్సార్సీపీ గెలవదు’ అన్నారు. ఇది జరిగాక కావొచ్చు, చివరి ప్రయత్నంగా ప్రశాంత్ కిషోర్– ‘వదలొద్దు మరో ప్రయత్నం చేయండి’ అని రాబిన్ శర్మ బృందానికి సూచించారు. ఇప్పుడు టీడీపీ పూర్తి స్థాయిలో ‘మేనిఫెస్టో’ వెల్లడించిన తర్వాత కూడా అన్ని ‘సర్వే’ నివేదికలు జగన్‌కు అనుకూలంగా ఉన్నాయి. సరిగ్గా ఈ కాలంలోనే, చంద్రబాబు తన ప్రసంగాల్లో ‘బ్యాలెన్స్’ కోల్పోవడం మొదలయింది. సభకు వచ్చినవాళ్లను ‘మీ ఊళ్లో గంజాయి దొరుకుతోందా’ అని గుచ్చి గుచ్చి అడుగుతూ తనకు అనుకూలమైన సమా ధానం పొందేందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థిని సాధారణంగా శత్రు వుగా చూడరు. జగన్ విషయంలో బాబు ఆ హద్దు ఎప్పుడో దాటారు. ఎప్పుడైనా ఎన్నికల ‘నోటిఫికేషన్’ అంటే చంద్ర బాబుకు ఆయన పార్టీ అభ్యర్థులకు అది ‘టెండర్ నోటీస్’ వంటిది. అందుకే ఎన్నికల సమయానికి ఆర్థిక నేరస్థులూ, ‘ఎన్నారై’లూ అ పార్టీలో అభ్య ర్థులుగా ఉంటారు. వీరి వద్ద నుంచి నిధులను సమీకరించి ముందుగా వాటిని తన నేలమాళిగలో దాచి, అప్పుడు తన పార్టీ ‘మేనిఫెస్టో’ అంటూ బాబు ప్రజల ముందు ‘టెండర్’ దాఖలు చేస్తారు. గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఐదేళ్ళ సంపాదనముందుగా దాచిన దానికి అదనం. ప్రతి ఎన్నికలో బాబుది ఇదే ‘ఫార్ములా’. అందుకే, ప్రతిపక్ష నాయ కుడిగా బాబు ఎలాగోలా నెట్టుకుంటూ తన పార్టీ ఉనికిని ఎన్నికల వరకు దొర్లించి, చివరిలో ఎవరో కొందరి మద్దతు తీసుకుని; మళ్ళీ తన టోపీని ఎన్నికల ‘ఎరీనా’లోకి విసురుతారు. గెలిస్తే, ‘డబల్ బెనిఫిట్’; ఓడిపోతే, ‘సింగిల్ బెనిఫిట్’. బాబుకు ఎన్నికలు అంటే, ఇంత ‘సింపుల్’.అందుకే గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను తప్పు పట్టిన బాబు, ఎన్నికల ముందు ‘సూపర్ సిక్స్’ అంటూ అరువు తెచ్చుకున్న అంశాలతో ‘కిచిడీ’ మేనిఫెస్టో’ ప్రకటించారు. అందులోని అంశాలు: టీడీపీ అధికారంలోకి వస్తే ‘మహా శక్తి’ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు ‘స్త్రీనిధి‘ కింద నెలకు 1500 రూపాయలు, ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే.. వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున, ‘దీపం‘ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయడం, స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. జగన్ సంక్షేమ పథకాలను తప్పు పట్టి, మళ్ళీ వాటినే పేర్లు మార్చి అమలుచేస్తాననే ఈ ‘యూ టర్న్’ ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు మనం మూడు చోట్ల వెతకాలి. మొదటిది అమరావతి. బాబును నమ్మి అక్కడ భూములు కొన్న ‘ఎన్నారై’లకు ఈ ఎన్నికల్లో బాబు గెలుపు అవసరం. అది వారికి జీవన్మరణ సమస్య. అందుకే వాళ్ళు స్వయంగా నెల ముందుగా ఇండియా వచ్చి టీడీపీ కోసం ఇక్కడ ప్రచారం చేసే పనిలో ఉన్నారు. రెండవది – ‘మార్గదర్శి’ రామోజీరావు భవిష్యత్తు. మూడవది – పై రెండింటి కంటే సంక్లిష్టమైన కొడుకు లోకేష్ చుట్టూ అల్లుకుని ఉన్న కుటుంబ చట్రంలో నుంచి బాబు క్షేమంగా బయటపడటం. బయట నుంచి దీన్ని చూస్తున్న మనకే వీటికి పరిష్కారం ఉందని అనిపించడం లేదు. ఇంకా మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయో వాటి సంగతి ఏమిటో... మరో నెల రోజులు కాలం తర్వాత తెలుస్తుంది. - వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు మొబైల్: 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
కూటమి చిలుక 'పీకే'
సాక్షి, అమరావతి: తాను ఏ రాజకీయ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదంటూ ప్రశాంత్ కిశోర్ (పీకే) వల్లె వేస్తున్న మాటల్లో వీసమెత్తు నిజం లేదని స్పష్టమైంది. ఏపీలో టీడీపీ–బీజేపీ కూటమికి పీకే ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్నట్లు పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ఈమేరకు బుధవారం టీవీ 9 బంగ్లా చానెల్‌కు మమతా బెనర్జీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘పీకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు, పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అనుకూలంగా పీకే జోస్యం చెబుతున్నారు’ అని వెల్లడించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలను బట్టి పీకే చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకనే టీడీపీ గెలిచే అవకాశం ఉందంటూ చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా జోస్యం చెబుతున్నట్లు తేలిపోయింది. బాబు అరెస్టు తరువాత.. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అనంతరం భయపడి ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో నారా లోకేష్ పీకేను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని వేడుకున్నారు. ఈక్రమంలో చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు అక్కడి నుంచి విజయవాడకు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్‌లో లోకేష్ తీసుకొచ్చారు. ఉండవల్లిలోని తమ అక్రమ నివాసంలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు తాను ఏ పార్టీకీ వ్యూహకర్తగా పని చేయడం లేదని పీకే చెప్పారు. బిహార్‌లో కలసి రాకపోవడంతో.. బెంగాల్ ఎన్నికల తర్వాత 2021లో ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయనంటూ పీకే ప్రతినబూని ఐప్యాక్ నుంచి తప్పుకున్నారు. బిహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బిహార్ సీఎం నితీ‹Ùకుమార్ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. ఆపై నితీశ్‌తో విభేదించి సొంత పార్టీ స్థాపించి పాదయాత్ర చేసినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. దీంతో రాజకీయంగా బిహార్‌లో తన పప్పులు ఉడకవని గ్రహించిన పీకే డబ్బుల కోసం ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పేందుకు అలవాటుపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకుంటూ టీడీపీకి అవసరమైనప్పుడల్లా ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు. ఆ జోస్యాలన్నీ తప్పే.. అటు బిహార్‌లో రాజకీయంగా చెల్లక.. ఇటు ఇం‘ధనం’ లేక కొట్టుమిట్టాడిన పీకే తనకు ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యాలు చెప్పేందుకు అలవాటు పడ్డారు. గతేడాది చివరిలో తెలంగాణ, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని పీకే చెబితే చివరకు అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందని పీకే ఢంకా భజాయిస్తే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని, గత ఎన్నికల్లో టీడీపీ తరపున వకాల్తా తీసుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్ కిశోర్ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాబు సేవలో ‘పీకే’ ఏపీ రాజకీయాల్లో తలమునకలు బెంగాల్ సీఎం మమత వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం లేదన్నారు. ఐప్యాక్ సంస్థకు చెందిన ప్రతీక్ జైన్, ఆయన బృందం తమకు వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తలమునకలై ఉన్నట్లు చెప్పారు. ఆయన టీడీపీ, బీజేపీల కోసం పనిచేస్తున్నారన్నారు. తాజాగా బెంగాల్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో మమతా ఈ విషయాలను వెల్లడించారు. పీకే బీజేపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టే ఎన్డీఏ కూటమి మళ్లీ విజయం సాధిస్తుందంటూ పదే పదే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ వెలుపల ఆయన ప్రభావం, ప్రమేయం పెద్దగా లేదన్నారు. -
వ్యూహకర్తలు హ్యాండ్సప్.. జారిన జాకీలు!
సాక్షి, అమరావతి: ఎన్ని ఎత్తుగడలు వేసినా.. ఎంత హైప్ ఇచ్చినా.. జాకీల నుంచి పొక్లెయిన్ల దాకా అన్నీ వాడి చూసినా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గ్రాఫ్ ఏమాత్రం పెరగడం లేదని పార్టీ వ్యూహకర్తలు తేల్చేశారు! తాము చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదని, ఎన్నికల్లో టీడీపీ గెలుపు దుర్లభమని పార్టీ ప్రధాన వ్యూహకర్త రాబిన్ శర్మ చేతులెత్తేశారు. టీడీపీ ముఖ్య నేతల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబుకు ఏమాత్రం విశ్వసనీయత లేకపోవడమే అసలు సమస్య అని రాబిన్ బృందం తేల్చింది. ప్రజలు ఆయన చెప్పే మాటలను నమ్మడం లేదని, అందువల్లే ఆరు నెలల ముందే విడుదల చేసిన శాంపిల్ మేనిఫెస్టో నిష్ఫలంగా మారిందనే అంచనాకు వచ్చారు. ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో సూపర్ సిక్స్ పథకాల గురించి ఎంత ఊదరగొట్టినా, ఇంటింటికీ తిరిగి రిజిస్ట్రేషన్ల కోసం వేడుకున్నా జనం పట్టించుకోలేదని వారి సర్వేల్లో తేలింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం, మాట నిలబెట్టుకోకపోవడం వల్లే చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలు నమ్మదగ్గవి కావనే అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నట్లు గుర్తించారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన అన్ని పనులను సీఎం అయ్యాక చేయడం, 99 శాతం హామీలను అమలు చేయడంతో ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత బలంగా నాటుకుందని నిర్థారించుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఎంత గొప్ప పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నమ్మబలికినా జనం నమ్మే అవకాశాలు లేవనే అంచనాకు వచ్చారు. పొత్తు బెడిసికొట్టింది.. ఓట్ల బదిలీ అసాధ్యం బీజేపీ, జనసేనతో టీడీపీ కుదుర్చుకున్న అవకాశవాద పొత్తు బెడిసికొట్టినట్లు రాబిన్ శర్మ సర్వేలు తేల్చినట్లు సమాచారం. రాజకీయ అవసరాల కోసం కుదుర్చుకున్న అసహజ పొత్తుగా ప్రజలు దీన్ని గుర్తించినట్లు గ్రహించారు. పొత్తులతో సీట్ల సర్దుబాటు కూడా ఆశాజనకంగా లేదని వెల్లడైంది. దీంతో ఏ రకంగా చూసినా టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఓట్ల బదలాయింపు సాధ్యం కాదని తేలింది. నియోజకవర్గాల స్థాయిలో మూడు పార్టీలు కలవలేదని, జనసేన ఓట్లు టీడీపీకి వచ్చే అవకాశాలు చాలా స్వల్పమేనని అంచనా వేశారు. పొత్తు కుదిరాక పవన్ కళ్యాణ్ బలహీనంగా మారడంతో ఆయనకున్న కొద్దిపాటి ఓటు బ్యాంకుకు గండి పడుతున్నట్లు నిర్థారించుకున్నారు. ఇక బీజేపీకి ఉన్న ఓట్లే తక్కువ కావడంతోపాటు అవి టీడీపీకి బదిలీ అవడం కష్టమేనని తేల్చారు. బీజేపీతో కలవడం వల్ల టీడీపీకి ఉన్న స్వల్ప మైనారిటీల ఓట్లు కూడా దూరమైనట్లు గుర్తించారు. జనసేన, బీజేపీకి కేటాయించిన 31 సీట్లలో ఆ పార్టీలు గెలిచే సీట్లు అరడజను కూడా లేవని వారి సర్వేలో నిర్థారణ అయినట్లు సమాచారం. అమ్ముకుంటే గెలిచేది ఎలా? అనేక సీట్లను తాము సూచించిన వారికి కాకుండా బయట వ్యక్తులకు కేటాయించడాన్ని రాబిన్ శర్మ తీవ్రంగా తప్పబట్టినట్లు తెలిసింది. నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు, పలు సమీకరణాలు, రకరకాల పొందికల ఆధారంగా తాము ప్రతిపాదించిన వారికి సీట్లు ఇవ్వకపోవడం ప్రధాన తప్పిదంగా ఆయన ప్రస్తావిస్తున్నారు. సర్వేలను పట్టించుకోకుండా, పార్టీ కోసం పని చేసిన వారిని వదిలేసి బయట వ్యక్తులకు సీట్లు ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. డబ్బు మూటలతో అప్పటికప్పుడు దిగిన ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు సీట్లు అమ్ముకుంటే ఇక గెలవడం ఎలా సాధ్యమని ఆయన నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అర్బన్ సీటును పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న ప్రభాకర చౌదరికి కాకుండా పెద్దగా తెలియని దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌కి కేటాయించడంపై రగడ జరిగిన విషయం తెలిసిందే. ఇలా బయట వ్యక్తులకు సీట్లు ఇచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాలు 30 వరకూ ఉన్నట్లు రాబిన్ శర్మ చెబుతున్నారు. స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా 8 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏలూరు ఎంపీ స్థానాన్ని రాయలసీమకు చెందిన వ్యక్తికి ఇవ్వడం లాంటి అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. తాము చేసిన సర్వేలు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు విరుద్ధంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ నిర్ణయాలు తీసుకున్నారని, దీంతో తమ బృందాలు మూడేళ్లుగా పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరులా వృథా అయిందని రాబిన్ బృందం వాపోతున్నట్లు సమాచారం. దిద్దుకోలేని తప్పులు.. గెలవడం దుర్లభం తమ వ్యూహాలకు అనుగుణంగా పార్టీ నడుచుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల దిద్దుకోలేని తప్పులు జరిగాయని రాబిన్ శర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీతో కలిసి పని చేయడంలో అర్థం లేదని ఆయన తేల్చి చెప్పడంతో చంద్రబాబు బుజ్జగించి కొద్దిరోజులు ఆపినట్లు తెలిసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, తీసుకున్న నిర్ణయాలపైనా రాబిన్ బృందం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన చంద్రబాబు తన పలుకుబడి ఉపయోగించి రాబిన్ శర్మ గురువైన ప్రశాంత్ కిశోర్‌ను పిలిచి మధ్యవర్తిత్వం చేయాలని కోరారు. దీంతో పీకే జోక్యం చేసుకుని సర్దుబాటు చేయడంతో ప్రస్తుతం అయిష్టంగానే రాబిన్ శర్మ బృందం టీడీపీ కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో పీకే సైతం సంక్షేమ పథకాలు, విశ్వసనీయత విషయాల్లో సీఎం జగన్‌తో చంద్రబాబు పోటీ పడలేరని చెప్పినట్లు తెలిసింది. వ్యూహకర్తలు ఇచ్చిన ఈ షాకులతో చంద్రబాబు అయోమయంలో మునిగిపోయారు. రాబిన్ శర్మ చెప్పినట్లు అభ్యర్థులను మార్చలేక, కొనసాగించలేక సతమతమవుతున్నారు. అభ్యర్థులను మార్చాలంటే లోకేష్ వారి వద్ద నుంచి రూ.కోట్లలో వసూలు చేసిన డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలి. అందుకు చినబాబు ససేమిరా అనడంతో చంద్రబాబు కక్కలేక మింగలేక మిన్నకుండిపోయారు. -
పీకే మాటలకు విలువే లేదు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రశాంత్‌కిషోర్ (పీకే) మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, బతుకు దెరువు కోసం సర్వే సంస్థ పేరుతో రోజుకో మాట మాట్లాడుతాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. గాం«దీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల పీకే సర్వేల పేరిట చెపుతున్న జోస్యాలను కొట్టిపారేశారు. పీకే మాటలకు విలువ లేదని తేల్చి చెప్పారు. దేశంలో గెలిచేది బీజేపీ అని ఓసారి, ఇంకోసారి కాంగ్రెస్ అని అంటాడని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తారని చెప్పాడని, కానీ కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు. పీకే సర్వేలకు, మాటలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పారీ్టకి 12 నుంచి 14 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ పాలనకు వంద మార్కులు రేవంత్ పాలనకు వంద మార్కులు వేస్తున్నట్లు జగ్గారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటే బాగుంటుందనే రేవంత్‌రెడ్డి కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో కింగ్, కింగ్ మేకర్ రాహుల్ గాంధీనే అని స్పష్టం చేశారు. కరువు కాంగ్రెస్‌తో వచి్చందని మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు వర్షాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలుసుకునే తెలివి లేదా అని విమర్శించారు. కేసీఆర్ ఇంకా ఓటమి ఫ్ర్రస్టేషన్లోనే ఉన్నారన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఏ విషయంపైనా కనీస అవగాహన ఉండదని విమర్శించారు. బీజేపీ బౌండరీలో మంద కృష్ణ రాజకీయాలు బీజేపీ బౌండరీలో ఉండి మంద కృష్ణ మాదిగ రాజకీయాలు మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. న్యూట్రల్‌గా ఉంటే ఆయన ఏం అడిగినా సమాధానం చెప్పేవాళ్లమన్నారు. బీజేపీ తెలంగాణలో మాదిగను రాజ్యసభ సభ్యుడిని చేయమని గానీ కేంద్ర మంత్రిని చేయాలని గానీ మంద కృష్ణ అడిగారా అని ప్రశ్నించారు. బంగారు లక్ష్మణ్‌ని నవ్వులపాలు చేసినప్పుడు మంద కృష్ణ కనీసం స్పందించలేదని గుర్తు చేశారు.పార్టీ ఫిరాయింపులపై తాను మాట్లాడలేనని, ఎందుకంటే తానే పార్టీలు మారి వచ్చానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. -
మళ్లీ పలికిన బాబు చిలక
వరదలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డి పోచ దొరికినా ఆశగా దాన్ని పట్టుకుంటాడు. అలాగే ప్రజా వ్యతిరేక వరదలో కొట్టుకుపోతున్న చంద్రబాబు.. ప్రశాంత్ కిషోర్ అనే గడ్డిపోచ పట్టుకుని ఎన్నికల్లో గట్టెక్కేయాలని తెగ ఆరాట పడుతున్నారు. అయితే ఈ గడ్డిపోచ పరిస్థితి ఇప్పటికే తెగిన గాలిపటంలా మారిందని దేశ వ్యాప్తంగా అందరికీ తెలుసు. మాకక్కర్లేదని రెండు జాతీయ పార్టీలు విసిరికొడితే ఉనికి కోసం పాట్లు పడుతున్న ఇతగాడు చంద్రబాబు గూటికి చేరారు. అలాగని ఆ విషయాన్ని ధైర్యంగా బయటకు చెప్పే ధైర్యం లేదు. రాజకీయాలకు పనికి రాక, ఒంటరిగా ఏమీ చేయలేక.. బాబు ఇచ్చింది పుచ్చుకుని ఆయన చెప్పిన మాటలను వల్లె వేస్తున్నారు. సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన–బీజేపీతో జట్టు కట్టినా.. కాంగ్రెస్‌తో కలిసి కుట్రలు చేస్తున్నా వైఎస్సార్సీపీ ప్రభంజనంలో కొట్టుకుపోవడం ఖాయమని.. గత ఎన్నికల కంటే ఘోర పరాజయం తప్పదని గ్రహించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉనికి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. గత ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్‌తో ఎప్పటికప్పుడు టీడీపీ గెలుస్తుందంటూ చిలక జోస్యం చెప్పించిన చంద్రబాబు.. ఇప్పుడు అదే రీతిలో ప్రశాంత్ కిశోర్(పీకే)తో టీడీపీకి అనుకూలంగా జోస్యం చెప్పిస్తున్నారు. నెల క్రితం వల్లె వేసిన మాటలనే ఆదివారం పీటీఐ ప్రతినిధుల భేటీలో మరోమారు చెప్పించారు. అటు దేశంలో.. ఇటు రాష్ట్రంలో విస్తృత యంత్రాంగం ఉన్న టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన డజనుకుపైగా సర్వేల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధిస్తుందని స్పష్టమైంది. కానీ.. ఏ యంత్రాంగం లేని ప్రశాంత్ కిశోర్ – ప్యాకేజీ కోసం చంద్రబాబు చెప్పే మాటలనే జోస్యంగా వెల్లడిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాక లగడపాటిలానే ప్రశాంత్ కిశోర్ కూడా మాయం కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ జోస్యాలన్నీ తప్పే పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనని భీషణ ప్రతిజ్ఞ్ఞ చేసి.. ఐప్యాక్ నుంచి తప్పుకుని.. బీహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బీహార్ సీఎం నితీష్‌కుమార్ పంచన చేరి, జేడీ(యూ) నేతగా చలామణి అయ్యారు. ఆ తర్వాత నితీశ్‌తో విభేదించి.. సొంత కుంపటి పెట్టుకుని బీహార్‌లో పాదయాత్ర చేశారు. అయినప్పటికీ బీహార్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. అంటే.. అక్కడ చెల్లని కాసుగా ముద్రపడ్డారు. ఇదే సమయంలో ఇక్కడ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడంతో భయపడి ఢిల్లీలో తలదాచుకున్న లోకేశ్.. రాజకీయంగా బీహార్‌లో గిట్టుబాటుకాని ప్రశాంత్ కిశోర్‌ను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని కోరారు. ఆ క్రమంలోనే చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యాక.. ప్రశాంత్ కిశోర్‌ను సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్‌లో లోకేశ్ విజయవాడకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉండవల్లిలోని తమ అక్రమ నివాసంలో చంద్రబాబు ఎదుట కూర్చొబెట్టారు. అప్పుడు మాత్రం తాను ఏ పార్టీకి వ్యూహకర్తగా పని చేయనని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ఈ క్రమంలోనే గతేడాది ఆఖర్లో తెలంగాణ, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ జోస్యాలన్నీ తప్పాయి. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ కుండబద్ధలు కొడితే.. అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే.. ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది. డబ్బుల కోసమే ఆ మాటలు.. ఐప్యాక్ నుంచి తప్పుకున్న ప్రశాంత్ కిశోర్.. డబ్బుల కోసమే చంద్రబాబు చెప్పిన మాటలను తన జోస్యంగా వల్లె వేస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎలాంటి యంత్రాంగం, వ్యవస్థ లేని ప్రశాంత్ కిశోర్.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులను ఎలా అంచనా వేయగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో రాష్ట్రాన్ని సీఎం జగన్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారు. అందుకే సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత రోజురోజుకూ పెరుగుతోంది. ఇది సిద్ధం సభల్లో.. బస్సు యాత్రలో ప్రస్ఫుటితమవుతోంది. చెప్పిన మాటపై నిలబడని చంద్రబాబు మోసం చేస్తాడనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ప్రజాగళం పేరుతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నిర్వహించిన సభకు.. చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేయడమే అందుకు నిదర్శనం. కూటమికి ఘోర పరాజయం తప్పదన్నది కళ్ల ముందే కన్పిస్తుండటంతో ఉనికి చాటుకోవడానికి ప్రశాంత్ కిశోర్‌తో పదే పదే తన మాటలను జోస్యంగా చంద్రబాబు చెప్పిస్తున్నారనే భావన ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది. -
బాబు డైరెక్షన్లోనే పీకే వ్యాఖ్యలు!
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆదివారం హైదరాబాద్‌లోని ఓ సదస్సులో ఏపీలో వైఎస్సార్సీపీపై చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ప్రేరేపితమని బయటపడిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ముందుగా సమావేశమై, ఆయన డైరెక్షన్లోనే ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తేటతెల్లమైంది. హైదరాబాద్ నగరంలోని ఖరీదైన హోటల్లో బస చేసి, గంటల తరబడి చంద్రబాబుతో భేటీలు జరుపుతున్న ప్రశాంత్ కిషోర్.. బాబు వ్యూహంలో భాగంగానే వైఎస్సార్సీపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ ఆంగ్ల పత్రిక సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ శనివారం మూడు గంటలపాటు చంద్రబాబుతో సమావేశమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆ సమావేశంలో చంద్రబాబు కోరిన మేరకు ఆదివారం సదస్సులో ఏపీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. తాను సర్వేలు చేయడంలేదని, ఏ రాజకీయ పార్టీకీ సలహాలు ఇవ్వడంలేదంటూనే, పీకే ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎలాంటి సర్వేలు చేయకుండా, గణాంకాల్లేకుండానే ఓ పార్టీ ఓడిపోతుందని చెప్పడం కచ్చితంగా రాజకీయ ప్రేరేపితమేనని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రోజురోజుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం, టీడీపీ ఓటమి ఖాయమని తేలడంతో ప్రజల్లో గందరగోళం సృష్టించాలన్న ఉద్దేశంతోనే పీకేతో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ వీరు వైసీపీపై ఇటువంటి విష ప్రచారాన్ని మరింతగా చేయాలని చంద్రబాబు, పీకే నిర్ణయించినట్లు చెబుతున్నారు. సోమవారమూ బాబుతో పీకే భేటీ సోమవారం ఉదయం కూడా ప్రశాంత్ కిషోర్ రెండున్నర గంటలపాటు చంద్రబాబుతో భేటీ అయ్యారు. టీడీపీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ (ఒకప్పుడు పీకే టీంలో సభ్యుడు), లోకేశ్ సన్నిహితుడు కిలారి రాజేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశం ముగిసేవరకు సోమవారం ఉదయం చంద్రబాబు మరెవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తెలిసింది. పీకేతో భేటీ తర్వాతే చంద్రబాబు అనంతపురం జిల్లాలో టీడీపీ సమావేశానికి వెళ్లారని సమాచారం. సోమవారం సాయంత్రం ప్రశాంత్ కిషోర్ పాట్నా వెళ్లినట్లు తెలిసింది. -
అరేయ్ పీకే నీ పంచాంగం ఆపు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
-
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై కేశినేని ఫైర్
-
చంద్రబాబుకు వాడు పీకే-1 వీడు పీకే -2
-
ప్రశాంత్ కిషోర్ మాట్లాడినదంతా చంద్రబాబు మాటలే: అంబటి
-
ప్రశాంత్ కిషోర్ బీహార్ లో చెల్లని రూపాయి: మంత్రి అమర్నాథ్
-
ఒక పీకే వల్ల కావట్లేదనే రెండో పీకేను తెచ్చారా?
సాక్షి, అమరావతి: ఒక పీకే (పవన్ కళ్యాణ్) వల్ల కావడం లేదనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండో పీకే (ప్రశాంత్ కిశోర్)ను తెచ్చుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని(వెంకట్రామయ్య) ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిశోర్ బిహార్‌లో ఓడిపోనుండగా రాష్ట్రంలో చంద్రబాబు– పవన్‌కళ్యాణ్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని సామాన్యులు సైతం చెబుతున్నారన్నారు. చంద్రబాబే గెలుస్తాడనుకుంటే మేనిఫెస్టోలో సంక్షేమం గురించి ఎడాపెడా హామీలు ఇచ్చేయాలని ఆయనకు ఎందుకు సలహా ఇచ్చారని ప్రశాంత్ కిశోర్‌ను ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్, బీజేపీతో పొత్తు పెట్టుకోమని ఎందుకు సూచించారని నిలదీశారు. ఏపీలో అసలు సర్వే టీమ్‌లే లేని ప్రశాంత్ కిశోర్ డీబీటీకి ప్రజలు ఓట్లు వేయరని ఎలా చెబుతారని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకుంటే వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగం గత ఐదేళ్లుగా ఎలా ముందుకు వెళ్లాయని నిలదీశారు. డీబీటీ, అభివృద్ధి రెండూ చేయని చంద్రబాబుకు ప్రజలు ఓటు వేస్తారని ప్రశాంత్ కిశోర్ చెప్పడానికి కారణం నెల క్రితం నేరుగా చంద్రబాబు ఇంట్లో జరిగిన సమావేశమే కదా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రశాంత్ కిశోర్ పలుమార్లు రహస్యంగా చంద్రబాబును కలవడం నిజం కాదా? అని నిలదీశారు. ఒక ప్రకటనతో మొత్తం ప్రజల నాడిని మార్చేయవచ్చని, తాను మహా మాంత్రికుడినని అనుకుంటున్న ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చివరకు సొంత రాష్ట్రం బిహార్‌లో రాజకీయ భిక్షగాడిగా మారాడని ఎద్దేవా చేశారు. ఇంట గెలవలేని వాడు రచ్చ గెలుస్తాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, ప్రశాంత్ కిశోర్ ముగ్గురూ పచ్చి అబద్ధాల పోటీల్లో ప్రపంచ ఛాంపియన్లే అని వ్యాఖ్యానించారు. -
బాబు మాటలే... పీకే నోట
సాక్షి, అమరావతి: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పలుకుతున్న పలుకులన్నీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పలికిస్తున్న చిలుక పలుకులేనని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలనే ఆయన వల్లిస్తుండటాన్ని బట్టి అవన్నీ కిరాయి పలుకులు, కిరాయి ప్రకటనలేనని స్పష్టమవుతోందన్నారు. గతంలో పార్టీలకు వ్యూహకర్తగా డబ్బులు తీసుకున్న ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఒక్కో స్టేట్మెంట్కు లెక్కగట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బెంగాల్ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని ప్రశాంత్ కిశోర్ పేర్కొనటాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆయన బిహార్‌లో రాజకీయ అరంగేట్రంతో పాదయాత్ర చేశారన్నారు. అయితే బిహార్‌లో చెల్లనికాసులా మారడంతో ఇక్కడ కొన్ని కాసులైనా ఏరుకుందామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ డీల్ కుదుర్చుకున్నారని వ్యాఖ్యానించారు. లోకేశ్ గతంలో ప్రశాంత్ కిశోర్‌ను వెంటబెట్టుకుని ఉండవల్లిలోని అక్రమ కట్టడంలో చంద్రబాబుతో సమావేశమయ్యారని గుర్తు చేశారు. ఆ సందర్భంగా ప్రశాంత్ కిశోర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ తరఫున పనిచేస్తున్నామని ఐ–ప్యాక్ ప్రకటించిందన్నారు. రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి సర్వే చేసేందుకు అవసరమైన వ్యవస్థ ప్రశాంత్ కిశోర్‌కు లేదన్నది తద్వారా స్పష్టమవుతోందన్నారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోందన్నారు. టైమ్స్‌నౌ, జీన్యూస్, రిపబ్లిక్ టీవీ లాంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం ఖాయమని వెల్లడవడమే అందుకు నిదర్శనమన్నారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్ భీమిలి, దెందులూరు, రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలకు జనం సముద్రంలా పోటెత్తారని, ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు సభ అతి పెద్ద ప్రజాసభగా నిలిచిందని రాజకీయ పరిశీలకులే విశ్లేషించారన్నారు. టీడీపీ–జనసేన పొత్తులో సీట్ల పంపకాలు తేలాక తాడేపల్లిగూడెంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభ జనం లేక అట్టర్ ఫ్లాప్ అయ్యిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధించడం ఖాయమని ఆందోళన చెందుతున్న చంద్రబాబు టీడీపీ ఉనికి కాపాడుకోవడం కోసం ప్రశాంత్ కిశోర్‌తో తనకు అలవాటైన రీతిలో అబద్ధాలను మాట్లాడిస్తున్నారంటూ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. -
‘బీజేపీపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు.. అందుకే గెలుస్తోంది’
బీజేపీపై ప్రముఖ్య ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ అభియాన్ సంస్థ వ్యవస్థపకుడు ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు. దేశంలోని యువత సమస్యలు, నిరుద్యోగంపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. ఓ టీవీ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. దేశంలోని యువతకు సంబంధిచిన సమస్యలపై బీజేపీ ఒక్కమాట కూడా మాట్లాడకుండా వరుసగా ఎన్నికల్లో ఎలా గెలుస్తుంది? అనే ప్రశ్నకు సమాధానం చేప్పారు. 2014 నుంచి బీజేపీ పలు ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రతిపక్షాలు ఐకమత్యంగా లేకపోవటమే కారణమని తెలిపారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలు.. ఓటర్లకు ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలకు వివరించటంలో విఫలం అయ్యాయి. ఓటర్లును తమవైపు మళ్లించుకోవటంలో ప్రతిపక్షాలు తరచూ వెనకబడటం వల్లే బీజేపీ మెరుగైన ఫలితాలు రాబట్టుకుంటోందనిపేర్కొన్నారు. ‘2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం వందమంది ఓటర్లలో సుమారు 38 మంది ప్రధాన మంత్రి మోదీ నాయకత్వానికి మద్దతుగా నిలిచారు. కానీ, 62 మంది ఓటర్లు వ్యతిరేకంగా ఆయనక ఓట్లు వేశారు. మెజార్టీ ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలేకపోయారు. 62 మంది ఓటర్లు ప్రతిపక్షాల వైపు ఐక్యంగా ఉండలేకపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మేజార్టీ ఓటర్లంతా కూడా చెల్లాచెదురుగా ఉన్నారు. ఎవరూ ప్రభుత్వ వ్యతిరేక మేజార్టీ ఓటర్లను ఒక్కతాటిపైకి తీసుకురాలేకపోయారు’ అని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఇక.. ప్రశాంత్ కిషోర్ ఇటీవల తన సంస్థ ‘జన్ సూరాజ్’ ద్వారా అత్యంత వెనబడిన తరగతులకు చెందిన సుమారు 75 మందిని 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరితో దింపుతానని ప్రకటించారు. ప్రశాంత్ కిషోక్ ఎన్నికల వ్యూహకర్తగా బీజేపీ, జేడీ(యూ)- ఆర్జేడీ మహాఘట్బంధన్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు అధికారంలోకి రావటానికి కృషి చేసిన విషయం తెలిసిందే. -
రాహుల్ యాత్ర రాంగ్: పీకే కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా వాడీవేడిగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వాతావరణం నెలకొన్న ప్రస్తుత సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ వల్ల ఉపయోగం లేదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ రాహుల్ యాత్రపై స్పందించారు. రాహుల్ గాంధీ యాత్ర తనకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇలా యాత్ర చేయమని ఏ ఎన్నికల వ్యూహకర్త చెప్పారోనని ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉండాల్సిన రాహుల్.. ఎన్నికల సమయంలో ఇలా యాత్ర చేయటం ఒక చెత్త నిర్ణయమని, అసలు ఈ సమయంలో యాత్ర చేపట్టడం సరికాదన్నారు పీకే. పార్లమెంట్ ఎన్నికలకు సుమారు ఆరు నెలల ముందు ఇటువంటి యాత్ర నిర్వహించాల్సి ఉండేదన్నారు. యాత్ర కాకుండా.. బహిరంగ సభలు, అభ్యర్థుల ఎంపిక ఖరారు, భాగస్వామ్య పక్షాలు కలుపుకుపోవటం, ఎన్నికల కోసం వనరుల సేకరణ, రోజువారి సమస్యలకు పరిష్కారాలపై కసరత్తు చేయాల్సిందన్నారు. కానీ యాత్ర చేయటంలో లాజిక్ ఏం లేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. కానీ, యాత్ర చేయమని సలహా ఇచ్చింది ఎవరని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో నితీష్ కుమార్ వంటి కీలక నేతలు చేజారుతూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరుతుంటే.. రాహుల్ గాంధీ మాత్రం ఈశాన్య భారతంలో యాత్రలో ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించటం కొంతమేరకు మంచిదే అయినప్పటికీ ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని వదలటం తెలివైన పని కాదని అన్నారు. రాహుల్ ఇటువంటి చెత్త సలహాలు ఎవరు ఇస్తున్నారో తనకు తెలియటం లేదని అన్నారు. జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమైన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’.. మార్చి 20న ముంబైలో ముగియనుంది. ప్రస్తుతం యాత్ర పశ్చిమ బెంగాల్లో కొనసాగుతోంది. చదవండి: అలాంటి వాళ్లు కాంగ్రెస్ వీడాలనుకున్నా: రాహుల్ గాంధీ -
ఎన్డీయే విజయావకాశాలపై పీకే కీలక వ్యాఖ్యలు
బిహార్‌లో నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జేడీయూ అధినేత నితీష్.. ఎన్డీఏ కూటమిలో చేరటంపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. నితీష్ బిహార్‌లోని మహాకూటమి నుంచి వైదొలిగి.. ఎన్డీయే కూటమిలో చేరటం వల్ల ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ ఎటువంటి ప్రభావం పడదని కాంగ్రెస్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిపై ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధిక సంఖ్యలో ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని అభిప్రాయపడ్డారు. బిహార్‌లో నీతిష్ కుమార్ తిరిగి మాళ్లీ ఎన్డీయేలో చేరటంతో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. బిహార్‌లో మహా కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్‌పై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. నితీష్ రాజకీయం జీవితంలో ఇదే చివరి ఇన్సింగ్స్ అన్నారు. రాజకీయాల్లో నితీష్ చాలా కపటంతో కూడిన వ్యక్తి అని మండిపడ్డారు. 2025లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 20 స్థానాల్లో కూడా జేడీయూ విజయం సాధించలేదని జోష్యం చెప్పారు. నితీష్ ఏ కూటమితో పొత్తు పెట్టుకున్నా సరే.. ఆయన పార్టీ అంతం కావటం ఖాయమన్నారు. కేవలం 20 అసెంబ్లీ స్థానాలకే పరిమితమవుతారని అన్నారు. నితీష్‌ను బిహార్ ప్రజలు తిస్కరిస్తున్నారని.. అందుకే తన సీఎం కుర్చీ కోసం కూటములు మారుతున్నారని మండిపడ్డారు. బిహార్‌లో ఇండియా కూటమిని దెబ్బతీయటానికి బీజేపీ.. నితీష్ కుమార్‌తో ఎత్తుగడ వేసిందన్నారు. కానీ.. బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా పార్లమెంట్లో ఎన్నికల్లో మంచి ఫలితాలనే సాధిస్తుందని అన్నారు. ఇక.. ఎన్డీయే కూటమిలో చేరిన నితీష్ కుమార్ 2025లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు మళ్లీ బయటకు వస్తారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కొన్ని నెలల్లో ఎన్డీయేతో నితీష్‌కు విభేదాలు వస్తాయని అంచనా వేసిన విషయం తెలిసిందే. చదవండి: వారంలోగా దేశవ్యాప్తంగా సీఏఏ అమలు.. కేంద్రమంత్రి ప్రకటన -
బీజేపీ-జేడీయూ కూటమిపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
జేడీ(యూ) చీఫ్ బిహార్‌లోని మహాకూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జట్టు కట్టడంపై ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ఏర్పడిన బీజేపీ-జేడీ(యూ) కూటమి కూడా ఎక్కువ కాలం నిలవదని అభిప్రాయపడ్డారు. నితీష్ కుమార్ మహాకూటమి సీఎం పదవీ రాజీనామా చేసి.. ఎన్డీఏ కూటమి నేతగా మళ్లీ బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న సమయంలో ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2025లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా బీజేపీ-జేడీయూ కూటమి స్థిరంగా ఉండదని జోష్యం చేప్పారు. బిహార్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక ఏడాది లేదా దాని కంటే తక్కువేనని కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఏర్పడిన బీజేపీ-జేడీయూ కూటమిలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయన కేవలం ఆరు నెలల్లోనే ఊహించినంత మార్పు సంభవిస్తుందని కూడా తెలిపారు. ఇక 2022లో నితీష్ కుమార్ ఎన్డీఏ ఉంచి బయటకు వచ్చారని.. అప్పుడు బిహార్‌లో రాజకీయ స్థిరత్వం ఉంటుందని ఆశించానన్నారు. అయితే రాజకీయ, పరిపాలన పరమైన అంచనాలు ఎప్పటికప్పుడు పెరిగిపోవటం వల్లనే ఇలాంటి కూటమి మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మహాకూటమి కూటమి కూడా 2020 వరకు మాత్రమే కొనసాగదని గతంలో తాను అంచనా వేసినట్లు గుర్తు చేశారు. గత అంచనా నిజం అయినట్టు ఇప్పుడు కూడా 2025 వరకు మాత్రమే ప్రస్తుతం ఏర్పడిన బీజేపీ-జేడీయూ కూటమి సైతం కొనసాగుతుందని అన్నారు. అనంతరం బీజేపీ- జేడీయూ కూటమి కూడా బీటలు వారుతుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. చదవండి: ‘నితీష్, బీజేపీకి బిహార్ ప్రజలు బుద్ధి చెబుతారు’ -
‘ప్రశాంత్ కిషోర్‌ను మేం వదిలేశాక బాబు పట్టుకున్నారు’
సాక్షి, చిత్తూరు: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ప్రశాంత్ కిషోర్‌ను మేము వదిలేశాక బాబు పట్టుకున్నారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బాబు తప్పుడు ప్రచారానికి ఎల్లో మీడియా అండగా ఉందని మండిపడ్డారు. ‘‘2019 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వైఎస్సార్సీపీకి వస్తాయి. సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా ఎన్ని కుయుక్తులు పన్నిన వచ్చే ఎన్నికల్లో తిరిగి సీఎం జగనేనని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇదీ చదవండి: గ్రామీణ ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం: సీఎం జగన్ -
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్
భోపాల్: ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు గెలుపు వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాజీ సహచరుడు సునీల్ కనుగొలును కాంగ్రెస్ రంగంలోకి దించింది. ఆయన ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నారు. సునీల్ గతంలో ఈయన ప్రధాని మోదీతో కలిసి బీజేపీ ప్రచార వ్యూహాన్ని రచించారు. 2017లో యూపీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ గెలుపునకు బాటలు వేశారు. అనంతరం కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం వెనుక సునీల్ కృషి ఉంది. సునీల్ కనుగొలు(39) తండ్రి కర్ణాటక, తల్లి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. ఈయన విద్యాభ్యాసం తమిళనాడులో సాగింది. ఎంబీఏ, ఎంఎస్ అమెరికాలో పూర్తి చేశారు. -
ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్? పీకే సమాధానమిదే..!
పట్నా: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెటుతున్నట్లు కొద్ది నెలల క్రితం విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన ఓ పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఇప్పటి వరకు దానిపై స్పష్టత లేదు. ఇప్పుడు మరోమారు ఈ అంశం తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు ఇన్నాళ్లు మౌనం పాటించిన ఆయన సస్పెన్స్‌ను బ్రేక్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. బిహార్ వ్యాప్తంగా ప్రజలను కలిసేందుకంటూ ‘జన్ సూరాజ్ అభియాన్’ ఏర్పాటు చేసిన క్రమంలో ఆయనకు ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఓ ఇంటర్వ్యూలో మీరు ఎన్నికల బరిలో నిలుస్తున్నారా? అని అడిగి ప్రశ్నకు సమాధానంగా.. ‘నేను ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి? నాకు అలాంటి ఆకాంక్షలు లేవు’ అని తేల్చేశారు ప్రశాంత్ కిషోర్. ఈ సందర్భంగా జేడీయూ, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. తాను స్వతంత్రంగా ఉండేందుకు నిర్ణయించుకున్న తర్వాత జేడీయు నేతలు తనను తిట్టేందుకు ఇష్టపడుతున్నారని ఆరోపించారు. తనకు రాజకీయ అవగాహన లేకపోతే నితీశ్ కుమార్ వెంట రెండేళ్లు ఏం పని చేశానో ఆయననే ప్రశ్నించాలని సూచించారు. జేడీయూ-ఆర్జేడీ కూటమి ప్రభుత్వం ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని తోసిపుచ్చారు ప్రశాంత్ కిషోర్. వారు ఇచ్చిన హామీని నెరవేరుస్తే తన పాదయాత్రను ఆపేస్తానని సవాల్ చేశారు. బిహార్‌లో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నారు కిషోర్. ఈ సందర్భంగా జన్ సూరాజ్ కార్యక్రమం పార్టీగా మారనుందా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. 'మునుగోడు' వేడి చల్లారకముందే.. -
మా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలట
సితాబ్ దియారా: తమ జేడీ(యూ) పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చాడని జేడీ(యూ) చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. సామాజికవేత్త జయప్రకాశ్ నారాయణ్ జన్మస్థలి సితాబ్ దియారాలో పర్యటించిన నితీశ్ శనివారం అక్కడి మీడియాతో మాట్లాడారు. ‘ రెండు వారాల క్రితం ప్రశాంత్ కిశోర్ నా వద్దకు వచ్చారు. నేనేం అతడిని పిలవలేదు. జేడీయూను కాంగ్రెస్‌లో కలిపేస్తే మంచిదని నాలుగైదేళ్ల క్రితమే నాకు సలహా ఇచ్చాడు. ఇప్పడేమో చాలాసేపు ఏవోవో అంశాలు మాట్లాడుతున్నాడు. నాకప్పుడే అర్థమైంది ప్రశాంత్ బీజేపీ తరఫున పనిచేస్తున్నాడని ’ అని నితీశ్ చెప్పారు. ‘10–15 రోజుల క్రితం నితీశే నన్ను పిలిచారు. తన జేడీయూ పార్టీకి సారథ్యం వహించాలని కోరారు. నేను తిరస్కరించా. మళ్లీ జేడీయూలో చేరలేనని చెప్పా’ అని మంగళవారం ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించిన నాలుగు రోజులకే నితీశ్ స్పందించడం గమనార్హం. ఐ–ప్యాక్‌కు సారథ్యం వహిస్తూ 2018లో జేడీయూలో చేరిన ప్రశాంత్‌కు జాతీయ పౌరసత్వం సవరణ చట్టంపై నితీశ్‌తో అభిప్రాయ భేదాలొచ్చాయి. దీంతో పార్టీ నుంచి ప్రశాంత్‌ను బహిష్కరించారు. -
బిహార్‌లో మద్యం నిషేధం విఫలం: ప్రశాంత్
పట్నా: బిహార్ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం నిషేధ కార్యక్రమం పూర్తిగా విఫలమైందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ఈ విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని సీఎం నితీశ్‌కు సలహా ఇచ్చినట్లు వెల్లడించారు. నితీశ్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసమే మద్యం నిషేధాన్ని ప్రకటించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, వాస్తవానికి మహిళలే నిషేధంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్యం కోసం అడ్డదారులు తొక్కి మగవాళ్లు జైలు పాలైతే వారి కోసం మహిళలు కాళ్లరిగేలా స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. పెచ్చుమీరిన అవినీతి కారణంగానే నిషేధం విఫలమైంది. అందుకే గొప్పలకు పోకుండా నిజాయతీగా ఈ విధానంపై సమీక్ష చేపట్టాలని సీఎంను కోరా’అని ఆయన వివరించారు. ‘జన్‌సురాజ్’ ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టబోయే 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్రకు ఏర్పాట్లను చంపారన్‌లో కిశోర్ సమీక్షించారు. మిస్టర్ సుంగోర్కిన్ యొక్క "ఆకస్మిక" మరణం మరొక రష్యన్ ఎలైట్, ఇవాన్ పెచోరిన్, ఎనర్జీ ఎగ్జిక్యూటివ్, అతను స్పీడ్ బోర్డ్ నుండి ఓవర్‌బోర్డ్‌లో పడిపోయిన తర్వాత రహస్యమైన పరిస్థితులలో మరణించిన కొద్ది రోజులకే వచ్చింది. మిస్టర్ పుతిన్ స్వయంగా హత్యాయత్నం నుండి బయటపడినట్లు నివేదించబడిన ఒక రోజు తర్వాత కూడా ఇది వస్తుంది. టెలిగ్రామ్ ఛానెల్లోని ఖాతా ప్రకారం, మిస్టర్ పుతిన్ యొక్క లిమోసిన్ యొక్క ఎడమ ముందు చక్రం పెద్ద చప్పుడుతో కొట్టబడింది, యూరో వీక్లీ నివేదించింది, దాని నుండి పొగ వెలువడినప్పటికీ కారు త్వరగా సురక్షితంగా నడపబడిందని పేర్కొంది. ఈ ఘటనలో రష్యా అధ్యక్షుడు క్షేమంగా ఉన్నారని, అయితే పలువురిని అరెస్టు చేసినట్లు అవుట్లెట్ తెలిపింది. (చదవండి: వెనెకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా) -
Sakshi Cartoon: తనింకా పార్టీలో చేరకుండానే ట్రాక్ రికార్డు పాడయిందంటే... మన పరిస్థితి
తనింకా పార్టీలో చేరకుండానే ట్రాక్ రికార్డు పాడయిందంటే... మన పరిస్థితి ఏంటో.. అర్థం కావడం లేదు! -
కాంగ్రెస్‌కి నా అవసరం లేదు: ప్రశాంత్ కిశోర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో చేరడానికి నిరాకరించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆ పార్టీకి తన అవసరం లేదని స్పష్టం చేశారు. తనంతట తానుగా పూర్వ వైభవాన్ని సాధించే శక్తి సామర్థ్యాలు కాంగ్రెస్‌కు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆజ్‌తక్ ఛానెల్‌కి ప్రశాంత్ కిశోర్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీ భవిష్యత్ ప్రణాళికలపై ఎన్నో అంశాల్లో తనకు, అధిష్టానానికి మధ్య అంగీకారం కుదిరిందని చెప్పారు. అయితే అవన్నీ ఆ పార్టీ తనంతట తానే చేసుకోగలదని, ఎందరో తలపండిన నాయకులు ఆ పార్టీలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేదని, అందుకే పార్టీలోకి తనని రమ్మని ఆహ్వానించినా తిరస్కరించానని చెప్పారు. కాంగ్రెస్‌లో ఎలాంటి పాత్రా పోషించాలని తాను అనుకోలేదని, భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి ఒక బ్లూ ప్రింట్ అనుకుంటే కచ్చితంగా అమలు చేసి తీరాలని ఆశించానని చెప్పారు. ‘‘కాంగ్రెస్‌కి ఏం చెప్పదలచుకున్నానో అది చెప్పేశాను. 2014 తర్వాత కాంగ్రెస్ తన ప్రణాళికల్ని ఒక నిర్ణయాత్మక పద్ధతిలో చర్చించడం చూశాను. కానీ ఆ పార్టీ సాధికారత కార్యాచరణ బృందంపై నాకు కొన్ని అనుమానాలున్నాయి. అనుకున్న మార్పుల్ని ఆ బృందమే అమలు చేయాలి. అందులోనే నన్ను సభ్యుడిగా చేరమన్నారు’’అని పీకే వెల్లడించారు. ప్రియాంకగాంధీకి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదిస్తే కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదని వచ్చిన వదంతుల్ని ఆయన కొట్టిపారేశారు. తాను ఎవరి పేర్లను చెప్పలేదన్నారు. -
‘పీకే’పై మల్లగుల్లాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేరిక అంశం పార్టీ చీఫ్ సోనియాగాంధీ కోర్టుకు చేరింది. రాహుల్‌గాంధీ విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఆయనతో చర్చించి సోనియా నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల సమాచారం. పీకే ప్రతిపాదనలపై కాంగ్రెస్ కమిటీ సమర్పించిన నివేదికపై కమిటీ సభ్యులు, సీనియర్లతో సోనియా సోమవారం సుదీర్ఘంగా చర్చించారు. భేటీలో ప్రియాంక గాంధీతో పాటు సుర్జేవాలా, అంబికా సోని, కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్, పి.చిదంబరం తదితరులు పాల్గొన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరతారా అన్నదానిపై ఓ వైపు చర్చ నడుస్తుంటే మరోవైపు ఆయన తెలంగాణలో టీఆర్ఎస్తో ఒప్పందం కుదుర్చుకున్న వైనాన్ని సోనియా సమక్షంలో నేతలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో హైదరాబాద్‌లో రెండు రోజులుగా పీకే మంతనాలు, ఆ పార్టీతో పీకే సంస్థ ఐప్యాక్ కుదుర్చుకున్న ఒప్పందం తదితరాలను నేతలు వివరించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా చేసిన దిగ్విజయ్‌సింగ్ ఈ అంశాన్ని లేవనెత్తినట్టు చెబుతున్నారు. పలు ప్రత్యర్ధి పార్టీలతో పీకేకు సంబంధాల దృష్ట్యా పార్టీ నిర్ణయాలను ఆయనతో పంచుకునే విషయంలో గోప్యత పాటించాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. పీకే కాంగ్రెస్‌లో చేరే పక్షంలో పూర్తిగా పార్టీ సేవకే అంకితం కావాలని, ఇతర పార్టీలతో ఎలాంటి సంబంధమూ కొనసాగించొద్దని మరో నేత అన్నట్టు సమాచారం. ‘నీ శత్రువులతో స్నేహంగా ఉండే వ్యక్తులను నమ్మొద్దు’ అంటూ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్ పీకేను ఉద్దేశించేదేనని నేతలన్నారు. ప్రాంతీయ పార్టీలతో పీకేకు సంబంధాలు కాంగ్రెస్‌కు మేలే చేస్తాయని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. -
కేసీఆర్ సుముఖత.. టీఆర్ఎస్ వెంట పీకే టీమ్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ ప్యాక్) సేవలు తీసుకోవాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రశాంత్ కిశోర్ (పీకే) కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనా కూడా.. ఐప్యాక్ సేవలను టీఆర్ఎస్ వినియోగించుకోబోతోంది. ప్రశాంత్ కిశోర్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే పలు సూచనలు, ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. వాటి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్.. ఐప్యాక్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో టీఆర్ఎస్ రాతపూర్వక ఒప్పందం చేసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చదవండి👉 ‘టీఆర్ఎస్ మళ్లీ వస్తే గొంతు కోసుకుంటా’ కేసీఆర్– పీకే.. సుదీర్ఘంగా భేటీ: ప్రశాంత్ కిశోర్ శనివారం ఉదయం 9.30 గం. ప్రగతిభవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. వారు రోజంతా రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఆదివారం కూడా ఈ చర్చలు కొనసాగుతాయని పార్టీ వర్గాల సమాచారం. టీఆర్ఎస్, ఐప్యాక్ మధ్య ఒప్పందం జరిగాక.. ఆదివారం సాయం త్రం లేదా సోమవారం ప్రశాంత్ కిశోర్ ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నట్టు తెలిసింది. ప్రచారం, సర్వేలతో.. ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ సంస్థకు సర్వేలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకునే మార్పులకు అనుగుణంగా వ్యూహరచన అంశాల్లో ఎంతో అనుభవం ఉంది. దీనికితోడు నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్, ఇతర పార్టీల పనితీరుపై విశ్లేషణలు, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహ రచన, రాష్ట్రంలో వివిధ పార్టీలు చేసే విమర్శలను ఎలా తిప్పికొట్టాలన్న అంశాలపై ఐప్యాక్ శాస్త్రీయ సమాచారాన్ని, విశ్లేషణలను అందిస్తుందన్న ఉద్దేశంతో పీకేతో ఒప్పందానికి టీఆర్ఎస్ మొగ్గు చూపినట్టు తెలిసింది. ఒప్పందం తర్వాత ఐప్యాక్ బృందం నేరుగా టీఆర్ఎస్ యంత్రాంగంతో కలిసి పనిచేస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చదవండి👉🏼 నాకు పీకే చెప్పారు.. టీఆర్ఎస్కు 30 సీట్లు కూడా రావు: కేఏ పాల్ -
ప్రశాంత్ కిశోర్ (ఎన్నికల వ్యూహకర్త) రాయని డైరీ
సోనియాజీకి ఒక్కో స్లయిడ్ వేసి చూపిస్తున్నాను. అవన్నీ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించే వ్యూహాల స్లయిడ్స్. ‘‘ఇంకా ఎన్ని స్లయిడ్స్ ఉన్నాయి కిశోర్?’’ అని అడిగారు సోనియాజీ!! ‘‘కొన్ని వందల స్లయిడ్స్ ఉన్నాయి మేడమ్‌జీ. ఇప్పటికి కొన్ని పదుల స్లయిడ్స్ మాత్రమే మీకు చూపించగలిగాను. చిన్న బ్రేక్ తీసుకుని మళ్లీ మొదలు పెడితే బాగుండని మీకు అనిపిస్తుంటే కనుక అలాగే చేద్దాం’’ అన్నాను. ఆ మాటకు రాహుల్ స్పందించారు. ‘‘నాకైతే అలాగే అనిపిస్తోంది కిశోర్. బ్రేక్ తీసుకోవడం వల్ల పునరుత్తేజం పొంది స్లయిడ్స్ని మరింత ఉత్సాహంగా చూడగలమేమో కదా..’’ అన్నారు రాహుల్.. ఒక పెద్ద అలవిమాలిన ఆవలింతతో! అప్పటికే ఆయన తన సీట్లోంచి లేచేందుకు సిద్ధమై ఉన్నారు. ఆ సమయానికి స్క్రీన్ మీద ‘ఉత్సాహం–ఉత్తేజం’ అనే స్లయిడ్ పడి ఉంది.‘‘రాహుల్ కూర్చో. మన మంచి కోసమే కదా కిశోర్ అన్నన్ని స్లయిడ్స్ వేసి చూపిస్తున్నాడు. ‘ఇంకా ఎన్ని స్లయిడ్స్ ఉన్నాయి కిశోర్..’ అని నేను అడిగింది.. కిశోర్కేమైనా బ్రేక్ తీసుకోవాలనిపిస్తోందేమోనని. అవతలి వాళ్ల కష్టసుఖాల గురించీ మనం ఆలోచించాలి కదా..’’ అన్నారు సోనియాజీ. ‘‘మరైతే రాహుల్జీ.. మీరెళ్లి బ్రేక్ తీసుకుని వస్తారా? అంతవరకు ‘ఉత్సాహం–ఉత్తేజం’ అనే ఈ స్లయిడ్‌ని స్క్రీన్ మీద అలా కదలకుండా ఉంచేస్తాను’’ అన్నాను. ‘‘అవునా! అయితే మేం కూడా రాహుల్‌బాబుతో పాటు చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తాం..’’ అని జైరాం రమేశ్, కేసీ వేణు గోపాల్, దిగ్విజయ్‌సింగ్ లేచారు. తారిఖ్ అన్వర్, సుర్జేవాలా, సోనియాజీ, ప్రియాంక నేను.. ప్రెజెంటేషన్ రూమ్‌లో మిగిలాం. ‘‘వాళ్లు బ్రేక్ తీసుకోవడానికి వెళ్లి మనకు బ్రేక్ ఇచ్చారుగా..’’ అని నవ్వారు తారిఖ్ అన్వర్. ఆ మాటకు అంతా నవ్వారు. ‘‘మనమెప్పుడూ ఇలాగే నవ్వుతూ ప్రజలకు కనిపించాలి. నరేంద్ర మోదీని చూసినా కూడా మన ముఖంపై చిరునవ్వు నాట్యమాడాలి. అప్పుడే పార్టీ ఎనర్జిటిక్‌గా ఉందని ప్రజలకు సంకేతం వెళుతుంది. పోల్ స్ట్రాటజీలో ఇది ఫస్ట్ పాయింట్..’’ అన్నాను. ‘‘ఇది ఫస్ట్ పాయింట్ అయితే కావచ్చు కానీ, పెద్ద పాయింట్ అయితే కాదనిపిస్తోంది. నరేంద్ర మోదీ నవ్వడం నేనెప్పుడూ చూళ్లేదు. గెలవడమే చూశాను.. ’’ అన్నారు సుర్జేవాలా. నవ్వుముఖంతో ఉన్నా లేకున్నా ఈసారి కాంగ్రెస్ గెలిచి తీరాలన్న సంకల్పం ఆయనలో బలంగా ఉన్నట్లు క్రితంరోజు స్లయిడ్స్ వేస్తున్నప్పుడు కూడా నాకు అనిపించింది. ఆ ప్రెజెంటేషన్‌లో సుర్జేవాలాతో పాటు సచిన్ పైలట్, అశోక్ గెహ్లోత్, భూపేష్ బఘేల్, మరికొందరు ఉన్నారు. వాళ్లలో ఒక్కరు కూడా నవ్వుముఖంతో లేరు. ‘ప్రశాంత్ కిశోర్‌కి ఇక్కడేం పని..’ అనే ముఖంతోనే ఉన్నారు. నేను ఏం మాట్లాడితే దానికి కౌంటర్ ఇస్తున్నారు. ‘ఇండియా డిజర్వ్స్ బెటర్’.. ఇదీ మన పోల్ క్యాంపెయిన్. ఎలా ఉంది?’ అని అడిగితే.. దానికన్నా అర్ణబ్ గోస్వామి ‘నేషన్ వాంట్స్ టు నో’ అనే ట్యాగ్ లైనే ఎక్సయిటింగ్‌గా ఉంది’ అన్నారు సచిన్ పైలట్! ‘మన పార్టీ పునరుత్తేజ ప్రణాళిక పేరు ‘నటరాజ్’! సృష్టి, స్థితి, లయకారుడు కదా శివుడు.. అందుకే అలా పెట్టాను..’ అన్నప్పుడు.. ‘పార్టీ స్థితికి, సృష్టి స్థితి లయలకు సంబంధం ఏమిటి?’ అన్నారు భూపేష్ బఘేల్! నా ఐడియాలు నచ్చకా?! నేను నచ్చకా?! బ్రేక్ అయిపోయినట్లుంది.. రాహుల్, ఆయన వెనకే మిగతావారు లోపలికి వచ్చారు. స్లయిడ్ మార్చబోతుంటే.. ‘‘కిశోర్‌జీ! మీరు పార్టీ బయటే ఉండి స్ట్రాటజిస్ట్‌గా పని చేస్తారా? లేక, పార్టీ లోపలికి వచ్చి అడ్వైజర్‌గా ఉంటారా?’’ అని రాహుల్ అడిగారు!లోపల, బయట అనే మాట వచ్చిందంటే.. బయట బ్రేక్‌లో రాహుల్‌కి ఎవరి స్లయిడ్స్ వాళ్లు వేసి చూపించి ఉంటారు!! -
సోనియా చేతికి నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాలు, సూచనలపై అధ్యయనానికి ఏర్పాటైన కాంగ్రెస్ కమిటీ శుక్రవారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి నివేదిక సమర్పించింది. కాంగ్రెస్ పునరుజ్జీవానికి, 2024 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలు, తీసురోవాల్సిన నిర్ణయాలపై సోనియా, ఇతర సీనియర్ నేతల సమక్షంలో ఇటీవల పీకే సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇవ్వడం తెలిసిందే. ఆయన సిఫార్సులపై అధ్యయనానికి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులతో సోనియా కమిటీ వేశారు. వారంలోగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. వారిచ్చిన తాజా నివేదికపై నేతలతో సోనియా చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. కాంగ్రెస్ పునరుజ్జీవానికి పీకే గట్టి వ్యూహాలే సూచించారని దిగ్విజయ్ అన్నారు. ఆయన చేరికపై పార్టీలో ఎవరికీ అభ్యంతరాల్లేవని చెప్పారు. పీకే బహుశా మేలో కాంగ్రెస్‌లో చేరవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
పీసీసీలో ‘పీకే’ ఫీవర్! అలా అయితే ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ప్రశాంత్ కిశోర్ (పీకే) టెన్షన్ పట్టుకుంది. ఎన్నికల వ్యూహకర్తగా పేరు గడించిన ఆయన.. కాంగ్రెస్ శిబిరం లోకి వస్తుండటం, మరోవైపు తెలంగాణలో టీఆర్ ఎస్ పక్షాన పనిచేస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం పీకేతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ క్రమంలో ఆయన ప్రాంతీయ సమీకరణాల పేరుతో టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తుకు దారితీయిస్తారేమోనన్న సందేహం రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. దీనితో ఎవరూ అడగకున్నాకూడా.. టీఆర్ఎస్తో ఎలాంటి పొత్తు ఉండదంటూ పార్టీ పెద్దలు ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌తో స్పష్టత ఇప్పిం చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై రాహుల్‌గాంధీతో స్పష్టత ఇప్పించి.. టీఆర్ఎస్తో పొత్తు చర్చకు తెరదింపాలని భావిస్తున్నట్టు సమాచారం. లోక్‌సభ నాటికి ఎలా? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేశారు. అదేబాటలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పక్షాన కూడా ఆయన టీం పనిచేస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితిపై పీకే టీం అధ్యయనం చేసి.. టీఆర్ఎస్ అధిష్టానానికి నివేదిక కూడా ఇచ్చినట్టు సమాచారం. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని నేరుగా ధ్రువీకరించకపోయినా.. పీకేతో కలిసి పనిచేస్తే తప్పేమిటని విలేకరుల సమావేశంలోనే పేర్కొనడం గమనార్హం. ఆయన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు కాంగ్రెస్ అధిష్టానాన్ని పీకే సిద్ధం చేస్తారని.. రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్థితి ఆయనకు తెలుసు గనుక కలిసి పోటీ చేయాలని సూచిస్తారేమోననే కాంగ్రెస్ నేతల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకపోయినా.. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవచ్చన్న చర్చ జరుగుతోంది. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీస్తుందని, అందువల్ల వరంగల్ సభ వేదికగా రాహుల్‌తో స్పష్టత ఇప్పించాలని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు. రాహుల్‌తో చెప్పించేందుకు! తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా రాష్ట్రంలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైందని.. 2014 ఎన్నికల్లో అతివిశ్వాసం దీనికి కారణంకాగా, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కొంప ముంచిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో నిలవాలని.. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి మరీ ఎన్నికల గోదాలోకి దిగాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అంతర్గత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేస్తున్నామన్న సంకేతాలూ ఇస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామంపై స్పందిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం తామేనని, ప్రజల పక్షాన పోరాడేది తామేనన్న భావనను కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ కిశోర్ తెరపైకి రావడం రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కలవరం రేపుతోంది. ఇటీవల మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన టీపీసీసీ కీలక నేత ఒకరు ప్రత్యేకం గా పీకే, టీఆర్ఎస్తో పొత్తు అంశాలను ప్రస్తావించారు. ఈ విషయాన్ని రాహుల్‌గాంధీ దగ్గరే తేల్చుకుంటామని వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అయితే తాము టీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధంగా లేమని బహిరంగంగా ప్రకటించారు. ఇటీవల రాహుల్‌తో టీపీసీసీ నేతలు భేటీ అయిన సందర్భంలో.. ఏ పార్టీతో పొత్తు ఉండదని, టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలపై పోరాటాన్ని కొనసాగించాలని రాహుల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కానీ అప్పటికి రాష్ట్ర ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కనుగోలు మాత్రమే ఉన్నారు. పీకే తెరపైకి రాలేదు. ఇప్పు డు పీకే కాంగ్రెస్ శిబిరంలోకి వస్తుండటంతో టీఆర్ఎస్తో పొత్తు ప్రచారం ఊపందుకుంది. -
ముళ్లు ‘పీకే’స్తే గుబాళింపే!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల ముచ్చటే లేదని ఇటీవలే గట్టిగా చెప్పిన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు.. మరోవైపు పార్టీలో, ప్రభుత్వంలో కీలక మార్పుచేర్పులు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో వరుసగా మూడోసారి టీఆర్ఎస్ను అధికారంలోకి తేవడంతోపాటు జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఇందుకోసం వివిధ అంశాలపై తనకున్న సమాచారం, అంచనాలతోపాటు.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) బృందం చేసిన సర్వే నివేదికలపై దృష్టిపెట్టినట్టు తెలిసింది. సర్వేల ద్వారా ప్రజలనాడి పట్టుకునే కళ ఉన్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) తనతో కలిసి పనిచేస్తున్నాడని కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ పనితీరుపై వివిధ రూపాల్లో, వేర్వేరు ప్రశ్నావళితో పీకే బృందం సర్వేలు చేసింది. ఆ వివరాలను క్రోడీకరించి.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఏం చేయాలి? ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? ఏ తరహా కార్యాచరణ అవసరమన్న దానిపై సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేసింది. విశ్వసనీయ వర్గాల వివరాల ప్రకారం.. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల నుంచి పొందిన విశ్వాసాన్ని మరింత పెంచుకోవడం లక్ష్యంగా పీకే తన నివేదికలో సూచనలు చేసినట్టు తెలిసింది. ప్రతికూలత పోగొట్టుకోవాలి.. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్‌తోనే తెలంగాణ ఉద్యమం సాగిందని.. కానీ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీలో జరిగిన తాత్సారం ప్రభుత్వంపై కొంత ప్రతికూల ప్రభావం చూపిందని పీకే నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయాలని నివేదిక సూచించింది. జిల్లాలు, జోన్ల విభజనతో కొందరు ఉద్యోగుల్లో ఏర్పడిన అసంతృప్తిని తొలగించేందుకు ప్రమోషన్లు, ఇతర సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే.. ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వ్యవహార శైలితో ఉద్యోగుల సమస్యలు సకాలంలో పరిష్కారం కావడం లేదని.. కొన్ని కీలక విభాగాల్లో ఏళ్ల తరబడి తిష్టవేసిన అధికారుల పనితీరు పాలనపై ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నట్టు తెలిసింది. ఐఏఎస్ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో కొనసాగాల్సిన విభాగాల్లో కిందిస్థాయి అధికారులు ఏళ్ల తరబడి ఇన్చార్జులుగా కొనసాగుతుండటంతో.. క్రియాశీలకంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని పేర్కొన్నట్టు సమాచారం. వీటిపై బాగా దృష్టిపెట్టాలి.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నవారు, ఉద్యమంలో భాగస్వాములైన వివిధ రంగాలకు చెందిన కొందరిలో అసంతృప్తి ఉందని.. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చినా తమకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదనే ఆవేదన నెలకొందని పీకే నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఉద్యమ సమయంలో, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వివిధ స్థాయిల్లో వేర్వేరు పార్టీల నుంచి చేరిన కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయ లోపం ప్రతిబంధకంగా మారిందనీ వివరించినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు జరగడం చాలా చోట్ల సానుకూల ఫలితాలు ఇచ్చినా కొన్నిచోట్ల చేటు చేస్తున్న విషయాన్ని ఉదాహరణలతో ప్రస్తావించినట్టు తెలిసింది. వివాదాల్లో తలదూర్చడం, అధికారుల విధుల్లో మితిమీరిన జోక్యం, పార్టీ యంత్రాంగంపై ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల కుటుంబ సభ్యుల పెత్తనం వంటి అంశాలకు చెక్ పెట్టడానికి సంబంధించి పీకే నిర్దిష్ట సూచనలు చేసినట్టు సమాచారం. కొందరు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన వ్యవహారాల్లో లోతుగా దృష్టి సారించడం లేదని, అంతర్గత సమీక్షల్లో సంబంధిత అంశాలపై వారికి అవగాహన లేకపోవడాన్ని అధికారులు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని ప్రస్తావించినట్టు తెలిసింది. సరిదిద్దండి లేదా సాగనంపండి! ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా జనంతో మమేకమైన కొందరు కీలక నేతలు.. అధికారంలోకి వచ్చాక వివిధ కారణాలతో అందుబాటులో లేకపోవడంతో నష్టం జరుగుతోందని పీకే నివేదిక పేర్కొంది. అలాంటి వారు క్షేత్రస్థాయికి వెళ్లేలా కార్యక్రమాలు ఇవ్వాలని కొందరు నేతల పేర్లతో జాబితా అందజేసినట్టు తెలిసింది. ఇక అటు పార్టీ యంత్రాంగంతో సఖ్యత లేని, ఇటు సరైన పనితీరు చూపని ఎమ్మెల్యేలను సరిదిద్దడమో లేదా సాగనంపడమో చేయాలని పేర్కొన్నట్టు సమాచారం. నిరంతరం జనంలో ఉండేలా.. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సంబంధిత వర్గాలకు చెందినవారు సంతృప్తిగా ఉన్నారని.. ఈ క్రమంలో వివిధ పథకాల విజయగాథల (సక్సెస్ స్టోరీస్)ను జనంలోకి బలంగా తీసుకెళ్లాలని పీకే నివేదిక సూచించింది. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా పలు సూచనలు చేసింది. కొత్త ఓటర్లు, యువతను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా బీజేపీ శ్రేణులు చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకునేందుకు యువత, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలుపెట్టాలని పేర్కొంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చేసిన సర్వేల్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సానుకూలత వ్యక్తమైనా.. మంత్రులు, ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా కార్యక్రమాలు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ కార్యాచరణ ఏ రీతిలో ఉండాలనే దానిపై పలు ప్రతిపాదనలు చేసింది. పీకే నివేదికలో పేర్కొన్న అంశాలకు సీఎం కేసీఆర్ తన రాజకీయ అనుభవాన్ని జోడించి రాబోయే రోజుల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. నివేదికలోని కీలకాంశాలు ► వచ్చే ఎన్నికలలోపు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి ► ఉద్యమం, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ► ఏళ్ల తరబడి ఒకేచోట తిష్టవేసిన అధికారులకు స్థాన చలనం ► తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు నో టికెట్ ► మంత్రులు, ఎమ్మెల్యేలు నిరంతరం జనంలో ఉండేలా కార్యక్రమాలు ► కొత్త, పాత నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచాలి ► బీజేపీ దూకుడును తట్టుకునేలా సోషల్ మీడియాపై ఫోకస్ ► యువత, విద్యార్థులకు అవగాహన సదస్సులు ► అభివృద్ధి, సంక్షేమ పథకాల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. -
2024 లోక్‌సభ ఎన్నికలు; మమత కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా: ప్రత్యామ్నాయం లేకనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, సరైన ప్రత్యామ్నాయం దొరికిన రోజున ప్రజలు ఆ పార్టీని సాగనంపడం ఖాయమని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అటువంటి ప్రత్యామ్నాయాన్ని ఆచరణ సాధ్యం చేసేందుకు తమ టీఎంసీ ఇతర ప్రతిపక్షాలతో కలిసి ప్రయత్నిస్తోందని చెప్పారు. మంగళవారం ఇక్కడ జరిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశంలో ఆమె మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని.. ఇందుకోసం చురుగ్గా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అధినేతగా గత నెలలో మరోసారి ఎన్నికైన మమతా బెనర్జీ.. తాజాగా రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. సీనియర్లు, కొత్త నేతలకు సమతౌల్యం పాటిస్తూ విధేయతకు పెద్దపీట వేశారు. సుబ్రతా బక్షీని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్థా చటర్జీని ప్రధానకార్యదర్శిగా మళ్లీ నియమించారు. అదేవిధంగా, పార్టీ ఉపాధ్యక్షులుగా సుమారు 20 మందిని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా హాజరయ్యారు. సీనియర్ నేతలతో కలిసి ఆయన వేదికపై ఆసీనులయ్యారు. మమత.. బెంగాల్‌కే పరిమితం తమ పార్టీని ఓడించాలన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ స్పందించారు. మమతా బెనర్జీ బెంగాల్‌కే పరిమితమని.. కేంద్రంలో బీజేపీని ఓడించే సత్తా ఆమెకు లేదన్నారు. ‘ఇంత పెద్ద లక్ష్యం వారి (టీఎంసీ) ఆరోగ్యానికి మంచిది కాదు. ఆమె (సీఎం మమతా బెనర్జీ) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన లోక్‌సభ ఎన్నికల్లో కూడా గెలుస్తారని అనుకోలేం. సార్వత్రిక ఎన్నికల్లో వారిని భంగపాటు తప్పద’ని సుకాంత మజుందార్ అన్నారు. (క్లిక్: బీజేపీ నుంచి ఔట్.. మమత పార్టీలోకి మరో సీనియర్ నేత) -
‘పీకే’కు ఓకే? ఇప్పట్నుంచే కేసీఆర్ పక్కా ప్లాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏడాది ముందుగానే కసరత్తు ప్రారంభించారు. ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొనే విషయంలో పొలిటికల్ కన్సల్టెన్సీల పాత్ర కూడా కీలకమని భావిస్తున్న గులాబీ దళపతి... ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్రాల్లో పలు పార్టీలు పొలిటికల్ కన్సల్టెంట్లను నియమించుకున్న తరహాలోనే రాష్ట్రంలోనూ కన్సల్టెంట్ల సేవలు పొందాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ–ప్యాక్) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే)కు చెందిన బృందం సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పలుమార్లు సమావేశమైంది. రాష్ట్ర రాజకీయాలు, క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరు తదితర అంశాలకు సంబంధించి తమ పరిశీలనలోకి వచ్చిన అంశాలను పీకే బృందం ఈ భేటీల్లో ప్రస్తావించినట్లు సమాచారం. ఐ–ప్యాక్ బృందం ఏ తరహా సేవలు అందిస్తుంది, దాని పరిధి, పరిమితులు ఏమిటనే అంశాలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పీకే బృందంతో కలిసి పనిచేయడంలో ఉన్న సాధ్యాసాధ్యాలను మదింపు చేసిన తర్వాత త్వరలో టీఆర్ఎస్, ఐ–ప్యాక్ నడుమ తుది ఒప్పందం కుదరనుంది. పార్టీపరంగా ఎప్పటికప్పుడు సర్వేలు... రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పార్టీ యంత్రాంగం, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల పనితీరుపై టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. సమాచార సేకరణకు మై యాక్సిస్ వంటి ప్రముఖ సర్వే సంస్థల సేవలను వినియోగించుకుంటోంది. సర్వేలు శాస్త్రీయంగా ఉండేందుకు ప్రశ్నావళి రూపకల్పన మొదలుకొని నమూనాల సేకరణకు వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. సర్వేలో భాగంగా కన్సల్టెన్సీలు కేవలం నమూనాల సేకరణకే పరిమితమవకుండా వివిధ కోణాల్లోనూ విశ్లేషిస్తూ నివేదికలు అందజేస్తున్నాయి. సందర్భాన్ని బట్టి సర్వేల ద్వారా ప్రజానాడిని పసిగట్టడం, పార్టీ పనితీరును అంచనా వేస్తున్న టీఆర్ఎస్ అధినేత... వివిధ నిఘా సంస్థల నుంచి అందే నివేదికలతో వాటిని పోల్చి చూస్తూ వ్యూహరచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో... ఇన్నాళ్లూ అధికారిక కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాల ప్రచారం కోసం పీఏలు, పీఆర్వోలపై ఆధారపడిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇటీవలి కాలంలో పొలిటికల్ కన్సల్టెన్సీల వైపు చూస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ పనితీరుపై ప్రచారం, తమపై వచ్చే ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టడం తదితరాల కోసం కన్సల్టెన్సీల సేవలను వినియోగించుకుంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోజువారీ కార్యక్రమాలు, సోషల్ మీడియా ఖాతాల నిర్వహణకు నాలుగు కన్సల్టెన్సీలు పనిచేస్తున్నట్లు తెలిసింది. ఓ కీలక మంత్రి కూడా ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ బాధ్యతను ఓ కన్సల్టెన్సీకి అప్పగించినట్లు సమాచారం. -
ప్రధాన పార్టీలకు..వలసల దెబ్బ
గోవా రూటే సెపరేటు.. ఆ రాష్ట్రంలో ఫిరాయింపులు సర్వసాధారణం. అతి చిన్న రాష్ట్రమైన గోవాలో పార్టీ కంటే నాయకులే అత్యంత శక్తిమంతులు. పార్టీ ఫిరాయింపులతో ప్రభుత్వాలు కూలదోయగలరు, వాటితోనే ప్రభుత్వాలను నిలబెట్టగలరు. ఇప్పుడు కూడా ఆయారామ్, గయారామ్ సంస్కృతి పెరిగి గందరగోళానికి దారితీస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ గోవాలో పార్టీ ఫిరాయింపులు అధికమయ్యాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఎటు దూకుతారో తెలియక అన్ని పార్టీలు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇన్నాళ్లూ బీజేపీ, కాంగ్రెస్ హవా కొనసాగిన గోవాలో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో నాలుగు స్తంభాలాట (ఆమ్ ఆద్మీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇక్కడ బరిలోకి దిగింది) నెలకొంది. దీంతో నాయకుల పక్క చూపులు ఎక్కువయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎక్కువగా ఆపరేషన్ ఆకర్‡్ష నిర్వహిస్తోంది. ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో అత్యంత ప్రభావం చూపించే నాయకులపై వల విసురుతోంది. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న తృణమూల్ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి సై అంటోంది. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, ఈశాన్య రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి అయిన లూయీజిన్హో ఫలేయిరో 2021 సెప్టెంబర్‌లో తృణమూల్‌లో చేరడంతో ఈ ఫిరాయింపుల పర్వం మొదలైంది. వెంటనే ఆయన్ను రాజ్యసభకు పంపిన మమతా బెనర్జీ ఎవరొచ్చినా తగిన గౌరవం ఇస్తామని సంకేతాలు పంపారు. గోవా మరో మాజీ సీఎం, ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్ అలెమావో కూడా పార్టీని వీడి టీఎంసీలో చేరారు. వీరిద్దరి రాకతో కేథలిక్కుల్లో తృణమూల్‌కు పట్టు లభించినట్టయింది. గత ఎన్నికల్లో 17 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఇద్దరే మిగిలి ఉండడం పార్టీ దుస్థితిని చాటిచెబుతోంది. 2017లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, 2019లో ఏకంగా 10 మంది కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. తర్వాత గత ఏడాది మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడారు. అధికార బీజేపీలో సొంత పార్టీ మంత్రులే అవినీతి ఆరోపణలు చేయడంతో ఆ పార్టీని వీడేవారి సంఖ్య పెరుగుతోంది. బీజేపీకి క్రిస్టియన్లు దూరమవుతున్నారా? గోవాలో బీజేపీ క్రిస్టియన్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. కలంగుటే ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మైఖేల్ లోబో బీజేపీకి రాజీనామా చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయారు. గోవాలో మెజార్టీ జనాభా హిందువులైనప్పటికీ 2011 లెక్కల ప్రకారం 25% క్రిస్టియన్లు ఉన్నారు. మనోహర్ పారిక్కర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిస్టియన్లను ఆకర్షించే కార్యక్రమాలు నిర్వహించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 13 స్థానాలను గెలిస్తే వారిలో ఏడుగురు ఎమ్మెల్యేలు క్రిస్టియన్లు కావడం విశేషం. గత నెలలో కార్టోలిమ్ ఎమ్మెల్యే అలీనా సల్దాన్హా బీజేపీకి రాజీనామా చేసి ఆప్‌లో చేరారు. మరో క్రిస్టియన్ ఎమ్మెల్యే వాస్కో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్లోస్ అల్మీదా కాంగ్రెస్‌లో చేరారు. ఇక వెలిమ్ ఎమ్మెల్యే, మంత్రి ఫిలిప్ నెరి, రోడ్రిగెజ్ ఎమ్మెల్యే బాబాసన్ త్వరలోనే బీజేపీని వీడతారని ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రి మైఖేల్ లోబో తన భార్య దలిలాకి కూడా టికెట్ ఆశించారు. అది వచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీని వీడారన్న ఊహాగానాలు ఉన్నాయి. ఉత్తర గోవాకి చెందిన లోబోకు 5–6 నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. క్రిస్టియన్ జనాభా అధికంగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తే ఓడిపోతామన్న భయంతోనే వీరంతా రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మదర్ థెరిసా నెలకొల్పిన మిషనరీస్ ఆప్ చారిటీకి విదేశీ విరాళాల సేకరణకు లైసెన్స్ పునురుద్ధరించకపోవడం.. ఆపై విమర్శలు రావడంతో 15 రోజుల తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓకే చెప్పడం తెలిసిందే. ఈ పరిణామాలు క్రిస్టియన్లలో బీజేపీపై ఆగ్రహం తెప్పించి ఉంటాయని ఈ నాయకులు భయపడుతున్నారు. అంతా గందరగోళం ఎమ్మెల్యేలు, నేతలు పార్టీలు మారుతుండటంతో ఎవరెక్కడ ఉన్నారోననే తీవ్రమైన గందరగోళం నెలకొంది. దీంతో ఓటర్లు ఎవరివైపు ఉంటారో చెప్పడం తలపండిన రాజకీయ విశ్లేషకులకు కూడా సాధ్యం కావడం లేదు. ‘‘బీజేపీ తీవ్ర అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కానీ టీఎంసీ ఎన్నికల బరిలోకి రావడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకి దెబ్బపడింది. గత ఎన్నికల్లో 6.3 శాతం ఓటు షేర్ సాధించిన ఆప్ క్రమంగా బలం పుంజుకుంటోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమైతేనే అధికార బీజేపీని ఓడించగలరు’’ అని ఎన్నికల విశ్లేషకుడు క్లాఫాటో కౌంటిన్హో అభిప్రాయపడ్డారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
కాంగ్రెస్ సారథ్య బాధ్యతలపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడం ఏ వ్యక్తికి దైవదత్తంగా సంక్రమించే హక్కు కాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. గత పదేళ్ల కాలంలో 90 శాతానికి పైగా ఎన్నికల్లో ఓడిపోయిన ఒక పార్టీకి నేతృత్వం వహించే హక్కు దానంతట అదే రాదని పేర్కొన్నారు. మమతా బెనర్జీ యూపీఏ కూటమి లేదంటూ కామెంట్లు చేసిన మర్నాడు గురువారం రాహుల్‌గాంధీపై ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్ వేదికగా మాటల దాడికి దిగారు. దేశ రాజకీయ ముఖచిత్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం ఉందని, ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ప్రతిపక్ష కూటమికి సారథి ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని తన ట్వీట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ లేని కూటమి ఆత్మ లేని శరీరమే: సిబల్ యూపీఏ కూటమే లేదంటూ మమత చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ లేని యూపీఏ అంటే ఆత్మ లేని శరీరం వంటిదన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి తమ సత్తా చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలనూ తిప్పికొట్టారు. ఇతర పార్టీల ఎజెండా ఏంటో ప్రశాంత్ ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో సలహాలిచ్చుకునే స్వేచ్ఛ ఆయనకు ఉందని, కానీ మరో పార్టీ ఎజెండాపై ఎలా మాట్లాడాతారని నిలదీశారు.‘మమతది పచ్చి రాజకీయ అవకాశవాదం. ఆర్ఎస్ఎస్, బీజేపీలను ఎదుర్కొంటున్నట్లు నటిస్తూ అదే ఫాసిస్టు శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారు’ అని రణ్‌దీప్ సూర్జేవాలా ధ్వజమెత్తారు. -
వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం కేసీఆర్ భేటీ?
సాక్షి, హైదరాబాద్: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం ‘ఐ ప్యాక్’తో కలిసి పనిచేసేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆసక్తి చూపుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. విశ్వసనీయ సమాచారం మేరకు.. కొంతకాలంగా వారితో సంప్రదింపులు జరుపుతున్న గులాబీ దళం అధినేత, బుధవారం ప్రగతిభవన్‌లో ఐ ప్యాక్‌కు చెందిన కీలక బృం దంతో సమావేశమయ్యారు. ఐ ప్యాక్ సర్వే బృం దంగా చెబుతున్న వారితో జరిగిన భేటీలో.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. కాగా రాష్ట్రంలోని వివిధ వర్గాల స్పం దన వివిధ కోణాల్లో తెలుసుకునేందుకు కేసీఆర్ ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ సందర్భాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలపై ప్రజాభిప్రాయాన్ని సర్వేల ద్వారా సేకరించడంపై చర్చించినట్లు సమాచారం. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న అంశాలు, పార్టీ యంత్రాంగం పనితీరు వంటి వాటిపై ఐ ప్యాక్ ద్వారా సర్వే చేయించాలని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్లు తెలిసింది. ఐ ప్యాక్ నుంచి ప్రస్తుతానికి సర్వేలకు సంబంధించిన సేవలు మాత్రమే తీసుకోవాలని, భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని విస్తృత సేవలు పొందాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
కోల్‌కతా ఓటరుగా ప్రశాంత్ కిషోర్.. పక్కా ప్లాన్‌తోనేనా?!
కోల్‌కతా: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పశ్చిమబెంగాల్ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటరుగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్రపోషించారు. ఆయన ఇదివరకు బీహార్‌లోని ససారాం జిల్లాలోని తన స్వగ్రామంలో ఓటరుగా ఉన్నారు. ఈ నెల 30న జరగనున్న భవానీపూర్ ఉపఎన్నికలో ప్రశాంత్‌కిషోర్ తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. IUI0656683 ఎపిక్ నెంబర్‌తో ఉన్న నివాసం ఆయన శాశ్వత నివాసంగా చూపబడింది. నియోజకవర్గ పరిధిలోని రాణిశంకరి లేన్‌లోని బూత్ నెం-2222లో పోలింగ్ స్టేషన్ ఉంది. భవానీపూర్ అసెంబ్లీ ఎన్నిక సమయంలో ప్రశాంత్ కిషోర్ కోల్‌కతాలో ఉండకుండా బయటకు తీసుకురావడానికి బీజేపీ ఎన్నికల కమిషన్ని బలవంతం చేయొచ్చు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పథకం ప్రకారం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. భవానీపూర్‌లో ఓటరుగా నమోదు చేసుకోవడంతో బీజేపీ ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది. టీఎంసీ అడ్వయిజర్‌గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఓటరుగా నమోదు చేసుకోవడంపై బీజేపీ మీడియాసెల్ ఇన్చార్జ్ సప్తర్షి చౌదరి ఫైర్ అయ్యారు. 'చివరికి బహిరాగాటో (బయటివ్యక్తి) భవానీపూర్ ఓటర్ అయ్యారు. కాబట్టి, బెంగాల్ కుమార్తె ఇప్పుడు బహిరాగాటో (బయటి) ఓటర్‌కు అనుకూలంగా ఉంటుందో లేదో తెలియదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: (యూపీ బరిలో ఒవైసీ అలజడి) కిషోర్‌ను భవానీపూర్ ఓటర్ జాబితాలో చేరడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడింది. కొద్ది రోజుల క్రితం సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ అగ్ర నాయకులను కలుసుకున్నారు. దీంతో అతను కాంగ్రెస్‌లో చేరవచ్చు అనే ఊహాగానాలకు ఆజ్యం పోశారు. అయితే ఆయన పార్టీలో చేరే నిర్ణయం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీదేనని పార్టీ వర్గాలు సూచించాయి. ప్రశాంత్ కిషోర్ మొదట్లో 2014 లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత జేడీ(యు)లో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ పార్టీ నుంచి బహిష్కరించారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ వేదికను ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. అతను పంజాబ్‌లో పార్టీ విజయానికి తోడ్పాటునందించాడు. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సలహాదారుగా ఉంటూ, అతను ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్.. ముహుర్తం ఖరారు) -
ప్రశాంత్ కిశోర్ చేరికపై రాహుల్ చర్చలు!
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి ఏమేరకు ప్రయోజనం ఉంటుంది? ఎదురయ్యే ప్రతికూలతలు ఏమిటని రాహుల్ గాంధీ సీనియర్ నేతలతో చర్చించినట్లు విశ్వసనీయవర్గాలు గురువారం తెలిపాయి. ఈనెల 22న రాహుల్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్లు ఏ.కె.ఆంటోనీ, మల్లికార్జున ఖర్గే, కమల్‌నాథ్, అంబికా సోని, హరీష్ రావత్, కె.సి.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నట్లు తెలిసింది. ప్రశాంత్ కిశోర్ చేరికతో ఉండే సానుకూలత, ప్రతికూలతలను ఇందులో రాహుల్ పార్టీ నేతలతో కూలంకషంగా చర్చించారు. పార్టీలో చేరితే ప్రశాంత్ కిశోర్‌కు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనే అంశం కూడా చర్చకు వచ్చింది. ప్రశాంత్ చేరితే కాంగ్రెస్ పార్టీకి ప్రయో జనం కలుగుతుందని సీనియర్లు అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రశాంత్ కిశోర్ ఈనెల 13న రాహుల్, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యా రు. అప్పటినుంచి ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారనే ఊహగానాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, ప్రశాంత్ కిశోర్‌లు మాత్రం ఈ అంశంపై ఇంతవరకు స్పందించలేదు. బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి మమత హ్యాట్రిక్‌లో కీలకభూమిక పోషించిన ప్రశాంత్ కిశోర్ తాను ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని మే నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. -
నిఘా నేత్రాల నీడలో...
కనిపించని కళ్ళేవో గమనిస్తున్నాయి. తెలియకుండానే మాటల్నీ, కదలికల్నీ కనిపెడుతున్నాయి. మన చేతిలోని మొబైల్‌ఫోన్ నిజానికి నిఘావాళ్ళ చేతిలో సాధనం. ఈ మాట ఎవరన్నా అంటే, ఉలిక్కిపడతాం. ‘పెగసస్’ అనే నిఘా సాఫ్ట్‌వేర్‌తో దేశంలో ప్రముఖుల ఫోన్లు సుదూరం నుంచే హ్యాకింగ్‌కు గురయ్యాయంటూ ఆదివారం వెలువడ్డ కథనాలు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది అందుకే! ఇజ్రాయెలీ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘ఎన్ఎస్ఓ గ్రూపు’ నిఘా టెక్నాలజీని విక్రయిస్తుంటుంది. ఆ సంస్థకు చెందిన నిఘా సాఫ్ట్వేర్– ‘పెగసస్’. దాన్ని వినియోగించుకొని, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతల మొదలు ప్రముఖ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల దాకా అందరి మొబైల్ ఫోన్లపైనా నిఘా పెట్టారనేది తాజా ఆరోపణ. తమ పరిశోధనలో ఆ సంగతి బయటపడిందని ‘వాషింగ్టన్ పోస్ట్’, ‘గార్డియన్’ సహా పలు అంతర్జాతీయ వార్తా సంస్థల కన్సార్టియమ్ వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలు వాస్తవ విరుద్ధమనీ, ఈ స్పైవేర్‌ను ఆయా దేశాల ప్రభుత్వాలకు అమ్ముతామే తప్ప, దాన్ని నిర్వహించట్లేదనీ, డేటా వివరాలు తమకు తెలియవనీ ఇజ్రాయెలీ సంస్థ చెప్పుకొస్తోంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మటుకు ‘పెగసస్’ నిఘా సాయంతో పెద్దయెత్తున సాంకేతిక భద్రతా ఉల్లంఘనలు జరిగినట్టు తమ డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణలో బయటపడినట్టు పేర్కొంటోంది. పరస్పర విరుద్ధ వాదనలతో ఈ వివాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్త డిజిటల్ నిఘాపై చర్చ రేపుతోంది. ఈ నిఘా సాఫ్ట్వేర్ ‘పెగసస్’ మాట కొన్నేళ్ళ క్రితమే తొలిసారిగా వినిపించింది. మళ్ళీ ఇప్పుడు తెర మీదకొచ్చింది. 2019లో ఈ స్పైవేర్‌ను చూసి, ఆ ప్రయత్నాలను నిర్వీర్యం చేసినట్టు సాక్షాత్తూ మెసేజింగ్ వేదిక ‘వాట్సప్’ సారథే ఒప్పుకున్నారు. దాదాపు 53 కోట్ల మంది వాట్సప్ వాడుతున్న దేశం మనది. ఆ ఏడాది డిసెంబర్లో సాక్షాత్తూ అప్పటి మన కేంద్ర మంత్రి దేశంలోని అనేక వాట్సప్ ఖాతాల సమాచారం హ్యాకింగ్‌కు గురైనట్టు అంగీకరించడం గమనార్హం. ఈసారేమో సాక్షాత్తూ కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, జలశక్తి మంత్రి ప్రహ్లద్ జోషీ కూడా ఈ స్పైవేర్ బాధితుల జాబితాలో ఉన్నట్టు వార్త. రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా 2019 లోక్‌సభ ఎన్నికల వేళ ఇలాంటి బాధితులే కావచ్చనీ కథనం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిశోధనాత్మక జర్నలిస్ట్‌లకూ, సామాజిక కార్యకర్తలకూ ఈ అవస్థ తప్పలేదు. వాళ్ళందరి డేటా స్పైవేర్ వద్ద ఉన్నట్టు బయటపడిందంటున్నారు కానీ, వారి సమాచారం పూర్తిగా హ్యాకింగ్ అయిందా, లేదా అన్నది తేలాల్సి ఉంది. నిజానికి, ఇంటెలిజెన్స్ బ్యూరో సహా అనేక ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు మన దేశంలో అనుమాని తులపై నిఘా పెట్టే వీలుంది. అధికారిక నిఘా ఏమీ పెట్టలేదని ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు. మరి, ఇప్పుడీ విదేశీ స్పైవేర్‌తో అనధికారికంగా, చట్టవిరుద్ధమైన నిఘా సాగుతోందా అన్నది వెంటనే తలెత్తే ప్రశ్న. దానికి ఇంకా జవాబు రావాల్సి ఉంది. సమాజంలోని ప్రముఖుల ఫోన్లపై తీవ్రవాదుల లాగా ఇలా చట్టవిరుద్ధంగా నిఘా ఏమిటన్నది ప్రతిపక్షాల ప్రశ్న. అలాగే, విదేశీ నిఘావేర్‌ను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వినియోగించిందా, లేదా అనీ విమర్శకులు సూటిగా అడుగుతున్నారు. ఆ ప్రశ్నలు వట్టి అన్యాయమని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. ఇప్పటికి సుమారు 45 దేశాలు ఈ ‘పెగసస్’ స్పైవేర్‌ను వినియోగిస్తున్నట్టు ఓ లెక్క. కానీ, మోదీ సర్కార్ మాత్రం తాము అలాంటి సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయలేదంటోంది. నిఘా బాధితుల జాబితాలో పేరున్నట్టు వార్తలొచ్చిన సాక్షాత్తూ కేంద్ర ఐటీ శాఖ మంత్రే సోమవారం లోక్‌సభ సాక్షిగా ఈ మొబైల్ నిఘావేర్ వివాదాన్ని కొట్టిపారేయడం గమనార్హం. ‘సంచలనం సృష్టించడమే ఈ ఆరోపణల ధ్యేయం. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు చేశారు’ అని ఆయన సభాముఖంగా తేల్చేశారు. ‘సరిగ్గా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం ముందు రోజునే ఓ వెబ్సైట్ ఈ నివేదికను లీక్ చేయడం యాదృచ్ఛికం కాదు’ అని కూడా మంత్రివర్యులు అనడం కొసమెరుపు. ఎవరైనా ఏమైనా ఆరోపణలు చేయవచ్చు. కానీ, వాటికి బలమైన ఆధారాలు ఏవీ అన్నది ప్రభుత్వ, పాలకపక్షాల వాదన. ఆరోపణలకు తగిన ఆధారాలు కోరడం కచ్చితంగా సమంజసమే. దాన్ని తప్పుపట్టలేం. కానీ, తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై సమగ్ర దర్యాప్తు జరపడానికి ఎవరికైనా అభ్యంతరం ఉండనక్కర లేదు. అందులోనూ అధికారంలో ఉన్నవారు చేయాల్సింది అదే కదా! ప్రతిపక్షాలు కోరుతున్నదీ అదే! నిజానిజాల నిగ్గు తేల్చడానికైనా సరే ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే రంగంలోకి దిగాలి. ఒకవేళ ఆరోపణలే గనక నిజమైతే, దేశ పౌరుల ప్రైవేట్ డేటాపై ఇలా విదేశీ నిఘాను ఉపయోగించడం దిగ్భ్రాంతికరం. మరీ ముఖ్యంగా మంత్రులతో సహా పలువురు ప్రముఖుల సంభాషణలు, కాంటాక్ట్ వివరాలు, ఇ–మెయిల్స్, నెట్లో ఏవేం వెతికారనే చరిత్ర, ఫోటోలు, కెమేరా, మైక్రోఫోన్లతో సహా అన్నీ విదేశీ నిఘా నేత్రం కింద ఉన్నాయంటే – అది దేశభద్రతకే పెనుముప్పు. అణుమాత్రమైనా అనుమానం రాకుండా, కనీసం ఆనవాళ్ళయినా లేకుండా తన పని కానిచ్చే ‘పెగసస్’ నిఘా నేత్రం విషయంలో వెంటనే అప్రమత్తం కావాల్సింది కూడా అందుకే! తాజా ఆరోపణలన్నీ భారత ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చే ప్రయత్నమని కేంద్ర మంత్రి అన్నారు కానీ, రేపు ఈ ఆరోపణలే గనక నిజమని తేలితే... ఈ దుర్మార్గపు నిఘా ఏ ప్రజాస్వామ్యానికైనా మాయని మచ్చ అని గ్రహించాలి. ఇప్పటికీ నత్తనడక సాగుతున్న ప్రైవేట్ సమాచార భద్రత బిల్లును ఇకనైనా చట్టం చేయాల్సిన అవసరాన్ని ఇప్పుడిక అందరూ గుర్తించాలి. -
పవార్‌తో మళ్లీ ప్రశాంత్ కిషోర్ భేటీ
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 8 విపక్ష పార్టీల నేతలు మంగళవానం పవార్ నివాసంలో ప్రత్యేకంగా సమావేశమైన మర్నాడు ఈ భేటీ చోటు చేసుకోవడం విశేషం. పవార్, ప్రశాంత్ కిషోర్ దాదాపు గంటపాటు సమావేశమయ్యారని, గత పక్షం రోజుల్లో వారిమధ్య ఇది మూడో భేటీ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్ 11న ముంబైలో పవార్ నివాసంలో ఒకసారి, ఆ తరువాత తాజాగా సోమవారం ఢిల్లీలోని పవార్ నివాసంలో రెండోసారి వారు సమావేశమయ్యారని వెల్లడించాయి. ఇటీవలి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహలున్న విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నారన్న అంచనాల మధ్య ప్రశాంత్ కిషోర్, పవార్ల మధ్య వరుస భేటీలు జరగడం ఆసక్తికరంగా మారింది. పవార్ నివాసంలో మంగళవారం జరిగిన విపక్ష నేతల సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, ఆర్ఎల్డీ, నేషనల్ కాన్ఫెరెన్స్, లెఫ్ట్ పార్టీలు పాల్గొన్న విషయం తెలిసిందే. అది రాజకీయేతర సమావేశమని అందులో పాల్గొన్న పలువురు నేతలు పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పనున్న సిద్దూ!
ఢిల్లీ : పంజాబ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధమైనట్లే కనిపిస్తుంది. గత కొంత కాలంగా ఆయన పార్టీని వీడతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తాజాగా ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రివాల్.. సిద్దూ రావాలనుకుంటే తమ పార్టీ ఆయనకు స్వాగతం పలుకుతుంది అనడంతో ఈ విషయంపై స్పష్టత వచ్చినట్టయింది. గురువారం జరిగిన ఓ సమావేశంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్ తరపున సిద్దూతో ఎవరైనా చర్చలు జరుపుతున్నారా అని ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు. 2017లో బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన సిద్దూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ తర్వాత ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో వచ్చిన విబేధాల కారణంగా పార్టీ సమావేశాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఏడాది క్రితమే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయనను ఆహ్వానించింది. అయితే కొన్ని సామాజిక పరిస్థితుల కారణంగా అప్పుడు చేరలేదు. ఈ ఏడాది మార్చిలో ఆమ్ ఆద్మీ పంజాబ్ ఛీప్ భగవంత్ మన్ కూడా సిద్దూని తమ పార్టీలోకి ఆహ్వానించారు. (గుజరాత్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ) అప్పటి ఎన్నికల్లో సిద్దూ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం పార్టీ మారే విషయంలోనూ కీలకంగా మారినట్టు కనబడుతోంది. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఐడి), బీజేపీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లో అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 117 స్థానాల్లో 77 సీట్లు గెలిచి అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. (కరోనా చికిత్సకు తాజా మార్గదర్శకాలు) -
డీఎంకేకు ప్రశాంత్ కిశోర్ సేవలు
చెన్నై: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకుంటున్న రాజకీయ పార్టీ్టల్లో తాజాగా డీఎంకే కూడా చేరింది. తమిళనాడులో 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ కిశోర్‌కు చెందిన సంస్థ ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐప్యాక్)’ సహాయం తీసుకోనున్నామని ఆదివారం డీఎంకే అధినేత స్టాలిన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. స్టాలిన్ ట్వీట్‌పై ఐప్యాక్ కృతజ్ఞతలు తెలిపింది. ‘2021లో విజయమే లక్ష్యంగా తమిళనాడులో డీఎంకేతో కలిసి పనిచేసేందుకు ఉత్సుకతతో ఉన్నాం’ అని ట్వీట్ చేసింది. గత పదేళ్లుగా విపక్షంలో ఉంటున్న డీఎంకే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అన్నాడీఎంకే నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది. సినీ నటుడు కమల్‌హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ కూడా ప్రశాంత్ కిశోర్ వ్యూహాలను వాడుకోనుందని కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికలను డీఎంకే దాదాపు స్వీప్ చేసింది. మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో 38 సీట్లను డీఎంకే గెలుచుకుంది. 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం రెండు అసెంబ్లీ స్థానాలను అన్నాడీఎంకే గెల్చుకుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కోసం, పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కోసం ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐప్యాక్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. -
ప్రశాంత్ కిషోర్‌పై జేడీయూ వేటు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్) విషయంలో పార్టీ వైఖరిని ప్రశ్నించినందుకు పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌ను జనతాదళ్(యూ) బహిష్కరించింది. సీఏఏ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తున్న కిషోర్... ఈ విషయంలో పార్టీ వైఖరిని తప్పుబడుతున్నారు. నితీశ్ ఈ రెండింటికీ మద్దతివ్వటాన్ని ప్రశాంత్‌తో పాటు జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి పవన్ వర్మ విమర్శించారు. ఈ రెండింటికీ వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కటవ్వాలని ప్రశాంత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీనుంచి వారిద్దరినీ బహిష్కరిస్తున్నట్లు జేడీయూ తెలిపింది. ‘వారిద్దరూ సీఎంను అవమానించేలా మాట్లాడారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించారు’ అని పార్టీ పేర్కొంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి, పార్టీ పదవుల నుంచి తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రశాంత్ కిషోర్, పవన్ వర్మలను బహిష్కరిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. నితీశ్ మళ్లీ సీఎం కావాలి: ప్రశాంత్ బహిష్కరణ ప్రకటన వెలువడిన వెంటనే ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ‘కృతజ్ఞతలు నితీశ్‌జీ. మీరు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ’ అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించడం వల్లే ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకున్నానని మంగళవారం నితీశ్ చెప్పటంతో ఇద్దరి మధ్యా విభేదాలు తీవ్రమయ్యాయి. దానిపై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహిస్తూ... ‘‘ఎంత దిగజారిపోయారు!!. ఇలాంటి అబద్ధం చెప్పి నన్నూ మీ స్థాయికి లాగుతున్నారా? ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే అమిత్ షా సిఫారసులున్న నన్ను తొలగించే ధైర్యం మీకుంటుందా? దాన్ని ఎవరైనా నమ్ముతారా?’’ అని ప్రశ్నించారు. తృణమూల్‌లో చేరనున్నారా? ప్రశాంత్ త్వరలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారని వినిపిస్తోంది. కానీ ఈ వార్తను తృణమూల్ వర్గాలు నిర్ధారించలేదు. భవిష్యత్తులో ఆ అవకాశం లేకపోలేదంటూ... ఆ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ లేదా తమ అధినేత్రి మమత బెనర్జీనే ధ్రువీకరించాలని టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ పేర్కొన్నారు. మమత బెనర్జీతో ప్రశాంత్‌కు సంబంధాలున్నాయన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రశాంత్ సేవలను టీఎంసీ ఉపయోగించుకుంటోంది. -
ప్రశాంత్ కిషోర్‌పై నితీష్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జేడీయూ అధ్యక్షుడు సీఎం నితీష్ కుమార్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు మధ్య విభేదాలు బయటపడ్డాయి. ప్రశాంత్ కిషోర్‌పై మంగళవారం నితీష్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘పార్టీలో ఉండాలనుకుంటే ఉండు లేకపోతే లేదు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీలో కొనసాగాలి అనుకుంటే జేడీయూ నిబంధనలకు కట్టుబడి ఉండాలని లేకపోతే పార్టీ వదిలి వెళ్లాలని నితీష్ తేల్చిచెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై వెంటనే స్పందించిన ప్రశాంత్ కిషోర్.. తాను బిహార్ వచ్చి సమాధానం చెబుతానని, కొంత సమయం వరకు వేచి చూడాలని సమాధానమిచ్చారు. తాజా పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. (అమిత్ షాకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్..!) కాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు వివాదాస్పద చట్టాలను ప్రశాంత్ కిషోర్ బహిరంగంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అలాగే నితీష్ కుమార్ ప్రస్తుతం ఎన్డీయే మిత్రపక్షంగా కొనసాగుతున్నప్పటికీ.. బీజేపీ వ్యతిరేక పక్షాలకు మద్దతుగా ప్రశాంత్ వ్యవహరిస్తున్నారు. ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపడుతున్నారు. అంతటితో ఆగకుండా బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రశాంత్ తలదూర్చారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఆయన.. హస్తినలో ఆప్ విజయానికి ప్రణాళికలు రచిస్తూ... తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాగే ఆప్ తరఫున ప్రచార బరిలోనూ దిగుతానని ఇటీవల ప్రకటించారు. (ఆ చట్టాలను అడ్డుకోవాలంటే రెండే మార్గాలు) మరోవైపు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీ విధానాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలపై దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున ఉద్యమించారని వారిని అభినందిస్తూ ఇటీవల ఆయన ట్వీట్ కూడా చేశారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. షాహీన్‌బాగ్ ఘటనపై ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సందించుకున్నారు. (ప్రశాంత్ కిషోర్‌కు మరో ప్రాజెక్టు..!) ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలించిన బీజేపీ నాయకత్వం ప్రశాంత్ వ్యవహారంగా తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని కంట్రోల్లో పెట్టాలని నితీష్‌ను బీజేపీ పెద్దలు మందలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ వ్యవహారంపై నితీష్ బహిరంగ వ్యాఖ్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ జేడీయూకి రాజీనామా చేసి బయటకు వెళ్తారా లేక నితీష్‌కు సంజాయిషీ ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. -
అమిత్ షాకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్..!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఘాటుగా స్పందించారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే షహీన్‌బాగ్ వంటి వేలాది ఘటనలను నివారించవచ్చని, పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) విమర్శిస్తున్న ప్రత్యర్ధులను లక్ష్యంగా చేస్తూ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. షహీన్‌బాగ్‌లో జరిగిన ఘటనలను గుర్తుచేస్తూ అంతే ఆగ్రహంతో ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో బటన్ నొక్కడం ద్వారా ప్రతిఘటించవచ్చని అమిత్ షా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సోమవారం ట్విటర్ వేదికగా ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ‘ఢిల్లీపై ప్రేమతో ఓటు వేయండి అంతేచాలు. ప్రస్తుతం ప్రభుత్వంపై ఎలాంటి అసహనంలేదు. సోదరభావం, స్నేహ భావానికి ఎలాంటి ప్రమాదంలేదు’ అని అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు ప్రశాంత్ కిషోర్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ఆయన.. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రాజకీయ సలహాదారుడిగా సేవలు అందిస్తున్నారు. దీనిలో భాగంగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపునకు తెరవెనుక ప్రణాళికలు రచిస్తున్నారు. -
‘అది వ్యూహాత్మక ఎత్తుగడే’
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుపై చర్చ ఉండదని ప్రభుత్వం చేసిన ప్రకటన పౌరసత్వ సవరణ చట్టంపై పెల్లుబికిన నిరసనలను చల్లార్చేందుకేనని జేడీ(యూ) నేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఇది కేవలం విరామం మాత్రమే ఫుల్స్టాప్ కాదని ఆయన గురువారం ట్వీట్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు వెలువరించేవరకూ వేచిచూడాలని కోరారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా మొత్తం ప్రక్రియ మొదటికి వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జేడీ(యూ) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పౌరసత్వ సవరణ చట్టంపై బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్త ఎన్ఆర్సీని డిమానిటైజేషన్ ఆఫ్ సిటిజన్‌షిప్‌గా ఆయన అభివర్ణించారు. దేశవ్యాప్త ఎన్ఆర్సీపై చర్చ ఉండబోదన్న ప్రధాని మోదీ ప్రకటనను వ్యూహాత్మక చర్యగా ప్రశాంత్ కిషోర్ అన్నారు. మరోవైపు ఎన్ఆర్సీలో గుర్తించిన ముస్లిమేతర అక్రమ వలసదారులను పౌర చట్టం రక్షిస్తుందని, పెద్దసంఖ్యలో ముస్లింలు దేశం వీడివెళ్లాల్సి వస్తుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పౌరచట్టం, ఎన్ఆర్సీల ఫలితంగా ముస్లింలు దేశం నుంచి నిష్క్రమించేలా ప్రభావం చూపుతాయని మాజీ హోంమంత్రి పీ చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. -
విపక్షాలకు ప్రశాంత్ కిషోర్ సూచనలు
పట్నా: నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్( ఎన్ఆర్సీ), పౌరసత్వ సవరణ చట్టంపై రాజకీయ వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ఆర్సీ అడ్డుకోవటం కోసం ప్రజలు, రాజకీయ నాయుకులు రెండు బలమైన మార్గాలను ఎంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్ వేదికగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీపై ప్రజలు, నాయకులు వ్యతిరేకంగా అన్ని మాధ్యమాల్లో శాంతియుతంగా నిరసనలు వ్యకం చేయాలని ఆయన సూచించారు. ఆదే విధంగా బీజేపీయేతర 16 మంది ముఖ్యమంత్రులు ఏకమై పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలని ప్రశాంత్ కిశోర్ పిలుపునిచ్చారు. ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఎన్ఆర్సీని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఎన్ఆర్సీని బిహార్‌లో అమలు చేయాల్సిన అవసరం ఏముందని నితీష్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్డీయేతర ముఖ్యమంత్రులు కేంద్రంపై తీవ్రంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జేడీయూ పార్లమెంట్ ఉభయ సభల్లోనూ క్యాబ్ బిల్లుకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై పార్టీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2014లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రశాంత్ కిషోర్ విస్తృతంగా కృషిచేసిన విషయం తెలిసిందే. -
ప్రశాంత్ కిషోర్‌కు మరో ప్రాజెక్టు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెంట రాజకీయ పార్టీలు లైన్ కడుతున్నాయి. తమ పార్టీకి సలహాదారుడిగా వ్యవహరించాలంటూ దేశంలోని ప్రముఖ నేతలంతా అభ్యర్థిస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ప్రశాంత్ అపాయింట్మెంట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని తొలిసారి పీఎం పీఠంపై కూర్చోబెట్టడంలో ప్రశాంత్ అద్భుతమైన విజయం సాధించారు. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆ తరువాత బిహార్‌లో నితీష్ కుమార్ కూటమి విజయం, పంజాబ్‌లో అమరిందర్ సింగ్ గెలుపుకోసం విశేషంగా కృషి చేసి విజయం సాధించారు. ఆ తరువాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో పశ్చిమ బెంగాల్లో తిరుగులేని శక్తిగా అవతరించిన తృణమూల్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ప్రశాంత్‌కు ఆశ్రయించకతప్పలేదు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గర పడుతుండటంతో తనకు వ్యూహకర్తగా వ్యవహరించాలంటూ దీదీ కోరారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎదురులేదనుకున్న మమత బీజేపీ ధాటికి దారుణంగా దెబ్బతిన్నారు. మెజార్టీ సిట్టింగ్ స్థానాలకు కోల్పోవల్సి వచ్చింది. దీంతో పీకే అవసరం తప్పదని భావించిన మమత.. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే అతనితో కలిసి వ్యూహాలు రచిస్తున్నారు. ఇదిలావుండగా తాజాగా ప్రశాంత్ కిషోర్‌కు మరో ప్రాజెక్టు కూడా వచ్చినట్లు జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. తమిళనాడులో బలమైన నేతగా గుర్తింపుపొందిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా ప్రశాంత్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. తమిళనాట 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలపై అనుసరించాల్సి వ్యూహాలు, సలహాలు గురించి పీకేతో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే స్టాలిన్, కిషోర్ మధ్య సమావేశం జరుగనుందని చెన్నై వర్గాల సమాచారం. -
మీడియా ముందుకు రండి.. ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్
పట్నా : తమ పార్టీని సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో విలీనం చేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించారని బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ ఘటుగా స్పందించారు. లాలు కోరుకుంటే ఎప్పుడైనా తనతో పాటు మీడియా ముందుకు వచ్చి చర్చ జరపవచ్చని ఛాలెంజ్ చేశారు. మీడియా ముందు చర్చ జరిగితే ఎవరేంటో..ఆ రోజు ఏం జరిగిందో, ఎవరు ఎవరికి ఏం ఆఫర్ ఇచ్చారో ప్రజలకు తెలియజేయవచ్చు అని ట్విట్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు నిజాన్ని కాపాడుతున్నారా అని మండిపడ్డారు. చదవండి...‘ప్రశాంత్ కిశోర్ మా పార్టీని విలీనం చేయమన్నారు’ కాగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను ఆర్జేడీ తిప్పికొట్టింది. ‘పండిత్ జీ.. మీ వయసు మా పార్టీ అధినేత అనుభవమంతా కాదు. మీలాంటి రాజకీయ నాయకులను చాలా మంది వచ్చి వెళ్లారు. మోదీ, నితీష్ల దగ్గరకు వెళ్లి మీ స్టోరీలను అమ్ముకోండి. మేము నిజం బయటపెడితే మీ పరువు, కీర్తి పోతుంది’ అని పార్టీ ట్వీట్ చేసింది. సీఎం నితీశ్ తరఫున ప్రశాంత్ మమ్మల్ని కలిశారని, రెండు పార్టీలను విలీనం చేసి, ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దామని చెప్పారని రబ్రీ దేవి ఆరోపించారు. ఒక సందర్భంలో తనకు బాగా కోపం వచ్చి ఆయన్ను బయటకు వెళ్లిపోవాలని చెప్పానన్నారు. ప్రశాంత్ కిశోర్.. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నితీశ్ కుమార్, లాలూతో కలిసి పని చేశారు. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ సహా ఆరు పార్టీలు జనతా పరివార్‌గా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. నితీశ్ కుమార్‌ను తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించాయి. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ 81 స్థానాలు, జేడీయూ 70, బీజేపీ 53 స్థానాల్లో గెలిచాయి.అనంతరం ఆర్జేడీ, జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2017లో నితీశ్ కూటమి నుంచి బయటకు వచ్చి.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. -
‘ప్రశాంత్ కిశోర్ మా పార్టీని విలీనం చేయమన్నారు’
పట్నా: తమ పార్టీని సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో విలీనం చేయాలంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించారని బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి సంచలన ప్రకటన చేశారు. ఈ విలీనం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిని ప్రకటించవచ్చని ఆయన తెలిపారని కూడా రబ్రీదేవి వెల్లడించారు. ‘సీఎం నితీశ్ తరఫున ప్రశాంత్ మమ్మల్ని కలిశారు. రెండు పార్టీలను విలీనం చేసి, ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దామని చెప్పారు. ఒక సందర్భంలో నాకు బాగా కోపం వచ్చి ఆయన్ను బయటకు వెళ్లిపోవాలని కోరా’ అని పేర్కొన్నారు. రెండు పార్టీలను కలపాలంటూ నితీశ్‌కుమార్ చేసిన ప్రతిపాదనను ప్రశాంత్ కిశోర్ తన వద్దకు తెచ్చారని ఇటీవల తన జీవిత చరిత్ర పుస్తకంలో లాలూ వెల్లడించారు. రబ్రీదేవి వ్యాఖ్యలపై జేడీయూ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. జేడీయూలో చేరక మునుపు అనేక పర్యాయాలు లాలూతో భేటీ అయిన విషయం వాస్తవమేనన్నారు. అయితే, అప్పట్లో తాము చర్చించిన విషయాలను వెల్లడిస్తే ఆయన ఇబ్బందుల్లో పడతారని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. -
సీఎంపైకి చెప్పు విసిరిన యువకుని అరెస్ట్
పాట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పైకి చెప్పు విసిరిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం జనతాదళ్ యునైటెడ్ యూత్ వింగ్ సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. చెప్పు విసిరిన వ్యక్తిని ఔరంగాబాద్‌కు చెందిన చందన్ కుమార్‌గా పోలీసలు గుర్తించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లపై అసంతృప్తిగా ఉన్న చందన్.. ఈ పనికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తాను అగ్ర కులానికి చెందిన వ్యక్తి కావడం, రిజర్వేషన్ వ్యవస్థ కారణంగా ఉద్యోగం లభించకపోవడంతో తన అసంతృప్తిని ఇలా వెల్లగక్కినట్లు చందన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. చందన్ నితీష్‌పైకి చెప్పు విసిరిన వెంటనే జేడీయూ యూత్ కార్యకర్తలు అతనిపై దాడి చేశారు. పోలీసులు వచ్చి చందన్‌ను విడిపించి అక్కడ నుంచి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. నితీష్ పక్కనే ఉన్నారు. సీఎం నితీష్ కుమార్‌పైకి చెప్పు విసరడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2016లోనూ పీకే రాయ్ అనే వ్యక్తి నితీష్‌పైకి చెప్పు విసిరాడు. -
ప్రతి ఇంటికీ వైఎస్సార్సీపీ
-
సర్వేలేమీ చేయలేదు
ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ - వైఎస్సార్సీపీ నేతలతో పరిచయ కార్యక్రమం - తమ కార్యకలాపాల గురించి వివరణ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై తమ కార్యకలాపాలను త్వరలో మొదలు పెడతామని ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఆయన బుధవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా అధ్యక్షుల, జిల్లా పరిశీలకుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాల్లో పెట్టబోతున్న తీర్మానాలపై చర్చించడం కోసం ఏర్పాటైన ఈ సమావేశానికి ప్రశాంత్ కిషోర్‌ను జగన్ ఆహ్వానించారు. జిల్లా అధ్యక్షులను, నేతలను పరిచయం చేశారు. ఏఏ అంశాలపై ఆయన పార్టీకి సహకారం అందజేస్తారో నేతలకు వివరించారు. పార్టీని సంస్థాగతంగా శాస్త్రీయంగా విశ్లేషించి మరింత పటిష్టతకు ఆయన సేవలను తీసుకుంటున్నామని అందులోని ఉద్దేశాలను జగన్ వెల్లడించారు. ఎలాంటి సర్వేలూ చేయలేదు.. తాము రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి అధ్యయనాలు చేయలేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టంచేశారు. ‘రాష్ట్రంలో ఇప్పటికే మీ బృందం సర్వేలు జరిగినట్లుగా, వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితులున్నట్లుగా టీడీపీ అనుకూల మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం జరుగుతోంది కదా?’ అని ఓ జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రస్తావించగా... ‘అవును... ఇలాంటి వార్తలు నా దృష్టికి కూడా వచ్చాయి. అదంతా బోగస్, మేం ఎలాంటి సర్వే చేయలేదు. మేమింకా పని మొదలు పెట్టనేలేదు. మా బృందంతో ఇపుడిపుడే కార్యక్షేత్రంలోకి దిగు తున్నాం. అయినా ప్రాథమికంగా మా ప్రవృత్తి సర్వేలు చేయడం కానే కాదు. అవసరమని భావించినపుడు సర్వేలు చేస్తాం తప్ప అదే ప్రధానం కాదు’ అని ఆయన సమాధానమిచ్చారు. పార్టీ పరిస్థితి, పనితీరు క్షేత్ర స్థాయిలో ఎలా ఉందో తెలుసుకుని అంచనా వేస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ నేతలతో కార్యకలా పాలను సమన్వయం చేసేందుకు తమకు సంబంధించి ఓ బృందం పని చేస్తూ ఉంటుందని, అలాగే జిల్లాల్లో కూడా కొన్ని బృందాలు ఉండబోతాయని వివరించారు. తమ బృందం సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు, పరిశీలకులతో సంబంధాలు కలిగి ఉంటాయన్నారు. ఎక్కడైనా, ఏవైనా చిన్న లోపాలు ఉంటే పార్టీ నేతల దృష్టికి తమ బృంద సభ్యులు తెస్తుంటారని, వాటిని సవరించుకోవాలన్నారు. తమ కార్యకలాపాలు ఎలా ఉండబోతాయో వివరించారు. సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు ఉమ్మా రెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, వైవీ సుబ్బా రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృ ష్ణారెడ్డి, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, 13 జిల్లాల అధ్యక్షులు పరిశీలకులు పాల్గొన్నారు. స్థానిక అంశాలపైనా తీర్మానాలు: కాకాణి పార్టీ ప్లీనరీ సమావేశాల్లో రాష్ట్ర స్థాయి అంశాలే కాక ఆయా జిల్లాల్లో స్థాని కంగా ప్రజలను ప్రభావితం చేస్తున్న, ఇబ్బందిగా పరిణమిస్తున్న సమస్యలపై కూడా తీర్మానాలు చేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్య క్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. -
'పీకే' విషయంలో సీఎం తప్పు లేదు: సుప్రీం
పట్నా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే)ను బిహార్ ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విషయంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఎటువంటి ఉల్లంఘనకు పాల్పడలేదని పేర్కొంది. సీఎం తన సలహారుదారుకు కేబినెట్ హోదా కల్పించడం తప్పుకాదని తేల్చిచెప్పింది. 'ప్రశాంత్ కిషోర్ పై ముఖ్యమంత్రికి నమ్మకం ఉంది. ఆయనతో కలిసి పనిచేయాలని సీఎం అనుకుని ఉండొచ్చు. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమ'ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 39 ఏళ్ల ప్రశాంత్ కిషోర్ 2014 సాధారణ ఎన్నికల్లో ప్రధాని మోదీ తరపున పనిచేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున వ్యూహకర్తగా వ్యహరించారు. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేశారు. -
కాంగ్రెస్ బాధ్యత ప్రశాంత్ కిశోర్ చేతుల్లోకి..
నియోజకవర్గం నుంచి 30 మంది కార్యకర్తలకు త్వరలో శిక్షణ సాక్షి, హైదరాబాద్: రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ప్రశాంత్ కిశోర్ తెలంగాణలో అడుగు పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే బాధ్యతలను ప్రశాంత్ కిశోర్‌కు ఏఐసీసీ అప్పగించినట్టుగా తెలిసింది. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చిన ప్రశాంత్ కిశోర్ తన అవసరాలను టీపీసీసీ ముందుంచారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా పనిచేయడానికి ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం 30 మంది మెరికల్లాంటి, చురుకైన కార్యకర్తల జాబితా కావాలని కోరారు. దీనికి అనుగుణంగానే 30 మంది జాబితాను ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఏఐసీసీ నుంచి సూచనలు అందాయి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతమున్న నియోజకవర్గాల ప్రకారం సుమారు 3,600 మంది కార్యకర్తలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వచ్చే నెలలో సమావేశం అవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులు, వాటికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రశాంత్ కిశోర్ స్థూలంగా ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలిసింది. దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలంటే ఏమేం చేయాలో ప్రశాంత్ కిశోర్ సూచనల ప్రకారం ఎంపికైన కార్యకర్తలు పనిచేయాల్సి ఉంటుంది. కార్యకర్తలకు వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవడం, వీటి ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు పోవడం, పార్టీని పటిష్ట పరుచుకోవడానికి తగిన సూచనలను, సలహాలను ప్రశాంత్ కిశోర్ ఇవ్వనున్నట్టుగా సమాచారం. -
ప్రచార వ్యూహకర్తలకు డిమాండ్
న్యూఢిల్లీ: ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్, లాలూ కూటమి భారీ విజయం సాధించడానికి ప్రశాంత్ కిశోర్ ప్రచార వ్యూహాలు బాగా పనిచేయడంతో ఇప్పుడు రాజకీయరంగంలో ఈ తరహా నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఇంతవరకు వ్యాపార, పారిశ్రామిక రంగాలకే పరిమితమైన ఈ నిపుణులకు బిహార్ ఎన్నికలు రాజకీయరంగంలో కొత్త బాటలు వేశాయి. రాజకీయ పార్టీలు ఈ తరహా నిపుణుల సేవలను వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ తరఫున, ఇటీవల బిహార్‌లో నితీశ్ కూటమి తరఫున పనిచేసిన ప్రశాంత్ కిశోర్, వారికి అద్భుతమైన విజయాలు సాధించి పెట్టడంతో ఆయనకు ఇప్పుడు ఊహించనంత డిమాండ్ ఏర్పడింది. రాబోయే కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, యూపీ రాష్ట్రాలనుంచి కిశోర్ బృందానికి పలు రాజకీయ పార్టీలనుంచి ఇప్పటికే ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, అస్సాంలలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత 2017లో యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో ఓక్లాండ్ బ్రిగ్స్ అనే ఓ కొత్త ప్రజాసంబంధాల సంస్థతో ఇప్పటికే ఒక ప్రముఖ రాజకీయ పార్టీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థ యూపీలో కూడా ఓ ప్రధాన రాజకీయ పార్టీతో ఒప్పందంకోసం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ సంస్థ, ప్రచార వ్యూహాలకోసం అంతర్జాతీయ నిపుణుల సాయం కూడా తీసుకుంటోంది. కేవలం ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాకుండా వివిధ రాష్ట్రాల్లో విస్తరించడానికి తమ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోందని ఓక్లాండ్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ప్రశాంత్ కిశోర్ బృందం కూడా రాబోయే రోజుల్లో ఏయే పార్టీలకు పనిచేస్తారన్న విషయాన్ని చెప్పడం లేదు. ఎన్నికల సమయంలో ఓటర్ల మనోగతాలు మారుతుంటాయని, వారు ఆశిస్తున్నదేమిటో తెలుసుకుని రాజకీయ పార్టీలకు చెప్పడమే ప్రచార వ్యూహకర్తల పని అని అనూప్ శర్మ అనే ప్రజాసంబంధాల కన్సల్టెంట్ వెల్లడించారు. ప్రస్తుతం ఓటర్లు అభ్యర్థుల గుణగణాలనే కాకుండా పార్టీల విధానాలను కూడా పరిశీలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎన్నికలు రానురాను సంక్లిష్టంగా తయారవుతున్నాయని, ఓ వైపు మీడియా, మరో వైపు సోషల్ మీడియా ప్రజాభిప్రాయాన్ని మార్చడంలో తీవ్ర ప్రభావం చూస్తున్నాయని ఫార్చునా ప్రజాసంబంధాల సంస్థ వ్యవస్థాపకుడు హర్షవర్ధన్ పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని ఒక్కోసారి వారు సరిగా అంచనా వేయలేకపోతున్నారని ఆయన చెప్పారు. -
అప్పుడు మోదీకి.. ఇప్పుడు నితీశ్‌కు!
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కుమార్ అద్భుత విజయాన్ని సాధించి వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. ఆయన విజయానికి కారణమైన తెరవెనుక కీలక వ్యక్తుల్లో ఒకరు ప్రశాంత్ కిషోర్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రచారరథాన్ని ముందుకునడిపిన ప్రశాంత్ కిషోర్ ఈసారి నితీశ్‌కుమార్ వెన్నంటి ఉండి ఆయన విజయంలో కీలక పాత్ర పోషించారు. తెర వెనుక ఉండి ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన ఆయన గత మే నెలలోనే రంగంలోకి దిగి.. మరోసారి నితీశ్‌కు సీఎం పీఠం దక్కేలా వ్యూహాలు సిద్ధం చేశారు. నిజానికి ప్రశాంత్ కిషోర్ ఒక ప్రజారోగ్య నిపుణుడు . నరేంద్రమోదీ కోసం ఆఫ్రికాలో ఐక్యరాజ్యసమితి తరఫున చేస్తున్న ఉద్యోగానికి 2011లో రాజీనామా చేసి భారత్ తిరిగొచ్చారు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సుపరిపాలనకు మోదీ ప్రభుత్వాన్ని మారుపేరుగా జాతీయవ్యాప్తంగా ప్రచారం చేయడంలో కిషోర్ కీలక పాత్ర పోషించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వినూత్న రీతిలో సాగించిన ప్రచారానికి రూపకల్పన చేసింది కిషోరే. ముఖ్యంగా ఆయన రచించిన 'చాయ్ పే చర్చ' మోదీకి ప్రచారంలో బాగా కలిసివచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రచార వ్యూహాలకు పదునుపెట్టే ప్రశాంత్ కిషోర్ బృందంలో ప్రధానంగా యువ ఎంబీఏ, ఐఐటీ గ్రాడ్యుయేట్లు ఉంటారు. ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని సృష్టించడం, విజయం ఖాయమన్న సందోహాన్ని కల్పించడం కిషోర్ ప్రచార వ్యూహాల్లో ప్రధానంగా ఉంటాయి. మోదీకి 'చాయ్ పే చర్చ' కార్యక్రమాన్ని రూపొందించిన ఆయన నితీశ్ కోసం 'పర్చా పే చర్చ'ను (పాంఫ్లెట్‌పై చర్చ) తెరముందుకు తెచ్చారు. గత పదేళ్లలో నితీశ్ సర్కార్ పనితీరుపై తమ అభిప్రాయాన్ని తెలుపాల్సిందిగా ప్రజలను ఈ కార్యక్రమం ద్వారా కోరారు. ఎల్ఈడీ మానిటర్లతోపాటు 400 ట్రక్కుల పాంఫ్లెట్లను ఇందుకోసం బిహార్‌లోని అన్ని గ్రామాలకూ పంపారు. ఆయన రూపొందించిన కార్యక్రమాలు ఎన్నికల ప్రచారంలో నితీశ్ నేతృత్వంలోని మహాకూటమికి బాగా కలిసివచ్చాయి.